మారడోనాకు మళ్లీ పెళ్లి | Maradona to wedding again | Sakshi
Sakshi News home page

మారడోనాకు మళ్లీ పెళ్లి

Published Sun, Sep 13 2015 12:25 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 AM

మారడోనాకు మళ్లీ పెళ్లి

మారడోనాకు మళ్లీ పెళ్లి

 ఫుట్‌బాల్ దిగ్గజం, నిత్యం వివాదా ల్లో ఉండే అర్జెంటీనా మాజీ స్టార్ డిగో మారడోనా మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారు. 54 ఏళ్ల మారడోనా 25 ఏళ్ల రికో ఒలివా అనే అమ్మాయితో చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు. తామిద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని ఒలివా ప్రకటించింది. ప్రస్తుతం మారడోనా, అయన మాజీ భార్య క్లాడియా విలాఫెనీల మధ్య వివాదం న్యాయస్థానంలో ఉంది. క్లాడియాతో మారడోనాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. మరో ముగ్గురు మహిళలతో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కూడా ఉన్నారు.

ఇన్ని పెళ్లిళ్లు అయ్యాక... ఈ వయసులో మరోసారి పెళ్లి కొడుకు కాబోతున్నాడు మారడోనా. ఇటీవల మారడోనాకు, ఒలివాకు కూడా విభేదాలు వచ్చాయనే వార్తలు పెరిగిన నేపధ్యంతో ఆ అమ్మాయి ఈ ప్రకటన చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement