ఫిబ్రవరిలో 56.9కి సూచీ
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం ఫిబ్రవరిలో మంచి ఫలితాన్ని నమోదుచేసుకుంది. హెచ్‌ఎస్‌బీసీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 56.9కి ఎగసింది. ఇది ఐదు నెలలు గరిష్ట స్థాయి. జనవరిలో సూచీ 56.5గా నమోదయ్యింది. సమీక్షా నెల్లో సూచీకి దేశీయ, అంతర్జాతీయ డిమాండ్ సహకారం లభించినట్లు ఈ మేరకు వెలువడిన ఒక నెలవారీ సర్వే పేర్కొంది.
కాగా, ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆలోపునకు పడిపోతేనే క్షీణతగా పరిగణించడం జరుగుతుంది. ద్రవ్యోల్బణం 2023 జూలై కనిష్ట స్థాయికి తగ్గడంతో తయారీ సంస్థల మార్జిన్లు మెరుగుపడినట్లు సర్వే పేర్కొనడం గమనార్హం. దాదాపు 400 మంది తయారీదారుల ప్యానెల్‌లో కొనుగోలు చేసే మేనేజర్‌లకు పంపిన ప్రశ్నలు, ప్రతిస్పందనలను ఎస్‌అండ్‌పీ గ్లోబల్ మదింపుచేసే హెచ్‌ఎస్‌బీసీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పీఎంఐని ఆవిష్కరిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment