సీనియర్‌ టెకీలపై వేటుకు భారీ కసరత్తు | IT industry slows, Indian companies ready for large layoffs | Sakshi
Sakshi News home page

సీనియర్‌ టెకీలపై వేటుకు భారీ కసరత్తు

Published Tue, May 9 2017 3:17 PM | Last Updated on Tue, Sep 5 2017 10:46 AM

సీనియర్‌ టెకీలపై వేటుకు భారీ కసరత్తు

సీనియర్‌ టెకీలపై వేటుకు భారీ కసరత్తు

బెంగళూరు: ఐటీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సంక్షోభం ఫలితాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఐటి రంగంలో ఆటోమేషన్‌, డిజిటల్‌ టెక్నాలజీల కారణంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు గల్లంతయ్యే ప్రమాదం  మరింత వేగంగా  దూసుకొస్తోంది. ఇండియాలో ఈ పరిస్థితి మరికాస్త తీవ్రంగా ఉంది. ఈ ప్రమాదం అటు ఉన్నతస్థానాల్లో,  ఇటు దిగువస్థాయిలో ఉన్న వారందరినీ వెన్నాడుతోంది.  దీనికితోడు  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొత్త హెచ్‌1 బి వీసా సంస్కరణల  నేపథ్యంలో  టాప్  ఐటీ సేవల సంస్థలు భారత్‌ లో తమ ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి.  మరికొందరిని స్వచ్చంద పదవీ విరమణ ద్వారా ఇంటికి పంపిస్తోంది.   ఊహించిన దానికంటేఎక్కువగా సుమారు 150 బిలియన్‌ డాలర్ల వృద్ధి మందగమనం తోపాటు,  ట్రంప్‌ హైర్‌ అమెరికన్‌, బై అమెరికన్‌ నినాదం  ఐటీ సంస్థలను ఈ వైపుగా కదిలిస్తున్నాయని  ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. 
 
కాగ్నిజెంట్‌ ఇటీవల ఆరువేల మంది ఉన్నత స్థాయి ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అగ్రశ్రేణి ఉద్యోగుల్లో 6వేలమంది ఉద్యోగాలను + లేదా దాని మొత్తం శ్రామిక శక్తిలో 2.3శాతం తగ్గించాలని భావిస్తోంది.  ఇదే బాటలో మరో అతిపెద్ద సేవల సంస్థ ఇన్ఫోసిస్‌ కూడా కదులుతోంది.  దాదాపు వెయ్యిమంది సీనియర్‌ ఉద్యోగులను  రాజీనామా చేయమని కోరనుందని మార్కెట్‌ వర్గాల అంచనా.  వీరిలో  గ్రూపు ప్రాజెక్ట్ డైరెక్టర్లు, ప్రాజెక్ట్  డైరెక్టర్లు , సీనియర్ ఆర్కిటెక్ట్ మరియు ఉన్నత స్థాయి ఉద్యోగులు ఉన్నారు. ఈ స్థాయిల్లో  డైరెక్టర్లు, మేనేజర్ల పనితీరు రిపోర్టును ఇన్ఫీ  సమీక్షిస్తోంది. 
 
మూడు వారాల క్రితం విప్రో సీఈఓ అబిద్ ఆలీ నీమచ్వాల  ఇంటర్నెల్‌  సమావేశాల్లో  మాట్లాడుతూ  ఆదాయాల వృద్ధి జరగకపోతే, సుమారు 10 శాతం మంది ఉద్యోగులపై వేటు వేసే హెచ్చరికలు జారీ చేశారు.  దీంతో  ఈ సం‍స్థలోని ఇంజనీరింగ్ టీం పెద్ద ప్రమాదంలో పడినట్టే. గత ఆర్థిక సంవత్సరంలో విప్రో 1.81 లక్షల ఉద్యోగులను కలిగి ఉంది.
 
ఫ్రెంచ్ ఐటీ సేవల  సంస్థ కాప్‌ జెమిని కూడా  సుమారు 9,000 మందిని, లేదా దాదాపు 5శాతం మంది ఉద్యోగులను తొలగించనుంది. వీటిలో ఎక్కువ భాగం 2015లో  కాప్‌ జెమిని కొనుగోలు చేసిన  ఐ గేట్‌ ఉద్యోగులు. అలాగే ముంబైలోని 35మంది వైస్‌ ప్రెసిడెంట్లు, ఇతర   సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు మరియు సీనియర్ డైరెక్టర్లను దాదాపు 200 మంది  రాజీనామా చేయాలని కాప్‌ జెమిని ఫిబ్రవరిలో కోరింది. మార్చి 31 నాటికి దీని మొత్తం ఉద్యోగులు 195,800 మంది. 
 
ప్రతి సంవత్సరం చేసే సమీక్షలో భాగంగా ఈ తొలగింపులనీ, 2017లో తమ ఉద్యోగుల్లోచాలామందికి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో శిక్షణనిస్తున్నామని చెబుతున్నప్పటికీ ఉ‍ద్యోగులను నిర్దాక్షిణ్యంగా   తొలగిస్తున్నతీరుపై ఉద్యోగులు అగ్రహం వ్యక్తం చేశారు.  అంతకంతకూ తీవ్రమవుతున్న ధోరణిపై వివిధ  కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరిపి తదుపరి కార్యాచరణకు సిద్ధపడుతున్నారు.
 
ఐటి సేవలలో మందగమనం కారణంగా  వివిధ ఐటి సంస్థలు  ఆదాయాలను నష్టపోతున్నది వాస్తవం.    ముఖ్యంగా కాగ్నిజెంట్‌ 20శాతం గ్రోత్‌లో  ఈ సంవత్సరం  8-10శాతం మాత్రమే పెరుగుతుందని అంచనా. 2015-16లో 13.3 శాతంగా ఉన్న ఇన్ఫోసిస్ గత ఆర్థిక సంవత్సరంలో 8.3 శాతానికి తగ్గింది. ఈ ఏడాది 6.5 శాతం నుంచి 8.5 శాతానికి పెరగాలని ఆశిస్తోంది. టీసీఎస్ గత సంవత్సరం కేవలం 8.3శాతం  మాత్రమే  సాధించడం గమనార్హం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement