ఆస్ట్రేలియన్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ క్రికెట్‌లో రారాజు అనడంలో సందేహం లేదు. బంతిని నైపుణ్యంతో తిప్పడంలో అతనికి ఎవరు సాటిరారు. గింగిరాలు తిరిగే బంతి పిచ్‌పై పడి ఎటు వెళుతుందో తెలుసుకునే లోపే ప్రత్యర్థిని పెవిలియన్ చేర్చడం వార్న్ శైలి. క్రికెట్‌లో రారాజుగా వెలుగొందిన వార్న్‌కు.. ఆఫ్ ఫీల్డ్‌లో మాత్రం మాయని మచ్చలు చాలానే ఉన్నాయి.
-సాక్షి, వెబ్‌డెస్క్
ముఖ్యంగా డ్రగ్స్, ఆల్కాహాల్, మహిళలతో ప్రేమాయణాలు, అమ్మాయిలకు అసభ్యకర సందేశాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. మైదానం వెలుపల ఇన్ని చేసినప్పటికి వార్న్‌కు అభిమానగణం ఇసుమంతైనా తగ్గలేదు. తాజాగా వార్న్ గుండెపోటుతో హఠాన్మరణం చెందడం క్రీడాలోకాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. తమ అభిమాన క్రికెటర్‌కు వీడ్కోలు పలుకుతూ తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.
క్రికెట్ ప్రపంచంలో వార్న్‌కు ఎవరు పోటీ లేరు అనుకుంటున్న మనకు.. క్రికెట్ వెలుపల మాత్రం ఇద్దరు ఫుట్‌బాల్ స్టార్ ఆటగాళ్లతో షేన్ వార్న్‌కు చాలా పోలికలు ఉన్నాయి. ఆ ఇద్దరిలో ఒకరు అర్జెంటీనా దిగ్గజం డీగో మారడోనా అయితే.. రెండో వ్యక్తి నార్తన్ ఐరిష్ స్టార్ ఫుట్‌బాలర్ జార్జ్ బెస్ట్.. మీకు తెలుసో లేదో.. ఈ ముగ్గురి జీవితాలు పరిశీలిస్తే ఒకే రీతిలో ఉంటాయి. వార్న్, మారడోనా, జార్జ్ బెస్ట్ ఆటలో ఎంత పేరు సంపాదించారో.. వ్యక్తిగత జీవితంలో అంత చెడ్డ పేరు తెచ్చుకున్నారు. ఈ ముగ్గురిలో ఉన్న పోలికలు ఒకసారి తెలుసుకుంటే ఆశ్చర్యపోవడం ఖాయం. అవేంటో ఒకసారి చూడండి.
►వార్న్ క్రికెట్‌లో రారాజుగా వెలుగొందితే.. మారోడనా, జార్జ్ బెస్ట్‌లు తమ కాలాల్లో ఫుట్‌బాల్‌లో స్టార్ ప్లేయర్లుగా సత్తా చాటారు. ఫుట్‌బాల్ ఆటలో మారడోనా, బెస్ట్‌లు తమ పాదాలతో గోల్ కొట్టడంలో నైపుణ్యం ప్రదర్శిస్తే.. వార్న్ లెగ్ స్పిన్నర్‌గా క్రికెట్‌లో తన మణికట్టు మాయజాలాన్ని ప్రదర్శించి వికెట్లు తీసేవాడు.
►వార్న్ లాగే మారడోనా, జార్జ్ బెస్ట్ మద్యానికి, డ్రగ్స్‌కు అలవాటు పడినవారే.. అమ్మాయిలతో రాసలీలలు.. అసభ్యకరమైన సందేశాలు పంపించడం చేశారు. ఈ విషయంలో మాత్రం జార్జ్ బెస్ట్‌కు మినహాయింపు
జార్జ్ బెస్ట్ నార్తన్ ఐర్లాండ్ స్టార్ ఫుట్‌బాలర్
► 1974లో జార్జ్ బెస్ట్ మాంచెస్టర్ సిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో ఒక మ్యాచ్ సందర్భంగా ఫుల్లుగా తాగి వచ్చాడు. విషయం తెలుసుకున్న జట్టు మేనేజర్ బెస్ట్‌ను డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు గెంటేశాడు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు బెస్ట్ మ్యాచ్‌లు ఆడకుండా మాంచెస్టర్ సిటీ అతడిపై నిషేధం విధించింది.
► మారడోనా కూడా 1994 వరల్డ్‌కప్‌కు ముందు ఈఫిడ్రైన్ అనే నిషేధిత డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. టెస్టులు చేయగా పాజిటివ్ రావడంతో ఫిఫా అతనిపై నిషేధం విధించింది. దీంతో మారడోనా వరల్డ్‌కప్‌కు దూరమయ్యాడు.
మారడోనా విగ్రహం
►వార్న్ కూడా 2003 వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందు డోపింగ్ టెస్టులో పట్టుబడడంతో క్రికెట్ ఆస్ట్రేలియా వార్న్‌పై నిషేధం విధించింది.
►ఇక నిషేధం తర్వాత మారడోనా లాగే వార్న్ కూడా స్టెరాయిడ్స్‌కు దూరంగా ఉన్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి
►మారడోనాకు ఫుట్‌బాల్‌లో ''గోల్ ఆఫ్ ది సెంచరీ'' ఉన్నట్లే.. క్రికెట్‌లో వార్న్‌కు ''బాల్ ఆఫ్ ది సెంచరీ'' ఉండడం విశేషం.
►1986 ఫిఫా వరల్డ్‌కప్ సందర్భంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మారడోనా 60 గజాల దూరం నుంచి బంతిని గోల్‌పోస్ట్‌లోకి తరలించడం చరిత్రలో నిలిచిపోయింది. 2002లో ఫిఫా డాట్‌కామ్ నిర్వహించిన సర్వేలో మారోడోనా కొట్టిన గోల్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో మారడోనా గోల్‌ను ఫిఫా.. ''గోల్ ఆఫ్ ది సెంచరీ''గా పేర్కొంది.
మారడోనా గోల్ ఆఫ్ ది సెంచరీ; వార్న్ బాల్ ఆఫ్ ది సెంచరీ
►ఇక వార్న్ బాల్ ఆఫ్ ది సెంచరీ విషయానికి వస్తే.. 1993లో ఇంగ్లండ్ గడ్డపై జరిగిన యాషెస్ సిరీస్‌లో మాంచెస్టర్ వేదికగా తొలి టెస్టు జరిగింది. ఆట రెండోరోజు వార్న్ మైక్ గాటింగ్‌కు అద్బుత బంతి వేశాడు. లెగ్‌స్టంప్ అవతల నుంచి వెళ్లిన బంతి అనూహ్యంగా టర్న్ అయి ఆఫ్ స్టంప్ వికెట్‌ను ఎగురగొట్టడం క్రీడా పండితుల్ని సైతం ఆశ్చర్యపరిచింది. అసలు బంతి ఎలా తిరిగిందన్నది ఇప్పటికి మిస్టరీగానే ఉండిపోయింది. బ్యాట్స్‌మన్ మైక్ గాటింగ్‌తో పాటు అంపైర్ కూడా ఆశ్చర్యపోయారు. అందుకే వార్న్ బంతి ''బాల్ ఆఫ్ ది సెంచరీ''గా చరిత్రలో నిలిచిపోయింది.
►1986 ఫిఫా ప్రపంచకప్ అర్జెంటీనా గెలవడంలో మారడోనా పాత్ర కీలకం.. అటు క్రికెట్‌లో 1999 వన్డే వరల్డ్‌కప్ ఆస్ట్రేలియా గెలవడంలో వార్న్ కీలకపాత్ర పోషించాడు.
1986 ఫిఫా వరల్డ్‌కప్‌తో మారడోనా; 1999 వన్డే వరల్డ్‌కప్‌తో షేన్ వార్న్
►ఇక ఈ ముగ్గురి మరణాలు కూడా దాదాపు ఒకే రీతిలో జరగడం విశేషం. ముగ్గురు తాము చనిపోయేటప్పుడు అచేతనా స్థితిలోనే మరణించారు.
చదవండి: Shane Warne: శవ పరీక్షకు వార్న్ భౌతికకాయం.. బోరుమన్న కుమారుడు
Pak vs Aus: ఒకవైపు వార్న్ మరణం.. ఇప్పుడు ఇది అవసరమా వార్నర్ ?
Shane Warne: భారత్‌కు ఆప్తుడు.. స్వదేశంలో మాత్రం ఘోర అవమానం!
Comments
Please login to add a commentAdd a comment