పుష్కర అమరావతి
పుష్కర అమరావతి
Published Thu, Aug 11 2016 10:05 PM | Last Updated on Fri, May 25 2018 7:04 PM
ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన అమరావతిలో పుష్కర మహోత్సవాలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. అమరావతిలో ఉన్న రెండు భారీ ఘాట్‌లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ముందుగానే ఊహించి అన్ని ఏర్పాట్లు చేశారు.
అమరావతి : స్థానిక ధ్యానబుద్ధ ఘాట్, అమరేశ్వరఘాట్‌లలో భక్తులకు క్యూలైన్‌లు, హైమాస్ట్ లైట్‌లు, కష్ణవేణి మాత విగ్రహం ఏర్పాటు చేశారు. ఘాట్‌లన్నీ అగ్నిమాపక సిబ్బంది శుభ్రంగా కడిగివేశారు. ఈఘాట్‌లో మూడు వైద్యశిబిరాలను, సంచార వైద్యశాలలను, అంబులెన్స్ సౌకర్యం ఆరోగ్యశాఖ ర్పాటు చేసింది.
అతిథి గృహంలో పోలీస్ కంట్రోల్‌రూం..
ధ్యానబుద్ధ విగ్రహం పక్కను ఉన్న పర్యాటక శాఖ అతిథిగహంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం ఊర్పాటు చేశారు. ఇక్కడ అన్ని శాఖల ఉన్నదాధికారులు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కసి చేసే విధంగా ఏర్పాట్లు చేశారు.
మూడు పిండ ప్రధాన షెడ్లు..
మూడు పిండ ప్రధాన షెడ్లు వేయటం ద్వారా భక్తులు ప్రత్యేకంగా పిండ ప్రధానం చేసుకునేందుకు వీలుగా ఏర్పాటుచేశారు. దేవాలయంలో క్యూలైన్‌లు, చలువ పందిళ్లు వేసి స్వామివారి అంత్రాలయ ద్వారానికి బంగారు రేకులతో తాపడం చేయించారు.
ప్రతిరోజూ హారతికి ఏర్పాట్లు..
ప్రతిరోజు కృష్ణానదికి హారతులు ఇచ్చేందుకు దేవాదాయశాఖ ఏర్పాటు చేసింది. ఇంకా చిన్న చిన్న లోపాలను అన్ని శాఖల ఉన్నతాధికారుల సమీక్ష నిర్వహించి ఈరోజు రాత్రికి సరిచేస్తారని అధికారులు తెలిపారు.
వైకుంఠపురంలో..
వైష్ణవ క్షేత్రంలో పుష్కరాల ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఇక్కడ ఉత్తరవాహని ఘాట్‌లో సుమారు వందమీటర్ల సిమెంటు రోడ్డుతో పాటుగా 50 మీటర్ల ఘాట్ నిర్మాణం చేశారు. ఇక్కడ గురువారం నాడుకూడా పనులు చేయటం విశేషం. ఘాట్ వద్ద రోడ్డుపై మట్టి, బురద గురువారం సాయంత్రం వరకు శుభ్రం చేయలేదు. ఇక్కడ భక్తులకు సౌకర్యాలు పూర్తి స్థాయిలో జరుగలేదు. కొండకిద ఆలయానికి రంగులు వేసి విద్యుత్ లైటింగ్ ఏర్పాటు చేశారు.
Advertisement
Advertisement