దేవుడి చేయి ప్రత్యక్షమైందా? | NASA's X-ray image of the 'Hand of God' | Sakshi
Sakshi News home page

దేవుడి చేయి ప్రత్యక్షమైందా?

Published Sat, Jan 11 2014 9:57 AM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM

దేవుడి చేయి ప్రత్యక్షమైందా?

దేవుడి చేయి ప్రత్యక్షమైందా?

అంతరిక్షంలో దేవుడి చేయి ప్రత్యక్షమైందా? వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఈ అపురూప దృశ్యం ఆవిశృతమైందా? కొందరు అవును అంటుండగా, మరికొందరు కాదని వాదిస్తున్నారు. ఏది ఏమైనా నాసా విడుదల చేసిన దృశ్యాలు సర్వత్రా ఆసక్తిని రేపుతున్నాయి. చేతిని పోలిన ఆకారం నింగిపై దర్శనమివ్వడం ... ఆ సుస్పష్ట ఆకారం వెలుగులు విరజిమ్మడం .. కొత్త ఊహలకు తావిస్తోంది. నాసాకు చెందిన న్యూక్లియర్‌ స్పెక్ట్రోస్కోపిక్‌ టెలిస్కోప్ ఆరే - న్యూస్టార్‌ తీసిన ఎక్స్‌రే ఇమేజెస్‌లో చేయి ఆకారంలో ఉన్న మబ్బులాంటి దృశ్యాలు కనిపించాయి.

నక్షత్రంలోంచి పుట్టుకొచ్చినట్టున్న ఈ చేయి ఆకారానికి 'హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌'గా పిలుస్తున్నారు. ఏడాది క్రితం దేవుడి కన్ను అంటూ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఓ ఫొటోను విడుదల చేసింది. ఇప్పుడు నాసా తీసిన ఈ ఫొటోలు ఖగోళ అద్భుతాలను కళ్ల ముందు ఉంచుతున్నాయి. ఇంతవరకూ ఎప్పుడూ అర్థావృత్తాకారంలో లేదా వృత్తాకారంలోనే ఇటువంటి అరుదైన దృశ్యాలు కనిపించేవి. తొలిసారిగా చేయి ఆకారంలో కనిపించడంతో .. కచ్చితంగా ఆ దేవదేవుడి అభయహస్తమేనని భక్తులు నమ్ముతున్నారు. ఇటు నాసా కూడా ఈ ఆకారం ఎందుకు, ఎలా వచ్చిందని పరిశోధనలు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement