లండన్: అర్జెంటీనా దిగ్గజం డీగో మారడోనా... ఇంగ్లండ్‌తో జరిగిన 1986 ప్రపంచకప్ ఫుట్‌బాల్ క్వార్టర్ ఫైన ల్లో ధరించిన జెర్సీ ని కళ్లు చెదిరే మొత్తానికి కొనుగోలు చేశారు. ఈ మ్యాచ్‌లో మారడోనా చేసిన తొలి గోల్ ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్‌గా వివాదాస్పదమైంది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 2–1తో గెలిచి సెమీఫైనల్ చేరింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్ ముగిశాక మారడోనా తన జెర్సీని ఇంగ్లండ్ ప్లేయర్ స్టీవ్ హాడ్జ్‌కు అందజేశాడు.
దానిని ఇంతకాలం దాచుకున్న హాడ్జ్ ఇటీవల ‘సోతీబై’ అనే ఆన్‌లైన్ వేలం సైట్‌లో విక్రయానికి పెట్టాడు. బుధవారం ముగిసిన ఈ ఆన్‌లైన్ వేలంలో ఓ అజ్ఞాత అభిమాని ఈ జెర్సీని 71 లక్షల పౌండ్లకు (రూ. 67 కోట్ల 72 లక్షలు) కొనుగోలు చేశాడని సోతీబై సైట్ తెలిపింది
Comments
Please login to add a commentAdd a comment