జల విహారానికి బోటు సిద్ధం
జల విహారానికి బోటు సిద్ధం
Published Thu, Aug 11 2016 9:20 PM | Last Updated on Wed, Apr 3 2019 5:24 PM
ప్రకాశం బ్యారేజి (తాడేపల్లి రూరల్): కృష్ణానదిలో ప్రజలు జలవిహారం చేసేందుకు ‘తన్వి క్రూజ్’ బోటును గురువారం ఏర్పాటు చేశారు. బెంగళూరుకు చెందిన ఛాంపియన్ సంస్థ ఈ బోటును ఏర్పాటు చేసింది. పుష్కరాలకు రానున్న భక్తులకు సేవలు అందించేందుకు శుక్రవారం నుంచే దీన్ని వినియోగంలోకి తీసుకురానున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ బోటు కృష్ణానది అందాలను చూపిస్తూ విహార యాత్ర కొనసాగుతుందని, ఒకేసారి 300 మంది ప్రయాణించవచ్చని వివరించారు. టిక్కెట్టు ధర రూ.500 అని తెలిపారు.
Advertisement
Advertisement