కోర్టు బోను ఎక్కనున్న దిగ్గజ ఆటగాడు | Italian judge orders Maradona, lawyer to stand trial | Sakshi
Sakshi News home page

కోర్టు బోను ఎక్కనున్న దిగ్గజ ఆటగాడు

Published Thu, May 14 2015 4:10 PM | Last Updated on Sun, Sep 3 2017 2:02 AM

కోర్టు బోను ఎక్కనున్న దిగ్గజ ఆటగాడు

కోర్టు బోను ఎక్కనున్న దిగ్గజ ఆటగాడు

రోమ్: అర్జెంటీనా దిగ్గజ ఫుట్ బాల్ ఆటగాడు డిగో మారడోనా ఇటలీలో కోర్టు బోను ఎక్కనున్నాడు. మారడోనా, అతడి తరపు లాయర్ ఆంగెలొ పిసానో వచ్చే ఏడాది జూలై 16న విచారణకు హాజరు కావాలని రోమ్ కోర్టు ఆదేశించింది. ఈక్విటాలియా ట్యాక్స్ కలెక్షన్ ఏజెన్సీని దూషించిన కేసులో వీరిద్దరూ తమ ఎదుట విచారణ హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది.

ఈక్విటాలియాపై పలు ఇంటర్వ్యూల్లో మారడోనా దుమ్మెత్తి పోశాడు. తప్పుడు పత్రాలతో తనను ఈక్విటాలియా పీడించుకుని తిందని, అవకతవకలకు పాల్పడిందని విమర్శించాడు. ఇటలీలోని తన ఆస్తులను ఈక్విటాలియా స్తంభింపజేయడంతో మారడోనా ఈవిధంగా విరుచుకుపడ్డాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement