ఆరంభ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో ‘మిక్స్‌డ్ డబుల్స్’ ఫైనల్ కాస్తా ఆ్రస్టేలియన్ల సమరంగా మారింది. కోర్టులో ఇవతల... అవతల... నలుగురూ ఆ్రస్టేలియన్లే ట్రోఫీ కోసం ‘ఏస్’లు దూశారు. చివరకు ఒలివియా గడెస్కీ–జాన్ పీర్స్ (ఆ్రస్టేలియా) జోడీ విజేతగా నిలిస్తే... సహచర ద్వయం కింబర్లీ బిరెల్–జాన్ ప్యాట్రిక్ స్మిత్ రన్నరప్‌తో తృప్తి పడింది.
ఇరు జోడీలు ‘వైల్డ్‌కార్డ్’ ఎంట్రీతోనే సొంతగడ్డపై గ్రాండ్‌స్లామ్ ఆడటం గమనార్హం. మొత్తానికి 58 ఏళ్ల తర్వాత అంతా అ్రస్టేలియన్లే తలపడిన తుది పోరులో పీర్స్–ఒలివియా జోడీ 3–6, 6–4, 10–6తో స్మిత్–బిరెల్ జంటపై గెలిచింది.
ఒలివియా–పీర్స్ జంటకు 1,75,000 ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 95 లక్షల 36 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 22 ఏళ్ల ఒలివియాకిదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్. 36 ఏళ్ల పీర్స్ ఖాతాలో ఆ్రస్టేలియన్ ఓపెన్ (2017) పురుషుల డబుల్స్ టైటిల్, 2022లో యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment