- రెండు సహాయ కేంద్రాలు ఏర్పాటు
- ఆప్షన్ల ఎంపిక 26 నుంచి 31 వరకు
- సెప్టెంబర్ 3న సీట్ల కేటాయింపు
26 నుంచి ఐసెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్
Published Sun, Aug 21 2016 6:57 PM | Last Updated on Sat, Aug 25 2018 6:53 PM
కమాన్‌చౌరస్తా : టీఎస్ ఐసెట్–2016 విద్యార్థుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు జరుగనుంది. జిల్లా కేంద్రంలోని ఉజ్వల పార్కు వద్ద ఉన్న డాక్టర్ బీఆర్.అంబేద్కర్ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, ఎస్సారార్ కళాశాలలో ఇందు కోసం రెండు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతీరోజు ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో నిర్ణీత ర్యాంకుల విద్యార్థుల సర్టిపికెట్లు పరిశీలించనున్నట్లు పాలిటెక్నిక్ కళాశాల సమన్వయ అధికారి బి.రాజ్‌గోపాల్ తెలిపారు. ఉదయం 9 గంటలకు , మధ్యాహ్నం 1:30 గంటలకు విద్యార్థులు ర్యాంకులవారీగా హాజరవ్వాల్సి ఉంటుంది.
విద్యార్థులు తీసుకురావాల్సిన పత్రాలు
–టీఎస్ ఐసెట్–2016 ర్యాంకు కార్డు
–టీఎస్ ఐసెట్–2016 హాల్‌టికెట్
–ఆధార్‌కార్డు
–డిగ్రీ మార్కుల పత్రం
–ఇంటర్ లేదా తత్సమాన అర్హత మార్కుల పత్రం
–ఎస్‌ఎస్‌సీ లేదా తత్సమాన అర్హత మార్కుల పత్రం
–స్టడీ సర్టిపికెట్ 9 వతరగతి నుంచి డిగ్రీ వరకు
–ట్రాన్స్‌ఫర్ సర్టిపికెట్
–ఆదాయ ధ్రువీకరణ పత్రం(01.01.2016 తర్వాత జారీచేసిన)
–కుల ధ్రువీకరణ పత్రం
–నివాస ధ్రువీకరణపత్రం
–పైన తెలిపినవన్నీ రెండు సెట్ల జిరాక్స్
ఎస్టీలు పాలిటెక్నిక్‌లోనే....
జిల్లాలోని అన్ని ర్యాంకులకు చెందిన ఎస్టీ విద్యార్థులు మహిళా పాలిటెక్నిక్ కళాశాలలోనే విధిగా హాజరుకావాలి. ఇతర సహాయ కేంద్రంలో అనుమతించరు. వికలాంగులు, ఆర్మీ విద్యార్థులు, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కోటా విద్యార్థులు హైదరాబాద్‌లోని మాసాబ్‌ట్యాంక్ వద్ద సాంకేతిక విద్యాభవన్‌లో హాజరుకావాలి.
ఫీజు వివరాలు....
సర్టిపికెట్ల పరిశీలన సమయంలో ఓసీ, బీసీలకు చెందిన విద్యార్థులు రూ.వెయ్యి, ఎస్సీ, ఎస్టీ వారు రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. డిగ్రీలో ఓసీ, బీసీ విద్యార్థులు 50 శాతం మార్కులు, ఎస్సీఎస్టీ విద్యార్థులు 45 శాతం కలిగి ఉండాలి. ఎంట్రన్స్ సమయంలో బయోమెట్రిక్ హాజరువిధానం అములు చేసినందున పరీక్ష రాసిన విద్యార్థి తప్పనిసరిగా సర్టిపికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలి. ఇక్కడ కూడా వేలిముద్రలు సేకరించి సరిపోలుస్తారు. గోరింటాకు పెట్టకుని వస్తే వేలిముద్రల సమయంలో ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుంది.
ర్యాంకువారీగా తేదీలు..
తేదీ సమయం మహిళా పాలిటెక్నిక్ ఎస్సారార్ కళాశాల
(హాజరవ్వాల్సిన ర్యాంకు) (హాజరవ్వాల్సిన ర్యాంకు)
26 ఉదయం 1–3000 3001–6000
మధ్యాహ్నం 6001–9000 9001–12000
27 ఉదయం 12001–15000 15001–18000
మధ్యాహ్నం 18001–21000 21001–24000
28 ఉదయం 24001–27000 27001–30000
మధ్యాహ్నం 30001–33000 33001–36000
29 ఉదయం 36001–39500 39501–43000
మధ్యాహ్నం 43001–46500 46501–50000
30 ఉదయం 50001–53500 53501–57000
మధ్యాహ్నం 57001–60500 60501–చివరిర్యాంకు
వెబ్ ఆప్షన్ల తేదీలు ర్యాంకు వారీగా
తేదీ ర్యాంకులు
26, 27 1–12000
27, 28 12001–24000
28, 29 24001–36000
29, 30 36001–50000
30, 31 50001–చివరిర్యాకు
సెప్టెంబర్ 3న సీట్ల కేటాయింపు
టీఎస్ ఐసెట్–2016 సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరై ఆప్షన్లను ఎంపిక చేసుకున్న విద్యార్థులకు సెప్టెంబర్ 3వ తేదీన సాయంత్రం 8 గంటల తర్వాత సీట్ల కేటాయింపు జరుగుతుంది. అన్ని ర్యాంకుల వారికి సెప్టెంబర్ 1 తేదీన అప్షన్ల మార్పుకు అవకాశం ఉంటుంది.
మొబైల్ నంబర్ సరిచూసుకోవాలి
–బి.రాజ్‌గోపాల్, మహిళా పాలిటెక్నిక్ కళాశాల క్యాంప్ ఆఫీసర్ (21కెఎన్‌టీ126)
ఐసెట్–2016 సర్టిపికెట్ల పరిశీలన సమయంలో విద్యార్థులు వారి మొబైల్ నంబరు నమోదు చేసే ప్రక్రియలో ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవాలి. ఐసెట్‌కు సంబంధించిన పాస్‌వర్డ్, సీట్ల కేటాయింపు వివరాలన్నీ మొబైల్ నంబర్‌కే వస్తాయి. మొబైల్ నంబర్ కీలకంగా ఉంటుంది. దానిని స్విచ్‌ఆఫ్ చేయడం, సిమ్‌కార్డు తీసివేయడం వంటివి చేసి ఇబ్బందులకు గురికావద్దు. నంబర్ మార్చుకోవాలంటే హైదరాబాద్‌కు సమాచారం ఇవ్వాలి.
Advertisement
Advertisement