
మాట్లాడుతున్న ఎస్పీ జోయల్‌డేవిస్
ఒక వేళ తక్కువ సంఖ్యలో ఉంటే పనితీరు ఆధారంగా ఆయా జిల్లాలకు కేటాయిస్తామని తెలిపారు. ఇప్పటికే హోంగార్డ్‌ల విభజన పూర్తయిందన్నారు. వారిని తక్కువగా ఉన్న యూనిట్లలో సమీపంలోని మండలాల నుంచి తీసుకుని భర్తీ చేశామని తెలిపారు. డీపీవో సిబ్బందిలో పనితీరు ఆధారంగా మూడు జిల్లాలకు సమానంగా వచ్చేలా మారుస్తామని, తక్కువగా ఉంటే వివిధ కేటగిరీలుగా మార్చి ఆయా జిల్లాకు కేటాయిస్తామన్నారు. ఏఆర్ సిబ్బందిని ఆయా జిల్లాలో అవసరం, జైళ్లు, కోర్టులు, కార్యాలయాలు, బందోబస్తులు, వీఐపీ మూమెంట్, ఆలయాలు తదితర అంశాలను ఆధారంగా చేసుకుని వారిని కేటాయిస్తామని తెలిపారు.
కొత్త జిల్లాకు పంపాల్సిన రికార్డులు, ఫర్నిచర్, ఇతర పరికరాలు, అయుధాలు, వాటిని పరికరాలు ఆయుధగారాల పంపకాలు కూడా పూర్తి చేసినట్లు తెలిపారు. ఏఆర్‌తోపాటు డీసీఆర్‌బీ, ఎస్‌బీ, మినిస్టీరియల్ సిబ్బంది విభజన దాదాపు పూర్తి కావచ్చిందని, వారికి నంబరింగ్ కూడా పూర్తి చేశామని పేర్కొన్నారు. నివేదికలను రెండు మూడు రోజుల్లో ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. తదుపరి ఉత్తర్వుల ప్రకారం మిగిలి వ్యవహరాలు, కార్యాలయాలు, ఆయా ఠాణాల సిబ్బందిని పరిశీలించి పంపకాలు చేస్తామని చెప్పారు. తర్వాత ఆయా జిల్లాలో తక్కువగా ఉన్న సిబ్బంది ఆయా జిల్లాల పరిపాలన విభాగం చూసుకుంటుదని తెలిపారు.