
ఫ్లోరిడా: మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న (భారత్)–షపోవలోవ్ (కెనడా) జంట ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో బోపన్న–షపోవలోవ్ ద్వయం 7–5, 2–6, 10–6తో ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా)–ఆర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్) జోడీపై గెలిచింది. 89 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట ఐదు ఏస్‌లు సంధించింది. ఇదే టోర్నీ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ నయోమి ఒసాకా (జపాన్) మూడో రౌండ్‌లో ఓటమి చవిచూసింది. చైనీస్ తైపీ క్రీడాకారిణి సెయి సు వె 4–6, 7–6 (7/4), 6–3తో ఒసాకాపై సంచలన విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment