సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి డాలరు మారకంలో మరోసారి కుదేలైంది. మంగళవారం 78.59 వద్ద తొలుత రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. అంతకుముందు నాలుగు ట్రేడింగ్ సెషన్‌లలో ప్రతి ఒక్కటి రికార్డు స్థాయిలో ముగిసిన రూపాయి తాజాగా 78.74 వద్ద సరికొత్త ఆల్ టైమ్ ఇంట్రా-డే కనిష్ట స్థాయికి పడిపోయింది.
ఆర్థిక మందగమన భయాలు, అంతర్జాతీయ మార్కెట్లు, చమురు ధరలు, ఎఫ్‌ఐఐల నిరంత అమ్మకాల కారణంగా ఇటీవల ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి జారిపోతున్న రూపాయి అమెరికా డాలర్‌తో పోలిస్తే 78.53 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. అనంతరం మరింత క్షీణించి 51 పైసల నష్టంతో 78.74 స్థాయికి చేరింది. మునుపటి సెషన్‌లో రూపాయి నాలుగు పైసలు క్షీణించి 78.37 వద్ద రికార్డు ముగింపును నమోదు చేసింది.
మరోవైపు దేశీయ మార్కెట్లలో ఎఫ్‌ఐఐల (ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు) నిరంతర విక్రయాలు కూడా రూపాయిపై ఒత్తిడిని పెంచుతున్నాయని మెహతా ఈక్విటీస్ కమోడిటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలంత్రి తెలిపారు. రష్యాపై మరిన్ని ఆర్థిక ఆంక్షలు ప్రపంచ ఇంధన ధరలకు ఊతమిస్తాయని, దీంతో అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కరెన్సీలపై ఒత్తడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా మంగళవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment