షాకింగ్‌ : ఆరేళ్ల కనిష్టానికి జీడీపీ | Q1 GDP Growth crashes to 5 Percent  | Sakshi
Sakshi News home page

షాకింగ్‌ : ఆరేళ్ల కనిష్టానికి జీడీపీ

Published Fri, Aug 30 2019 5:54 PM | Last Updated on Fri, Aug 30 2019 8:13 PM

Q1 GDP Growth crashes to 5 Percent  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ఒక వైపు ఆర్థికమాంద్య పరిస్థితులనుంచి గట్కెక్కేందుకు కేంద్రం తీవ్రకసరత్తు చేస్తోంది. మరోవైపు అందరూ ఊహించినట్టుగానే మాంద్యం ముప్పు ముంపు కొస్తోంది. తాజాగా గణాంకాల ప్రకారం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)  5 శాతానికి పడిపోయింది. ఏప్రిల్‌-జూన్‌ మాసంలో ఇది 5.8 శాతంగా ఉంది.  దీంతో జీడీపీ ఆరేళ్ల కనిష్టానికి చేరింది. అటు జీవీఏ 4.9 శాతానికి క్షీణించింది. ఇది ఏప్రిల్‌-జూన్‌ మాసంలో 5.7 గా ఉంది. జీడీపీ తక్కువగా ఉంటుందని ఊహించినప్పటికీ, ఇంత దారుణ అంచనా వేయలేక పోయామనీ, దీంతో దేశంలో మరోసారి మాంద్యం  రిస్థితులు నెలకొన్నాయని ఎనలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు.

కాగా  5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ సాధనలో భాగంగా  పలు కీలక చర్యలు  తీసుకుంటున్నామని కేంద్ర ఆర్థికమంత్రి నిర‍్మలా సీతారామన్‌  శుక్రవారంనిర్వహించిన మీడియా సమావేశాన్ని ప్రకటించారు. ప్రధానంగా వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల ఏకీకరణను ప్రకటించారు. 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసి 4 పెద్ద సంస్థలుగా రూపొందిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement