సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి మళ్లీ బలహీన ధోరణికి మళ్లింది. డాలరుతో మారకంలో ఇటీవల కాస్త బలాన్ని పుంజుకున్న రూపాయ తిరిగి నష్టాల్లోకి జారుకుంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభంలోనే రూపాయి 36 పైసలు క్షీణించింది. 67.98 వద్ద రూపాయి మూడు వారాల కనిష్టాన్ని నమోదు చేసింది.
ప్రారంభమైంది. దాదాపు ఇదే స్థాయిలో ట్రేడవుతోంది.
కరెంట్ ఖాతాలోటు, చమురు ధరల మంటకు తోడు అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్ వడ్డీ పెంపు నేపథ్యంలో దేశీ స్టాక్స్‌లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీ అమ్మకాలకు తెరతీశారు. స్టాక్ ఎక్స్ఛేంజ్ జారీ చేసిన తాత్కాలిక డేటా ప్రకారం గురువారం విదేశీ పెట్టుబడులు (ఎఫ్‌పీఐ) లు రూ. 1,372.84 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. కాగా ఫెడ్ వడ్డీ రేటు పెంపుతో గురువారం 3 పైసలు బలపడి 67.62 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment