ఇంట్లో, బయటా, ఆఫీసులో, మరో చోట.. ఎక్కడైనా ఎవరో ఒకరిని కలుస్తూ ఉంటాం. కొందరు మనకన్నా పొడుగ్గా ఉంటే.. మరికొందరు పొట్టిగా ఉంటుంటారు. ఇది సాధారణమే. కానీ కొన్ని ప్రాంతాల్లో వారు బాగా పొట్టిగా, మరికొన్ని ప్రాంతాల్లో వారు బాగా పొడుగ్గా ఉంటుంటారు. వారిలో తరాలుగా వస్తున్న జన్యువులకుతోడు స్థానిక వాతావరణం, ఉష్ణోగ్రతలు, జీవన విధానం, పని పరిస్థితులు, వైద్యారోగ్య సౌకర్యాలు, పోషకాహారం వంటివి మనుషుల ఎత్తులో తేడాలకు కారణమవుతుంటాయి.
ఈ నేపథ్యంలోనే ఇన్‌సైడర్ సంస్థ ప్రపంచంలో ఎత్తు తక్కువ జనాభా ఉన్న 25 దేశాలతో నివేదికను రూపొందించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆయా దేశాల ఆరోగ్యశాఖలు, వివిధ సర్వేలు, అధ్యయనాలను పరిశీలించి.. దీనిని సిద్ధం చేసింది. ఆయా దేశాల్లో బాగా పొడవుగా ఉన్నవారు కూడా ఉండొచ్చని, తాము సగటు ఎత్తును ప్రామాణికంగా తీసుకున్నామని తెలిపింది.
- ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను పరిశీలిస్తే.. దక్షిణాసియా, మధ్య ఆఫ్రికా దేశాల్లో జనంఎత్తు తక్కువగా ఉన్నారని నివేదిక పేర్కొంది.
- దాదాపు అన్ని దేశాల్లో కూడా మహిళల కంటే పురుషుల ఎత్తు ఎక్కువని తెలిపింది.
- ప్రపంచంలో అత్యధికంగా నెదర్లాండ్స్ దేశస్తుల సగటు ఎత్తు 175.62 సెంటీమీటర్లుకాగా.. అమెరికాలో 172.21, చైనాలో 161.45 సెంటీమీటర్లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment