low
-
కొత్త పన్ను కోడ్ అవసరం
న్యూఢిల్లీ: వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన దేశం) లక్ష్య సాధనకు తక్కువ పన్ను రేట్లతో కూడిన సమగ్రమైన పన్నుల కోడ్‌ను తీసుకురావాల్సిన అవసరాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. మరింత మందిని పన్ను పరిధిలోకి తీసుకురావడం, వసూళ్లు మెరుగుపరుచుకోవడం, నిబంధనల అమలును ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. ఇందుకు ‘ఎఫ్‌ఎల్‌ఏటీ’ నమూనాను ప్రస్తావిస్తున్నారు. కేవలం కొన్ని శ్లాబులు, తక్కువ రేట్లతో, వివాదాలను తగ్గించే విధంగా, పన్ను చెల్లింపుదారులను విస్తృతం చేసే విధంగా ఉండాలంటున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌కు సమర్పించనున్న నేపథ్యంలో నిపుణుల సూచనలకు ప్రాధాన్యం నెలకొంది. ‘‘జీఎస్టీ కింద ఎన్నో రకాల రేట్లు ఉండడం ఎంత మాత్రం మంచిది కాదు. జీఎస్టీ అన్నది ఒక్కటే రేటుగా ఉండాలి. కానీ, మన దేశంలో ఒకటే రేటు అన్నది సాధ్యం కాదు’’అని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) మాజీ చైర్మన్ పీసీ ఝా అభిప్రాయపడ్డారు. కాకపోతే 5 శాతం, 16 శాతం, 28 శాతం చొప్పున మూడు పన్ను శ్లాబులను పరిశీలించాలని సూచించారు. థింక్ చేంజ్ ఫోరమ్‌లో పాల్గొన్న సందర్భంగా ఈ అంశంపై మాట్లాడారు. ప్రస్తుత పన్ను వ్యవస్థలోని నిబంధనలను సులభతరం చేయాల్సిన అవసరాన్ని ఎర్నెస్ట్ అండ్ యంగ్ పార్ట్నర్ రాజీవ్ ఛుగ్ సైతం సమరి్థంచారు. ‘‘పన్ను రేట్లు తగ్గించడం వల్ల పౌరులు, కంపెనీలకు ఖర్చు పెట్టేందుకు వీలుగా నిధుల మిగులు పెరుగుతుంది. రేట్లను క్రమబద్దీకరిస్తే అది ఆర్థిక వ్యవస్థకు ఊతంగా నిలుస్తుంది’’అని ఛుగ్ వివరించారు. -
75 గజాల్లోపు ఉన్నా.. అనుమతి తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 75 చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణం ప్లాట్‌లో ఎలాంటి నిర్మాణాన్ని చేపట్టాలనుకున్నా.. భవన యజమానులు మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ నుంచి ధ్రువీకరణ పత్రాన్ని పొందడం తప్పనిసరి అని హైకోర్టు స్పష్టం చేసింది. 75 చదరపు గజాల కంటే తక్కువ ఉన్నా.. ఎక్కువ ఉన్నా అధికారుల నుంచి ధ్రువీకరణ, పని ప్రారంభ ఉత్తర్వును పొందాలని, దీనికి ఎలాంటి మినహాయింపు లేదని తేల్చిచెప్పింది. తమ ప్లాట్లలో నిర్మాణ పనులను ఆపివేయాలంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నోటీసులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ నేరేడ్మెట్ వినాయకనగర్‌కు చెందిన ఒక కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్లలో తండ్రీ కొడుకులు, ప్లాట్‌ను రెండు భాగాలుగా విభజించారు. టీఎస్ బీపాస్ చట్టం–2020 ప్రకారం నిర్మాణాలకు రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక్కొక్కటి 40 చదరపు గజాల్లో నిర్మాణాన్ని ప్రారంభించారు. మరొక పిటిషనర్ 54 చదరపు గజాలలో నిర్మాణాన్ని ప్రారంభించారు. అయితే వీరి నిర్మాణాలపై పొరుగు వారు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్మాణాలను ఆపివేయాలంటూ జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. అయితే టీఎస్ బీపాస్ చట్ట ప్రకారం నిర్మాణాలను ప్రారంభించామని.. జీహెచ్ఎంసీ ఇచి్చన నోటీసులను రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ తడకమళ్ల వినోద్‌కుమార్ విచారణ చేపట్టారు. జీహెచ్ఎంసీ తరఫున స్టాండింగ్ కౌన్సిల్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రమే సరిపోదని, దాని పరిశీలన తర్వాతే నిర్మాణంపై ముందుకు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని టీఎస్ బీపాస్ చట్టంలోని సెక్షన్ 7 చెబుతోందని చెప్పారు. రిజిస్ట్రేషన్ తర్వాత అధికారులు నిర్ణయం తీసుకోవడానికి 21 రోజుల సమయం ఉంటుందని, ఆ తర్వాత ఎలాంటి కారణం చూపకుండా దరఖాస్తును ఆపితే పిటిషనర్లు ముందుకు వెళ్లవచ్చని తెలిపారు. కానీ, పిటిషనర్లు జనవరి 9న రిజిస్ట్రేషన్ చేసి, వెంటనే నిర్మాణం ప్రారంభించారని పేర్కొన్నారు. దీంతో అదే నెల 18న జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసిందని వెల్లడించారు. టీఎస్ బీపాస్ నిబంధనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. జీహెచ్ఎంసీ వాదనలను సమర్థించారు. 75 చదరపు గజాల కంటే తక్కువ ప్లాట్లలో నిర్మాణానికి ప్రారంభ అనుమతి సర్టీఫికెట్ అవసరమని స్పష్టం చేశారు. అయితే వీటికి రూ.1 మాత్రమే నామమాత్రపు రుసుము ఉంటుందని, నిర్మాణం పూర్తయిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టీఫికెట్ పొందవలసిన అవసరం ఉండదని తేల్చిచెప్పారు. -
ఆంధ్రప్రదేశ్‌కు తక్కువ నిధులెందుకు?
సాక్షి, అమరావతి: న్యాయస్థానాల భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు ఇతర రాష్ట్రాలకు అధిక నిధులు వెచ్చిస్తున్న కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు ఆ స్థాయిలో నిధులు ఇవ్వకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నిధుల కొరతతో ప్రాథమిక దశలోనే పలు నిర్మాణాలు నిలిచిపోయాయని తెలిపింది. కోర్టు భవనాలు, న్యాయమూర్తుల నివాస సముదాయాలకు సంబంధించిన 19 ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం వాటా కింద ఇవ్వాల్సిన రూ. 394 కోట్లను విడుదల చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయాలని సూచించింది. రాష్ట్ర విభజన తరువాత న్యాయవ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని గుర్తు చేసింది. నిధుల విడుదల వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళతానని కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు అడిషనల్ జనరల్ (ఏఎస్జీ) బి.నరసింహ శర్మ హై కోర్టుకు తెలిపారు. ఇందుకు కొంత గడువునిస్తే కేంద్రం నిర్ణయం ఏమిటో తెలియచేస్తానన్నారు. దీంతో తదుపరి విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. రూ. 4.82 కోట్లు మాత్రమే విడుదల కృష్ణాజిల్లా గన్నవరంలో పలు కోర్టుల కోసం భవన నిర్మాణాలను చేపట్టడం లేదని, పాత భవనాలకు మరమ్మతులు నిర్వహించడం లేదని, తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ గన్నవరానికి చెందిన దేవిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి 2022లో హైకోర్టులో పిల్ దాఖలు చేయగా.. దీనిపై ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎంఆర్కే చక్రవర్తి వాదనలు వినిపిస్తూ, నిధుల కొరత వల్ల కోర్టు భవనాల నిర్మాణాలు నిలిచిపోయాన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ, కేంద్ర ప్రభుత్వ పథకం ప్రకారం న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు విడుదల చేయాల్సి ఉంటుందన్నారు. 19 ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మొత్తం రూ. 656 కోట్లు ఖర్చు అవుతుందని, ఇందులో కేంద్రం వాటా రూ. 394 కోట్లు విడుదల చేయాల్సి ఉందన్నారు. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు రూ. 83.33 కోట్లు కోసం హైకోర్టు కేంద్రానికి లేఖ రాసిందన్నారు. కేంద్రం తరఫున ఏఎస్జీ నరసింహశర్మ వాదనలు వినిపిస్తూ, ఈ విషయాలన్నింటినీ కేంద్రం దృష్టికి తీసుకెళతానన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం కేటాయించిన సొమ్ములో ఇంకా రూ. 14.44 కోట్లు ఇవ్వాల్సి ఉందని, ఈ మొత్తం విడుదల చేసినా కూడా ఇప్పటికే నిలిచిపోయిన 19 ప్రాజెక్టులు పూర్తి కావని తెలిపింది. అందువల్ల పూర్తిస్థాయి నిధుల కేటాయింపు అవసరమని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఏఎస్జీకి స్పష్టం చేసింది. -
ఢిల్లీలో మరో మూడు,నాలుగు రోజులు విష గాలులే!
ఢిల్లీని మరోమారు పొగమంచు దట్టంగా కమ్ముకుంది. ఫలితంగా విజిబులిటీ దెబ్బతినడమే కాకుండా జనం విషవాయువులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మంగళవారం రాజధానిలోని ఐదు ప్రాంతాలలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 400 లేదా అంతకంటే ఎక్కువ అంటే ‘తీవ్రమైన’ విభాగంలోకి చేరుకుంది. మరో మూడు నాలుగు రోజులపాటు ఈ విషపూరితమైన గాలి నుంచి ఉపశమనం లభించే అవకాశం ఢిల్లీ ప్రజలకు లేదని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా గాలి దిశ, వేగం మారడంతో శని, ఆదివారాల్లో కాలుష్య స్థాయిలో కొంత మెరుగుదల కనిపించింది. అయితే ఇప్పుడు గాలిలో ఉధృతి ఏర్పడిన కారణంగా కాలుష్య స్థాయి మళ్లీ పెరుగుతోంది. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత సూర్యరశ్మి బలహీనంగా మారి వాతావరణంలో పొగమంచు కమ్ముకుంది. వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం సఫ్దర్‌జంగ్ వాతావరణ కేంద్రం వద్ద మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు దృశ్యమాన స్థాయి 1500 మీటర్ల వరకు ఉంది. సాధారణంగా రెండు వేల మీటర్లు ఉండాలి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఢిల్లీలో ఏక్యూఐ 372గా నమోదైంది. మంగళవారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్, సాధారణం కంటే రెండు డిగ్రీలు తక్కువగా ఉండగా, కనిష్ట ఉష్ణోగ్రత 11.5 డిగ్రీల సెల్సియస్, సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా నమోదైంది. గాలిలో తేమ స్థాయి 95 నుంచి 56 శాతంగా నమోదైంది. లోధి రోడ్డు అత్యంత శీతల ప్రాంతం. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 26.0 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 11.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. బుధవారం కూడా ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది కూడా చదవండి: అమేథీలో మళ్లీ రాహుల్ Vs స్మృతి? -
ఎవరు పొట్టి..పొడుగు
ఇంట్లో, బయటా, ఆఫీసులో, మరో చోట.. ఎక్కడైనా ఎవరో ఒకరిని కలుస్తూ ఉంటాం. కొందరు మనకన్నా పొడుగ్గా ఉంటే.. మరికొందరు పొట్టిగా ఉంటుంటారు. ఇది సాధారణమే. కానీ కొన్ని ప్రాంతాల్లో వారు బాగా పొట్టిగా, మరికొన్ని ప్రాంతాల్లో వారు బాగా పొడుగ్గా ఉంటుంటారు. వారిలో తరాలుగా వస్తున్న జన్యువులకుతోడు స్థానిక వాతావరణం, ఉష్ణోగ్రతలు, జీవన విధానం, పని పరిస్థితులు, వైద్యారోగ్య సౌకర్యాలు, పోషకాహారం వంటివి మనుషుల ఎత్తులో తేడాలకు కారణమవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ఇన్సైడర్ సంస్థ ప్రపంచంలో ఎత్తు తక్కువ జనాభా ఉన్న 25 దేశాలతో నివేదికను రూపొందించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆయా దేశాల ఆరోగ్యశాఖలు, వివిధ సర్వేలు, అధ్యయనాలను పరిశీలించి.. దీనిని సిద్ధం చేసింది. ఆయా దేశాల్లో బాగా పొడవుగా ఉన్నవారు కూడా ఉండొచ్చని, తాము సగటు ఎత్తును ప్రామాణికంగా తీసుకున్నామని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను పరిశీలిస్తే.. దక్షిణాసియా, మధ్య ఆఫ్రికా దేశాల్లో జనంఎత్తు తక్కువగా ఉన్నారని నివేదిక పేర్కొంది. దాదాపు అన్ని దేశాల్లో కూడా మహిళల కంటే పురుషుల ఎత్తు ఎక్కువని తెలిపింది. ప్రపంచంలో అత్యధికంగా నెదర్లాండ్స్ దేశస్తుల సగటు ఎత్తు 175.62 సెంటీమీటర్లుకాగా.. అమెరికాలో 172.21, చైనాలో 161.45 సెంటీమీటర్లుగా ఉంది. -
July 8th 2023: మూడు నెలల కనిష్టానికి బంగారం ధర,మరింత పెరగకముందే కొనేద్దామా?
రోజుకు రోజుకు దిగి వస్తున్న పసిడి ధరలు కొనుగోలు దారులను ఊరిస్తున్నాయి. అమెరికా ఫెడ్ రేట్ పెంపు ఆందోళన గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఈప్రభావం బంగారం ధరలపై కూడా చూపిస్తోంది. ముఖ్యంగా జూలై నెలలో బంగారం ధరలు కూడా దిగి వస్తున్నప్పటికీ భారీ ఒడిదుడుకులు మధ్య కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బలహీనమైన ట్రెండ్ కారణంగా దేశీ మార్కెట్లో కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే జూన్ నెలలో బంగారం ధరలు ఏకంగా 3.3 శాతం మేర తగ్గాయి. బంగారం ధరలు జూలై నెల తొలి వారాన్ని పెరుగుదలను నమోదు చేశాయి. శుక్రవారంతో ముగిసిన మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఆగస్టు గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ 10 గ్రా. రూ.392 ఎగిసింది. అయితే ఎంసీఎక్స్‌లో బంగారం ధర దాదాపు రూ. 58,350 వద్ద మూడు నెలల కనిష్టానికి చేరిన తర్వాత మాత్రమే ఈ ర్యాలీ వచ్చింది. ధరల తగ్గుదల ఆగి పోయిందని భావిస్తున్నప్పటికీ రానున్న కాలంలో ఏ మాత్రం తగ్గినా ఈ అవకాశాన్ని మిస్ కాకుండా కొనుగోళ్లకు ఉపయోగించు కోవాలని సూచిస్తున్నారు. అమెరికా జాబ్ డేటా ,అమెరికా డాలర్‌పై కూడా ఒత్తిడి తదితర అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర రూ.400పెరిగి రూ. 54550 వద్ద ఉంది. అటు 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రా. రూ. 59510 వద్ద ఉంది. అలాగే వెండి ధర కిలో వెయ్యి రూపాయలు ఎగిసి హైదరాబాద్‌లో రూ. 76700 పలుకుతోంది. -
ఫండ్ రివ్యూ: ఈ ఫండ్‌తో రిస్క్ తక్కువ.. మెరుగైన రాబడులు
ఈక్విటీలు ఇటీవల రెండు నెలల కాలంలో ర్యాలీ చేసి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి సమీపానికి చేరుకున్నాయి. ఈ సమయంలో మార్కెట్లోకి ప్రవేశించడం రిస్క్‌గా ఇన్వెస్టర్లు భావించొచ్చు. ఇలాంటి సందర్భాల్లోనే అని కాదు, ఏ సమయంలో అయినా పెట్టుబడులు పెట్టుకునేందుకు అనుకూలమైన విభాగమే బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్. మార్కెట్ పరిస్థితులు, వడ్డీ రేట్లు, స్థూల ఆర్థిక అంశాలకు అనుగుణంగా ఈక్విటీ, డెట్ విభాగాల మధ్య కేటాయింపులు మారుస్తూ, రిస్క్ తగ్గించి మెరుగైన రాబడులు ఇచ్చే విధంగా ఇవి పనిచేస్తుంటాయి. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ టాప్ పనితీరు చూపిస్తోంది. రాబడులు ఈ పథకం 16 ఏళ్ల స్థిరమైన రాబడుల చరిత్రతో బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ విభాగంలో మెరుగైన స్థానంలో ఉంది. స్టాక్స్, బాండ్స్, డెరివేటివ్స్ (హెడ్జింగ్) మధ్య కేటాయింపులు మారుస్తూ, తక్కువ రిస్క్‌తో స్థిరమైన రాబడులు అందిస్తోంది. ఈ పథకం పదేళ్ల కాలంలో చూస్తే ఏటా 13.5 శాతం చొప్పున రాబడులు అందించింది. అదే ఐదేళ్ల కాలంలో రాబడులు చూస్తే ఏటా 11 శాతానికి పైనే ప్రతిఫలాన్ని ఇచ్చింది. ఇక మూడేళ్ల కాలంలో వార్షిక రాబడులు 15 శాతానికి పైనే ఉన్నాయి. ఏడాది కాలంలో 13.72 శాతం రాబడి తెచ్చి పెట్టింది. మూడు, ఐదు, పదేళ్ల కాలంలో రాబడుల పరంగా ఈ పథకం బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ విభాగం సగటు రాబడుల కంటే మెరుగైన పనితీరు చూపించింది. 2–3 శాతం అధిక రాబడులు అందించింది. ఈ కాలంలో ఈక్విటీ కేటాయింపులు 49 శాతంగానే ఉన్నాయి. అయినా కానీ ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఎంతో మెరుగైన రాబడులు అందించడాన్ని ఇన్వెస్టర్లు గమనించాలి. క్రిసిల్ హైబ్రిడ్ 50ప్లస్50 మోడరేట్ ఇండెక్స్‌ను మూడు, ఐదేళ్ల కాలం రాబడుల పరంగా ఈ పథకం అధిగమించింది. బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసే వారు అచ్చమైన ఈక్విటీ పథకాల కంటే తక్కువగా, అదే సమయంలో డెట్ కంటే ఎక్కువ రాబడులు సొంతం చేసుకోవచ్చు. అంటే ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడులు వీటితో సొంతం అవుతాయి. ఈ పథకంలో పదేళ్ల కాలంలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎక్స్ఐఆర్ఆర్ రాబడి వార్షికంగా 11.95 శాతం చొప్పున ఉంది. పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో సెబీ నిబంధనల ప్రకారం బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ అన్నవి ఈక్విటీ, డెట్‌లో ఎందులో అయినా సున్నా నుంచి నూరు శాతం వరకు పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అంటే పెట్టుబడుల విషయంలో వీటికి పూర్తి స్వేచ్ఛ ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, స్థూల ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఈక్విటీ, డెట్ విభాగాలకు కేటాయింపులు చేసుకోవడం రిటైల్ ఇన్వెస్టర్‌కు కష్టమైన పనే. ఆ పనిని ఈ పథకం చేసి పెడుతుంది. ఈక్విటీ, డెట్ మధ్య మార్పులు చేర్పులు చేస్తూ ఈ పథకం దీర్ఘకాలంలో సమర్థవంతమైన, విశ్వసనీయమైన పనితీరు చూపిస్తోంది. స్టాక్స్ అధిక విలువలకు చేరాయా? లేక చౌకగా ఉన్నాయా? అన్నది నిర్ణయించుకునేందుకు తనదైన నమూనాను ఈ పథకం అనుసరిస్తుంది. 2020 మార్చిలో సెన్సెక్స్ గణనీయంగా పడిపోయినప్పుడు నికర ఈక్విటీ పెట్టుబడులను 73.7 శాతానికి పెంచుకుంది. ఆ తర్వాత మార్కెట్ ర్యాలీ చేయడంతో 2021 నవంబర్ నాటికి ఈక్విటీ పెట్టుబడులను 30 శాతానికి తగ్గించుకుంది. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.46,534 కోట్ల పెట్టుబడులు ఉంటే, అందులో ఈక్విటీ కేటాయింపులు 40.9 శాతంగా, డెట్ కేటాయింపులు 24 శాతంగా ఉన్నాయి. నగదు, నగదు సమానాల్లో 32.54 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. ఈక్విటీ పెట్టుబడుల్లోనూ రిస్క్‌ను దాదాపు తగ్గించేందుకు 91 శాతం మేర లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. మిడ్‌క్యాప్‌నకు 8.52 శాతం కేటాయింపులు చేసింది. డెట్ విభాగంలోనూ అధిక నాణ్యత కలిగిన ఏఏఏ, ఏఏప్లస్ బాండ్లకే కేటాయింపులు ఎక్కువ చేసింది. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం రిలయన్స్ ఇండస్ట్రీస్ 5.94 ఐసీఐసీఐ బ్యాంక్ 5 హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3.85 ఇన్ఫోసిస్ 3.66 టీవీఎస్ మోటార్ 2.81 మారుతి సుజుకీ 2.57 హెచ్డీఎఫ్సీ 2.44 భారతీ ఎయిర్టెల్ 2.44 ఎస్బీఐ 2.31 యాక్సిస్ బ్యాంక్ 1.88 -
ముందుంది పెళ్ళిళ్ల సీజన్: దిగొస్తున్న పుత్తడి
సాక్షి,ముంబై: ఇటీవల రికార్డు స్థాయికి ఎగబాకిన బంగారం ధరలు క్రమంగి దిగివస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన సమీపిస్తున్న తరుణంలో రెండు నెలల కనిష్టం వద్ద పసిగి కొనుగోలు దారులకు ఊరనిచ్చే అంశం. అంతర్జాతీయంగా ఇటీవలి కాలంలో దాదాపు 3500 దిగొవచ్చిన పసిడి ధర మంగళవారం కూడా అదే బాటలో నడిచింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో MCXలో బంగారం ధర నేడు 55,000 స్థాయిలో ఉంది. అలాగే వెండి 63,000 వద్ద ట్రేడవుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం ధరపై రూ.150 తగ్గి రూ.51,350గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.160 బలహీనపడి రూ.56,020గా ఉంది. అలాగే కేజీ వెండి ధరపై రూ.1000 తగ్గడంతో,రూ.69000లుగా ఉంది. అయితే దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధరూ స్వల్పంగా పుంజుకుని రూ.69200 పలుకుతోంది. గ్లోబల్ మార్కెట్లో కూడా బంగారం ధర పడిపోయింది. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుదల కారణంగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పడిపోయింది. జూన్ 2021 నుండి అతిపెద్ద నెలవారీ నష్టానికి దారితీశాయి. సోమవారం రెండు నెలల కనిష్టానికి చేరిన తర్వాత మంగళవారం స్పాట్ బంగారం 0.1శాతం తగ్గి ఔన్సు ధర 1,816.19 డాలర్ల వద్ద ఉంది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 0.1శాతం క్షీణించి తగ్గి 1,823.30 డాలర్ల స్థాయికి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరలు ఇలా ఉన్నాయి హైదరాబాద్ - రూ.51,450 చెన్నై - రూ. 52,070 ముంబై - రూ. 51,450 ఢిల్లీ - రూ. 51,600 కోల్‌కతా - రూ. 51,450 బెంగళూరు - రూ.51,500 -
టోకు ద్రవ్యోల్బణం తగ్గినా, ‘తీవ్రమే’
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఆగస్టులో 12.41 శాతంగా (2021 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. గడచిన 11 నెలలుగా ఇంత తక్కువ స్థాయి టోకు ధరల రేటు నమోదు ఇదే తొలిసారి. గడచిన మూడు నెలలుగా టోకు ధరల స్పీడ్ తగ్గుతూ వస్తోంది. అయితే ఈ సూచీ రెండంకెలపైనే కొనసాగడం ఇది వరుసగా 17వ నెల. దీనితోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యపరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టు వరకూ వరుసగా ఎనిమిది నెలల నుంచి కేంద్రం నిర్ధేశిస్తున్న 6 శాతం ఎగువన కొనసాగుతోంది. ఆయా అంశాలు సామాన్యునిపై ధరల భారాన్ని మోపుతున్నాయి. గణాంకాల్లో కొన్ని కీలక విభాగాలను పరిశీలిస్తే.. ♦ ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం 12.37 శాతంగా ఉంది. జూలైలో ఈ రేటు 10.77 శాతమే. తృణధాన్యాలు (1.77శాతం), గోధుమలు (17.35 శాతం) పండ్లు (31.75 శాతం), కూరగాయల (22.92 శాతం) ధరలు పెరుగుదల బాటన ఉన్నాయి. ♦ టమాటా విషయంలో ధర 43.56 శాతం ఎగసింది. ♦ ఇంధనం, విద్యుత్ బాస్కెట్లో ద్రవ్యోల్బణం 33.67 శాతంగా ఉంది. అయితే జూలైలో ఈ స్పీడ్ 43.75 శాతం. ♦ తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 7.51% ఉంది. ♦ ఆయిల్‌సీడ్స్ విషయంలో రేటు 13.48% తగ్గింది. -
మిరే అస్సెట్ తక్కువ వడ్డీకే స్టాక్ ఫండింగ్
ముంబై: మిరే అస్సెట్‌కు చెందిన ఎం.స్టాక్ ‘మార్జిన్ ట్రేడ్ ఫెసిలిటీ’ (ఎంటీఎఫ్)ను ఆరంభించింది. 7.99 శాతం వడ్డీకే రుణ సదుపాయం కల్పిస్తున్నట్టు తెలిపింది. పరిశ్రమలోనే ఇది కనిష్ట వడ్డీ రేటుగా పేర్కొంది. ఈక్విటీలకు సంబంధించి ట్రేడర్లు, ఇన్వెస్టర్లు తక్షణమే నిధుల సదుపాయం పొందొచ్చని తెలిపింది. 700 స్టాక్స్‌కు సంబంధించి 80 శాతం మార్జిన్‌ను పొందొచ్చని వివరించింది. మార్జిన్ ఫండింగ్ (రుణం)తో కొనుగోలు చేసిన షేర్లను ఎంత కాలం పాటు అయినా కొనసాగించుకోవచ్చని తెలిపింది. ట్రేడర్లు రూపాయి బ్రోకరేజీ లేకుండా అపరిమిత డ్రేడ్స్ చేసుకోవచ్చని ఈ సంస్థ ప్రకటించింది. రూ.10 లక్షల వరకు ఫండింగ్పై 9.49 శాతం రేటు, రూ.10–25 లక్షల మధ్య తీసుకుంటే రూ.8.99 శాతం రేటు, రూ.25 లక్షలకు పైగా ఫండింగ్ తీసుకున్న వారికి 7.99 శాతం రేటును వసూలు చేస్తున్నట్టు తెలిపింది. షేర్ల ప్లెడ్జ్ (ఫండింగ్ కోసం), అన్ ప్లెడ్జ్ లావాదేవీపై కేవలం రూ.12 వసూలు చేస్తున్నట్టు పేర్కొంది. -
తొమ్మిది నెలల కనిష్టానికి తయారీ రంగం
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం క్రియాశీలత జూన్‌లో మందగించింది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మ్యాను ఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 53.9గా నమోదయ్యింది. గడచిన తొమ్మిది నెలల్లో ఈ స్థాయి తక్కువ స్థాయి నమోదుకావడం ఇదే తొలిసారి. మే నెల్లో పీఎంఐ 54.6 వద్ద ఉంది. సూచీ 50పైన ఉంటే వృద్ధిగా ఆ లోపునకు పడిపోతే క్షీణతగా పరిగణించే సంగతి తెలిసిందే. వస్తువుల ధరల తీవ్రత నేపథ్యంలో ఉత్పత్తి, అమ్మకాల స్పీడ్ తగ్గిందని ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటిలిజెన్స్‌లో ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. అన్ని విభాగాలపై ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు ఉన్నట్లు ఆమె తెలిపారు. వ్యాపార విశ్వాసం 27 నెలల కనిష్టానికి పడిపోయింది. కాగా, ఉపాధి అవకాశాలు మాత్రం వరుసగా నాలుగవ నెలలోనూ మెరుగుపడ్డం గమనార్హం. -
రూపాయి మరింత ఢమాల్! మున్ముందు మరింత కష్టం
సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి డాలరు మారకంలో మరోసారి కుదేలైంది. మంగళవారం 78.59 వద్ద తొలుత రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. అంతకుముందు నాలుగు ట్రేడింగ్ సెషన్లలో ప్రతి ఒక్కటి రికార్డు స్థాయిలో ముగిసిన రూపాయి తాజాగా 78.74 వద్ద సరికొత్త ఆల్ టైమ్ ఇంట్రా-డే కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆర్థిక మందగమన భయాలు, అంతర్జాతీయ మార్కెట్లు, చమురు ధరలు, ఎఫ్ఐఐల నిరంత అమ్మకాల కారణంగా ఇటీవల ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి జారిపోతున్న రూపాయి అమెరికా డాలర్‌తో పోలిస్తే 78.53 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. అనంతరం మరింత క్షీణించి 51 పైసల నష్టంతో 78.74 స్థాయికి చేరింది. మునుపటి సెషన్లో రూపాయి నాలుగు పైసలు క్షీణించి 78.37 వద్ద రికార్డు ముగింపును నమోదు చేసింది. మరోవైపు దేశీయ మార్కెట్లలో ఎఫ్ఐఐల (ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు) నిరంతర విక్రయాలు కూడా రూపాయిపై ఒత్తిడిని పెంచుతున్నాయని మెహతా ఈక్విటీస్ కమోడిటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలంత్రి తెలిపారు. రష్యాపై మరిన్ని ఆర్థిక ఆంక్షలు ప్రపంచ ఇంధన ధరలకు ఊతమిస్తాయని, దీంతో అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కరెన్సీలపై ఒత్తడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా మంగళవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
ఎల్ఐసీ ఫ్లాప్ షో, మార్కెట్ క్యాప్ ఢమాల్: షాక్‌లో ఇన్వెస్టర్లు
సాక్షి,ముంబై:అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)కి మార్కెట్లో వరుసగా ఐదో సెషన్లోనూ అమ్మకాల సెగ తాకింది. ఇన్వెస్టర్ల ఎడ తెగని అమ్మకాలతో సోమవారం ఎస్ఐసీ మరింత దిగజారి ఆల్ టైం కనిష్టానికి చేరింది. ఫలితంగా సంస్థ మార్కెట్ క్యాప్ 5 లక్షల కోట్ల రూపాయల దిగువకు పడిపోయింది. ఇది లిస్టింగ్ నాటికి రూ.6 లక్షల కోట్లకు పై మాటే. ఈ స్థాయికి దిగజారడం ఇదే తొలిసారి. సోమవారం నాటి అమ్మకాలతో ఎల్ఐసీ షేరు 2.86 శాతం క్షీణించి రికార్డు ముగింపు కనిష్టం రూ.777.40 వద్ద స్థిరపడింది. బీఎస్ఈఇండెక్స్లో ఈ స్టాక్ ఆల్-టైమ్ ఇంట్రాడే కనిష్ట స్థాయి రూ. 775.40ని తాకింది. దీంతో మార్కెట్ విలువ 4.97 లక్షల కోట్లకు చేరింది. అయితే భవిష్యత్తులో మరింత అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోనుందని, యాంకర్ ఇన్వెస్టర్ల లాక్-ఇన్ పీరియడ్ ముగియనున్న నేపథ్యంలో రూ. 750 వద్ద మరింత దిగజారే అవకాశం ఉందని స్టాక్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఎల్ఐసీ షేరు లిస్టింగ్ ప్రైస్ (మే 17న) రూ. 949 నుండి 18.08 శాతం కుప్ప కూలింది. ఎఫ్ఐఐల భాగస్వామ్యం దాదాపు శూన్యం కావడం, లాక్ ఇన్ పీరియడ్ ముగియనుండటంతోపాటు, క్యూ4 ఫలితాలు ప్రోత్సాహకరంగా లేకపోవడంతో మరింత దిగజారవచ్చని, పొజిషనల్ ఇన్వెస్టర్లు అప్రమత్తంగాఉండాలని మార్కెట్ నిపుణుడు ఎస్ఎంసి గ్లోబల్ సెక్యూరిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ జైన్ సూచించారు. దీంతో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లు లబోదిబో మంటున్నారు. అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు పెద్దగా చింతించాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా మార్చి 2022 త్రైమాసికంలో సంస్థ వార్షిక ప్రాతిపదికన ఏకీకృత నికర లాభం 17 శాతం క్షీణించి 2,410 కోట్లు రూపాయలుగా ఉంది. అయితే నికర ఆదాయం 17.9 శాతం పెరిగి రూ.1.4 లక్షల కోట్లకు చేరింది, క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలోరూ.1.2 లక్షల కోట్లుగా ఉంది. -
పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి అంతంతే!
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి సెప్టెంబర్‌లో స్వల్పంగా 3.1 శాతంగా (2020 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. మైనింగ్ రంగం మెరుగైన ఫలితాన్ని నమోదుచేసుకుంది. బేస్ ఎఫెక్ట్ దన్నుతో గడచిన ఆరు నెలలుగా (2021 మార్చి నుంచి ) రెండంకెల్లో ఉన్న పారిశ్రామిక ఉత్పత్తి, తన ధోరణిని కొనసాగించకుండా తక్కువ వృద్ధి రేటుకు పడిపోవడం ఆందోళన పారిశ్రామిక రంగానికి సంబంధించి ఆందోళన కలిగిస్తున్న అంశం. ఎలా అంటే... 2020 సెప్టెంబర్‌లో సూచీ 124.1 పాయింట్ల వద్ద ఉంది. 2021 సెప్టెంబర్‌లో సూచీ 127.9 పాయింట్లకు ఎగసింది. అంటే వృద్ధి 3.1 శాతమన్నమాట. 2019లో సూచీ 122.9 వద్ద ఉంది. కరోనా ముందస్తు కాలంతో పోల్చినా సూచీల్లో పురోగతి ఉన్నా... ఇది అతి స్వల్పంగా మాత్రమే ఉండడం గమనించాల్సిన అంశం. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) శుక్రవారం ఈ గణాకాలను విడుదల చేసింది. ముఖ్యాంశాలు ఇవీ... ► మొత్తం ఐఐపీలో దాదాపు 77.63 శాతం వెయిటేజ్ ఉన్న తయారీ రంగం సెప్టెంబర్‌లో 2.7 శాతం పురోగమించింది. ► మైనింగ్ రంగం వృద్ధి రేటు 8.6 శాతంగా ఉంది. ► విద్యుత్ ఉత్పత్తి కేవలం ఒక శాతం పెరిగింది. ► భారీ యంత్రపరికరాల ఉత్పత్తికి సంబంధించిన క్యాపిటల్ గూడ్స్ విభాగం కేవలం 1.3 శాతం లాభపడింది. 2020 ఇదే కాలంలో ఈ రంగం అసలు క్షీణతలో ఉంది. ► కన్జూమర్, నాన్ కన్జూమర్ గూడ్స్ ఉత్పత్తి క్షీణతలో ఉండడం గమనార్హం. రిఫ్రిజిరేటర్లు, ఏసీల వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ తయారీ 2021 సెప్టెంబర్‌లో 2 శాతం క్షీణించింది. నిత్యావసరాలకు సంబంధించి (ఎఫ్ఎంసీజీ) నాన్ కన్జూమర్ గూడ్స్ ఉత్పత్తులు 0.5 శాతం క్షీణించాయి. ► మొత్తం ఐఐపీలో దాదాపు 44 శాతం వాటా కలిగిన ఎనిమిది రంగాల మౌలిక పరిశ్రమల గ్రూప్ 4.4 శాతం పురోగమించింది. సహజవాయువు ఉత్పత్తి 27.5 శాతం పురోగతి సాధిస్తే, రిఫైనరీ ప్రొడక్టుల ఉత్పత్తి 6% ఎగసింది. ఇక సిమెంట్ ఉత్పత్తి 10.8 శాతం పెరిగింది. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి 1.7% క్షీణించింది. ఎరువుల రంగం స్వల్పంగా 0.02% పురోగమించింది. విద్యుత్ ఉత్పత్తి కూడా ఇదే విధంగా 1% పెరిగింది. స్టీల్ రంగం పనితీరు కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఇక బొగ్గు ఉత్పత్తి వృద్ధి రేటు 8.1%. -
భారత్ ఎకానమీ అంచనాలకు కోత
న్యూఢిల్లీ: కోవిడ్–19 సెకండ్ వేవ్ కారణంగా రికవరీ ప్రక్రియ మందగించిన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ వృద్ధి అంచనాలను 10 శాతానికి కుదిస్తున్నట్లు రేటింగ్స్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ వెల్లడించింది. గతంలో ఇది 12.8 శాతంగా ఉంటుందని ఫిచ్ అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సెకండ్ వేవ్ వ్యాప్తి వల్ల బ్యాంకింగ్ రంగానికి సవాళ్లు మరింతగా పెరిగాయని తాజాగా ఒక నివేదికలో పేర్కొంది. స్థానికంగా లాక్డౌన్లు విధించడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు .. పూర్వ స్థాయికి పడిపోకుండా కాస్త ఊతం లభించిందని వివరించింది. అయితే, కీలకమైన పలు వ్యాపార కేంద్రాల్లో కార్యకలాపాలు దెబ్బతినడం వల్ల రికవరీ ప్రక్రియ మందగించిందని ఫిచ్ తెలిపింది. 2019–20లో 4 శాతంగా ఉన్న భారత్ వృద్ధి రేటు .. కోవిడ్–19 మొదటి దశ వ్యాప్తి తరుణంలో 2020–21లో 7.3 శాతం పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రెండంకెల స్థాయిలో ఉండవచ్చని ముందుగా అంతా అంచనా వేసినప్పటికీ, కరోనా సెకండ్ వేవ్ రాకతో పరిస్థితి మారిపోయింది. ఆర్బీఐ ఇటీవలే తమ అంచనాలను 10.5 శాతం నుంచి 9.5 శాతానికి కుదించింది. మూడీస్, ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ మొదలైన అంతర్జాతీయ సంస్థలు కూడా ఇది 9.3 శాతం–9.5 శాతం దాకా ఉండవచ్చని భావిస్తున్నాయి. అటు ప్రపంచ బ్యాంకు ఏకంగా 10.1 శాతం నుంచి 8.3 శాతానికి కుదించింది. టీకా ప్రక్రియ కీలకం.. టీకాల ప్రక్రియ వేగం పుంజుకుంటే వ్యాపార వర్గాలు, వినియోగదారుల్లో విశ్వాసం మెరుగుపడే అవకాశం ఉందని ఫిచ్ వెల్లడించింది. అయినప్పటికీ తదుపరి కరోనా ఉధృతి మరింత పెరిగినా, లాక్డౌన్లు విధించిన ఆర్థిక వ్యవస్థ రికవరీకి సవాళ్లు ఎదురు కావచ్చని పేర్కొంది. ‘2021 జూలై 5 నాటికి 137 కోట్ల జనాభాలో 4.7 శాతం ప్రజలకు మాత్రమే టీకా ప్రక్రియ పూర్తయ్యింది. అర్థవంతమైన, నిలకడైన ఆర్థిక రికవరీ సాధనకు దీనివల్ల రిస్కులు పొంచి ఉన్నాయి‘ అని ఫిచ్ వివరించింది. ఫలితంగా, బ్యాంకుల మధ్యకాలిక పనితీరుపై కూడా ప్రభావం పడవచ్చని పేర్కొంది. వ్యాపార, ఆదాయ వృద్ధికి అవకాశాలు పరిమితంగా ఉండటం వల్ల బ్యాంకులకు పరిస్థితి సమస్యాత్మకంగా ఉండవచ్చని తెలిపింది. మరోవైపు, ’బీబీబీమైనస్’ రేటింగ్ గల ఇతర దేశాలతో పోలిస్తే భారత్ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి కాస్త మెరుగ్గానే ఉండవచ్చని, కానీ కరోనా గాయాల కారణంగా మధ్యకాలికంగా వ్యాపార వర్గాలు, వినియోగదారుల సెంటిమెంటు బలహీనపడే రిస్కులు ఉన్నాయని ఫిచ్ తెలిపింది. -
పసిడి డిమాండ్‌కు కరోనా కాటు
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్-19 సంక్షోభం, ఆకాశాన్నంటిన ధరలతో పసిడికి డిమాండ్ భారీగా పడిపోయింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2020 సంవత్సరంలో దేశీయంగా పుత్తడి డిమాండ్ 25 ఏళ్ల కనిష్టానికి క్షీణించింది. ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యుజీసీ) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, 2020 క్యాలెండర్ సంవత్సరంలో భారతదేశంలో బంగారం డిమాండ్ 25 సంవత్సరాల కనిష్టానికి చేరింది. (అన్ని ఆభరణాలకూ హాల్‌మార్క్ అమలయ్యేనా?) 2019లో 690.4 టన్నులతో పోలిస్తే ఇది 446 టన్నులకు పడిపోయింది. 1995లో 462 టన్నుల వద్ద డిమాండ్ చివరిసారిగా పెరిగిందని డబ్ల్యుజీసీ ఇండియా పీఆర్ మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరం వెల్లడించారు. డబ్ల్యుజీసీ డేటా ప్రకారం మొత్తం ఆభరణాల డిమాండ్ 2019 లో 544.6 టన్నులతో పోలిస్తే భారతదేశంలో (సమీక్షించిన కాలంలో) 42 శాతం పడి 315.9 టన్నులుగా ఉంది. 2020 లో ఆభరణాల డిమాండ్ 22 శాతం తగ్గింది. విలువ పరంగా ఇది రూ. 133.260 కోట్లు. కరోనా సంక్షోభం, లాక్డౌన్ ఆంక్షలకు తోడు, బంగారం ఆల్ టైం ధరల నేపథ్యంలో 2020 లో భారతదేశ బంగారం డిమాండ్ మూడో వంతు పడిపోయింది. అయితే విలువ పరంగా చూసినప్పుడు ఈ డ్రాప్ గణనీయంగా తక్కువగా ఉంది. అయితే లాక్డౌన్ ఆంక్షల సడలింపు, పండుగ సీజన్‌నే పథ్యంలో బంగారానికి డిసెంబర్ త్రైమాసికం ఆశలను రేకెత్తించింది. 2020 డిసెంబర్ త్రైమాసికంలో ఆభరణాల డిమాండ్ 137.3 టన్నులకు పెరిగింది. ఈకాలంలో పెట్టుబడులుకూడా 8 శాతం పెరిగి 48.9 టన్నులకు చేరుకుంది. 2020 డిసెంబర్ త్రైమాసికంలో భారతదేశంలో బంగారం డిమాండ్ 186.2 టన్నులుగా ఉంది, ఇది అంతకుముందు 2019 లో (194.3 టన్నులు) పోలిస్తే 4 శాతం తగ్గింది. విలువ పరంగా, డిమాండ్ 26 శాతం పెరిగి రూ .82.790 కోట్ల రూపాయలుగా ఉంది. గ్లోబల్ వ్యూ 2020నాటికి, ప్రపంచ డిమాండ్ 3,759.6 టన్నులతో 14శాతం తగ్గింది. 2020లో వినియోగదారుల డిమాండ్ బలహీనపడటం వెనుక కీలకమైన కారణం కరోనా మహమ్మారేని డబ్ల్యుజీసీ తెలిపింది. 2009 తరువాత గ్లోబల్‌గా మొదటిసారి వార్షిక ప్రాతిపదికన పసిడి డిమాండ్ 4వేల టన్నుల మార్క్ కంటే దిగువకు పడి పోయింది. అయితే 2021వ సంవత్సరం బంగారానికి మంచి సంవత్సరంగా ఉండనుందని సోమసుందరం అభిప్రాయపడ్డారు. గ్లోబల్ మార్కెట్లు కోవిడ్-19 ఆర్ధిక సంక్షోభ ప్రభావానికి ఇంకా పూర్తిగా గురి కాలేదు. ఆ తర్వాత, ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకోవడంతో డిమాండ్ ప్రభావితమవుతుందని అంచనా వేశారు. -
అమ్మకాల సెగ : 11150 దిగువకు నిఫ్టీ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిసాయి. ఆరంభ లాభాలనుంచి వెంటనే పతనమై డే హై నుంచి దాదాపు 500 పాయింట్లు కుప్పకూలిన కీలక సూచీలు రోజంతా భారీ ఒడిదుడుకుల మధ్య సాగాయి. చివరికి సెన్సెక్స్ 194 పాయింట్లు నష్టంతో 37943 వద్ద, నిఫ్టీ 62 పాయింట్లు నష్టంతో 11131 వద్ద ముగిసింది. తద్వారా సెన్సెక్స్ 38 వేల దిగువన, నిఫ్టీ 11150 స్థాయిని కోల్పోయింది. ప్రధానంగా బ్యాంకింగ్ షేర్లు భారీగా నష్టపోగా, బంగారం సంబంధిత షేర్లులాభాల్లో ముగిసాయి. మరోవైపు ఐటీ, పెయింట్, సిమెంట్ రంగ షేర్లు లాభపడ్డాయి. ఆసియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, బీపీసీఎల్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటాస్టీల్ భారీగా లాభపడ్డాయి. అటు ఐసీఐసీఐ బ్యాంకు, జీ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, ఇండస్ఇండ్,ఎస్‌బీఐబ్యాంకు,బజాజ్ ఫైనాన్స్, సన్‌ఫార్మ, గెయిల్ భారీగా నష్టపోయాయి. మరోవైపు డాలరుమారకంలో రూపాయి ఆరంభ లాభాలను కోల్పోయి ఫ్లాట్‌గా ముగిసింది. 74.70 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించిన రూపాయి 74.83 వద్ద ముగిసింది. (ప్రపంచంలోనే నెంబర్ 2 సంస్థగా రిలయన్స్) -
లాక్డౌన్ సడలింపు : పసిడి వెలవెల
సాక్షి, ముంబై: కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్ పరిమితుల సడలింపుతో పుత్తడి రేట్లు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసిఎక్స్) లో బంగారం ధర మంగళవారం కీలక మద్దతు స్థాయికి దిగువన ట్రేడ్ అవుతోంది. ప్రారంభంలో రూ .45,527 పలికిన జూన్ డెలివరీ ఫ్యూచర్స్ 10 గ్రాములకి 0.71 శాతం తగ్గి 45,480 రూపాయలకు చేరుకుంది. అంతకుముందు రూ.45,807 లు పలికిన కిలో వెండి ధర కూడా పడింది. ఫ్యూచర్స్ రూ .41,244 తో పోలిస్తే 0.24 శాతం తగ్గి కిలో ధర రూ .41,143 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల పది గ్రాముల ధర రూ. 43760 గా వుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.46560 వద్ద కొనసాగుతున్నాయి. (పెట్రో ధరలకు వ్యాట్ షాక్ ) అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ ఎత్తివేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించడం ప్రపంచ మార్కెట్లకు ఊతమిచ్చింది. కరోనా వైరస్ ఆంక్షలను సడలించడం ద్వారా మార్కెట్లలో సెంటిమెంట్ బలడి పెట్టుబడులు ఈక్విటీల వైపు మళ్లాయి. దీంతో మంగళవారం బంగారం ధరలు పడిపోయాయి. స్పాట్ బంగారం 0.1 శాతం తగ్గి ఔన్సు ధర 1699.56 డాలర్లకు చేరుకుంది. అమెరికా బంగారు ఫ్యూచర్స్ 0.5 శాతం తగ్గి ఔన్సుకు 1705.50 డాలర్ల వద్ద వుంది. అయితే అమెరికా, చైనా మధ్య ముదుతున్న ట్రేడ్ వార్ భయాలు అటు ట్రేడర్లను, ఇటు పెట్టుబడిదారులను ఆందోళనలోకి నెడుతున్నాయి. దీంతో బంగారం ఔన్స్ ధర 1700 డాలర్లకు ఎగువన స్థిరంగా కొనసాగుతోంది. -
కరోనా కల్లోలం : జీడీపీపై ఫిచ్ షాకింగ్ అంచనాలు
సాక్షి, న్యూఢిల్లీ: భారత వృద్ధి రేటుపై షాకింగ్ అంచనాలు వెలువడ్డాయి. ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత జీడీపీపై మరోసారి ఆందోళనకర అంచనాలను వెలువరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు కేవలం 1 శాతం దిగువన నమోదు కావొచ్చని అభిప్రాయపడింది. మూడు వారాల క్రితం అంచనా వేసిన 2 శాతం అంచనాను సంస్థ తాజాగా దీన్ని0.8 శాతానికి తగ్గించింది. చైనాలో కూడా 2020 లో 0.7 శాతం వృద్ధి నమోదు కానుందని తెలిపింది. అలాగే ఇంతకుముందు అంచనా వేసిన 1.9 శాతంతో పోలిస్తే 2020 లో ప్రపంచ జీడీపీ 3.9 శాతానికి పతనం కానుందని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. ఇది యుద్ధానంతర కాలం నాటి అసాధారణమైన మాంద్యం అని వ్యాఖ్యానించింది. కోవిడ్-19, లాక్ డౌన్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం గుప్పిట్లోకి వెళ్లిపోతున్న తరుణంలో ఆ ప్రభావం భారత్‌పై ఉండొచ్చని ఫిచ్ రేటింగ్స్ వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా రెండు త్రైమాసికాల్లో సంకోచం లేదా ప్రతికూల ప్రతికూల వృద్ధిని వుంటుందని, అయితే 2021-22లో జీడీపీ 6.7 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. (బాబోయ్ కరోనా జీడీపీకి షాక్!) కరోనా వైరస్ సంక్షోభం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపబోతోందని తెలిపింది. ఆర్థిక పతనం ప్రపంచవ్యాప్తంగా పునరావృతమవుతోందనీ, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల జీడీపీ మరింత దిగజారనుందని అంచనావేసింది. మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై చెయిన్ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం అంతర్జాతీయంగా వ్యాపించిందని, ఎగుమతుల పరిస్థితి కూడా ప్రతికూలంగా వుందని తెలిపింది. పడిపోతున్న వస్తువుల ధరలు, మూలధన ప్రవాహాలు, మరింత పరిమితమవుతున్న పాలసీ విధానాలు దేశీయ వైరస్-నియంత్రణ చర్యలు ప్రభావాన్ని పెంచుతున్నాయని తెలిపింది. చైనా భారతదేశం రెండింటి వృద్ది ఒక శాతం దిగువకు అంచనా వేసినందున, అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల జీడీపీ 2020లో మరింత క్షీణిస్తుందని తెలిపింది. 1980ల నాటికంటే దారుణమైన పరిస్తితి అని పేర్కొంది. కాగా 2020-21లో భారతదేశం 1.9శాతం వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనా వేసింది. అదే సమయంలో భారతదేశ వృద్ధి 1.5- 4 శాతం వద్ద అంచనా వేసిన సంగతి తెలిసిందే. (ఆసియాలో అపర కుబేరుడుగా అంబానీ) -
కరోనా కుయ్యో మొర్రో
ప్రపంచమంతా కరోనా వర్రీలో ఉంది. మహిళా దేశాధినేతలు ఉన్న చోట మాత్రం.. కరోనానే.. కుయ్యో మొర్రో అంటోంది! చాల్లెద్దూ.. మాట వినే రకమా కరోనా? వినే రకం కాకపోవచ్చు. కానీ.. జర్మనీ, న్యూజిలాండ్, ఫిన్లాండ్, ఐస్లాండ్, బెల్జియం, డెన్మార్క్ దేశాల పాలకులు ఊరుకునే రకం కాదు. కరోనాను ఎలా దారికి తేవాలో ప్రజలకు చెప్పారు. ‘మీ దగ్గరకు కరోనాను రప్పించుకోండి. అప్పుడు కరోనా ఎవరి దగ్గరకూ వెళ్లదు’ అన్నారు. అదే నిజమైంది. ఈ దేశాల్లో కరోనా గ్రాఫ్ సాగిలపడుతోంది. న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్. వయసు 39 ఏళ్లు. నవ్వు ముఖం. బొద్దింకలపై హిట్ కొట్టినట్లు ప్రజా సమస్యల్ని పోగొట్టేస్తుంటారు. కొత్త సమస్య.. కరోనా వచ్చింది. యాభై లక్షల జనాభా. కరోనాకు కావలసినంత పాడి. కానీ దగ్గరకు వెళ్లలే కపోయింది! ప్రజలకు ఒకటే మాట చెప్పారు జెసిండా. ‘‘యాక్ట్ లైక్ యు హ్యావ్ కరోనా వైరస్’’. మీకొస్తుందని తలుపు వేసుకోకండి. వచ్చిందని వేసుకోండి. అప్పుడు కరోనా ఎవరి తలుపూ కొట్టదు అని చెప్పారు. బాధ్యతను పెంచడం ఇది. దెబ్బతో కరోనా కంట్రోల్ అయింది. మనలాగే మార్చి 25 న లాక్డౌన్ విధించారు జెసిండా. విదేశాల నుంచి విమానం దిగిన వారిని వెనువెంటనే ఐసోలేషన్‌కి పంపిన తొలి దేశాలలో న్యూజిలాండ్ ఒకటి. ఏంజెలా మెర్కిల్ సీనియర్ లీడర్. 65 ఏళ్లు. పద్నాలుగేళ్గుగా జర్మనీ చాన్స్‌లర్. 8 కోట్ల 50 లక్షల జనాభా. మార్చి 11న ‘ఒకరికొకరు దూరంగా ఉండండి’ అనే ప్రకటన చేశారు. ‘దూరంగా ఉండకపోతే ముగ్గురిలో ఒకరి వచ్చినా ఆశ్చర్యం లేదు’ అని మర్నాడే హెచ్చరిక. ప్రస్తుతం కేసులూ ఉంటున్నాయి. రికవరీలూ ఉంటున్నాయి. మూసివేసిన కేసుల్లో 95 శాతం రికవరీలు, 5 శాతం మరణాలు. వారానికి జర్మనీ ఇప్పుడు 5 లక్షల కరోనా పరీక్షలు చేస్తోంది. మిగతా ఐరోపా దేశాల్లో జరుగుతున్న పరీక్షల కంటే ఎక్కువ. ఐ.సి.యు. బెడ్లు, వెంటిలేటర్లకు కొరత లేకుండా చూసుకున్నారు. లాక్డౌన్లో ఎకానమీ డౌన్ అవకుండా ముందే లక్ష కోట్ల యూరోలతో ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ‘న్యూయార్క్ టైమ్స్’ ఏంజెలాను.. చలించని ధీమంతురాలు అని కీర్తించింది. ‘‘ఆర్థిక సంక్షోభాలలో పొదుపు ఖాతాల జోలికి వెళ్లని ఏంజెలా, పది లక్షల మంది వలస కార్మికుల్ని దేశంలోకి ఆహ్వానించిన ఏంజెలా.. ఇప్పుడీ కరోనా గడ్డుకాలం నుంచి ప్రజల్ని తేలిగ్గా గట్టెక్కించగలరని దేశ ప్రజలు విశ్వసిస్తున్నారు. ప్రజలూ ఆమె చెప్పినట్లే చేస్తున్నారు’’ అని రాసింది. జెసిండా తన ప్రజలకు చెప్పినట్లే ఏంజెలా కూడా.. ‘కరోనా మనకొస్తుందేమో అని కాకుండా.. మనం రప్పిస్తామేమో అన్నంత జాగ్రత్తగా ఉండాలి’ అని విజ్ఞప్తి చేశారు. బెల్జియం ప్రధానమంత్రి సోఫీ విల్మేస్. వయసు 45. మృతుల సంఖ్య 10 కి చేరుకోగానే దేశంలో లాక్డౌన్ విధించారు. బెల్జియం జనాభా కోటీ 20 లక్షలు. లాక్‌డౌన్‌కి ముందు దేశాన్ని ఉద్దేశించి ఆమె చేసిన ప్రసంగం చాలా స్పష్టంగా, ప్రజల్ని ఒప్పించేలా ఉంది. ‘‘లాక్డౌన్ అవసరం లేదు. లాక్డౌన్ అవసరం కలగకూడదనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రాకండి. అత్యవసరం అయినా విదేశీయానం చేయకండి’’. రెండే మాటలు. బలంగా పనిచేశాయి. కరోనా మరణాలను సోఫీ అతి తక్కువ సమయంలోనే అదుపు చేయగలిగారు. ఫిన్లాండ్లో ఏప్రిల్ 6 నుంచి కరోనా మరణాల సంఖ్య తగ్గడం మొదలైంది. ఫిన్లాండ్ జనాభా 56 లక్షలు. ఇప్పటివరకు ఆ దేశంలో నమోదైన మరణాలు 49. ఫిన్లాండ్ ప్రధానమంత్రి సనా మారిన్ లాక్‌డౌన్‌ని మే 13 వరకు పొడిగిస్తున్నట్లు గురువారం ఒక ప్రకటన చేశారు. ప్రపంచంలోని అతి చిన్న వయసు మహిళా ప్రధాని అయిన సనా (34) కూడా న్యూజిలాండ్ ప్రధాని జెసిండాలా ఎప్పుడూ చిరునవ్వుతో కనిపిస్తారు. ‘‘ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజలు సహకరిస్తే చాలు’’ అని సనా తన కరోనా ప్రసంగంలో కోరారు. మహిళా ప్రధానులు ఉన్న ఐస్లాండ్, డెన్మార్క్ దేశాలలో కూడా కరోనా కేసులు తక్కువగా ఉండటమో, తక్కువ మరణాలు నమోదవడమో, కోలుకుంటున్నవాళ్లు ఎక్కువగా ఉండటమో కనిపిస్తోంది. ఐస్లాండ్ జనాభా మూడున్నర లక్షలు. డెన్మార్క్ జనాభా 50 లక్షల 80 వేలు. ఐస్లాండ్ ప్రధాని కత్రిన్ జాకబ్డోటిర్ (44).. దూరాన్ని పాటించాలని ప్రజలకు చెబుతూనే, ఆర్థిక భారాలను పెరగన్వికుండా జాగ్రత్తపడ్డారు. కరోనా ప్రభావాన్ని తట్టుకునేందుకు 23,000 కోట్ల ‘క్రోనా’ల (వంద కోట్ల ఆరవై లక్షల డాలర్లు) అత్యవసర ఆర్థిక నిల్వల్ని పోగేశారు. ఇక డెన్మార్క్ ప్రధాని మ్యాటీ ఫ్రెడ్రిక్సన్ (42) ఈ నెల 15 నుంచి డే కేర్ సెంటర్లను, పాఠశాలలను తిరిగి తెరవబోతున్నారు! గత మూడు వారాలుగా ఆ దేశం లాక్డౌన్లో ఉంది. ఐస్లాండ్ ప్రధాని కత్రిన్లా.. లాక్డౌన్ లాక్‌డౌనే, ఎకానమీ ఎకానమీనే అన్నట్లు మ్యాటీ కూడా ఒకదాని ప్రభావం ఇంకోదానిపై పడకుండా చర్యలు తీసుకున్నారు. ఎంత కష్టంలోనూ దేశంలోని ప్రైవేటు కంపెనీల సిబ్బంది జీతాలలో 25 శాతానికి మించి కోత విధించడానికి వీల్లేదని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ ఆరుగురు దేశాధినేతలు మహిళలు కాబట్టి సమర్థంగా పని చేస్తున్నారని, మహిళలు అయినప్పటికీ కరోనాను ఎదుర్కోగలుగుతున్నారని చెప్పడం కాదిది. ప్రపంచ దేశాలకు పనికొచ్చే కష్టకాలపు పాఠాలు వీళ్ల దగ్గర ఉన్నాయని చెప్పుకోవడం. -
ఆరేళ్ల కనిష్టానికి జీడీపీ
-
షాకింగ్ : ఆరేళ్ల కనిష్టానికి జీడీపీ
సాక్షి, న్యూఢిల్లీ: ఒక వైపు ఆర్థికమాంద్య పరిస్థితులనుంచి గట్కెక్కేందుకు కేంద్రం తీవ్రకసరత్తు చేస్తోంది. మరోవైపు అందరూ ఊహించినట్టుగానే మాంద్యం ముప్పు ముంపు కొస్తోంది. తాజాగా గణాంకాల ప్రకారం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 5 శాతానికి పడిపోయింది. ఏప్రిల్-జూన్ మాసంలో ఇది 5.8 శాతంగా ఉంది. దీంతో జీడీపీ ఆరేళ్ల కనిష్టానికి చేరింది. అటు జీవీఏ 4.9 శాతానికి క్షీణించింది. ఇది ఏప్రిల్-జూన్ మాసంలో 5.7 గా ఉంది. జీడీపీ తక్కువగా ఉంటుందని ఊహించినప్పటికీ, ఇంత దారుణ అంచనా వేయలేక పోయామనీ, దీంతో దేశంలో మరోసారి మాంద్యం రిస్థితులు నెలకొన్నాయని ఎనలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధనలో భాగంగా పలు కీలక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారంనిర్వహించిన మీడియా సమావేశాన్ని ప్రకటించారు. ప్రధానంగా వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల ఏకీకరణను ప్రకటించారు. 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసి 4 పెద్ద సంస్థలుగా రూపొందిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఈ ఏడాది కనిష్ట స్థాయికి పెట్రో ధరలు
సాక్షి, ముంబై: చమురు ధరలు బలహీనంగా ఉండటంతో దేశీయంగా పెట్రోలు ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలుపడిపోవడంతో ఇటీవల బాగా దిగివ వచ్చిన పెట్రోలు డీజిలు ధరలు శనివారం 2018 కనిష్టానికి చేరాయి. ఢిల్లీ, ముంబై, కోలకతా, చెన్నైతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా దిగి వస్తున్నాయి. లీటరుకు 30పైసలు చొప్పున పెట్రో ధరలు తగ్గాయి. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్సైట్ ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ .69.26గా ఉంది. డీజిలు ధర రూ. 63.32గా ఉంది. ముంబై: పెట్రోలు ధర రూ.రూ. 74.89 , డీజిలు ధర రూ.66.25 చెన్నై : పెట్రోలు ధర రూ.71.85 డీజిలు ధర రూ. 66.84 కోలకతా: పెట్రోలు ధర రూ. రూ. 71.37, డీజిలు ధర రూ. 65.07 హైదరాబాద్: పెట్రోలు ధర రూ. 73.45, డీజిల్ ధర రూ.68.82 విజయవాడ: పెట్రోలు ధర రూ. 72.93, డీజిల్ ధర రూ.67.97 చమురు ధరల సెగతో ఈ ఏడాది ఆగస్టులో ఢిల్లీ, ముంబైలలో పెట్రోలు లీటరుకు రూ.83.22 రూపాయలు, లీటరు రూ.90.57 రూపాయలుగా నమోదయ్యాయి. అయితే గ్లోబల్‌గా మళ్లీ ముడి చమురు ధరలు భారీగా పడిపోవడంతో దేశీయంగా 20శాతం దిగి వచ్చిన ఇంధన ధరలు ఏడాదిన్నర కనిష్టాన్ని తాకాయి. అలాగే డిసెంబరు 24న ఢిల్లీలో పెట్రోధర (జనవరి తరువాత) తొలిసారిగా 70 రూపాయల దిగువకు చేరింది. -
ఏడునెలల కనిష్టానికి సెన్సెక్స్,నిఫ్టీ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లో చివరకు అమ్మకాలదే పై చేయి అయ్యింది. లాభానష్టాలమధ్య తీవ్రంగా ఊగిసలాడిన సూచీలు భారీ నష్టాలోతనే ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలసంకేతాలతో సెన్సెక్స్ 341 పాయింట్లు పతనమై 33,349కు వద్ద, నిఫ్టీ 95 పాయింట్ల నష్టంతో 10,030 వద్ద స్థిరపడింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ ఏడు నెలల కనిష్టానికి చేరాయి. అలా నవంబరు సిరీస్ నిరాశాజనకంగా స్టార్ట్అయింది. దాదాపు అన్ని రంగాలూ నష్టాల్లోనే. యస్‌బ్యాంక్ 9 శాతం పతనంకాగా.. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, యాక్సిస్, హెచ్‌సీఎల్ టెక్, గ్రాసిమ్, ఇండస్ఇండ్, టీసీఎస్, కొటక్ బ్యాంక్, జీ, ఐటీసీ 5.5-3 శాతం మధ్య నష్టాలను మూటగట్టుకున్నాయి. -
మరింత బక్కచిక్కిన రూపాయి
-
మూడు వారాల కనిష్టానికి రుపాయి
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి మళ్లీ బలహీన ధోరణికి మళ్లింది. డాలరుతో మారకంలో ఇటీవల కాస్త బలాన్ని పుంజుకున్న రూపాయ తిరిగి నష్టాల్లోకి జారుకుంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభంలోనే రూపాయి 36 పైసలు క్షీణించింది. 67.98 వద్ద రూపాయి మూడు వారాల కనిష్టాన్ని నమోదు చేసింది. ప్రారంభమైంది. దాదాపు ఇదే స్థాయిలో ట్రేడవుతోంది. కరెంట్ ఖాతాలోటు, చమురు ధరల మంటకు తోడు అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్ వడ్డీ పెంపు నేపథ్యంలో దేశీ స్టాక్స్‌లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీ అమ్మకాలకు తెరతీశారు. స్టాక్ ఎక్స్ఛేంజ్ జారీ చేసిన తాత్కాలిక డేటా ప్రకారం గురువారం విదేశీ పెట్టుబడులు (ఎఫ్‌పీఐ) లు రూ. 1,372.84 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. కాగా ఫెడ్ వడ్డీ రేటు పెంపుతో గురువారం 3 పైసలు బలపడి 67.62 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. -
టాటా మెటార్స్, జెట్ ఎయిర్వేస్కు ఫలితాల సెగ
సాక్షి, ముంబై: దేశీ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ కు ఫలితాల షాక్ తగిలింది. ఈక్విటీ మార్కెట్లు సెంచరీ లాభాలతో ఊత్సాహకరంగా సాగుతుండగా, టాటా మోటార్స్ భారీగా నష్టాలను మూటగట్టుకుంటోంది. ముఖ్యంగా గత ఏడాది క్యూ4లో నికర లాభాలు 50శాతం క్షీణించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. భారీ అమ్మకాల ఒత్తిడితో టాటా మోటార్స్ కౌంటర్ 7శాతానికి పతనమై టాప్ లూజర్‌గా నిలిచింది. 52 వారాల కనిష్టం వద్ద ఉంది. విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు ఫలితాల సెగ తాకింది. 6 శాతానికి పైగా పతనమైన జెట్‌ఎయిర్‌వేస్ షేరు 52 వారాల కనిష్టాన్ని తాకింది. గత ఆర్థిక సంవత్సరం(2017-18) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ4(జనవరి-మార్చి)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 50 శాతం క్షీణించి రూ. 2175 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం 18 శాతం పెరిగి రూ. 91,279 కోట్లను తాకింది. ఇబిటా 4 శాతం పుంజుకుని 11,250 కోట్లకు చేరింది. స్టాండెలోన్ ప్రాతిపదికన టాటా మోటార్స్ నికర నష్టం రూ. 806 కోట్ల నుంచి రూ. 500 కోట్లకు తగ్గింది. అటు జెట్ ఎయిర్‌వేస స్టాండ్‌లోన్ ప్రాతిపదికన 1030కోట్ల రూపాయల నష్టాన్నిప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం 3.44 శాతం తగ్గి రూ.6,271 కోట్ల నుంచి రూ.6,055 కోట్లకు పరిమితమైంది. -
తూత్తుకుడి విషాదం : వేదాంత షేరు ఢమాల్
సాక్షి,ముంబై: తమిళనాడులోని తూత్తుకుడిలో కాల్పుల ఉదంతంతో వేదాంత షేరు భారీ పతనాన్ని నమోదు చేసింది. వేదాంతకు చెందిన స్టెరిలైట్ కాపర్ తయారీ ప్లాంటును మూసివేయాలంటూ ప్రజలు చేపట్టిన ఆందోళన కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో 11మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో గురువారం నాటి మార్కెట్లో వేదాంతా కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. 5.5 శాతానికిపైగా క్షీణించి 10 నెలల కనిష్టాన్ని నమోదుచేసింది. జూలై 5, 2017 నాటి స్థాయికి పడిపోయింది. తమిళనాడును అట్టుడికించిన తూత్తుకూడి ఘటనపై స్టెరిలైట్ కంపెనీ సీఈవో రామనాధ్ స్పందించారు. ఈ విధ్వంసం వెనుక కరుడుగట్టిన శక్తులు ఉన్నాయని విమర్శించారు. ఈ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి పర్యావరణ కాలుష్యం సహా, ఇతర అన్ని నిబంధనలకనుగుణంగానే తాము పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంలో తదుపరి వాదనలు జూన్ 6వతేదీన ఉన్నాయని చెప్పారు. -
కొనసాగుతున్న రూపాయి పతనం
సాక్షి, ముంబై: దేశీయకరెన్సీ మరోసారి ఢమాల్ అంది. ఇటీవల భారీ పతనాన్ని నమోదు చేస్తున్న రూపాయి మంగళవారం మరింత నష్టాలతో ప్రారంభమైంది. డాలరుతో మారకంలో తాజాగా 67.78కు చేరింది. సోమవార\ం 67.50 వద్ద ముగిసింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభంలోనే 27 పైసలు(0.4 శాతం) బలహీనపడి 67.78ను తాకింది. దీంతో 16 నెలల కనిష్టానికి చేరింది. గత ఏడాది జనవరి 31, 2017 లో ఈస్థాయిని తాకింది.పుంజుకున్న డాలర్, ముడి చమురు ధరలు, ద్రవ్యోల్బణం పెరగడం రూపాయి ధరను ప్రభావితం చేసినట్టు విశ్లేషకుల అంచనా. ఏప్రిల్ నెలలో టోకు ధరల ద్రవ్యోల్బణం 4 నెలల గరిష్టానికి చేరింది. ఇది ఇలా ఉంటే పదేళ్ల అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ దాదాపు 3 శాతానికి ఎగశాయి. దీంతో ఆరు ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలరు 92.66కు బలపడింది. మరోవైపు 10 సంవత్సరాల బెంచ్‌మార్క్ బాండ్ దిగుబడి 33 నెలల కనిష్టాన్ని తాకింది. మంగళవారం 7 బేసిస్ పాయింట్లు పెరిగి 7.90 శాతానికి చేరింది. ఆగస్టు 25, 2015 నాటికంటే ఇది అత్యధికం. అటు కర్ణాటకలో బీజేపీ అది పెద్ద పార్టీ అవతరించేలా ఫలితాల సరళి కనిపిస్తోంది. కమలం దూకుడును అందిపుచ్చుకున్న దేశీ స్టాక్‌మార్కెట్లు ట్రిపుల్ సెంచరీ లాభాలతో దూసుకుపోతోంది. -
దిగి వస్తున్న పుత్తడి
ముంబై: దేశీయంగానూ, అంతర్జాతీయంగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఫ్రాన్స్ఎన్నికల్లో మార్కెట్లకు అనుకూలంగా వ్యవహరించే మాక్రెన్ తొలిరౌండ్లో విజయం సాధించటం, ఉత్తరకొరియాలో యుద్ద వాతావరణం కొంత శాంతించటం, అంతర్జాతీయ మార్కెట్లో పలు కంపెనీల ప్రోత్సాహకర ఫలితాల ప్రకటన వంటి అంశాలు డాలరు బలపడేలా చేశాయి. దీంతో పసిడి ధరలు దిగి వస్తున్నాయి. మంగళవారం నాటి ముగింపుతో పోలిస్తే పసిడిధరలు మరింత క్షీణించాయి. కామెక్స్‌లో ఔన్స్ బంగారం స్వల్ప నష్టంతో 1256 వద్ద ట్రేడవుతోంది. వెండి కూడా ఔన్స్ 16.87 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్ బలపడటంతోపాటు, ట్రెజరీ ఈల్డ్స్ పుంజుకుంటున్నాయి. మరోపక్క ఫ్యూచర్స్‌లో ట్రేడర్ల అమ్మకాల కారణంగా పసిడి ధరలు పతనమయ్యాయి. ఫలితంగా మరోసారి న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) 1,251 డాలర్ల వద్ద మూడు వారాల కనిష్టాన్ని తాకింది. ఇక అంతర్జాతీయ ప్రభావం దేశీ ప్యూచర్స్ మార్కెట్‌పై పడింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో 10 గ్రాముల బంగారం ధర బుధవారం మరింత దిగి వచ్చింది. రూ.51 రూపాయలు క్షీణించి రూ.28,531 వద్ద ట్రేడ్ అవుతోంది. అటు దుబాయ్ బంగారం కూడా బలహీనంగానే ఉంది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల సమావేశం బుధవారం ముగియనుంది. వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించనుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారానికి డిమాండ్ మరింత క్షీణించే అవకాశం ఉందని ఎనలిస్టుల అంచనా. మరోవైపు వెండి ధరలు కొద్దిగా పుంజుకున్నారు. ఇటీవల మూడునెలల కనిష్టాన్ని తాకిన సిల్వర్ ధరలు 0.4శాతం పెరిగి ఔన్స్16.87గా ఉంది. ప్లాటినం స్థిరంగాను, పల్లాడియం స్వల్ప లాభాల్లోను కొనసాగుతున్నాయి. -
మెదక్ @16 డి గ్రీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పగలు ఎండ, రాత్రి చలి పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నెలాఖరు వరకు ఇలానే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో మెదక్‌లో 16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, మహబూబ్‌నగర్, నల్లగొండల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 35 డిగ్రీల మధ్య నమోదవుతుండగా, రాత్రి ఉష్ణోగ్రతలు 16 నుంచి 22 డిగ్రీల మధ్య రికార్డవుతున్నాయి. ఖమ్మంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీల తక్కువగా నమోదయ్యాయి. అక్కడ పగలు 34 డిగ్రీలు, రాత్రి 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్‌నగర్, మెదక్, హన్మకొండల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల చొప్పున, హైదరాబాద్, నల్లగొండల్లో 2 డిగ్రీల చొప్పున తక్కువగా నమోదయ్యాయి. దీంతో రాత్రిళ్లు, తెల్లవారుజామున వాతావరణం చలిచలిగా ఉంటోంది. కొన్ని ప్రాంతాల్లో ఉదయం పూట మంచు కురుస్తోంది. మరోవైపు ఇప్పటికే ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాల్సి ఉండగా, ఆ ఊసే లేదు. నైరుతి తెలంగాణను వీడి వెళ్లినా ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతోందని, అది పూర్తిస్థాయిలో వెళ్లిపోయాక ఈశాన్య రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. -
అమ్మకాల ఒత్తిడిలో స్టాక్‌మార్కెట్లు
ముంబై: ఆర్ బీఐ వడ్డీ రేటు కోత నిర్ణయంతో దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. రెపో రేటును పావు శాతం తగ్గించడంతో జోష్ గా ప్రారంభమైన మార్కెట్లు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభంలో 150 పాయింట్లకు పైగా ఎగసిన సెన్సెక్స్ ప్రస్తుతం48 పాయింట్ల నష్టంతో 28,286 దగ్గర, నిఫ్టి 19పాయింట్ల నష్టంతో 8749 దగ్గర ట్రేడవుతున్నాయి. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 8,800 స్థాయి కిందికి దిగజారింది. ప్రపంచ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు మన మార్కెట్ సెంటిమెంటు ప్రభావితం చేస్తోందని ఎనలిస్టుల అంచనా. ప్రధానంగా ఆయిల్ అండ్ గ్యాస్, ఐటీ సెక్టార్ నష్టాల్లో ఉంది. ఈ సూచీల్లో మదుపర్ల అమ్మకాల ఒత్తిడి కొనసాగుతుండగా, మెటల్, రియల్టీ, పవర్, బ్యాంకింగ్ షేర్లు స్వల్పంగా లాభపడుతున్నాయి. అటు డాలర్ మారకపు విలువలో దేశీ కరెన్సీ 13 పైసల నష్టంతో 66.57 వద్ద, ఎంసీఎక్స్ మార్కెట్ లో 10 గ్రా. పుత్తడి 29,991 వద్ద ఉంది. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. స్వామివారి దర్శనార్థం గురువారం ఉదయం భక్తులు రెండు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటలు, కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. బుధవారం తిరుమలలో భారీ వర్షం కురవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
క్షీణిస్తున్న భూగర్భజలాలు
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో భూగర్భజల మట్టం వేగంగా అడుగంటిపోతున్నాయి. జిల్లా సగటు నీటి మట్టం 19.50 మీటర్లుగా నమోదైనా కొన్ని మండలాలు, గ్రామాల్లో పరిస్థితి దారుణంగా కనిపిస్తోంది. అమరాపురం మండలంలో 64.16 మీటర్లలో నీళ్లు కనిపించే పరిస్థితి నెలకొంది. అలాగే లేపాక్షి మండలంలో 61.88 మీటర్లు, రొద్దం 61.84 మీటర్లు, యాడికి 59.45 మీటర్లు, నల్లచెరువు 55.15 మీటర్లు, గాండ్లపెంట 51.12 మీటర్లు, గుడిబండ 45.64 మీటర్లు, బుక్కపట్టణం 43.95 మీటర్లు, తలుపుల 41.85 మీటర్లు, గుమ్మగట్ట 40.68 మీటర్లు, మడకశిర 39.62 మీటర్లు, తాడిమర్రి 38.78 మీటర్లు, హిందూపురం 37.02 మీ టర్లు, సోమందేపల్లి 36.75 మీటర్లు, పెద్దపప్పూరు 32.75 మీటర్లు, తాడిపత్రి 30.92 మీటర్లు... ఇలా చాలా ప్రాంతాల్లో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో బొమ్మనహాల్, బుక్కపట్నం, గాండ్లపెంట, గుత్తి, గోరంట్ల, గుడిబండ, గుమ్మగట్ట, కళ్యాణదుర్గం, మడకశిర, నల్లచెరువు, రొద్దం, సోమందేపల్లి, తాడిమర్రి, తాడిపత్రి, తలుపుల, తనకల్లు, యల్లనూరు మండలాల్లో నీటి నిల్వలు ఎక్కువగా పడిపోతున్నాయి. విస్తారంగా వర్షాలు పడకుంటే నీటికష్టం ఖాయంగా కనిపిస్తోంది. -
దుర్గగుడిపై రద్దీ అంతంతే
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : ఒకవైపు పవిత్ర పుష్కరాలు, చెంతనే ఉన్న దుర్గమ్మ దర్శనానికి భక్తజనం పోటెత్తుతుందని అంచనా. అయితే ఆలయ ఉన్నతాధికారుల నిర్వాకం వల్ల వేలమంది భక్తజనం అమ్మవారి దర్శనానికి రాకుండానే వెనుదిరిగారు. తొలిరోజునే భారీ గందరగోళం చోటుచేసుకుంది. శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో శుక్రవారం రద్దీ సాధారణమే. శ్రావణ మాసం రెండో శుక్రవారం, పుష్కర రద్దీ అయినప్పటికీ 50 వేల లోపే భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మరో వైపున పుష్కరాలలో 22 గంటలు అమ్మవారి దర్శనం కల్పిస్తామని చెప్పినప్పటికీ అది ఆచరణలో సాధ్య పడలేదు. గురువారం రాత్రి 9 గంటలకే అమ్మవారి దర్శనం నిలిపివేసినప్పటికీ శుక్రవారం తెల్లవారుజామున 1 గంటలకు దర్శనం కల్పించాల్సి ఉండగా , అలంకరణలో ఇబ్బందుల కారణంగా తెల్లవారుజామున 5 గంటల తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు. సర్వ దర్శనంలో క్యూలైన్లోనే భక్తుల తాకిడి కనిపించగా, శీఘ్రదర్శనం, రూ. 5 వందల దర్శనం క్యూలైన్లలో రద్దీ నామమాత్రం. బుద్ధా సొంత వాహనంలో బాలకృష్ణ ఇక వీఐపీలను దేవస్థాన వాహనాలపైనే దుర్గగుడి పైకి తీసుకువచ్చి దర్శనం అయిన తర్వాత అదే వాహనంపై సాగనంపుతామని చెప్పారు. అయితే దీనిని ఉల్లంఘిస్తూ సీఎం చంద్రబాబు బావమరిది, ఎమ్మెల్యే బాలకృష్ణను స్థానిక ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తన వాహనంపై కొండపైకి తీసుకువెళ్లడంతో టోల్గేట్ వద్ద డ్యూటీలో ఉన్న ఆర్డీఓపై దుర్గగుడి ఈవోసూర్యకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాపై ప్రతాపం మీడియా ప్రతినిధులకు పాస్‌లు లేవనే కారణంతో పోలీసు అధికారులు వారిని పైకి వెళ్లకుండా అడ్డుకున్నారు. మీడియాకు దేవస్థానం నుంచి ఎటువంటి డ్యూటీ పాస్‌లు ఇవ్వలేదని చెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదు.ఈవోకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. తొలి రోజు ఆదాయం రూ.8.38 లక్షలు పుష్కరాల తొలి రోజున దుర్గగుడికి ప్రసాదాలు, టికెట్ల విక్రయాల ద్వారా రూ. 8,38,818ల ఆదాయం సమకూరింది. వీఐపీ దర్శనం టికెట్లు కేవలం 96 మాత్రమే విక్రయించారు. ఇక 68,400 లడ్డూలను విక్రయించగా రూ. 6.84 లక్షల ఆదాయం సమకూరింది. భవానీ ప్రసాదం విక్రయాల ద్వారా రూ. 71,850ల ఆదాయం సమకూరింది. -
పాపన్నగౌడ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి
-సర్దార్‌సర్వాయి పాపన్న జైత్రయాత్ర రాష్ట్ర కన్వీనర్ రమణాగౌడ్ హత్నూర :బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాటం చేసిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పాపన్న గౌడ్ జైత్రయాత్ర రాష్ట్ర కన్వీనర్ వీవీ రమణాగౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం హత్నూర మండలం దౌల్తాబాద్‌కు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జైత్రయాత్ర బస్సుచేరుకుంది. మండల గౌడసంఘం నాయకులు దుర్గంగౌడ్, ధునుంజయ్యగౌడ్, గౌడసంఘం నాయకులు జైత్రయాత్ర బస్సుకు స్వాగతం పలికారు. తెలంగాణతల్లి, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసిన అనంతరం రమణాగౌడ్ మాట్లాడుతూ ఈనెల18న జరిగే సర్దార్ సర్వాయిపాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. ఈనెల1న పాపన్న జన్మస్థలమైన వరంగల్జిల్లా కిలాషాపురం నుంచి బస్సుయాత్ర ప్రారంభమై గ్రామగ్రామాన తిరుగుతూ సభలు, సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి గ్రామంలో పాపన్నగౌడ్ విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలన్నారు. ఈనెల18న పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ట్యాంక్‌బండ్, అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వమే పాపన్న విగ్రహాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గౌడసంఘం రాష్ట్ర నాయకులు బాల్‌రాజ్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, రమేష్‌గౌడ్, నర్సయ్యగౌడ్, వెంకటేశ్వర్‌గౌడ్, దుర్గంగౌడ్, రాజాగౌడ్, లక్ష్మణ్‌గౌడ్, మండల నాయకులు యాదగిరిగౌడ్, రామస్వామిగౌడ్, స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. 08ఎన్ఆర్ఎస్ః41 దౌల్తాబాద్‌లో తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాలలు వేస్తున్న గౌడసంఘం నాయకులు 08ఎన్ఆర్ఎస్ః41ఎః నాయకులకు స్వాగతం పలుకుతున్న గౌడసంఘం నాయకులు -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీనివాసుని దర్శనానికి గురువారం ఉదయం భక్తులు మూడు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుండగా.. కాలినడక భక్తులకు మూడు గంటల సమయం పడుతోంది. -
కొనేవారే కరువయ్యారు!
వేలకోట్ల రుణాలను ఉద్దేశ్యపూర్వకంగా ఎగ్గొట్టి, విదేశాలకు పారిపోయిన వ్యాపార వేత్త.. విజయ్ మాల్యాకు చెందిన ఆస్తుల అమ్మకానికి సైతం నానా తిప్పలూ పడాల్సివస్తోంది. భారత బ్యాంకులను సుమారు 9000 కోట్ల రుణం తీసుకొని మోసగించి, మాల్యా విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు సంబంధించి ఆస్తులను కొనేందుకూ ఎవ్వరూ ముందుకు రావడం లేదు. తాజాగా ఆయన కంపెనీకి చెందిన జెట్ విమానం వేలానికి పెట్టగా కనీస ధర కూడ పలకకపోవడంతో వేలం నిలిపివేయాల్సి వచ్చింది. లిక్కర్ కింగ్ విజయమాల్యా ఆస్తుల వేలంలో మరోసారి నిరాశ ఎదురైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏవియేషన్ సపోర్ట్ కంపెనీ.. అల్నా ఏరో డిస్ట్రిబ్యూషన్ వేసిన బిడ్ ను సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ రిజెక్ట్ చేసింది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ లిమిటెడ్ ఛైర్మన్ విజయమాల్యాకు చెందిన లగ్జరీ జెట్ విమానం.. వేలానికి పెడితే కనీస ధర 150 కోట్లు వస్తుందని అంచనా వేసిన కంపెనీకి నిరాశే మిగింలింది. బిడ్ కేవలం 1.09 కోట్ల రూపాయల అతి తక్కువ ధర రావడంతో ట్యాక్స్ అధికారులు అమ్మకానికి నిరాకరించారు. కనీస ధర కూడ పలకకపోవడంతో వేలాన్ని నిలిపివేశారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఏడుకొండల వాడి దర్శనానికి ప్రస్తుతం 6 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటలు, కాలినడక భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. గురువారం 71,079 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమల శ్రీవారి సన్నిధిలో రద్దీ బాగా తగ్గుముఖం పట్టింది. గురువారం ఉదయానికి రెండు కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం రెండు గంటల్లోనే పూర్తవుతోంది. అలాగే, కాలినడక భక్తులకు రెండు గంటల్లో దర్శన భాగ్యం లభిస్తోంది. -
ఛార్జింగ్ కూడా షేర్ చేయొచ్చు!
యాండ్రాయిడ్ ఫోన్ల ప్రపంచం విస్తరించింది. ప్రతి మనిషికీ ఫోన్ అత్యవసర వస్తువుగా మారిపోయింది. కమ్యూనికేషన్ వ్యవస్థను వినియోగించుకోవడంలో జనం ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతున్నారు. ఫోన్ కాల్స్ మాట్లాడటమే కాక వాయిస్ మెసేజిలు పంపడంతో పాటు ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకుంటున్నారు. అంతేకాదు ఫోన్ బ్యాలెన్స్‌ను కూడా షేర్ చేసుకుంటున్నారు. అయితే టెక్స్ట్, ఫొటోలు, వీడియోలతో పాటు.. తాజాగా ఫోన్ ఛార్జింగ్ ను సైతం షేర్ చేసుకునే అవకాశాన్ని లండన్ పరిశోధకులు అందుబాటులోకి తేనున్నారు. అత్యవసర సమయాల్లో ఫోన్లలో ఛార్జింగ్ అయిపోతే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఇకముందు ఉండవట. ఫోన్ చార్జింగ్ ను షేర్ చేసుకునే వ్యవస్థను త్వరలో అందుబాటులోకి తేనున్నారు. ఫోన్ లో పూర్తిగా ఛార్జింగ్ అయిపోయినపుడు ఇతరుల ఫోన్ నుంచి ఎటువంటి వైర్, కేబుల్ అవసరం లేకుండా పవర్ షేర్ చేసుకునే విధానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. పవర్ షేక్ పేరుతో లండన్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి పరుస్తున్న కొత్త వైర్ లెస్ టెక్నాలజీని త్వరలో అందరికీ అందుబాటులోకి తేనున్నారు. పవర్ ట్రాన్స్ మిట్ కాయిల్స్ ద్వారా ఒక మొబైట్ ఫోన్ నుంచి మరో మొబైల్ ఫోన్ కు కరెంట్ ప్రసరింపజేసే కొత్త విధానాన్ని కనుగొన్నారు. ఫోన్ పక్కనే మరో ఫోన్ ఉంచి 12 సెకన్లపాటు షేర్ చేసిన పవర్.. ఒక నిమిషం పాటు కాల్ మాట్లాడేందుకు వినియోగిస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. -
భారత్ లో లగ్జరీ రైళ్ళకు కష్టకాలం!
భారత్ లో లగ్జరీ, సూపర్ లగ్జరీ ట్రైన్లకు కష్టకాలం ఏర్పడింది. రాజభోగాల్లాంటి అత్యంత విలాసవంతమైన సౌకర్యాలతో పలు రాష్ట్రాల్లో తిరుగుతున్న నాలుగు ట్రైన్లకు ఇక కాలం చెల్లనుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పర్యాటక ప్రియులకోసం ఇండియన్ రైల్వే, టూరిజం కార్పొరేషన్ ప్రారంభించిన ప్రఖ్యాత ట్రైన్లలో ప్రముఖమైన 'ప్యాలస్ ఆన్ వీల్స్' గతవారం తొలిసారిగా చక్రాలు నిలిచిపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ప్రారంభించిన 34 ఏళ్ళలో ఎప్పుడూ ఆగని ఈ ట్రైన్.. ప్రయాణీకులు లేని కారణంతో నిలిచిపోవడం ఇప్పుడు లగ్జరీ ట్రైన్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. విలాసవంతమైన సౌకర్యాలకు అనుగుణంగానే లగ్జరీ ట్రైన్లలో ఉండే ఛార్జీలు కూడ సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. దీంతో ప్రస్తుతం దేశంలో తిరుగుతున్న నాలుగు లగ్జరీ, సూపర్ లగ్జరీ ట్రైన్లు ప్రయాణికుల్లేక బోసిపోతున్నాయి. ఈ పరిస్థితిపై ఆయా రాష్ట్రాల పర్యాటక శాఖలు తలలు పట్టుకుంటున్నాయి. భవిష్యత్తు ఏమిటోనన్న అయోమయ స్థితిలో పడ్డాయి. ఇండియన్ రైల్వే మొదటిసారి ప్రవేశ పెట్టిన ప్రఖ్యాత లగ్జరీ ట్రైన్ 'ప్యాలెస్ ఆన్ వీల్స్' సహా మరో మూడు లగ్జరీ ట్రైన్లు... ప్రస్తుతం తక్కువ ఆక్యుపెన్సీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నాయి. కేవలం 18 బుకింగ్స్ మాత్రమే జరగడంతో గతవారం ప్యాలెస్ ఆన్ వీల్స్ ను మొదటిసారి నిలిపివేశారు. అలాగే రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్ కూడ పీక్ టూరిస్టు సీజన్ అయిన గత డిసెంబర్ లో బుకింగ్స్ లేక రెండు ట్రిప్ లు నిలిపివేసినట్లు తెలుస్తోంది. 2014-15 లో 35 నుంచి 40 శాతం, అంతకు ముందు 2011-12 లో ఇంకా 60 శాతం వరకూ ప్రయాణీకుల సంఖ్య తగ్గి, ఆక్యుపెన్సీ సమస్య ఏర్పడటంతో అప్పట్లో కొన్ని ట్రిప్పులను కూడ కుదించేశారు. వాయువ్య, మధ్య భారతదేశంలోని 12 ప్రాంతాలను కవర్ చేసే అత్యంత విలాసవంతమైన మహారాజా ఎక్స్ ప్రెస్ లో మాత్రమే గత ఐదేళ్ళలో 15 శాతం వరకూ ప్రయాణీకుల స్థిరమైన పెరుగుదల కనిపించింది. 2011 నుంచి ఇప్పటివరకూ ఈ మహారాజా ఎక్స్ ప్రెస్ అనేక ట్రావెల్ అవార్డులను కూడా గెలుచుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ, సూపర్ రిచ్ ప్రాధాన్యతలున్న జాబితాలో మాహారాజా ఎక్స్ ప్రెస్ నాల్గవ స్థానంలో కూడ నిలిచింది. అలాగే లాటిన్ అమెరికాలో ఈ ఎక్స్ ప్రెస్ ను నడపాలంటూ మెక్సికో కూడ అభ్యర్థించింది. అత్యంత సంపన్నులైన వారికి అనువుగా.. ఖరీదైన, విలాసవంతమైన ఐదు రైళ్ళను అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునే ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టారు. ఒక్కరాత్రి ప్రయాణానికి ఒక్కో వ్యక్తికి ఈ లగ్జరీ ట్రైన్లలో మార్గం, సీజన్, రైలును బట్టి ఒక్కో వ్యక్తికి సుమారు 500 డాలర్లు, అంటే సుమారు 30 వేల రూపాయల నుంచి 1800 డాలర్లు అంటే సుమారు లక్ష రూపాలకు పైగా ఛార్జీలు ఉంటాయి. దేశంలోని మొత్తం ఐదు లగ్జరీ ట్రైన్లలో తొలి లగ్జరీ ట్రైన్... ప్యాలెస్ అన్ ది వీల్స్ ను మూడు దశాబ్దాలక్రితం రాజస్థాన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఆర్టీడీసీ) ప్రారంభించింది. తర్వాత రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్ ను కూడ ప్రారంభించిన ఆర్టీడీసీ.. ఇంచుమించు రెండు రైళ్ళనూ ఢిల్లీ నుంచి ప్రారంభమై రాజస్థాన్, ఆగ్రాలను కవర్ చేసేట్లు ఒకే మార్గంలో నడుపుతోంది. ఆ తర్వాత మహరాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ బోర్డ్ ప్రారంభించిన డెక్కన్ ఒడిస్సీ... మహరాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ లను కవర్ చేస్తుంది. కర్నాటక స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కర్నాటక నుంచి గోవా వరకూ నడిపే 'గోల్డెన్ ఛరియట్'.. దక్షిణ ప్రాంతంలో నడిచే ఒకేఒక్క లగ్జరీ ట్రైన్ గా చెప్పాలి. ఈ మొత్తం అన్ని లగ్జరీ ట్రైన్లలోనూ సెంట్రల్ ఎయిర్ కండిషన్, ఇంటర్ కమ్, టీవీ, వైఫై, కాన్ఫరెన్సింగ్ సౌకర్యాలతోపాటు... పాంట్రీ, లాంజ్, మ్యూజిక్, మనీ ఎక్సేంజ్ క్రెడిట్ కార్డ్ సౌకర్యాలు కూడా ఉంటాయి. అంతేకాక పర్యాటకులకు అనువుగా కాన్ఫరెన్సింగ్ సౌకర్యం, దేశీయ ప్రత్యేక వంటకాలను వడ్డించే ప్ర్తత్యేక రెస్టారెంట్లు, బార్లు తో పాటు ఎప్పటికప్పుడు ప్రయాణీకులకు అందుబాటులో అటెండెంట్స్ కూడ ఉంటారు. ప్రత్యేక అలంకరణతో ఆకట్టుకునే ఈ లగ్జరీ రైళ్ళు.. సుమారు 14 నుంచి 19 బోగీలను కలిగి ప్రయాణీకులకు భారత రాచరిక మర్యాదలతో ఎర్రతివాచీ స్వాగతం పలుకుతాయి. అయితే తాజాగా విదేశీయులు, ఎన్నారైలు వారి దేశాలనుంచే క్రెడిట్, డెబిట్ కార్డులతో ఐఆర్ సీటీసీ ద్వారా టికెట్లను కొనుగోలు చేసే సౌకర్యాన్ని కల్పించిన భారత రైల్వే... లగ్జరీ ట్రైన్ల ఆక్యుపెన్సీ సమస్య తీర్చేందుకు ఇకపై ఎటువంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాలి. -
తగ్గుముఖం పడుతున్న చలి
-
చంపేస్తోన్న ’చలి’ పులి
-
అమ్మకాల ఒత్తిడితో కుదేలయిన మార్కెట్లు
ముంబై: అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల ప్రభావంతో గతకొన్ని రోజులుగా నష్టాల్లో కొనసాగుతున్న మార్కెట్లు బుధవారం మరింత పతనమయ్యాయి దాదాపు 400 పాయింట్లకు పైగా నష్టపోయిన దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మంగళవారం లాభాలతో ముగిసిన సెన్సెక్స్ 396 పాయింట్ల నష్టంతో 24,326 దగ్గర, నిఫ్టీ 117 పాయింట్ల నష్టంతో 7,318 దగ్గర ట్రేడవుతున్నాయి. ఇన్వెస్టర్ల భారీగా అమ్మకాలకు పాల్పడుతుండటంతో అన్నిప్రధాన రంగా షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా బ్యాకింగ్ మెటల్, రియాల్టీ, ఆయిల్ రంగ షేర్లు భారీ పతనం దిశగా సాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర భారీగా తగ్గడంతో చమురు కంపెనీల నష్టాలు భారీగా పేరుకు పోయాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత వాతావరణం నేపథ్యంలో భారత ఈక్విటీ మార్కెట్లు కూడా నష్టాలను చవి చూస్తున్నాయి. నెమ్మదించిన చైనా ఆర్థికరంగం, ఆయిల్ రంగంలో నెలకొన్న సంక్షోభం, ఇటీవలి డాలర్ పతనం భారత మార్కెట్లను ప్రభావితం చేస్తోందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. చమురు ధరలు చైనా మందగమనం, కరెన్సీ తదితర కీలక అంశాలు పెట్టుబడిదారులు ఆందోళనకు గురి చేస్తున్నాయంటున్నారు. అయితే అమెరికా, ఐరోపా దేశాలనుంచి మార్కెట్లనుంచి కొన్ని సానుకూల సంకేతాలు అందితే మిగిలిన అన్ని మార్కెట్లు నిలదొక్కుకునేందుకు అవకాశం ఉందంటున్నారు. ఈ పతనాన్ని దీర్ఘకాలిక మదుపరులు అవకాశంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కరెన్సీలతో పోలిస్తే భారతదేశం మెరుగ్గా ఉందని భావిస్తున్నారు.అటు డాలర్ తో పోలిస్తే భారత కరెన్సీ రూపాయి మరింత దిగజారింది. 30 పైసలు నష్టపోయి 67.95 దగ్గర ఉంది. దాదాపు రెండున్నర సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయింది. అటు మరోవైపు ఈక్విటీ మార్కెట్ల పతనంతో బంగారం, వెండి ధరలు లాభాల్లో కొనసాగుతున్నాయి. -
మార్కులు తక్కువ వచ్చాయని..
-
మార్కులు తక్కువ వచ్చాయని..
విద్యార్థిని చితక్కొట్టిన ఉపాధ్యాయుడు రాజాం: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు అందుకు భిన్నంగా వ్యవహరించారు. మార్కులు తక్కువగా వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ విద్యార్థిని చితక్కొట్టాడు. ఈ సంఘటన రాజాంలో శుక్రవారం ఉదయం పది గంటల సమయంలో చోటుచేసుకుంది. ఎల్ఐసీ కార్యాలయం వెనుక నివసిస్తున్న గుల్లల రాజ్‌కుమార్ సారధి రోడ్డులో ఉన్న ఓ కాన్వెంట్లో పదో తరగతి చదువుతున్నాడు. వారం రోజుల క్రితం నిర్వహించిన యూనిట్ పరీక్ష ఫిజిక్స్ సబ్జెక్టులో 25కు 14 మార్కులు వచ్చాయి. దీంతో ఈ సబెక్టు బోధించే ఉపాధ్యాయుడికి కోపం వచ్చింది. రాజ్‌కుమార్‌ను ఒల్లంతా తట్టులు తేరేలా కర్రతో కొట్టారు. తండ్రి మృతి చెందడం, తల్లి ఇంటికే పరిమితం కావడంతో విషయాన్ని సాయంత్రం తమ బంధువులకు చెప్పాడు. వారుసంబంధిత ఉపాధ్యాయుడిని ఫోన్లో సంప్రదించగా దిక్కున్నచోట చెప్పుకోమన్నారని విద్యార్థి, అతని బంధువులు ఆరోపించారు. కాగా దెబ్బలు తిన్న రాజ్‌కుమార్‌ను బంధువులు స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేర్పించగా వైద్యుడు కరణం హరిబాబునాయుడు చికిత్సనందించి పోలీసులకు సమాచారం అందించారు. -
మరింత తగ్గిన బంగారం
-
నిరుటి కంటే తక్కువే..!
హైదరాబాద్: ఆశల పల్లకి నుంచి ఆచరణాత్మక బడ్జెట్ దిశగా తెలంగాణ సర్కారు కొత్త పంథాకు శ్రీకారం చుడుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఆదర్శంగా చేసుకొని.. ఈసారి కొత్త బడ్జెట్ రూపకల్పనకు మొగ్గు చూపుతోంది. వృద్ధి రేటు, అభివృద్ధిని పక్కనబెట్టి వాస్తవాలను ప్రతిబింబించే విధంగా 2015-16 బడ్జెట్‌ను తయారు చేసింది. ఈ నెల 11న ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ అందరి దృష్టినీ ఆకర్షించనుంది. పూర్తిస్థాయి బడ్జెట్ కావటంతో ఎంత మొత్తం కేటాయింపులుంటాయి..? తొలి బడ్జెట్ రూ.లక్షా 637 కోట్లతో ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఈసారి అంతకుమించి భారీ బడ్జెట్ ప్రవేశపెడుతుందా.. లేదా కొంత వెనక్కు తగ్గుతుందా..? అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం గత నవంబర్ లో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. లక్షకోట్ల పైచిలుకు బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం అం చనాలన్నీ ఆచరణలో తలకిందుల య్యాయి. ఆశించినంత రెవెన్యూ రాబడి లేకపోవటం.. కేంద్రం నుంచీ పెద్దగా నిధులు రాకపోవటం తో సర్కారు ఇరకాటంలో పడింది. ఫిబ్రవరి వరకు ఉన్న ఆదాయ వ్యయాల అంచనాలను విశ్లేషిస్తే 2014-15 బడ్జెట్లో దాదాపు రూ. 40 వేల కోట్ల కోత తప్పని పరిస్థితి తలెత్తింది. అందుకే ఈ ఏడాది ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్‌ను సమగ్రంగా రూపొందించాలని.. వాస్తవాల ఆధారంగా మంచి చెడులను ప్రజ లకు విడమర్చి చెప్పాలని.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, మంత్రి ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో గతంలోలా పెద్ద మొత్తంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాల్లేవని తెలుస్తోంది. ఆశించిన స్థాయిలో రాని ఆదాయం నవంబర్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ నాటి నుంచి నేటివరకు ప్రభుత్వానికి ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదు. రూ.80,090 కోట్ల రెవె న్యూ ఆదాయం లభిస్తుందని భావించింది. ఫిబ్రవరి ఒకటి నాటికి కేవలంరూ.30,187కోట్ల ఆదాయమే వచ్చింది. రెండోవారానికి ఈ ఆదాయం రూ.33 వేల కోట్లకు పెరిగినప్పటికీ ఖజానాకు పెద్దగా ఒరి గిందేమీ లేదు. దీంతో ఆర్థిక లోటు రూ.47 వేల కోట్లకు చేరినట్లు స్పష్టమవుతోంది. మార్చి మొదటివారంలోనూ ఇంచుమించుగా ఈ లోటు రూ.40 వేల కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో.. గతంలో నేల విడిచి సాము చేసిన సర్కారు ఇప్పుడు దిగొచ్చింది. తగ్గిన కేంద్ర నిధులు కేంద్ర ప్రభుత్వ పన్నులు, గ్రాంట్ల రూపంలో రాష్ట్రానికి రావాల్సిన రూ.14 వేల కోట్ల నిధుల్లో ఇప్పటి వరకు రూ. 8,768 కోట్లే వచ్చాయి. మిగతా రూ.6 వేలకోట్లకు పైగా నిధులపై కేంద్రం నోరు మెదపటం లేదు. పదమూడో ఆర్థిక సంఘం నిధుల్లోనూ భారీ కోతలే పడ్డాయి. విభజనానంతరం ఆర్థిక సంఘం నుంచి తెలంగాణ వాటాగా రూ.3 వేల కోట్లు రావాల్సి ఉండగా.. వెయ్యి కోట్లే వచ్చాయి. భూముల అమ్మకం ద్వారా వస్తాయని భావిం చిన రూ.6,500 కోట్లలో రూ.66 కోట్లే వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత బడ్జెట్ గతం కంటే తక్కువగా ఉండే అవకాశాలున్నాయని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొత్త పథకాలు ఉండనట్టే! తొలి బడ్జెట్‌ను పరిశీలిస్తే పది నెలల కాలానికి రూ.లక్షా 637 కోట్లు కేటాయించారు. ఈ ప్రకారంగా చూస్తే ప్రస్తుత బడ్జెట్ రూ.లక్షా 20 కోట్లు దాటాలి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితేం కనిపిం చడం లేదు. ‘గతంలో ప్రవేశపెట్టింది తొలి బడ్జెట్. ఉద్యమ సమయంలోనూ ఆ తర్వాత సీఎం కేసీఆర్ అంచనాలకు మించి హామీలి చ్చారు. వాటిని అమలు చేయాలన్నా.. జనం లో ఆత్మస్థైర్యం నింపాలన్నా.. ప్రజల ఆకాం క్ష ల మేరకు భారీ బడ్జెట్ ప్రవేశపెట్టడం తప్పనిసరైంది. ఇప్పుడు వాస్తవ పరిస్థితి అర్థమైంది. అందుకే కొంత వెనుకడుగు వేయక తప్పదు..’ అని ఆర్థికశాఖ వర్గాలు తమ అభిప్రాయం వ్య క్తం చేశాయి. కొత్త పథకాల జోలికి వెళ్లకుండా.. ఉన్నవాటికే నిధులు కేటాయించాలనేది సర్కారు ఆలోచనగా కనిపిస్తోంది. ఉన్నవాటికే ప్రాధాన్యం కేజీ టు పీజీ పథకాన్ని కొత్త ఆర్థిక సంవత్సరం లో ప్రారంభించాలని.. దీన్ని అమలు చేసేం దుకు మండల స్థాయిలో ప్రస్తుతమున్న రెసిడెన్షియల్ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, జ్యోతి రావు పూలే పాఠశాలలన్నీ ఒకే గొడుగు కిందకు తెచ్చే ప్రతిపాదనల్ని పరిశీలిస్తోంది. డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకా నికి చోటు కల్పించే అవకాశముంది. అమల్లో ఉన్న పది పథకాలను ఈసారి బడ్జెట్లో మరిం త ఫోకస్ చేయాలని నిర్ణయించింది. హరితహారం, కొత్త రోడ్ల నిర్మా ణం, మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ, వాటర్‌గ్రిడ్, ఇరిగేషన్, వ్యవసాయం, విద్యు త్తు, భూముల కొనుగో లు, హాస్టళ్లకు సన్నబి య్యం, అంగన్వాడీలకు అదనపు పౌష్టికాహారం, కల్యాణలక్ష్మి పథకాలకు అత్యంత ప్రాధాన్యమివ్వనుంది. ఉచిత విద్యుత్తుకు ఇచ్చే సబ్సిడీకి, విద్యుత్తు సమస్యను అధిగమిం చేందుకు నిర్మించ తలపెట్టిన కొత్త ప్లాంట్లను వేగవంతం చేసేందుకు ఈసారి బడ్జెట్లో అదనంగా నిధులు కేటాయించే అవకాశముంది. -
కూరగాయలు కొనలేం!