సాక్షి, ముంబై: దేశీయకరెన్సీ మరోసారి ఢమాల్ అంది. ఇటీవల భారీ పతనాన్ని నమోదు చేస్తున్న రూపాయి మంగళవారం మరింత నష్టాలతో ప్రారంభమైంది. డాలరుతో మారకంలో తాజాగా 67.78కు చేరింది. సోమవార\ం 67.50 వద్ద ముగిసింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభంలోనే 27 పైసలు(0.4 శాతం) బలహీనపడి 67.78ను తాకింది. దీంతో 16 నెలల కనిష్టానికి చేరింది. గత ఏడాది జనవరి 31, 2017 లో ఈస్థాయిని తాకింది.పుంజుకున్న డాలర్, ముడి చమురు ధరలు, ద్రవ్యోల్బణం పెరగడం రూపాయి ధరను ప్రభావితం చేసినట్టు విశ్లేషకుల అంచనా. ఏప్రిల్ నెలలో టోకు ధరల ద్రవ్యోల్బణం 4 నెలల గరిష్టానికి చేరింది. ఇది ఇలా ఉంటే పదేళ్ల అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ దాదాపు 3 శాతానికి ఎగశాయి. దీంతో ఆరు ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలరు 92.66కు బలపడింది. మరోవైపు 10 సంవత్సరాల బెంచ్‌మార్క్ బాండ్ దిగుబడి 33 నెలల కనిష్టాన్ని తాకింది. మంగళవారం 7 బేసిస్ పాయింట్లు పెరిగి 7.90 శాతానికి చేరింది. ఆగస్టు 25, 2015 నాటికంటే ఇది అత్యధికం.
అటు కర్ణాటకలో బీజేపీ అది పెద్ద పార్టీ అవతరించేలా ఫలితాల సరళి కనిపిస్తోంది. కమలం దూకుడును అందిపుచ్చుకున్న దేశీ స్టాక్‌మార్కెట్లు ట్రిపుల్ సెంచరీ లాభాలతో దూసుకుపోతోంది.
Comments
Please login to add a commentAdd a comment