సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో భారత మహిళల టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భాగస్వామి మారాడు. ఈ టోర్నీలో అమెరికా ఆటగాడు రాజీవ్ రామ్‌తో కలిసి ఆడాల్సిన సానియా... ఇప్పుడు భారత్‌కు చెందిన డబుల్స్ నంబర్‌వన్ రోహన్ బోపన్నతో కలిసి బరిలోకి దిగనుంది. రాజీవ్ రామ్ గాయపడటంతో అతను ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి వైదొలిగాడు. దాంతో బోపన్నతో కలిసి సానియా ఆడాలని నిర్ణయించుకుంది. రియో ఒలింపిక్స్ తర్వాత సానియా, బోపన్న కలిసి ఆడనుండటం ఇదే తొలిసారి. ఆ్రస్టేలియన్ ఓపెన్ ఈనెల 20న ప్రారంభమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment