Rajeev Ram
-
ఆస్ట్రేలియన్ ఓపెన్ ముగిసిన సానియా పోరాటం.. క్వార్టర్స్‌లో నిష్క్రమణ
Sania Mirza-Rajeev Ram Lose Quarterfinals In Australian Open 2022: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత మహిళల టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పోరాటం ముగిసింది. అమెరికాకు చెందిన రాజీవ్ రామ్‌తో కలిసి మిక్స్డ్ డబుల్స్ బరిలోకి దిగిన ఈ హైదరాబాదీ.. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అన్ సీడెడ్ ఆస్ట్రేలియన్ జంట జేసన్ కుబ్లర్-జేమీ ఫోర్లిస్ చేతిలో 4-6, 6-7 తేడాతో పరాజయం పాలైంది. Thank you for the memories, @MirzaSania ❤️ The two-time #AusOpen doubles champion has played her final match in Melbourne.#AO2022 pic.twitter.com/YdgH9CsnF0— #AusOpen (@AustralianOpen) January 25, 2022 మ్యాచ్ ప్రారంభం నుంచి సానియా జోడీ అద్భుంగానే ఆడినప్పటికీ.. ప్రత్యర్ధి అంతకుమించి రాణించడంతో తలవంచక తప్పలేదు. గంటన్నర పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ జోడీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ ఓటమితో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సానియా శకం ముగిసింది. గతంలో రెండు సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్స్‌ను నెగ్గిన సానియా.. ఈ ఏడాది తన కెరీర్‌కు ముగింపు పలుకనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. చదవండి: కార్నెట్ పట్టు వీడని పోరాటం -
Sania Mirza: ఆస్ట్రేలియా ఓపెన్.. సానియా జంట ముందడుగు
Australia Open- Sania Mirza: ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సానియా మీర్జా (భారత్)–రాజీవ్ రామ్ (అమెరికా) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. రెండో రౌండ్ మ్యాచ్‌లో సానియా–రాజీవ్ ద్వయం 7–6 (8/6), 6–4తో ఎలెన్ పెరెజ్–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జోడీపై గెలిచింది. 87 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా–రాజీవ్ రామ్ ద్వయం ఐదు ఏస్‌లు సంధించి తమ ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. సాకారి, బదోసా అవుట్ మహిళల సింగిల్స్ విభాగంలో రెండు సంచలన ఫలితాలు నమోదయ్యాయి. ఐదో సీడ్ మరియా సాకరి (గ్రీస్), ఎనిమిదో సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించారు. మాడిసన్ కీస్ (అమెరికా) 6–3, 6–1తో బదోసా ను ఓడించగా... 21వ సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) 7–6 (7/0), 6–3తో సాకరిపై గెలిచింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 6–4, 6–3తో అమండా అనిసిమోవా (అమెరికా)పై, నాలుగో సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 6–2, 6–2తో మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్)పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. చదవండి: Australia Open: నాదల్ దూకుడు.. మూడో సీడ్ జ్వెరెవ్‌కు షాక్ -
మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జా జోడి శుభారంభం
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ తర్వాత అంతర్జాతీయ టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పనున్న సానియా మీర్జా టోర్నీలో శుభారంభం చేసింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సానియా మీర్జా- రాజీవ్ రామ్ ద్వయం రెండో రౌండ్లో అడుగుపెట్టింది. తొలి రౌండ్లో వీరి జోడి సెర్బియాకు చెందిన అలెక్సాండ్రా క్రూనిక్- నికోలా కాకిక్ జోడిపై 6-3,6-7(3) తేడాతో నెగ్గి రెండో రౌండ్లో అడుగెపెట్టింది. కేవలం 69 నిమిషాల్లోనే ప్రత్యర్థిని మట్టికరిపించిన సానియా మీర్జా జోడి తొలి అంకాన్ని దిగ్విజయంగా పూర్తి చేసింది. చదవండి: Daniil Medvedev: గెలిచిన ఆనందం లేకుండా చేశారు.. ప్లేయర్ భావోద్వేగం -
బోపన్న భాగస్వామిగా ఆస్ట్రేలియా ఓపెన్ బరిలో..
సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత మహిళల టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భాగస్వామి మారాడు. ఈ టోర్నీలో అమెరికా ఆటగాడు రాజీవ్ రామ్‌తో కలిసి ఆడాల్సిన సానియా... ఇప్పుడు భారత్‌కు చెందిన డబుల్స్ నంబర్‌వన్ రోహన్ బోపన్నతో కలిసి బరిలోకి దిగనుంది. రాజీవ్ రామ్ గాయపడటంతో అతను ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి వైదొలిగాడు. దాంతో బోపన్నతో కలిసి సానియా ఆడాలని నిర్ణయించుకుంది. రియో ఒలింపిక్స్ తర్వాత సానియా, బోపన్న కలిసి ఆడనుండటం ఇదే తొలిసారి. ఆ్రస్టేలియన్ ఓపెన్ ఈనెల 20న ప్రారంభమవుతుంది. -
రన్నరప్ బోపన్న-మెర్జియా జోడీ
హాలె (జర్మనీ): వరుసగా రెండో వారం మరో టైటిల్ సాధించాలని ఆశించిన రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జంటకు నిరాశ ఎదురైంది. గెర్రీ వెబెర్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో బోపన్న-మెర్జియా జోడీ రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో బోపన్న-మెర్జియా ద్వయం 6-7 (5/7), 2-6తో రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)-రాజీవ్ రామ్ (అమెరికా) జోడీ చేతిలో ఓడిపోయింది. మరోవైపు లండన్‌లో జరిగిన ఎగాన్ చాంపియన్‌షిప్‌లో లియాండర్ పేస్ (భారత్)-నెస్టర్ (కెనడా) జోడీ సెమీఫైనల్లో 3-6, 6-7 (8/10)తో జిమోనిచ్ (సెర్బియా)-మట్కోవ్‌స్కీ (పోలండ్) జంట చేతిలో ఓడిపోయింది.