యాత్రికుల సేవలో ఆంధ్రాశ్రమం
Published Wed, Aug 24 2016 11:43 PM | Last Updated on Sat, Jun 2 2018 2:59 PM
సాక్షి, విజయవాడ :
కృష్ణా పుష్కరాల సందర్భంగా వారణాసిలోని శ్రీరామతారకాంధ్రాశ్రమం విజయవాడలో పుష్కర యాత్రికులకు ఇతోధికంగా సేవలందించింది. పుష్కరాలు జరిగిన 12 రోజులూ విజయవాడలో పోలీస్ కంట్రోల్ రూం సమీపంలో యామిజాల రామం మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు సహకారంతో సుమారు 50 వేల మంది యాత్రికులకు నిత్యాన్నదానం జరిపింది. ఆశ్రమం మేనేజింగ్ ట్రస్టీ వేమూరి వేంకట సుందరశాస్త్రి, ఆయన కుటుంబీకులు, ఆశ్రమ వైస్ చైర్మన్ ముక్తేవి సీతారామయ్య, ట్రస్టీ పురాణం శ్రీనివాస్, సిబ్బంది పెద్ద సంఖ్యలో పుష్కర యాత్రికుల సేవలో పాల్గొన్నారు. పుష్కరాల చివరి రోజైన మంగళవారం కృష్ణవేణికి ఘనంగా ముగింపు హారతి కార్యక్రమం కూడా నిర్వహించారు.
Advertisement
Advertisement