slows
-
అధిక ధరల సెగ: జీడీపీ వృద్ధి తగ్గింది, కానీ...
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (2022-23, జూలై-సెప్టెంబర్) నెమ్మదించింది. 2021-22 ఇదే కాలంతో పోల్చితే జీడీపీ విలువ 6.3 శాతం పెరిగింది. తయారీ, మైనింగ్ రంగాల పేలవ పనితీరు ఇందుకు ఒక కారణం. కాగా, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో (క్యూ1) జీడీపీ వృద్ధి రేటు 13.5 శాతం, గత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో వృద్ధి రేటు 8.4 శాతం కన్నా వృద్ధి వేగం (2.1 శాతం మేర) మందగించడం గమనార్హం. అయితే, ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ హోదాను మాత్రం భారత్ కొనసాగిస్తోంది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 3.9 శాతం. భారత్ సాధించిన వృద్ధి రేటుకు మరే దేశమూ చేరుకోకపోవడం గమనార్హం. ఇక మొదటి, రెండు త్రైమాసికాలు కలిపి ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో జీడీపీ వృద్ధి రేటు 9.7శాతం, రెండవ త్రైమాసికంలో 6.1-6.3 శాతం వృద్ధి నమోదవుతుందన్న ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ అంచనాలకు అనుగుణంగానే బుధవారం విడుదల చేసిన గణాంకాలు ఉండడం గమనార్హం. 6.3 శాతం ఎలా అంటే.. 2011-12 స్థిర ధరల ప్రాతిపదిక, వాస్తవిక జీడీపీ విలువ 2021-22 క్యూ2లో రూ.35.89 లక్షల కోట్లు. తాజా సమీక్షా త్రైమాసికంలో ఈ విలువ రూ.38.17 లక్షల కోట్లుగా నమోదయ్యింది. అంటే వృద్ధి 6.3 శాతమన్నమాట. వివిధ రంగాల తీరిది స్థూల విలువ జోడింపు (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్- జీవీఏ) ప్రాతిపదికన క్యూ2 వృద్ధి రేటు మాత్రం 5.6శాతం పెరిగి రూ.35.05 లక్షల కోట్లుగా నమోదయ్యింది. వ్యవసాయం: ఆర్థిక వ్యవస్థలో 15శాతం వాటా కలిగిన వ్యవసాయ రంగం వృద్ధి రేటు 4.6 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 3.2శాతం . తయారీ: ఈ రంగం జీవీఏ మాత్రం 5.6 శాతం (2021 ఇదే కాలంలో) వృద్ధి నుంచి 4.3 శాతం పడిపోయింది. మైనింగ్: ఈ విభాగం కూడా 2.8 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. 2021 ఇదే కాలంలో ఈ రంగం వృద్ధి రేటు భారీగా 14.5 శాతంగా ఉంది. నిర్మాణం: వృద్ధి 8.1శాతం నుంచి 6.6శాతానికి తగ్గింది. యుటిలిటీ సేవలు: విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా ఇతర యుటిలిటీ సేవల వృద్ధి రేటు 5.6 శాతానికి తగ్గింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 8.5 శాతంగా నమోదైంది. సేవలు: మొత్తం జీడీపీలో మెజారిటీ వాటా కలిగిన ఈ విభాగం చూస్తే (ట్రేడ్, హోటెల్, రవాణా, కమ్యూనికేషన్, బ్రాడ్‌కాస్టింగ్) వృద్ధి రేటు 9.6 శాతం నుంచి 14.7 శాతానికి చేరింది.జీడీపీ వృద్ధి తగ్గింది, కానీ...ఎకానమీ పరుగుకు ఢోకా లేదు! అక్టోబర్‌లో 20 నెలల కనిష్టానికి మౌలికం అక్టోబర్‌లో ఎనిమిది పరిశ్రమలతో కూడిన మౌలిక రంగం వృద్ధి రేటు 20 నెలల కనిష్టానికి పడిపోయింది. గత ఏడాది ఇదే నెలతో పోల్చితే వృద్ధి కేవలం 0.1శాతం గా నమోదయ్యింది. క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్టులు, సిమెంట్ రంగాలు క్షీణతను నమోదు చేసుకున్నాయి. ఎరువుల రంగం మాత్రం 5.4శాతం పురోగతి సాధించింది. బొగ్గు విభాగంలో 3.6 శాతం, స్టీల్ రంగంలో 4శాతం వృద్ధి నమోదైతే, విద్యుత్ ఉత్పత్తి వృద్ధి కేవలం 0.4శాతంగా నమోదైంది. 7 శాతం వరకూ వృద్ధి 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.8 శాతం 7 శాతం శ్రేణి బాటలో ఉంది. పలు రంగాల్లో రికవరీ బాటన నడుస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పండుగల సీజన్లో అమ్మకాలు, పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్, బ్యాంక్ రుణ వృద్ధి, ఆటో అమ్మకాల గణాంకాలు ఆశావహంగా ఉన్నాయి. -వీ అనంత నాగేశ్వరన్, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ -
ఆరేళ్ల కనిష్టానికి జీడీపీ
-
షాకింగ్ : ఆరేళ్ల కనిష్టానికి జీడీపీ
సాక్షి, న్యూఢిల్లీ: ఒక వైపు ఆర్థికమాంద్య పరిస్థితులనుంచి గట్కెక్కేందుకు కేంద్రం తీవ్రకసరత్తు చేస్తోంది. మరోవైపు అందరూ ఊహించినట్టుగానే మాంద్యం ముప్పు ముంపు కొస్తోంది. తాజాగా గణాంకాల ప్రకారం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 5 శాతానికి పడిపోయింది. ఏప్రిల్-జూన్ మాసంలో ఇది 5.8 శాతంగా ఉంది. దీంతో జీడీపీ ఆరేళ్ల కనిష్టానికి చేరింది. అటు జీవీఏ 4.9 శాతానికి క్షీణించింది. ఇది ఏప్రిల్-జూన్ మాసంలో 5.7 గా ఉంది. జీడీపీ తక్కువగా ఉంటుందని ఊహించినప్పటికీ, ఇంత దారుణ అంచనా వేయలేక పోయామనీ, దీంతో దేశంలో మరోసారి మాంద్యం రిస్థితులు నెలకొన్నాయని ఎనలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధనలో భాగంగా పలు కీలక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారంనిర్వహించిన మీడియా సమావేశాన్ని ప్రకటించారు. ప్రధానంగా వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల ఏకీకరణను ప్రకటించారు. 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసి 4 పెద్ద సంస్థలుగా రూపొందిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అయిదు నెలల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం
సాక్షి, న్యూఢిల్లీ: మార్చి నెలలో భారత వార్షిక రిటైల్ ద్రవ్యోల్బణం 4.28 శాతానికి దిగి వచ్చింది. వార్షిక ప్రాతిపదికన సిపిఐ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మార్చి నెలలో 4.28 శాతం వద్ద అయిదు నెలల కనిష్టాన్ని నమోదు చేసింది. అంతకు ముందు నెలలో 5.07 శాతంగా ఉంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రధానంగా ఆహార ధరలు తగ్గడం ఇందుకు దోహదపడ్డాయి. అయితే ఫిబ్రవరి నెలలో పారిశ్రామిక ఉత్పాదకత 7.1 శాతానికి తగ్గింది. సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సిఎస్ఓ) వృద్ధిని సాధించింది. సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సిఎస్ఓ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం కూరగాయల విభాగంలో ద్రవ్యోల్బణం మార్చి నెలలో 11.7 శాతానికి తగ్గింది. అంతకు ముందు నెలలో ఇది 17.57 శాతంగా ఉంది. గుడ్లు, పాలు, ఇతర ఉత్పత్తుల వంటి ప్రోటీన్ వస్తువుల ధరల పెరుగుదల రేటు గత నెలలో మార్చి నెలలో చాలా మోడరేట్ చేసింది. మొత్తం ఆహార ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 3.26 శాతానికి పడిపోయి 2.81 శాతంగా ఉంది. ఇంధన, లైట్ విభాగంలో కూడా మంత్ ఆన్ మంత్ ద్రవ్యోల్బణం 5.73 శాతంగా నమోదైంది. -
సీనియర్ టెకీలపై వేటుకు భారీ కసరత్తు
బెంగళూరు: ఐటీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సంక్షోభం ఫలితాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఐటి రంగంలో ఆటోమేషన్, డిజిటల్ టెక్నాలజీల కారణంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు గల్లంతయ్యే ప్రమాదం మరింత వేగంగా దూసుకొస్తోంది. ఇండియాలో ఈ పరిస్థితి మరికాస్త తీవ్రంగా ఉంది. ఈ ప్రమాదం అటు ఉన్నతస్థానాల్లో, ఇటు దిగువస్థాయిలో ఉన్న వారందరినీ వెన్నాడుతోంది. దీనికితోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త హెచ్1 బి వీసా సంస్కరణల నేపథ్యంలో టాప్ ఐటీ సేవల సంస్థలు భారత్ లో తమ ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. మరికొందరిని స్వచ్చంద పదవీ విరమణ ద్వారా ఇంటికి పంపిస్తోంది. ఊహించిన దానికంటేఎక్కువగా సుమారు 150 బిలియన్ డాలర్ల వృద్ధి మందగమనం తోపాటు, ట్రంప్ హైర్ అమెరికన్, బై అమెరికన్ నినాదం ఐటీ సంస్థలను ఈ వైపుగా కదిలిస్తున్నాయని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. కాగ్నిజెంట్ ఇటీవల ఆరువేల మంది ఉన్నత స్థాయి ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అగ్రశ్రేణి ఉద్యోగుల్లో 6వేలమంది ఉద్యోగాలను + లేదా దాని మొత్తం శ్రామిక శక్తిలో 2.3శాతం తగ్గించాలని భావిస్తోంది. ఇదే బాటలో మరో అతిపెద్ద సేవల సంస్థ ఇన్ఫోసిస్ కూడా కదులుతోంది. దాదాపు వెయ్యిమంది సీనియర్ ఉద్యోగులను రాజీనామా చేయమని కోరనుందని మార్కెట్ వర్గాల అంచనా. వీరిలో గ్రూపు ప్రాజెక్ట్ డైరెక్టర్లు, ప్రాజెక్ట్ డైరెక్టర్లు , సీనియర్ ఆర్కిటెక్ట్ మరియు ఉన్నత స్థాయి ఉద్యోగులు ఉన్నారు. ఈ స్థాయిల్లో డైరెక్టర్లు, మేనేజర్ల పనితీరు రిపోర్టును ఇన్ఫీ సమీక్షిస్తోంది. మూడు వారాల క్రితం విప్రో సీఈఓ అబిద్ ఆలీ నీమచ్వాల ఇంటర్నెల్ సమావేశాల్లో మాట్లాడుతూ ఆదాయాల వృద్ధి జరగకపోతే, సుమారు 10 శాతం మంది ఉద్యోగులపై వేటు వేసే హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఈ సంస్థలోని ఇంజనీరింగ్ టీం పెద్ద ప్రమాదంలో పడినట్టే. గత ఆర్థిక సంవత్సరంలో విప్రో 1.81 లక్షల ఉద్యోగులను కలిగి ఉంది. ఫ్రెంచ్ ఐటీ సేవల సంస్థ కాప్ జెమిని కూడా సుమారు 9,000 మందిని, లేదా దాదాపు 5శాతం మంది ఉద్యోగులను తొలగించనుంది. వీటిలో ఎక్కువ భాగం 2015లో కాప్ జెమిని కొనుగోలు చేసిన ఐ గేట్ ఉద్యోగులు. అలాగే ముంబైలోని 35మంది వైస్ ప్రెసిడెంట్లు, ఇతర సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు మరియు సీనియర్ డైరెక్టర్లను దాదాపు 200 మంది రాజీనామా చేయాలని కాప్ జెమిని ఫిబ్రవరిలో కోరింది. మార్చి 31 నాటికి దీని మొత్తం ఉద్యోగులు 195,800 మంది. ప్రతి సంవత్సరం చేసే సమీక్షలో భాగంగా ఈ తొలగింపులనీ, 2017లో తమ ఉద్యోగుల్లోచాలామందికి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో శిక్షణనిస్తున్నామని చెబుతున్నప్పటికీ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నతీరుపై ఉద్యోగులు అగ్రహం వ్యక్తం చేశారు. అంతకంతకూ తీవ్రమవుతున్న ధోరణిపై వివిధ కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరిపి తదుపరి కార్యాచరణకు సిద్ధపడుతున్నారు. ఐటి సేవలలో మందగమనం కారణంగా వివిధ ఐటి సంస్థలు ఆదాయాలను నష్టపోతున్నది వాస్తవం. ముఖ్యంగా కాగ్నిజెంట్ 20శాతం గ్రోత్‌లో ఈ సంవత్సరం 8-10శాతం మాత్రమే పెరుగుతుందని అంచనా. 2015-16లో 13.3 శాతంగా ఉన్న ఇన్ఫోసిస్ గత ఆర్థిక సంవత్సరంలో 8.3 శాతానికి తగ్గింది. ఈ ఏడాది 6.5 శాతం నుంచి 8.5 శాతానికి పెరగాలని ఆశిస్తోంది. టీసీఎస్ గత సంవత్సరం కేవలం 8.3శాతం మాత్రమే సాధించడం గమనార్హం. -
దిగి వస్తున్న టోకు ధరల సూచీ
న్యూఢిల్లీ: టోకు ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో దిగి వచ్చింది. వార్షిక ధరల పెరుగుదల రేటు ప్రతిబింబించే టోకు ధరల సూచీ 3.57 శాతం తగ్గింది. ఫుడ్ఆర్టికల్స్, కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టడంతో ఇది స్వల్పంగా తగ్గుముఖంపట్టింది. టోకు ధరల సూచీ గత ఆగస్టు నెలలో రెండేళ్ల గరిష్టాన్ని తాకింది. ఆగస్టులో 3.74 శాతంగా నమోదైంది. 2015 సెప్టెంబర్ లో ఇది 4.59 శాతంగా నమోదైంది. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రకారం తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం 64.97, ప్రాథమిక వస్తువుల ద్రవ్యోల్బణం 4.76, ఇంధన ద్రవ్యోల్బణం 5.58 ఆహార ద్రవ్యోల్బణం 10.91 వద్ద సెప్టెంబర్ డబ్ల్యుపిఐ ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 5.75 శాతంగా ఉంది. ఆగస్టులో ఇది 8.23శాతంగా నమోదైంది. కాగా ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ గతవారం 25 బేసిస్ పాయింట్లకు వడ్డీరేట్లలో కోత పెట్టిన సంగతి తెలిసిందే.