రన్నరప్ బోపన్న-మెర్జియా జోడీ | Rohan Bopanna, Florin Mergea end runners-up at Gerry Weber Open | Sakshi
Sakshi News home page

రన్నరప్ బోపన్న-మెర్జియా జోడీ

Published Mon, Jun 22 2015 1:14 AM | Last Updated on Sun, Sep 3 2017 4:08 AM

Rohan Bopanna, Florin Mergea end runners-up at Gerry Weber Open

హాలె (జర్మనీ): వరుసగా రెండో వారం మరో టైటిల్ సాధించాలని ఆశించిన రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జంటకు నిరాశ ఎదురైంది. గెర్రీ వెబెర్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో బోపన్న-మెర్జియా జోడీ రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో బోపన్న-మెర్జియా ద్వయం 6-7 (5/7), 2-6తో రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)-రాజీవ్ రామ్ (అమెరికా) జోడీ చేతిలో ఓడిపోయింది. మరోవైపు లండన్‌లో జరిగిన ఎగాన్ చాంపియన్‌షిప్‌లో లియాండర్ పేస్ (భారత్)-నెస్టర్ (కెనడా) జోడీ సెమీఫైనల్లో 3-6, 6-7 (8/10)తో జిమోనిచ్ (సెర్బియా)-మట్కోవ్‌స్కీ (పోలండ్) జంట చేతిలో ఓడిపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement