
సోచి: ఫిఫా వరల్డ్ కప్‌లో భాగంగా ఇంగ్లండ్-కొలంబియా జట్ల మధ్య జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రిఫరీ నిర్ణయంపై మండిపడ్డ అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు డిగో మారడోనా ఎట్టకేలకు దిగివచ్చాడు.. ఈ మేరకు ఫిఫాకు, ఆ గవర్నింగ్ బాడీ అధ్యక్షుడు ఇన్‌ఫాన్‌టినోకు క్షమాపణలు తెలియజేశాడు. ఆమ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిచి క్వార‍్టర్‌కు చేరిన సంగతి తెలిసిందే. కొలంబియాకు మారడోనా మద్దతుగా నిలిచిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ పెనాల్టీ షూటౌట్‌లో విజయాన్ని నమోదు చేసింది. దాంతో పెనాల్టీ షూటౌట్‌ను నిర్వహించే క్రమంలో రిఫరీ ఏకపక్షంగా వ్యవహరించాడంటూ మారడోనా ధ్వజమెత్తాడు.
దీనిపై మారడోనా తాజాగా క్షమాపణలు తెలియజేశాడు. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ రిఫరీ నిర‍్ణయాన్ని తప్పుపట్టడం సరికాదు. కొన్ని సందర్బాల్లో రిఫరీ నిర్ణయాలతో నా అభిప్రాయాలు భిన్నంగా ఉన్నప్పటికీ, వారి నిర్ణయాలను గౌరవించాల్సిన అవసరం ఉంది. రిఫరీని విమర్శించినందుకు నన్ను క్షమించండి. ఫిఫా వరల్డ్ కప్‌లో రిఫరీ బాధ్యతల్ని నిర్వహించడం చాలా కష్టంతో కూడున్నది. వారి శ్రమ నాకు తెలుసు. నేను మాట తూలడం తప్పే. ఇందుకు ఫిఫాకు, అధ్యక్షుడు ఇన్‌ఫాన్‌టినోకు క్షమాపణలు తెలియజేస్తున్నా’ అని మారడోనా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా విన‍్నవించాడు.
Comments
Please login to add a commentAdd a comment