![India Manufacturing Sector Activity Eases To 9 month Low In June - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/2/manufacturing%20growth.jpg.webp?itok=dlBH2WYl)
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం క్రియాశీలత జూన్‌లో మందగించింది. ఎస్‌అండ్‌పీ గ్లోబల్ ఇండియా మ్యాను ఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 53.9గా నమోదయ్యింది. గడచిన తొమ్మిది నెలల్లో ఈ స్థాయి తక్కువ స్థాయి నమోదుకావడం ఇదే తొలిసారి.
మే నెల్లో పీఎంఐ 54.6 వద్ద ఉంది. సూచీ 50పైన ఉంటే వృద్ధిగా ఆ లోపునకు పడిపోతే క్షీణతగా పరిగణించే సంగతి తెలిసిందే. వస్తువుల ధరల తీవ్రత నేపథ్యంలో ఉత్పత్తి, అమ్మకాల స్పీడ్ తగ్గిందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ మార్కెట్ ఇంటిలిజెన్స్‌లో ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. అన్ని విభాగాలపై ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు ఉన్నట్లు ఆమె తెలిపారు. వ్యాపార విశ్వాసం 27 నెలల కనిష్టానికి పడిపోయింది. కాగా, ఉపాధి అవకాశాలు మాత్రం వరుసగా నాలుగవ నెలలోనూ మెరుగుపడ్డం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment