సాక్షి, న్యూఢిల్లీ: భారత వృద్ధి రేటుపై షాకింగ్ అంచనాలు వెలువడ్డాయి. ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత జీడీపీపై మరోసారి ఆందోళనకర అంచనాలను వెలువరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు కేవలం 1 శాతం దిగువన నమోదు కావొచ్చని అభిప్రాయపడింది. మూడు వారాల క్రితం అంచనా వేసిన 2 శాతం అంచనాను సంస్థ తాజాగా దీన్ని0.8 శాతానికి తగ్గించింది. చైనాలో కూడా 2020 లో 0.7 శాతం వృద్ధి నమోదు కానుందని తెలిపింది. అలాగే ఇంతకుముందు అంచనా వేసిన 1.9 శాతంతో పోలిస్తే 2020 లో ప్రపంచ జీడీపీ 3.9 శాతానికి పతనం కానుందని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది.
ఇది యుద్ధానంతర కాలం నాటి అసాధారణమైన మాంద్యం అని వ్యాఖ్యానించింది. కోవిడ్-19, లాక్ డౌన్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం గుప్పిట్లోకి వెళ్లిపోతున్న తరుణంలో ఆ ప్రభావం భారత్‌పై ఉండొచ్చని ఫిచ్ రేటింగ్స్ వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా రెండు త్రైమాసికాల్లో సంకోచం లేదా ప్రతికూల ప్రతికూల వృద్ధిని వుంటుందని, అయితే 2021-22లో జీడీపీ 6.7 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. (బాబోయ్ కరోనా జీడీపీకి షాక్!)
కరోనా వైరస్ సంక్షోభం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపబోతోందని తెలిపింది. ఆర్థిక పతనం ప్రపంచవ్యాప్తంగా పునరావృతమవుతోందనీ, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల జీడీపీ మరింత దిగజారనుందని అంచనావేసింది. మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై చెయిన్ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం అంతర్జాతీయంగా వ్యాపించిందని, ఎగుమతుల పరిస్థితి కూడా ప్రతికూలంగా వుందని తెలిపింది. పడిపోతున్న వస్తువుల ధరలు, మూలధన ప్రవాహాలు, మరింత పరిమితమవుతున్న పాలసీ విధానాలు దేశీయ వైరస్-నియంత్రణ చర్యలు ప్రభావాన్ని పెంచుతున్నాయని తెలిపింది. చైనా భారతదేశం రెండింటి వృద్ది ఒక శాతం దిగువకు అంచనా వేసినందున, అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల జీడీపీ 2020లో మరింత క్షీణిస్తుందని తెలిపింది. 1980ల నాటికంటే దారుణమైన పరిస్తితి అని పేర్కొంది. కాగా 2020-21లో భారతదేశం 1.9శాతం వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనా వేసింది. అదే సమయంలో భారతదేశ వృద్ధి 1.5- 4 శాతం వద్ద అంచనా వేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment