ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ముగిసిన సానియా పోరాటం.. క్వార్టర్స్‌లో నిష్క్రమణ | Sania Mirza, Rajeev Ram Lose Quarterfinal Match In Australian Open | Sakshi
Sakshi News home page

Australian Open 2022: క్వార్టర్స్‌లో నిష్క్రమించిన రాజీవ్‌ రామ్‌-సానియా మీర్జా జోడీ

Published Tue, Jan 25 2022 2:57 PM | Last Updated on Tue, Jan 25 2022 2:57 PM

Sania Mirza, Rajeev Ram Lose Quarterfinal Match In Australian Open - Sakshi

Sania Mirza-Rajeev Ram Lose Quarterfinals In Australian Open 2022: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో భారత మహిళల టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా పోరాటం ముగిసింది. అమెరికాకు చెందిన రాజీవ్‌ రామ్‌తో కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌ బరిలోకి దిగిన ఈ హైదరాబాదీ.. మంగళవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌లో అన్‌ సీడెడ్‌ ఆస్ట్రేలియన్‌ జంట జేసన్‌ కుబ్లర్‌-జేమీ ఫోర్లిస్‌ చేతిలో 4-6, 6-7 తేడాతో పరాజయం పాలైంది. 


మ్యాచ్‌ ప్రారంభం నుంచి సానియా జోడీ అద్భుంగానే ఆడినప్పటికీ.. ప్రత్యర్ధి అంతకుమించి రాణించడంతో తలవంచక తప్పలేదు. గంటన్నర పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ జోడీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ ఓటమితో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సానియా శకం ముగిసింది. గతంలో రెండు సార్లు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ డబుల్స్‌ టైటిల్స్‌ను నెగ్గిన సానియా.. ఈ ఏడాది తన కెరీర్‌కు ముగింపు పలుకనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. 
చదవండి: కార్నెట్‌ పట్టు వీడని పోరాటం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement