రోజుకు రోజుకు దిగి వస్తున్న పసిడి ధరలు కొనుగోలు దారులను ఊరిస్తున్నాయి. అమెరికా ఫెడ్ రేట్ పెంపు ఆందోళన గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఈప్రభావం బంగారం ధరలపై కూడా చూపిస్తోంది. ముఖ్యంగా జూలై నెలలో బంగారం ధరలు కూడా దిగి వస్తున్నప్పటికీ భారీ ఒడిదుడుకులు మధ్య కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బలహీనమైన ట్రెండ్ కారణంగా దేశీ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
అయితే జూన్ నెలలో బంగారం ధరలు ఏకంగా 3.3 శాతం మేర తగ్గాయి. బంగారం ధరలు జూలై నెల తొలి వారాన్ని పెరుగుదలను నమోదు చేశాయి. శుక్రవారంతో ముగిసిన మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఆగస్టు గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ 10 గ్రా. రూ.392 ఎగిసింది. అయితే ఎంసీఎక్స్‌లో బంగారం ధర దాదాపు రూ. 58,350 వద్ద మూడు నెలల కనిష్టానికి చేరిన తర్వాత మాత్రమే ఈ ర్యాలీ వచ్చింది. ధరల తగ్గుదల ఆగి పోయిందని భావిస్తున్నప్పటికీ రానున్న కాలంలో ఏ మాత్రం తగ్గినా ఈ అవకాశాన్ని మిస్ కాకుండా కొనుగోళ్లకు ఉపయోగించు కోవాలని సూచిస్తున్నారు.
అమెరికా జాబ్ డేటా ,అమెరికా డాలర్‌పై కూడా ఒత్తిడి తదితర అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర రూ.400పెరిగి రూ. 54550 వద్ద ఉంది. అటు 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రా. రూ. 59510 వద్ద ఉంది. అలాగే వెండి ధర కిలో వెయ్యి రూపాయలు ఎగిసి హైదరాబాద్‌లో రూ. 76700 పలుకుతోంది.
Comments
Please login to add a commentAdd a comment