సెమీస్‌లో బోపన్న జంట | Rohan Bopanna And Wesley Koolhof Enterd Semi Final | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో బోపన్న జంట

Published Thu, Jan 9 2020 12:33 AM | Last Updated on Thu, Jan 9 2020 12:33 AM

Rohan Bopanna And Wesley Koolhof  Enterd Semi Final - Sakshi

దోహా (ఖతర్‌): భారత డబుల్స్‌ నంబర్‌వన్‌ ప్లేయర్‌ రోహన్‌ బోపన్న దోహా ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న–వెస్లీ కూలాఫ్‌ (నెదర్లాండ్స్‌) ద్వయం 6–3, 6–4తో వావ్రింకా (స్విట్జర్లాండ్‌)–ఫ్రాన్సెస్‌ టియాఫో (అమెరికా) జోడీపై విజయం సాధించింది.  ఇదే టోరీ్నలో దివిజ్‌ శరణ్‌ (భారత్‌)–ఆర్తెమ్‌ సితాక్‌ (న్యూజిలాండ్‌) జంట తొలి రౌండ్‌లో ఓడిపోయింది. దివిజ్‌–సితాక్‌ ద్వయం 6–7 (4/7), 2–6తో జెరెమి చార్డీ–ఫాబ్రిస్‌ మారి్టన్‌ (ఫ్రాన్స్‌) జంట చేతిలో ఓటమి పాలైంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement