మరింత మందిని భాగస్వాములను చేయాలి
పన్ను రేట్లను సరళతరం చేయాలి
నిపుణుల అభిప్రాయాలు
న్యూఢిల్లీ: వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన దేశం) లక్ష్య సాధనకు తక్కువ పన్ను రేట్లతో కూడిన సమగ్రమైన పన్నుల కోడ్‌ను తీసుకురావాల్సిన అవసరాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. మరింత మందిని పన్ను పరిధిలోకి తీసుకురావడం, వసూళ్లు మెరుగుపరుచుకోవడం, నిబంధనల అమలును ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. ఇందుకు ‘ఎఫ్‌ఎల్‌ఏటీ’ నమూనాను ప్రస్తావిస్తున్నారు.
కేవలం కొన్ని శ్లాబులు, తక్కువ రేట్లతో, వివాదాలను తగ్గించే విధంగా, పన్ను చెల్లింపుదారులను విస్తృతం చేసే విధంగా ఉండాలంటున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌కు సమర్పించనున్న నేపథ్యంలో నిపుణుల సూచనలకు ప్రాధాన్యం నెలకొంది. ‘‘జీఎస్‌టీ కింద ఎన్నో రకాల రేట్లు ఉండడం ఎంత మాత్రం మంచిది కాదు.
జీఎస్‌టీ అన్నది ఒక్కటే రేటుగా ఉండాలి. కానీ, మన దేశంలో ఒకటే రేటు అన్నది సాధ్యం కాదు’’అని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) మాజీ చైర్మన్ పీసీ ఝా అభిప్రాయపడ్డారు. కాకపోతే 5 శాతం, 16 శాతం, 28 శాతం చొప్పున మూడు పన్ను శ్లాబులను పరిశీలించాలని సూచించారు.
థింక్ చేంజ్ ఫోరమ్‌లో పాల్గొన్న సందర్భంగా ఈ అంశంపై మాట్లాడారు. ప్రస్తుత పన్ను వ్యవస్థలోని నిబంధనలను సులభతరం చేయాల్సిన అవసరాన్ని ఎర్నెస్ట్ అండ్ యంగ్ పార్ట్‌నర్ రాజీవ్ ఛుగ్ సైతం సమరి్థంచారు. ‘‘పన్ను రేట్లు తగ్గించడం వల్ల పౌరులు, కంపెనీలకు ఖర్చు పెట్టేందుకు వీలుగా నిధుల మిగులు పెరుగుతుంది. రేట్లను క్రమబద్దీకరిస్తే అది ఆర్థిక వ్యవస్థకు ఊతంగా నిలుస్తుంది’’అని ఛుగ్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment