
దిగ్గజ ఫుట్‌బాలర్ డీగో మారడోనాను స్మరిస్తూ మరో అర్జెంటీనా స్టార్ లియొనల్ మెస్సీ మైదానంలో చేసిన చర్య స్పానిష్ లీగ్ నిర్వాహకులకు ఆగ్రహం తెప్పించింది. ఆదివారం ఒసాసునాతో జరిగిన మ్యాచ్‌లో బార్సిలోనా తరఫున ఆడుతున్న మెస్సీ... గోల్ చేసిన సమయంలో తన జెర్సీని తొలగించి లోపల మారడోనా అర్జెంటీనా లీగ్ టీమ్ నెవెల్స్ ఓల్డ్ బాయ్స్‌కు ఆడిన సమయంలో వేసుకున్న జెర్సీని ప్రదర్శించాడు. అనంతరం ఆకాశం వైపు రెండు చేతులూ చాచి మారడోనాను స్మరించుకున్నాడు. ఇది నిబంధనలకు విరుద్ధమంటూ నిర్వాహకులు మెస్సీకి 600 యూరోలు (సుమారు రూ. 54 వేలు) జరిమానా విధించారు!
Comments
Please login to add a commentAdd a comment