సాకేత్ మైనేని- యుకీ బాంబ్రీ(PC: PTI)
న్యూఢిల్లీ: డేవిస్‌కప్ పురుషుల టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ వరల్డ్ గ్రూప్–1 పోటీల ‘డ్రా’ను గురువారం విడుదల చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 13 నుంచి 15 మధ్య వివిధ దేశాల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి.
భారత జట్టుకు స్వీడన్ జట్టు రూపంలో క్లిష్టమైన ప్రత్యర్థి ఎదురైంది. స్వీడన్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటి వరకు స్వీడన్‌తో ఐదుసార్లు తలపడిన భారత్ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది.
పోరాడి ఓడిన సహజ
సాక్షి, హైదరాబాద్: ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ– 125 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారిణి, భారత రెండో ర్యాంకర్ సహజ యామలపల్లి పోరాటం ముగిసింది. ముంబైలో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 336వ ర్యాంకర్ సహజ 6–1, 3–6, 5–7తో ప్రపంచ 162వ ర్యాంకర్ పొలీనా కుదెర్‌మెతోవా (రష్యా) చేతిలో ఓడిపోయింది.
గంటా 58 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత్‌కే చెందిన రుతుజా 6–7 (6/8), 6–2, 1–6తో కేటీ వోలినెట్స్ (అమెరికా) చేతిలో పరాజయం పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment