Hand of God
-
మారడోనా 'ఫుట్‌బాల్'కు కళ్లు చెదిరే మొత్తం.. ఎందుకంత క్రేజ్
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా అనగానే ముందుగా గుర్తుకువచ్చేది ''హ్యాండ్ ఆఫ్ గాడ్'' గోల్. ఆనాడు మారడోనా Hand OF God Goal కొట్టిన బంతికి తాజాగా వేలంలో కళ్లు చెదిరే మొత్తానికి అమ్ముడుపోయింది. బుధవారం లండన్‌లో నిర్వహించిన వేలంలో ఆ బంతి అక్షరాల .19.5 కోట్ల ధరకు అమ్ముడైంది. అయితే ఇంతకాలం ఆ బంతి అప్పటి మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన అలీ బిన్ నాసర్(ట్యునీషియా) దగ్గరే ఉంది. తాజాగా వేలానికి పెట్టడంతో ఇలా భారీ ధరకు అమ్ముడుపోయింది. 1986 సాకర్ వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మారడోనా రెండు గోల్స్ చేశాడు. అందులో ఒక గోల్‌ను చేతితో కొట్టడం అధికారులెవరు గుర్తించలేదు. తర్వాత మారడోనా కొట్టిన ఆ గోల్.. ''హ్యాండ్ ఆఫ్ గాడ్''(Hand OF GOD) గోల్‌గా ప్రసిద్ధి చెందింది. ఈ గోల్ అప్పట్లో వివాదాస్పదమైనప్పటికి.. మారడోనా తన ఆటతో అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలబెట్టడంతో అందరూ ఆ వివాదాన్ని మరిచిపోయారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో 1986 ఫిఫా వరల్డ్‌కప్‌లో మారడోనా ధరించిన జెర్సీకి కూడా కళ్లు చేదిరే మొత్తం వచ్చి చేరింది. క్వార్టర్స్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అర్జెంటీనా 2–1తో గెలిచి సెమీఫైనల్ చేరింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్ ముగిశాక మారడోనా తన జెర్సీని ఇంగ్లండ్ ప్లేయర్ స్టీవ్ హాడ్జ్‌కు అందజేశాడు. దానిని దాచుకున్న హాడ్జ్ ఏప్రిల్ నెలలో ‘సోతీబై’ అనే ఆన్లైన్ వేలం సైట్లో అమ్మకానికి పెట్టగా ఒక అజ్ఞాతవ్యక్తి సదరు జెర్సీని 71 లక్షల పౌండ్లకు అమ్ముడుపోవడం విశేషం. చదవండి: మ్యాచ్‌ను గెలిపించలేకపోయిన జైశ్వాల్ వీరొచిత సెంచరీ FIFA: అందాల విందు కష్టమే.. అసభ్యకర దుస్తులు ధరిస్తే జైలుకే -
మారడోనా 'హ్యాండ్ ఆఫ్ గాడ్'కు మరో అరుదైన గౌరవం
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా హ్యాండ్ ఆఫ్ గాడ్ జెర్సీకి మరో అరుదైన గౌరవం లభించింది. ఖతార్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్‌కప్‌లో మారడోనా జెర్సీని ప్రత్యేక డిస్ప్లేలో ఉంచనున్నారు. అక్టోబర్ 2(ఆదివారం) నుంచి ఏప్రిల్ 1 వరకు ఖతార్‌లోని స్పోర్ట్స్ మ్యూజియంలో ఉంటుందని ఒక అధికారి పేర్కొన్నారు. ఇక నాలుగు నెలల క్రితమే మారడోనా హ్యాండ్ ఆఫ్ గాడ్ జెర్సీని వేలం వేయగా కళ్లు చెదిరే మొత్తానికి అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. కాగా జెర్సీని కొన్న ఆ వ్యక్తి పేరును ఇప్పటివరకు బయటపెట్టలేదు. మారడోనాకు వీరాభిమాని అయిన ఆ అజ్ఞాతవ్యక్తి జెర్సీని 71లక్షల పౌండ్లకు(భారత కరెన్సీలో దాదాపు రూ.67 కోట్ల 72 లక్షలకు) కొనుగోలు చేయడం విశేషం. 1986 సాకర్ వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మారడోనా ఈ జెర్సీనే ధరించాడు. ఈ మ్యాచ్‌లో మారడోనా రెండు గోల్స్ చేయగా.. అందులో ఒకటి హ్యాండ్ ఆఫ్ గోల్ కూడా ఉంది. ఈ గోల్ అప్పట్లో వివాదాస్పదమైనప్పటికి.. మారడోనా తన ఆటతో అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలబెట్టడంతో అందరూ ఆ వివాదాన్ని మరిచిపోయారు. కాగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అర్జెంటీనా 2–1తో గెలిచి సెమీఫైనల్ చేరింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్ ముగిశాక మారడోనా తన జెర్సీని ఇంగ్లండ్ ప్లేయర్ స్టీవ్ హాడ్జ్‌కు అందజేశాడు.దానిని ఇంతకాలం దాచుకున్న హాడ్జ్ ఏప్రిల్ నెలలో ‘సోతీబై’ అనే ఆన్లైన్ వేలం సైట్లో అమ్మకానికి పెట్టాడు. -
మారడోనా హ్యాండ్ ఆఫ్ గాడ్’ జెర్సీకి కళ్లు చెదిరే మొత్తం
లండన్: అర్జెంటీనా దిగ్గజం డీగో మారడోనా... ఇంగ్లండ్‌తో జరిగిన 1986 ప్రపంచకప్ ఫుట్‌బాల్ క్వార్టర్ ఫైన ల్లో ధరించిన జెర్సీ ని కళ్లు చెదిరే మొత్తానికి కొనుగోలు చేశారు. ఈ మ్యాచ్‌లో మారడోనా చేసిన తొలి గోల్ ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్‌గా వివాదాస్పదమైంది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 2–1తో గెలిచి సెమీఫైనల్ చేరింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్ ముగిశాక మారడోనా తన జెర్సీని ఇంగ్లండ్ ప్లేయర్ స్టీవ్ హాడ్జ్‌కు అందజేశాడు. దానిని ఇంతకాలం దాచుకున్న హాడ్జ్ ఇటీవల ‘సోతీబై’ అనే ఆన్లైన్ వేలం సైట్లో విక్రయానికి పెట్టాడు. బుధవారం ముగిసిన ఈ ఆన్లైన్ వేలంలో ఓ అజ్ఞాత అభిమాని ఈ జెర్సీని 71 లక్షల పౌండ్లకు (రూ. 67 కోట్ల 72 లక్షలు) కొనుగోలు చేశాడని సోతీబై సైట్ తెలిపింది చదవండి: IPL 2022: సీఎస్కేపై ఆర్సీబీ ఘన విజయం.. -
వేలానికి మారడోనా ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ జెర్సీ
లండన్: దివంగత అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం మారడోనా కెరీర్లో ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ ఎంత ప్రసిద్ధికెక్కిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 1986 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మారడోనా చేసిన ఈ గోల్ ఫుట్‌బాల్ ప్రపంచంలో మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఈ గోల్ మాత్రమే కాకుండా ఆ మ్యాచ్‌లో మారడోనా ధరించిన జెర్సీ, షూ పట్ల అందరికీ ప్రత్యేక ఆసక్తి. ఇప్పుడు ఆ జెర్సీ వేలానికి రానుంది. ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ స్టీవ్ హోడ్జ్ దగ్గరున్న జెర్సీని వేలంలో 20 లక్షల డాలర్లకు (రూ. 14.79 కోట్లు) విక్రయించనున్నట్లు అమెరికా క్రీడా వస్తువుల సేకరణ నిపుణుడు డేవిడ్ అమర్మన్ తెలిపాడు. ‘హ్యాండ్ ఆఫ్ గాడ్ జెర్సీకి విలువ కట్టడం చాలా కష్టం. కానీ దాని యజమాని వేలంలో 20 లక్షల డాలర్లు ఆశిస్తున్నారు. ధర ఎక్కువే. కానీ అధిక సంపద ఉన్న వ్యక్తి ఆ జెర్సీని ఎందుకు వద్దనుకుంటారు. ఇది అమ్ముడయ్యే అవకాశం ఉంది’ అని డేవిడ్ అన్నారు. మారడోనా మరణానంతరం ఈ జెర్సీని ప్రస్తుతం మాంచెస్టర్‌లోని ఇంగ్లండ్ జాతీయ ఫుట్‌బాల్ మ్యూజియంలో ప్రజల సందర్శన కోసం ఉంచారు. -
దేవుడి చేయి ప్రత్యక్షమైందా?
అంతరిక్షంలో దేవుడి చేయి ప్రత్యక్షమైందా? వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఈ అపురూప దృశ్యం ఆవిశృతమైందా? కొందరు అవును అంటుండగా, మరికొందరు కాదని వాదిస్తున్నారు. ఏది ఏమైనా నాసా విడుదల చేసిన దృశ్యాలు సర్వత్రా ఆసక్తిని రేపుతున్నాయి. చేతిని పోలిన ఆకారం నింగిపై దర్శనమివ్వడం ... ఆ సుస్పష్ట ఆకారం వెలుగులు విరజిమ్మడం .. కొత్త ఊహలకు తావిస్తోంది. నాసాకు చెందిన న్యూక్లియర్ స్పెక్ట్రోస్కోపిక్ టెలిస్కోప్ ఆరే - న్యూస్టార్ తీసిన ఎక్స్‌రే ఇమేజెస్‌లో చేయి ఆకారంలో ఉన్న మబ్బులాంటి దృశ్యాలు కనిపించాయి. నక్షత్రంలోంచి పుట్టుకొచ్చినట్టున్న ఈ చేయి ఆకారానికి 'హ్యాండ్ ఆఫ్ గాడ్'గా పిలుస్తున్నారు. ఏడాది క్రితం దేవుడి కన్ను అంటూ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఓ ఫొటోను విడుదల చేసింది. ఇప్పుడు నాసా తీసిన ఈ ఫొటోలు ఖగోళ అద్భుతాలను కళ్ల ముందు ఉంచుతున్నాయి. ఇంతవరకూ ఎప్పుడూ అర్థావృత్తాకారంలో లేదా వృత్తాకారంలోనే ఇటువంటి అరుదైన దృశ్యాలు కనిపించేవి. తొలిసారిగా చేయి ఆకారంలో కనిపించడంతో .. కచ్చితంగా ఆ దేవదేవుడి అభయహస్తమేనని భక్తులు నమ్ముతున్నారు. ఇటు నాసా కూడా ఈ ఆకారం ఎందుకు, ఎలా వచ్చిందని పరిశోధనలు చేస్తోంది. -
దేవుడి చేయి ప్రత్యక్షమైందా?