పుష్కరాలకు సర్వం సిద్ధం | Everything is ready to puskaras | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు సర్వం సిద్ధం

Published Sat, Aug 6 2016 9:06 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM

పుష్కరాలకు సర్వం సిద్ధం

పుష్కరాలకు సర్వం సిద్ధం

యాత్రికులు, భక్తులకు సకల సౌకర్యాలు 
జిల్లా కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే
 
తుళ్లూరు: కృష్ణా పుష్కరాలకు సర్వం సిద్ధమయ్యాయని జిల్లా కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే పేర్కొన్నారు. శనివారం ఆయన తుళ్లూరు మండలంలోని పుష్కర ఘాట్లు, పుష్కర నగర్‌లు, పిండ ప్రదాన షెడ్‌లను జేసీ వెంకటేశ్వరరావుతో కలసి సందర్శించారు. యాత్రికులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. చివరి దశ పనులు మాత్రమే ఉన్నాయని, వాటిని కూడా నిర్వాహకులు పూర్తి చేస్తున్నారని తెలిపారు. ఎటువంటి అనుమానాలు, అపోహలు లేకుండా భక్తులు పుష్కర స్నానాలకు రావాలని కోరారు. చాలామంది దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు,ధార్మిక సంస్థలు యాత్రికులకు, భక్తులకు భోజన వసతులు కల్పించనున్నాయని చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వ సిబ్బంది అన్నీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement