
బ్యూనస్ ఎయిర్స్ : దివంగత ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా జ్ఞాపకార్థం కరెన్సీపై అతని బొమ్మను ముద్రించేందుకు అర్జెంటీనాలో సన్నాహాలు జరుగుతున్నాయి. ‘లా పంపా’ ప్రావిన్స్ సెనెటర్ నార్మా డ్యూరాంగో ఈ మేరకు సోమవారం ప్రజాప్రతినిధుల సభ ‘కాంగ్రెస్’కు ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదనను పంపించారు. 1000 పెసో నోటుపై ఒకవైపు మారడోనా చిత్రాన్ని, మరోవైపు ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ నమూనాను పొందుపరచనున్నట్లు ఆమె వెల్లడించారు. దీనిపై చట్టసభ సభ్యులదే తుది నిర్ణయమన్న ఆమె వచ్చే ఏడాది ప్రారంభంలో తన ప్రతిపాదనను వినిపిస్తానని చెప్పారు. ‘మన దిగ్గజాన్ని గౌరవించేందుకు మాత్రమే కాకుండా ఆర్థిక లావాదేవీల పరంగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు ‘మారడోనా’ను తమతో తీసుకెళ్లేందుకు ఇష్టపడతారని భావిస్తున్నా’ అని ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment