divide
-
'దక్షిణాదిన కేసీఆర్.. ఉత్తరాదిలో కేజ్రీవాల్.. చీల్చే పని వీళ్లదే..'
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఢిల్లీ ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, కేజ్రీవాల్ కలిసి కాంగ్రెస్ పార్టీని నష్టపరిచే చర్యలకు పాల్పడుతున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి తారిఖ్ అన్వర్ వ్యాఖ్యానించారు. ‘దేశంలోని మెజార్టీ విపక్షాలు నరేంద్ర మోదీ ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. కానీ, అవి ఏకం కాకుండా బీజేపీ రాజకీయం చేస్తోంది. అందులో భాగంగానే ఉత్తరాదిన కేజ్రీవాల్‌కు, దక్షిణాదిన కేసీఆర్‌కు బాధ్యతలు అప్పగించింది. విపక్షాలు కాంగ్రెస్ వైపు రాకుండా చీల్చే పనిని ఆ ఇద్దరు తీసుకున్నారు’అని ఆయన ఆరోపించారు. శుక్రవారం ఇక్కడి గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావెద్, పార్టీ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, కమలాకర్‌రావు, షబ్బీర్‌అలీతో కలిసి ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఏర్పాటు చేసిన ఖమ్మం సభ కూడా అందులో భాగమేనన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ లేకుండా జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఎంఐఎంతో కాంగ్రెస్ పార్టీ కలిసే అవకాశాలు లేవని, ఆ పార్టీ బీజేపీకి బీటీమ్‌గా పనిచేస్తోందని పేర్కొన్నారు. దేశంలోని సెక్యులర్ ఓట్లను చీల్చి కాంగ్రెస్ పార్టీని ఓడించడం ద్వారా బీజేపీకి లబ్ధి కలిగించే పనిలో ఆ పార్టీ ఉందన్నారు. నాడు వాజ్పేయే చెప్పారు గుజరాత్లో జరిగిన మత ఘర్షణలకు మోదీయే బాధ్యుడని తాజాగా వచ్చిన బీబీసీ వార్తలపై తారిఖ్ అన్వర్ స్పందిస్తూ ఆ వార్తలు వాస్తవమేనని అన్నారు. ఈ విషయంలో మోదీ రాజధర్మాన్ని నిర్వర్తించలేదని నాటి బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా వ్యాఖ్యానించారన్న విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ రూ.10 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఇస్తే ఎనిమిదేళ్ల పాలన తర్వాత సీఎం కేసీఆర్ రూ.5 లక్షల కోట్ల అప్పులకుప్పగా మార్చారని తారిఖ్ విమర్శించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఏర్పాటు లక్ష్యం నెరవేరలేదని, ఇక్కడి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని అన్నారు. ప్రధాని మోదీ కూడా దేశ ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదన్నారు. తెలంగాణ నుంచి గాంధీ కుటుంబం పోటీ చేస్తుందా లేదా అనేది ఆ కుటుంబమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. తెలంగాణలో పార్టీ పరిస్థితులను చక్కదిద్దే బాధ్యతను సీనియర్ నేత మాణిక్‌రావ్ ఠాక్రేకు అధిష్టానం అప్పగించిందని, ఆయన మార్గదర్శనంలో తెలంగాణలో పార్టీ బలోపేతం అవుతుందని తారిఖ్ ధీమా వ్యక్తం చేశారు. చదవండి: పాదయాత్రకు రేవంత్ సన్నాహాలు! ఓకే అయితే జూన్ 2 వరకు -
చిచ్చుపెట్టే వారితో జాగ్రత్త! మోసపోతే గోసే..
సాక్షి, మేడ్చల్ జిల్లా: ‘‘కొందరు దేశాన్ని కులం మతం పేరిట విడదీస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. సమాజంలో విద్వేషం పెచ్చరిల్లితే కోలుకోవడం చాలా కష్టం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చైనా, సింగపూర్, కొరియా దేశాల్లోలాగా కుల మత రహిత దేశంగా ముందుకు సాగాలి..’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ శివార్లలో తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని అంతాయిపల్లిలో నిర్మించిన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ఆ పార్టీల పట్ల జాగ్రత్తగా ఉండాలి: దేశంలో అనేక నదులు, ఎంతో సంపద ఉండి కూడా అభివృద్ధి చెందలేకపోయింది. దేశాన్ని ఏలుతున్న పాలకుల వైఫల్యాలే దీనికి కారణం. జాతీయ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాల్సిన అవసం ఉంది. నీచ రాజకీయాల కోసం ఎంతకైనా తెగించే పార్టీల పట్ల ప్రజలు జాగరూకతతో ఉండాలి. ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకొనే పార్టీల మాటలకు మోసపోతే గోస పడతాం. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశంలో గత పాలకుల చేతకానితనం, అసమర్థత వల్ల అభివృద్ధికి దూరమయ్యాం. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో నేటికీ తీవ్రంగా కరెంట్ కోతలు ఉన్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు, కోతల్లేని 24 గంటల నాణ్యమైన కరెంట్, రైతు బంధు, రైతు బీమా వంటి అద్భుతమైన కార్యక్రమాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇతర రాష్ట్రాలు తెలంగాణ పథకాలను చూసి నివ్వెరపోతున్నాయి. తెలంగాణలో చేపడుతున్న పథకాలు, అభివృద్ధి పనులను చూసి తమ రాష్ట్రంలోనూ ఇలాంటి నాయకుడు ఉంటే బాగుండేదని ఇతర రాష్ట్రాల ప్రజలు అంటున్నారు. తలసరి ఆదాయం పెరిగింది దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణలో తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. 2014లో దాదాపు రూ.లక్ష తలసరి ఆదాయం ఉండగా.. ఇప్పుడు రూ.2,78,500కు పెరిగింది. ఇది దేశంలోనే అత్యధికం. తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుందని నేను ఉద్యమకాలంలోనే చెప్పిన. అదిప్పుడు వాస్తవ రూపం దాల్చింది. ఇవాళ రాష్ట్ర జీఎస్డీపీ రూ.11.50 లక్షల కోట్లకు పెరిగి దేశంలోనే అద్భుతమైన రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఇది ఆషామాషీగా ఏమీ జరగలేదు. కడుపు కట్టుకొని పనిచేయడం, అవినీతి రహిత పాలన అందించడం వల్లే సాధ్యమైంది. రాష్ట్రంలో 2,601 రైతు వేదికలను 6 నెలల వ్యవధిలోనే నిర్మించుకోవడం, 11 వేల క్రీడా ప్రాంగణాలనూ అనతి కాలంలోనే ఏర్పాటు చేసుకోవడం సుపరిపాలనతోనే సాధ్యమైంది. పరిపాలన ప్రజలకు ఎంత చేరువగా ఉంటే అంత చక్కగా పనులు జరుగుతాయి. అందుకే 33 జిల్లాలు ఏర్పాటు చేసుకుని, నూతన కలెక్టరేట్లను ప్రారంభించుకుంటున్నాం. సంక్షేమంలో నంబర్ వన్‌గా ఉన్నాం దేశంలో సంక్షేమంలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉంది. దేశంలో అత్యధిక వేతనం పొందుతున్నది తెలంగాణ ఉద్యోగులే. రాష్ట్రంలో ప్రస్తుతం అందిస్తున్న 36 లక్షల పింఛన్లకు అదనంగా మరో 10 లక్షలు కలిపి మొత్తం 46 లక్షల పింఛన్లు అందిస్తున్నాం. ఇవి ఎప్పుడో అందించాల్సింది. కానీ కరోనా కారణంగా కొంత ఆలస్యమైంది. త్వరలోనే వారందరికీ డిజిటల్ కార్డులు జారీ చేస్తాం. గతంలో వృద్ధులను ఇంట్లో నుంచి వెళ్లగొట్టే పరిస్థితి కనిపించేది. కానీ ఆసరా పింఛన్ల పుణ్యామా అని అత్త, అమ్మలకు డిమాండ్ పెరిగింది. ఇవాళ రూ.30 వేల నుంచి రూ.50 వేల దాకా వారి సంచిలో ఉంటుండటంతో ఎవరికీ భారం కాకుండా బతుకున్నారు. అందుకు కారణం తమ పెద్ద కొడుకు కేసీఆరేనని భావిస్తున్నారు. త్వరలో డయాలసిస్ రోగులకు కూడా ఆసరా పింఛన్లు అందిస్తాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా గురుకుల విద్యాలయాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. వాటిలో చదువుతున్న విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తున్నారు. కరోనా కారణంగా మరికొన్నింటిని ప్రారంభించలేకపోయాం. గతంలో తెలంగాణ జనం పస్తులు ఉండలేక దుబాయ్, బొంబాయిలకు వలస వెళ్లేవారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల నుంచి 13 లక్షల మందికిపైగా తెలంగాణకు వలస వచ్చి జీవిస్తున్నారు.’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో పరిణామాలను గమనించాలి 60ఏళ్ల కిందట తెలంగాణ సమాజం నిద్రాణమై ఉండేది. అందుకే 58ఏళ్ల పాటు ఎన్నో గోసలు పడ్డాం. ఇప్పుడు పూర్తి జాగ్రత్తతో ఉండాలి. దేశంలో జరిగే పరిణామాలను గమనించాలి. పత్రికల్లో వచ్చే వార్తలను చూసి వదిలేయకుండా వాటిపై గ్రామాల్లో, బస్తీల్లో సైతం చర్చ జరగాలి. అప్పుడే చైతన్యవంతమైన సమాజ పురోగతి సాధ్యమవుతుంది. మేడ్చల్ అభివృద్ధికి రూ.70 కోట్లు హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ జిల్లా చాలా భాగం జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నా.. మిగతా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తమ నిధులు సరిపోవడం లేదని ఎమ్మెల్యేలు తనకు విన్నవించారని సీఎం కేసీఆర్ చెప్పారు. దీనితో అదనంగా ఒక్కో నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున 7 నియోజకవర్గాలకు రూ.70 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై గురువారమే జీవో జారీ చేస్తామన్నారు. కాగా.. సభకు ముందు కొత్త కలెక్టరేట్లో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేసి, భవన సముదాయాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు మల్లారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్‌రావు, జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, వివేకానంద, కృష్ణారావు, భేతి సుభాష్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, సుధీర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. చదవండి: కేసీఆర్ చేసింది పెద్ద రిస్కే.. ఇది ఆషామాషీ విషయం కాదు -
ట్రంప్ ఆస్ట్రేలియన్లను కూడా చీల్చాడు!
కాన్బెర్రా: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనకు మాత్రమే కాదు.. తన గురించి చర్చించుకుంటున్నవారికి తలనొప్పిగా మారారు. ట్రంప్ ఇటీవల తీసుకొచ్చిన ఏడు ముస్లిం దేశాల పౌరుల ట్రావెలింగ్ బ్యాన్ విషయంలో ఆస్ట్రేలియా వాసులు రెండుగా చీలిపోయారు. ట్రంప్‌దే కరెక్ట్ అని సగం మంది, సరికాదని మిగితా సగంమంది తగువుకు దిగారు. ఈ విషయం అక్కడ నిర్వహించిన ఓ ఆన్లైన్ సంస్థ తెలిపింది. 44శాతంమంది ఆస్ట్రేలియన్లు ట్రంప్ నిర్ణయానికి అనుకూలంగా నిలవగా 45 శాతం మంది మాత్రం వ్యతిరేకంగా నిల్చున్నారు. కన్జర్వేటివ్ ఓటర్లంతా కూడా ట్రంప్ శైలి తమకు నచ్చిందని, దానిని ప్రవేశపెడితే ఆస్ట్రేలియాలోకి కూడా వలసలు రాకుండా అడ్డుకోవచ్చని చెబుతున్నారంట. అలాగే, నేషనల్, లిబర్ ఓటర్లు కూడా ట్రంప్ విధానాన్ని సమర్థిస్తున్నారని కూడా ఆ సంస్థ తెలిపింది. ఇక 34శాతం ఓటర్లు ట్రంప్ కు అనుకూలంగా ఉన్నారని, అదే సమయంలో 55శాతం మంది మాత్రం ట్రంప్ విధానంపై గుర్రుగా ఉన్నారని ఆ సంస్థ తెలిపింది. జర్మనీ, బ్రిటన్, కెనడా వంటి దేశాలు స్పష్టంగా ట్రంప్ విధానాన్ని తప్పుబట్టగా అమెరికా వ్యక్తిగత అంశాల్లో తాము జోక్యం చేసుకోమని, అది ఆ దేశం ఇష్టమంటూ ఆస్ట్రేలియా ప్రధాని మాల్కోమ్ టర్న్‌బుల్ స్పష్టతనివ్వకుండా సమాధానం దాటవేశారు. -
‘నీరూ’ తరలుతోంది..
పాల్వంచ ఇరిగేషన్ పరిధి నుంచి 324 చెరువులు ఔట్ 9 మండలాలకు పరిమితమైన పాల్వంచ డివిజన్ సత్తుపల్లి డివిజన్ కలిస్తే మరింతగా పెరగనున్న విస్తీర్ణం పాల్వంచ: 15 ఏళ్ల క్రితం ఏర్పాటైన పాల్వంచ ఇరిగేషన్ డివిజన్ ముక్కలు కానుంది. ఈ డివిజన్ నుంచి 324 చెరువులు బయటకు వెళ్లనున్నాయి. ఇప్పటి వరకు 12 మండలాలలో ఉన్న నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధిశాఖ (ఇరిగేషన్) డివిజన్ ఇక మీదట 9 మండలాలకు పరిమితం కానుంది. పాల్వంచ ఇరిగేషన్ డివిజన్ నుంచి మూడు మండలాలు వివిధ జిల్లాల్లోకి వెళ్లనున్నాయి. డివిజన్లో ఇప్పటి వరకు పాల్వంచ, కొత్తగూడెం, పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, గుండాల, ఇల్లెందు, టేకులపల్లి, గార్ల, బయ్యారం, కామేపల్లి మండలాలు ఉండగా దీనిలో గార్ల, బయ్యారం మహబూబాబాద్ జిల్లాలోకి వెళ్లనున్నాయి. కామేపల్లి ఖమ్మం జిల్లాలోకి చేరుతుండగా ఈ డివిజన్ 9 మండలాలకు పరిమితం కానుంది. ఇప్పటి వరకు అశ్వారావుపేట డివిజన్లో ఉన్న అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, చండ్రుగొండ మండలాలు ఈ డివిజన్ పరిధిలోకి వస్తే విస్తీర్ణం పెరగనుంది. 12 మండలాల నుంచి 13 మండలాలకు ఈ ఇరిగేషన్ డివిజన్ చేరుతుంది. చెరువులు అటూఇటూ పాల్వంచ ఇరిగేషన్ డివిజన్ పరిధిలో ఇప్పటి వరకు 1,660 చెరువులున్నాయి. గార్ల, బయ్యారం మండలాల పరిధిలోని 222 చెరువులు మహబూబాబాద్ జిల్లాలోకి వెళ్తున్నాయి. కామేపల్లి మండలంలోని 102 చెరువులు మాత్రం ఖమ్మం జిల్లాలో చేరనున్నాయి. ఈ మూడు మండలాల్లో కలిపి 324 చెరువులు పోతే 1336 చెరువులు పాల్వంచ డివిజన్ పరిధిలో ఉంటాయని ఇరిగేషన్ అధికారులు ధ్రువీకరించారు. ఆయా చెరువుల కింద 14,898 ఎకరాల ఆయకట్టు ఉంది. బయ్యారం పెద్దచెరువు మీడియం ఇరిగేషన్ కూడా మానుకోట జిల్లాలోకి వెళ్లడంతో 7,200 ఆయకట్టు విస్తీర్ణం తగ్గుతుంది. ‘కొత్త’గా 730 చెరువులు: వెంకటేశ్వరరెడ్డి, ఈఈ, నీటిపారుదలశాఖ పాల్వంచ ఇరిగేషన్ డివిజన్ పరిధిలోని గార్ల, బయ్యారం, కామేపల్లి మండలాల నుంచి 324 చెరువులు ఇతర జిల్లాల్లోకి వెళ్తున్నాయి. అదే సమయంలో సత్తుపల్లి డివిజన్లో ఉన్న అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, చండ్రుగొండ మండలాల పరిధిలోని 730 చెరువులు పాల్వంచ ఇరిగేషన్ డివిజన్ పరిధిలోకి రానున్నాయి. ఇది ఖాయమైతే ఇరిగేషన్ డివిజన్ విస్తీర్ణం పెరుగుతుంది తప్ప తగ్గదు. -
పోలీస్‌శాఖ విభజన కొలిక్కి
కరీంనగర్ క్రైం : జిల్లాల పునర్విభజనలో కరీంనగర్ మూడు జిల్లాలుగా విడిపోనుంది. ఈ మేరకు ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని పోలీస్ శాఖ విభజన కూడా పూర్తయింది. ఈమేరకు ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ జోయల్‌డేవిస్ విభజన వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందిని కరీంనగర్ 40, జగిత్యాల 30, పెద్దపల్లి 30 శాతం కేటాయించినట్లు తెలిపారు. విభజన నాటికి ప్రస్తుతం ఏ ఠాణాలో పని చేస్తున్న ఎస్సైలు అక్కడే కొనసాగుతారని పేర్కొన్నారు. నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం సీఐ, ఎస్సైలను విభజించామని ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను వారి స్థానికత ఆధారంగా సొంత జిల్లాలకే కేటాయించే అవకాశం ఉందని వివరించారు. ఒక వేళ తక్కువ సంఖ్యలో ఉంటే పనితీరు ఆధారంగా ఆయా జిల్లాలకు కేటాయిస్తామని తెలిపారు. ఇప్పటికే హోంగార్డ్‌ల విభజన పూర్తయిందన్నారు. వారిని తక్కువగా ఉన్న యూనిట్లలో సమీపంలోని మండలాల నుంచి తీసుకుని భర్తీ చేశామని తెలిపారు. డీపీవో సిబ్బందిలో పనితీరు ఆధారంగా మూడు జిల్లాలకు సమానంగా వచ్చేలా మారుస్తామని, తక్కువగా ఉంటే వివిధ కేటగిరీలుగా మార్చి ఆయా జిల్లాకు కేటాయిస్తామన్నారు. ఏఆర్ సిబ్బందిని ఆయా జిల్లాలో అవసరం, జైళ్లు, కోర్టులు, కార్యాలయాలు, బందోబస్తులు, వీఐపీ మూమెంట్, ఆలయాలు తదితర అంశాలను ఆధారంగా చేసుకుని వారిని కేటాయిస్తామని తెలిపారు. కొత్త జిల్లాకు పంపాల్సిన రికార్డులు, ఫర్నిచర్, ఇతర పరికరాలు, అయుధాలు, వాటిని పరికరాలు ఆయుధగారాల పంపకాలు కూడా పూర్తి చేసినట్లు తెలిపారు. ఏఆర్‌తోపాటు డీసీఆర్బీ, ఎస్బీ, మినిస్టీరియల్ సిబ్బంది విభజన దాదాపు పూర్తి కావచ్చిందని, వారికి నంబరింగ్ కూడా పూర్తి చేశామని పేర్కొన్నారు. నివేదికలను రెండు మూడు రోజుల్లో ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. తదుపరి ఉత్తర్వుల ప్రకారం మిగిలి వ్యవహరాలు, కార్యాలయాలు, ఆయా ఠాణాల సిబ్బందిని పరిశీలించి పంపకాలు చేస్తామని చెప్పారు. తర్వాత ఆయా జిల్లాలో తక్కువగా ఉన్న సిబ్బంది ఆయా జిల్లాల పరిపాలన విభాగం చూసుకుంటుదని తెలిపారు. -
'రంగారెడ్డి జిల్లాను రెండుగా విభజిస్తాం'
శేరిలింగంపల్లి: రంగారెడ్డి జిల్లాను రెండుగా విభజిస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి తహశీల్దార్ కార్యాలయాన్ని ఆయన మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా పెద్దగా ఉన్నందున ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు ఈస్ట్ (తూర్పు), వెస్ట్ (పడమర)లుగా రెండుగా విభజించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్తానన్నారు. 30 రోజుల్లో అన్ని కార్యాలయాలను తనిఖీ చేసి రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు రెవెన్యూ విభాగంలో కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. -
బీహర్‌కు ప్యాకేజీపై తెలంగాణలో చిటపటలు
-
పోలీసు పతకాలూ విభజన!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రభావం పోలీసు పతకాల ప్రదానంపైనా పడింది. ఉగాది పండుగ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పతకాలను ఎవరు? ఎప్పుడు? అందిస్తారనేది అవి దక్కించుకున్నవారికి అర్థం కావట్లేదు. ఈ జాబితాను ప్రకటిస్తూ మార్చి నెలాఖరులో ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లోనూ వీటిపై ఎలాంటి ప్రస్తావనా లేదు. సంబంధిత విభాగాల ఉన్నతాధికారులూ దీనిపై స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. పతకాలను కూడా విభజించి రాష్ట్ర విభజన పూర్తయిన తర్వాత రెండు ప్రభుత్వాలు అందించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇవి ఎప్పుడు అందిస్తారనే దానిపై పతకాలు పొందిన వారు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. పోలీసు శాఖలో ఉత్తమ పనితీరు, ప్రతిభ కనబరిచిన వారికి జాతీయ స్థాయిలో ఏటా నాలుగుసార్లు పతకాల ప్రకటన ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రెసిడెంట్ పోలీసు మెడల్ (పీపీఎం), రాష్ట్రపతి గ్యాలెంటరీ మెడల్ (పీఎంజీ), ఇండియన్ పోలీసు మెడల్ (ఐపీఎం)లను ప్రతి ఏటా గణతంత్ర దినం, స్వాతంత్య్ర దినాల్లో ప్రకటిస్తారు. రిపబ్లిక్ డేకు ప్రకటించిన వాటిని ఇండిపెండెన్స్‌డే, ఇండిపెండెన్స్‌డేకు ప్రకటించిన వాటిని రిపబ్లిక్ డే నాడు ప్రదానం చేస్తారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఉగాది, రాష్ట్రావతరణ దినం సందర్భాల్లో పోలీసు పతకాలు ప్రకటిస్తుంది. వీటిని నవంబర్ 1న రాష్ట్రావతరణ వేడుకల్లో అందిస్తారు. ఈ ఏడాది అన్ని విభాగాల్లోనూ కలిపి 309 మందికి వివిధ పతకాలు దక్కాయి. ముఖ్యమంత్రి శౌర్య పతకం, మహోన్నత సేవా పతకాలను మాత్రమే రాజధానిలో జరిగే రాష్ట్రావతరణ వేడుకల్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందిస్తారు. అయితే విభజన నేపథ్యంలో ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరిగే అవకాశం లేదు. ఏ రాష్ట్రానికి చెందిన వారికి ఆ రాష్ట్రంలోనే, ఆ ముఖ్యమంత్రి చేతుల మీదుగా పతకాలు ఇవ్వాల్సి ఉంటుంది. దీనికోసం ఈ పతకాలు దక్కించుకున్న వారి జాబితాను కూడా విభజించాల్సి ఉంటుంది. అపాయింటెడ్ డే జూన్ 2న ఇచ్చే అవకాశాలు లేకపోవడంతో ఎప్పుడు? ఎక్కడ ఇవ్వాలనేది ఆయా రాష్ట్రాలే నిర్ణయం తీసుకుంటాయని ఉన్నతాధికారులు చెప్తున్నారు. అలా కాని పక్షంలో ఆగస్టు 15న ఉమ్మడి రాజధానిలో, ఉమ్మడి గవర్నర్ చేతుల మీదుగా ఇప్పించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ పతకాల్లో ఉత్తమ సేవా పతకం, కఠిన సేవా పతకం, పోలీసు సేవా పతకాలు పొందిన వారికి ఇబ్బంది లేదు. ఎందుకంటే వీటిని ఏ జిల్లాకు ఆ జిల్లాలో ఇన్చార్జి మంత్రి చేతుల మీదుగా అందిస్తారు. వీరు కేవలం ఎప్పుడు అందించాలనేది నిర్ణయించుకుంటే సరిపోతుంది. -
‘ఫోరెన్సిక్ ల్యాబ్ విభజన అసాధ్యం’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(ఏపీఎఫ్ఎస్ఎల్)ను విభజించడం వెంటనే సాధ్యం కాదని పేర్కొంటూ ఈ విభాగం డెరైక్టర్ శారద రాష్ట్ర ప్రభుత్వానికి బుధవారం ఒక నివేదికను సమర్పించారు. జూన్ 2వ తేదీన అపాయింటెడ్ డే సమీపిస్తుండడంతో పోలీసు శాఖలతో పాటు దానికి అనుబంధంగా ఉన్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ విభజన ప్రక్రియ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని గవర్నర్ సలహాదారుడు సలావుద్దీన్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఎస్‌ఎల్‌ను కూడా రెండు రాష్ట్రాలకు 13:10 ప్రకారం సిబ్బందిని, నిపుణులను , ఆస్తులను విభజించేందుకు పూనుకున్నారు. ఇందులో ఉన్న 13 ప్రత్యేక విభాగాలలో రెండు రాష్ట్రాలకు తగిన రీతిలో విభజించడానికి నిపుణుల కొరత ఉందని పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ విభాగాన్ని కొంతకాలం ఏకంగానే ఉంచి, నిపుణులను తయారు చేసిన తరువాత విభజన చేపడితే బాగుంటుందని శారద సూచించినట్లు తెలిసింది. -
ప్రాజెక్టుల వారీగా అధికారుల విభజన
ఏ ప్రాంత ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యత ఆ ప్రాంత అధికారులకే.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రాజెక్టుల వారీగా అధికారుల కేటాయింపుపై ఇరిగేషన్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఆయా ప్రాంత ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను సంబంధిత ప్రాంత ఉద్యోగస్తులకే అప్పగిస్తున్నారు. ఇందుకు సంబంధించి కిందిస్థారుు ఇంజనీర్ల నుంచి పైస్థాయిలో ఉన్న ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) వరకు జాబితాను రూపొందించారు. అయితే ఈ నెల 8న ప్రభుత్వం నుంచి విధివిధానాలు వెల్లడైన తర్వాత దీనిపై తుది నిర్ణయాన్ని తీసుకోనున్నారు. కాగా, ప్రాజెక్టుల వారీగా పనిచేసే అధికారులను కూడా ఇప్పటికే గుర్తించి, బాధ్యతలను అప్పగించారు. ఏ ప్రాంత ప్రాజెక్టులకు ఆ ప్రాంత అధికారులనే కేటాయించారు. అలాగే ఇప్పటి వరకు ఉన్న ఇరిగేషన్ కార్యదర్శుల బాధ్యతల్లో కూడా మార్పులను తీసుకువచ్చారు. తాజా నిర్ణయం ప్రకారం సీమాంధ్ర ప్రాజెక్టుల బాధ్యతలను ముఖ్యకార్యదర్శి అరవిందరెడ్డి చూడనున్నారు. ఇప్పటి వరకు ఈ బాధ్యతలను నాగిరెడ్డి చూసేవారు. అయితే ఆయన తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికారి కావడంతో ఈ మార్పు చేశారు. ఇకనుంచి నాగిరెడ్డి అంతర్రాష్ర్ట జలవనరుల విభాగం, కొత్తగా ఏర్పడే ప్రత్యేక బోర్డుల వంటి బాధ్యతలను పర్యవేక్షించనున్నారు. తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులను ఆదిత్యనాథ్ దాస్ పర్యవేక్షించనున్నారు. -
ప్రజల జీవితాలతో ఆటలాడుకోవద్దు: సబ్బం
-
'తెలంగాణాతో పాటు యూపీని విభజించాలి'