
మాట్లాడుతున్న కలెక్టర్ లోకేష్‌కుమార్
ఖమ్మం సహకారనగర్ : కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో అందరూ సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రజ్ఞా సమావేశ మందిరంలో అధికారులతో జిల్లా పునర్విభజనపై సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ లోకేష్‌కుమార్ మాట్లాడుతూ కొత్తగూడెంలో జిల్లా కార్యాలయాలకు ప్రైవేటు, ప్రభుత్వ భవనాలను శనివారంలోగా సిద్ధం చేయాలన్నారు. కార్యాలయాల బోర్డులపై భద్రాద్రి జిల్లా హెడ్‌క్వార్టర్ కొత్తగూడెంగా రాయించాలని ఆదేశించారు. ఆయా శాఖల అధికారులు, సిబ్బందికి వర్క్ టూ çసర్వ్ ఆర్డర్లను అందచేయాలన్నారు. వర్క్ టూ సర్వ్ ఆర్డర్లు ఇచ్చే అధికారులు కూడా హెడ్‌క్వార్టర్‌కు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. కొన్ని శాఖల విషయానికొస్తే.. జిల్లా బాధ్యులకు వర్క్ టూ సర్వ్ ఆర్డర్ జారీ చేసే అవకాశముందని, వీరంతా ఎక్కడకి వెళ్లకుండా అందుబాటులోనే ఉండాలన్నారు. మరికొన్ని శాఖలకు సంబంధించిన రాష్ట్రస్థాయిలో పనిచేసే అధికారులకు కూడా వర్క్ టూ సర్వ్ ఆర్డర్ ఇవ్వొచ్చన్నారు. వర్క్ టూ సర్వ్ తీసుకున్న అధికారులంతా అక్కడికి వెళ్లి ఈ–మెయిల్, వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు. వర్క్ టూ సర్వ్‌కు హాజరైన అధికారులు, సిబ్బంది తమ వివరాలతో సంబంధిత రాష్ట్ర శాఖాధికారికి నివేదించాలన్నారు. కార్యాలయ స్టాంపులు, అధికారి స్టాంపులు తయారు చేసుకోవాలన్నారు. వర్క్ టూ సర్వ్ జారీ చేసినా హాజరుకాని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భద్రాద్రి జిల్లాకు సంబంధించి ఫైళ్లు, సామగ్రికి కొత్తగూడెంకు పంపించాలన్నారు. జేసీ దివ్య మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేటు అద్దె భవనాల్లో ఉంటే... ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే అధికంగా ఉంటే ఆ భవన వివరాలు అందించి జిల్లా కమిటీ ఆమోదం పొందాల్సి ఉంటుందన్నారు.
తాను చైర్‌పర్స¯ŒSగా, ఆర్‌అండ్‌బీ ఈఈ మెంబర్‌గా, సంబంధిత మున్సిపాలిటీ కమిషనర్ కన్వీనర్‌గా ఉంటారన్నారు. అద్దె భవనాల «ధర నిర్ణయం కాని వారు ఈ నెల 10వ తేదీలోగా ఆమోదం పొందాలని సూచించారు.ఈ సమావేశంలో డీఆర్వో శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ నగేష్, సీపీఓ రాందాస్ తదితరులు పాల్గొన్నారు.