Indian GDP
-
2027 నాటికి భారత్... టాప్3
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ, ఈక్విటీ మార్కెట్‌పై అంతర్జాతీయ పెట్టుబడి సలహా సంస్థ జెఫరీస్ ఆశాజనక అంచనాలను ఆవిష్కరించింది. గత పదేళ్లలో భారతదేశం మౌలిక నిర్మాణాత్మక సంస్కరణలను చూసిందని, దేశం తన పూర్తి సామర్థ్యాలను చూసేందుకు కావాల్సిన కార్యాచరణను ఇది సృష్టించిందని న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా పనిచేసే జెఫరీస్ సంస్థ తన తాజా నివేదికలో పేర్కొంది. వచ్చే నాలుగేళ్లలో భారత జీడీపీ 5 ట్రిలియన్ డాలర్లకు (రూ.415 లక్షల కోట్లు) చేరుకుంటుందని, 2027 నాటికి జపాన్, జర్మనీలను వెనక్కి నెట్టి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని పేర్కొంది. స్థిరమైన వృద్ధి ప్రక్రియలో భాగంగా, 2030 నాటికి భారత స్టాక్ మార్కెట్ విలువ (మార్కెట్ క్యాప్) 10 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని జెఫరీస్ అంచనా వేసింది. ప్రస్తుతం భారత్ మార్కెట్ 4.3 ట్రిలియన్ డాలర్లు విలువతో ప్రపంచంలో ఐదో స్థానంలో ఉంది. టాప్4లో అమెరికా (44.7 ట్రిలియన్ డాలర్లు), చైనా (9.8 ట్రిలియన్ డాలర్లు), జపాన్ (6 ట్రిలియన్ డాలర్లు), హాంకాంగ్ (4.8 ట్రిలియన్ డాలర్లు) ఉన్నాయి. గత 5–20 సంవత్సరాల కాలంలో భారత ఈక్విటీ మార్కెట్ డాలర్ మారకంలో ఏటా 10 శాతం చొప్పున స్థిరమైన రాబడిని ఇచ్చింది. వర్ధమాన మార్కెట్లలో ఏ ఇతర దేశంతో పోల్చి చూసినా మెరుగైన పనితీరు చూపించింది. మూలధన వ్యయాలు తిరిగి పుంజుకోవడం, కంపెనీలు బలమైన ఆదాయాలను నమోదు చేసే స్థితిలో ఉండడం వల్ల భారత మార్కెట్ వచ్చే 5–7 ఏళ్లలోనూ మంచి వృద్ధిని నమోదు చేయనుంది’’అని జెఫరీస్ తన నివేదికలో పేర్కొంది. భారత ఈక్విటీల్లోకి భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు ప్రవహించేందుకు ఉన్న అవకాశాలను జెఫరీస్ ప్రస్తావించింది. ఇప్పటికీ గృహ పొదుపులో కేవలం 4.7 శాతమే ఈక్విటీల్లోకి వస్తున్నట్టు తెలిపింది. డిజిటల్‌గా ఎంతో పురోగతి సాధించడంతో సంప్రదాయ, రిటైల్ ఇన్వెస్టర్ల మధ్య అంతరాన్ని తగ్గించినట్టు వివరించింది. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రిటైల్ ఇన్వెస్టర్లు ఇప్పుడు అసాధారణ స్థాయిలో మార్కెట్ ప్రవేశాన్ని పొందుతున్నట్టు తెలిపింది. సిప్‌కు అమిత ఆదరణ పెరగడం, పెట్టుబడుల విషయంలో రిటైల్ ఇన్వెస్టర్లలో ఉన్న క్రమశిక్షణను తెలియజేస్తోందని పేర్కొంది. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై పెరుగుతున్న అవగాహన నేపథ్యంలో, భారత ఈక్విటీ మార్కెట్లోకి మరింతగా పొదుపు నిధులు ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నట్టు నివేదిక పేర్కొంది. బహుళజాతి కంపెనీల లిస్టింగ్ బలమైన వృద్ధి గమనం, మార్కెట్ల పెరుగుదల, అధిక రాబడుల ట్రాక్ రికార్డ్ ఇవన్నీ విదేశీ పెట్టుబడులను భారీగా ఆకర్షించాయని జెఫరీస్ పేర్కొంది. దక్షిణ కొరియా బహుళజాతి సంస్థ హ్యుందాయ్ ఇండియా తన భారతీయ అనుబంధ సంస్థను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలన్న నిర్ణయాన్ని ప్రస్తావించింది. బలమైన భవిష్యత్తుకు పునాది అధిక వృద్ధికి అనువైన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రభుత్వం చేపట్టిన నిరంతర సంస్కరణలను నివేదిక ప్రశంసించింది. ‘‘దేశంలో సులభతర వ్యాపారాన్ని (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ప్రోత్సహించే లక్ష్యంతో 2014 నుంచి మోదీ ప్రభుత్వం అనేక సంస్కరణలను విజయవంతంగా అమలు చేస్తోంది. 2017 నాటి చరిత్రాత్మక జీఎస్టీ చట్టం అనేక పన్నుల నిర్మాణాలను ఏకైక ఉమ్మడి జాతీయ విధానంగా కుదించింది ఇది. రాష్ట్రాల వ్యాప్తంగా ’యూరోజోన్’ శైలి వస్తువులు, సేవల ప్రవాహాన్ని సృష్టించింది. బ్యాంకింగ్ వ్యవస్థ మొండి బకాయిల ప్రక్షాళనను వేగవంతం చేయడంలో 2016 నాటి దివాలా చట్టం కీలకంగా మారింది. 2017 రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్ (రెరా) విస్తారమైన, అసంఘటిత స్థిరాస్తి రంగాన్ని ప్రక్షాళన చేయడానికి సహాయపడింది’’ అని నివేదిక పేర్కొంది. -
అమ్మ బాబోయ్.. యూట్యూబ్ నుంచి మనోళ్లు అంత సంపాదిస్తున్నారా!
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో యూట్యూబ్ అంటే తెలియని వారుండరు. సామాన్యులను సైతం సెలబ్రిటీలుగా మార్చడం యూట్యూబ్‌కే చెల్లింది. ప్రత్యేకంగా లాక్డౌన్ విధించినప్పటి నుంచి దీని వాడకం బాగా పెరిగిందనే చెప్పాలి. కొందరైతే ఉన్న ఉద్యోగాలను సైతం వదులుకునే యూట్యూబ్‌లో కంటెంట్‌ను క్రియేటర్‌గా కొంతమంది, నటులుగా మరి కొంతమంది ఇలా తమలోని సత్తాను చాటుతున్నారు. అలా కంటెంట్ క్రియేట్ చేసి మన యూట్యూబర్లు ఏకంగా రూ. 6,800 కోట్లు సంపాదించారట. వినడానికి షాక్ అనిపించినా నమ్మాలి మరీ.. 2020 సంవత్సరంలో మన ఎకానమీకి ఇంత మొత్తం ఆదాయం వచ్చిందని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ అనే స్వతంత్ర కన్సల్టింగ్ సంస్థ ఈ రిపోర్టు వెల్లడించింది. అంతేకాకుండా మన దేశంలో యూట్యూబ్ ప్రభావం ఆర్థికంగానూ, సామాజికంగానూ, కల్చరల్‌గా ఎలా ఉందనే అంశాలని ఈ కన్సల్టింగ్సంస్థ స్టడీ చేసింది. మన జీడీపీకి రూ. 6,800 కోట్లు తేవడమే కాకుండా, 6,83,900 ఫుల్ టైమ్‌తో సమానమైనఉద్యోగాలను కూడా యూట్యూబ్ ఇచ్చిందని ఆ నివేదిక తెలపింది. భారతదేశంలో 1,00,000 కంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్లతో ఉన్న ఛానెల్‌ల సంఖ్య ఇప్పుడు 40,000 వద్ద ఉన్నట్లు, ఇవి సంవత్సరానికి 45% కంటే ఎక్కువ వృద్ధిని సాధిస్తున్నట్లు తెలిపింది. యూట్యూబ్ సృష్టికర్తలు తమ కంటెంట్‌తో డబ్బు సంపాదించేందుకు ఎనిమిది విభిన్న మార్గాలను ఇందులో పొందుపరిచారు. వీటిని ఉపయోగించుకుంటూ కనీసం లక్ష లేదా అంతకంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించే యూట్యూబ్ ఛానెల్‌ల సంఖ్య సంవత్సరానికి 60% పైగా పెరిగినట్లు నివేదిక పేర్కొంది. -
ఆదాయ పన్ను రద్దు చేయండి
కరోనా వేళ దేశ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనవుతోంది. కోట్ల మంది ప్రజలు పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఒత్తిడి కింద నలిగిపోతున్నారు. కొవిడ్-19 జబ్బు ప్రభావంతో మందుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి కేంద్ర ప్రభుత్వాన్ని సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలంటూ సలహా ఇచ్చారు. ఏకంగా ఇన్కమ్ ట్యాక్స్‌ను రద్దు చేయాలంటున్నారు ఆయన. ఈ పరిస్థితుల్లో ఆదాయ పన్ను వసూళ్లను రద్దు చేయడం ఉత్తమం. అది కొన్నాళ్లపాటు!. ఆర్థిక సంవత్సరం మొదటి రోజు నుంచి ఈ నిర్ణయం ప్రకటించడం ద్వారా ఆర్థిక ప్రగతికి బలం ఇచ్చినట్లు అవుతుంది. పరిస్థితులు సర్దుకుని సాధారణ స్థితికి వచ్చే వరకు పౌరుల నుంచి పన్నులు వసూలు చేయకపోవడం మంచిదే అని ఓ జాతీయ మీడియా హౌజ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుబ్రమణియన్ స్వామి వ్యాఖ్యానించారు. ఆర్థిక మంత్రిగా ఉండి ఉంటే మీరు ఏం చేసి ఉండేవారన్న ప్రశ్నకు.. మొదటగా పన్ను వసూళ్లను రద్దు చేస్తా. ఏప్రిల్ 1 నుంచి ఇది దేశ వ్యాప్తంగా వర్తిస్తుందని ప్రకటిస్తా. పరిస్థితుల సాధారణం అయ్యేదాకా అది కొనసాగిస్తా. ఆపై దాన్ని శాశ్వతంగా కొనసాగించడం గురించి ఆలోచిస్తా’ అని పేర్కొన్నారు. ఇక తన వాదనను సమర్థించుకునే క్రమంలో సుబ్రమణియన్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు. మార్గాలెన్నో.. బీజేపీ మొదటి దఫా అధికారంలోకి వచ్చిన మొదట్లోనే నేను ఈ సలహా ఇచ్చా. ఆదాయపు పన్ను ద్వారా సుమారు 4 లక్షల కోట్ల ఆదాయం పొందుతున్నాము. అదే బడ్జెట్ చూసుకుంటే దాదాపు 8-9 లక్షల కోట్ల మధ్య ఉంటోంది. ట్యాక్సేషన్ బదులుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో వనరుల్ని పెంచుకోవచ్చు కదా అని చెప్పాను. ఉదాహరణకు.. 2జీ లైసెన్స్‌ల వేలం. మొదటి వేలంలో దాని ద్వారా ఎంత వచ్చిందో తెలుసా? 4 లక్షల కోట్లు. అంటే ఆదాయ పన్నుల వసూళ్లకి సమానం. పన్నులు పెంచే బదులు.. ఇలాంటి ప్రత్యామ్నాయాలు ప్రభుత్వం ముందర ఎన్నో ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ ఒక్కసారి గాడిన పడిందంటే.. ప్రజలు వాళ్లంతట వాళ్లే పన్నులు చెల్లిస్తారు. అలాగే, రీఇన్వెస్ట్ చేసిన కంపెనీల ఆదాయానికి పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుందని రూల్ పెడితే.. పొదుపు రేటు పెరుగుతుంది. ఆపై వృద్ధి రేటు కూడా పెరుగుతుంది అని స్వామి చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లోనుల మీద వడ్డీ రేటును తగ్గిస్తే (12 నుంచి 9 శాతానికి) మంచిదని, అది ప్రభుత్వం చేతుల్లో ఉందని, బ్యాంకులు కూడా చేసి తీరతాయని సుబ్రమణియన్ స్వామి అభిప్రాయపడ్డారు. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను 6 నుంచి 9 శాతానికి పెంచడం ద్వారా ప్రజలు సేవింగ్స్‌కు ముందుకొస్తారని పేర్కొన్నారు. మహమ్మారి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుండి ఉత్పన్నమయ్యే ఆర్థిక ఒత్తిడి కారణంగా జీడీపీ వాటా పరంగా గృహాల పొదుపు మొత్తం తగ్గిందని, పెట్టుబడులు కూడా తగ్గాయని స్వామి అంటున్నారు. ప్రపంచ మహమ్మారి విధ్వంసానికి ముందు 2019-20 నాలుగో త్రైమాసికంలో చూసిన వృద్ధి స్థాయిని ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ తిరిగి పొందలేదని సుబ్రమణియన్ స్వామి గుర్తు చేస్తున్నారు. ఆర్థిక అంచనాలు, అధికారిక డేటా ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి బలమైన వృద్ధిని సూచిస్తున్నప్పటికీ.. మిగిలిన త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ పనితీరుపై ఆధారపడి ఉంటుందని సుబ్రమణియన్ స్వామి అన్నారు. ఇదిలా ఉంటే బడ్జెట్‌టైంలో సుబ్రమణియన్ స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. అయితే గతంలోనూ ఆయన ఇలాంటి సలహాలే ఇచ్చారు కూడా!. క్లిక్ చేయండి: బడ్జెట్ 2022లో మధ్యతరగతి వర్గానికి ఊరట! -
బ‘బుల్’ రిస్క్..!
న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2020–21 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 8 శాతం క్షీణిస్తుందన్న అంచనాల నేపథ్యంలోనూ దేశీయ ఈక్విటీ మార్కెట్లు రికార్డు పరుగులు చేయడంపై స్వయంగా బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమానాలు వ్యక్తం చేసింది. ‘‘బుడగ పేలే (రిస్క్ ఆఫ్ ఏ బబుల్) అవకాశం ఉంది’’ అని హెచ్చరిక చేసింది. తద్వారా స్టాక్ మార్కెట్ పెరుగుదల నిలబడకపోవచ్చని సూచించింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్బీఐ విడుదల చేసిన నివేదికలో మార్కెట్‌కు సంబంధించి ఆర్బీఐ అభిప్రాయాలను క్లుప్లంగా పరిశీలిస్తే... ► భారత్ ఈక్విటీ మార్కెట్లు రికార్డు స్థాయికి పెరిగాయి. ప్రధాన సూచీ సెన్సెక్స్ 2021 జనవరి 21న 50,000 పాయింట్ల మైలురాయిని దాటింది. ఫిబ్రవరి 15న గరిష్టంగా 52,154 పాయింట్లను తాకింది. కరోనా కట్టడికి లాక్డౌన్ ప్రారంభమయిన నాటి నుంచీ చూస్తే (2020 మార్చి 23 నుంచీ) మార్కెట్ 100.7% పెరిగితే, ఒక్క 2020–21లో 68 శాతం ఎగసింది. ► జీడీపీ క్షీణ అంచనాల నేపథ్యంలోనూ మార్కెట్ భారీ పెరుగుదల ‘బబుల్ రిస్క్’ను సూచిస్తోంది. వాస్తవిక ఆర్థిక క్రియాశీల రికవరీకి అలాగే అసెట్ ప్రైస్ పెరుగుదలకు మధ్య వ్యత్యాసం భారీగా పెరుగుతుండడం ఇప్పుడు గ్లోబల్ విధాన నిర్ణయ అంశాల విషయంలో ఆందోళనకు కారణమవుతోంది. ► నిధుల సరఫరా, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) పెట్టుబడులు స్టాక్ మార్కెట్ల భారీ పెరుగుదలకు కారణం. ఎకానమీ మెరుగుపడుతుందన్న అంచనాలు స్టాక్ మార్కెట్ పెరుగుదలకు కొంత కారణమయినప్పటికీ, మనీ సప్లై, ఎఫ్‌పీఐల ప్రభావమే ఇందులో అధికం. ఆర్థిక రికవరీకి వ్యవస్థలోకి మనీ పంప్ చేయడం (లిక్విడిటీ) కూడా అసెట్ ధరల పెరుగుదలకు కారణం. అయితే ఈ తరహా ద్రవ్యలభ్యత, మద్దతు వ్యవస్థలో నియంత్రణ లేకుండా, నిరంతరం కొనసాగుతుందని భావించరాదు. ► భవిష్యత్ ఆర్జనలకు భరోసాను ఇచ్చింది. ► తాజా పరిస్థితిని విశ్లేషిస్తే, మహమ్మారి వేవ్‌ల కట్టడి జరిగి, ఎకానమీ వాస్తవిక వృద్ధి బాట పట్టే వరకూ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వినియోగం, పెట్టుబడులు కీలకం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ఆర్థికాభివృద్ధిపై సెకండ్‌వేవ్ ప్రభావం కొనసాగనుంది. 10.5 శాతం వృద్ధి సాధిస్తామన్న తొలి అంచనాలకు కోత పెట్టాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. కోవిడ్ సవాళ్ల అనంతరం దేశం వృద్ధి బాటన నిలదొక్కుకోవడానికి ప్రైవేటు వినియోగం పెట్టుబడుల మళ్లీ ఊపందుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్పీఏల పట్ల దృష్టి పెట్టాలి సెకండ్ వేవ్ నేపథ్యంలో మొండి బకాయిల (ఎన్పీఏ) పరిస్థితిని బ్యాంకులు జాగ్రత్తగా పరిశీలించాలి. ఎన్పీఏల వర్గీకరణపై నిషేధాన్ని సుప్రీంకోర్టు తొలగించిన నేపథ్యంలో తగిన స్థాయిలో ప్రొవిజనింగ్ (ఎన్పీఏ కేటాయింపులు)పై దృష్టి పెట్టాలి. తగిన స్థాయిలో లిక్విడిటీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవస్థలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ)తగిన స్థాయిలో ఉండడానికి తగిన అన్ని చర్యలూ తీసుకోవడం జరుగుతుంది. గత ఆర్థిక సంవత్సరం తరహాలోనే ఎటువంటి అవరోధాలూ లేకుండా ద్రవ్య,పరపతి విధానం కొనసాగేలా చర్యలు ఉంటాయి. బ్యాంక్ నోట్ల సర్క్యులేషన్ పెరిగింది 2020–21లో బ్యాంక్ నోట్ల సర్క్యులేషన్ పెరిగింది. మహమ్మారి నేపథ్యంలో ముందు జాగ్రత్తగా వినియోగదారు నగదు తన వద్ద ఉంచుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడం దీనికి కారణం. ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ నోట్ల సర్క్యులేషన్ విలువ 16.8 శాతం పెరిగితే, పరిమాణం విషయంలో ఇది 7.2 శాతం. 2019–20లో ఈ శాతాలు వరుసగా 14.7 శాతం, 6.6 శాతంగా ఉండడం గమనార్హం. విలువ రీత్యా చూస్తే, 2021 మార్చి 31 నాటికి మొత్తం సర్క్యులేషన్లో రూ.500, రూ.2000 నోట్ల వాటా 85.7 శాతం. ఇది 2020 మార్చి 31 నాటికి 83.4 శాతంగా ఉంది. 2,000 నోటుకు గుడ్‌బై! రూ.2,000 నోట్లను క్రమంగా పూర్తి స్థాయిలో వ్యవస్థలోంచి వెనక్కు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2020–21లో ఆర్బీఐ రూ.57,757 కోట్ల విలువైన రూ.2000 నోట్లకు వ్యవస్థలో నుంచి ఉపసంహరించింది. 2019–20లో 2000 నోట్ల విలువ రూ.5,47, 952 కోట్లు కాగా, 2020–21లో ఈ విలువ రూ.4,90,195 కోట్లకు పడిపోయింది. 2017–18లో ఈ నోట్ల పరిమాణం 33,630 లక్షలు కాగా, 2021 మార్చికి 24,510కి తగ్గింది. ఇక వ్యవస్థలో డిమాండ్‌ను నెరవేర్చడానికి రూ.500 నోట్లను భారీగా సర్క్యులేషన్లోకి తెస్తోంది. ప్రస్తుత సర్క్యులేషన్ నోట్లలో వీటి వాటా 68.4%. గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ వాటా 61%. -
12 శాతానికి భారత ఆర్థిక వృద్ధి రేటు!
న్యూఢిల్లీ: భారత జీడీపీ 2021లో 12 శాతం మేర వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా వేసింది. సమీప కాలంలో పరిస్థితులు భారత్‌కు ఎంతో సానుకూలంగా ఉన్నట్టు ఈ సంస్థ పేర్కొంది. 2020 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశ జీడీపీ మైనస్ 7.5 శాతానికి పడిపోయిన తర్వాత.. డిసెంబర్ త్రైమాసికంలో 0.4 శాతం వృద్ధిలోకి చేరుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్ క్వార్టర్ వృద్ధి రేటు అంచనాలకు మించి ఉన్నట్టు మూడీస్ పేర్కొంది. ‘‘ప్రైవేటు వినియోగం, నివాసేతర పెట్టుబడులు వచ్చే కొన్ని త్రైమాసికాల్లో చెప్పుకోతగ్గ స్థాయిలో పుంజుకుంటాయి. ఇది 2021లో దేశీయ డిమాండ్ పుంజుకునేందుకు సాయపడుతుంది’’ అని మూడీస్ తన తాజా నివేదికలో వివరించింది. క్రితం సంవత్సరంలో జీడీపీ కనిష్టాలకు పడిపోయినందున.. అక్కడి నుంచి చూసుకుంటే 2021 సంవత్సరంలో భారత వాస్తవ జీడీపీ వృద్ధి 12 శాతంగా ఉంటుందని తెలిపింది. కరోనాకు ముందున్న వృద్ధితో (2020 మార్చి త్రైమాసికం) పోలిస్తే ఇది 4.4 శాతం ఎక్కువ. ద్రవ్య, పరపతి విధానాలు వృద్ధికి అనుకూలంగానే ఉంటాయన్న అభిప్రాయాన్ని మూడీస్ వ్యక్తం చేసింది. ఈ ఏడాది అదనపు రేట్ల కోతలను అంచనా వేయడం లేదని పేర్కొంది. దేశీయ వినియోగాన్ని చూసి అవసరమైతే ద్వితీయ అర్ధ సంవత్సరంలో కొంత ద్రవ్యపరమైన మద్దతు అవసరం కావచ్చని అంచనా వేసింది. అయితే, 2021లో రికవరీ కరోనా కేసుల మలివిడత తీవ్రతపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. కరోనా రెండో విడత కేసుల తీవ్రత కొన్ని రాష్ట్రాల పరిధిలోనే ఎక్కువగా ఉన్నందున కట్టడికి అవకాశం ఉంటుందని పేర్కొంది. 11 శాతం వృద్ధి అవసరం: నీతి ఆయోగ్ భారత్ రానున్న ఆర్థిక సంవత్సరంలో (2021–22) 10.5–11 శాతం స్థాయిలో వాస్తవ వృద్ధి రేటును చేరుకోవాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు. మరోసారి వచ్చే మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్ సన్నద్ధంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. నేషనల్ సీఎస్ఆర్ నెట్వర్క్ వర్చువల్‌గా నిర్వహించిన ఒక కార్యక్రమంలో రాజీవ్‌కుమార్ మాట్లాడారు. -
కోవిడ్-19 తదుపరి భారత్ భలే స్పీడ్
ప్రస్తుతం భూగోళాన్ని వణికిస్తున్న కోవిడ్-19 తదుపరి ప్రపంచ దేశాలలో భారత్ అత్యంత వేగవంత వృద్ధిని అందుకోనున్నట్లు రినైసన్స్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ వ్యవస్థాపకులు పంకజ్ మురార్కా అంచనా వేస్తున్నారు. వివిధ రంగాలలో నాయకత్వ స్థాయిలో ఉన్న కంపెనీలలో ఇన్వెస్ట్ చేయడం మేలు చేస్తుందని పేర్కొంటున్నారు. ఒక ఇంటర్వ్యూలో మార్కెట్ల తీరు, పెట్టుబడి వ్యూహాలు తదితర పలు అంశాలపై అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. కేంద్ర బ్యాంకుల దన్ను ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల కేంద్ర బ్యాంకులు భారీ సహాయక ప్యాకేజీలు అమలు చేస్తుండటంతో ఫైనాన్షియల్ మార్కెట్లకు జోష్వచ్చింది. దీంతో రియల్ ఎకానమీ కంటే ముందుగానే స్టాక్ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్ అయ్యాయి. వివిధ దేశాల ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థలకు దన్నుగా పలు సంస్కరణలకు తెరతీశాయి. వీటికి జతగా కేంద్ర బ్యాంకులు చేపట్టిన లిక్విడిటీ చర్యలు ఫైనాన్షియల్ మార్కెట్లకు ప్రోత్సాహాన్నిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు తొలి దశ గరిష్టస్థాయికి చేరుకుంటున్నాయి. దేశీయంగా ఏడాది ద్వితీయార్థంలో ఇలాంటి పరిస్థితి నెలకొనవచ్చు. అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్‌సహా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు చేపట్టిన లిక్విడిటీ చర్యల కారణంగా స్టాక్ మార్కెట్లు బుల్ పరుగు తీస్తున్నాయి. కోవిడ్‌కు ముందు పరిస్థితితో పోలిస్తే ఇండియా మరింత బలంగా పుంజుకునే వీలుంది. తద్వారా ప్రపంచ దేశాలలోనే అత్యంత వేగవంత వృద్ధి సాధించగల దేశంగా నిలిచే అవకాశముంది. దేశీ డిమాండ్ ఇటీవలి మూడు నెలల పరిస్థితులను పక్కనపెడితే.. గత రెండేళ్లుగా దేశీ స్టాక్ మార్కెట్లు బేర్ దశను చవిచూశాయి. సాధారణంగా బేర్ ట్రెండ్ 12-24 నెలల కాలం కొనసాగుతుంది. అయితే గత రెండు నెలల్లోనే రెండేళ్ల బేర్ మార్కెట్ పరిస్థితులను మార్కెట్లు కళ్లజూశాయి. ప్రస్తుతం మార్కెట్ బుల్ ట్రెండ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. దేశీయంగా ఆర్థిక వ్యవస్థను గమనిస్తే.. కొన్ని బిజినెస్‌లకు సమస్యలు తప్పకపోవచ్చు. రానున్న రెండు, మూడు క్వార్టర్లలో ఆటో, రిటైల్ తదితర కొన్ని రంగాలకు సవాళ్లు ఎదురుకావచ్చు. అయితే పరిస్థితులు సాధారణస్థితికి చేరుకుంటే ఈ రంగాలు జోరందుకోవచ్చు. దేశీయంగా బిజినెస్‌లు కలిగిన, ఆయా రంగాలలో నాయకత్వ స్థాయిలో ఉన్న కంపెనీలను ఎంచుకోవడం లబ్ది చేకూర్చగలదని భావిస్తున్నాం. ఉదాహరణకు ఆటో రంగంలో భారత్ ఫోర్జ్, సుందరం ఫాజనర్స్వంటివి ప్రస్తావించవచ్చు. ఇక మల్టీప్లెక్స్ కంపెనీ పీవీఆర్.. మరికొంతకాలం సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. టెలికం, టెక్నాలజీ కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో టెక్నాలజీ, టెలికం రంగాలు విజేతలుగా ఆవిర్భవిస్తున్నాయి. టెలికం రంగంలో బాండ్విడ్త్ వినియోగం భారీగా పెరిగింది. సగటు వినియోగాన్ని పోలి టెక్నాలజీ వాడకం కూడా ప్రతీరోజూ వేగమందుకుంటోంది. ఇకపైన కూడా ఈ రెండు రంగాలూ ముందు వరుసలో నిలుస్తాయని భావించవచ్చు. వెరసి ఈ రంగంలో పెట్టుబడులకు ప్రాధాన్యమివ్వవచ్చు. ఎయిర్‌లైన్స్‌కు నో గత 15 ఏళ్ల కాలంలో విమానయాన రంగంలో పెట్టుబడులకు సంబంధించి మాకు వైఫల్యాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ రంగంపై విదేశీ పరిస్థితులు, తదితర పలు బాహ్య సంబంధ అంశాలు ప్రభావం చూపుతుంటాయి. దీంతో యాజమాన్య నియంత్రణను దెబ్బతీస్తుంటాయి. ఇంధన ధరలు, రూపాయి మారకం, విదేశీ పరిస్థితులు కంపెనీల నిర్వహణను ప్రభావితం చేస్తుంటాయి. దీంతో కోవిడ్-19 వంటి పరిస్థితులలో ఈ రంగం కంటే ఇతర రంగాలపై దృష్టిసారించడం మేలని భావిస్తున్నాం. -
కరోనా కల్లోలం : జీడీపీపై ఫిచ్ షాకింగ్ అంచనాలు
సాక్షి, న్యూఢిల్లీ: భారత వృద్ధి రేటుపై షాకింగ్ అంచనాలు వెలువడ్డాయి. ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత జీడీపీపై మరోసారి ఆందోళనకర అంచనాలను వెలువరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు కేవలం 1 శాతం దిగువన నమోదు కావొచ్చని అభిప్రాయపడింది. మూడు వారాల క్రితం అంచనా వేసిన 2 శాతం అంచనాను సంస్థ తాజాగా దీన్ని0.8 శాతానికి తగ్గించింది. చైనాలో కూడా 2020 లో 0.7 శాతం వృద్ధి నమోదు కానుందని తెలిపింది. అలాగే ఇంతకుముందు అంచనా వేసిన 1.9 శాతంతో పోలిస్తే 2020 లో ప్రపంచ జీడీపీ 3.9 శాతానికి పతనం కానుందని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. ఇది యుద్ధానంతర కాలం నాటి అసాధారణమైన మాంద్యం అని వ్యాఖ్యానించింది. కోవిడ్-19, లాక్ డౌన్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం గుప్పిట్లోకి వెళ్లిపోతున్న తరుణంలో ఆ ప్రభావం భారత్‌పై ఉండొచ్చని ఫిచ్ రేటింగ్స్ వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా రెండు త్రైమాసికాల్లో సంకోచం లేదా ప్రతికూల ప్రతికూల వృద్ధిని వుంటుందని, అయితే 2021-22లో జీడీపీ 6.7 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. (బాబోయ్ కరోనా జీడీపీకి షాక్!) కరోనా వైరస్ సంక్షోభం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపబోతోందని తెలిపింది. ఆర్థిక పతనం ప్రపంచవ్యాప్తంగా పునరావృతమవుతోందనీ, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల జీడీపీ మరింత దిగజారనుందని అంచనావేసింది. మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై చెయిన్ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం అంతర్జాతీయంగా వ్యాపించిందని, ఎగుమతుల పరిస్థితి కూడా ప్రతికూలంగా వుందని తెలిపింది. పడిపోతున్న వస్తువుల ధరలు, మూలధన ప్రవాహాలు, మరింత పరిమితమవుతున్న పాలసీ విధానాలు దేశీయ వైరస్-నియంత్రణ చర్యలు ప్రభావాన్ని పెంచుతున్నాయని తెలిపింది. చైనా భారతదేశం రెండింటి వృద్ది ఒక శాతం దిగువకు అంచనా వేసినందున, అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల జీడీపీ 2020లో మరింత క్షీణిస్తుందని తెలిపింది. 1980ల నాటికంటే దారుణమైన పరిస్తితి అని పేర్కొంది. కాగా 2020-21లో భారతదేశం 1.9శాతం వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనా వేసింది. అదే సమయంలో భారతదేశ వృద్ధి 1.5- 4 శాతం వద్ద అంచనా వేసిన సంగతి తెలిసిందే. (ఆసియాలో అపర కుబేరుడుగా అంబానీ) -
కరోనా: జీడీపీపై సంచలన అంచనాలు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై ప్రపంచ దేశాలు యుద్ధాన్ని అప్రతి హతంగా కొనసాగిస్తున్నాయి. ఒకవైపు కరోనా వైరస్, మరోవైపు లాక్డౌన్ పరిస్థితుల మధ్య ప్రపంచ ఆర్థికవ్యవస్థ మరింత మాంద్యంలోకి జారిపోతోంది. అనేక కీలక పరిశ్రమలు సంక్షోభంలోకి కూరుకుపోతున్నాయి. ఈ ఆందోళనల నేపథ్యంలో ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ సంచలన విషయాన్ని ప్రకటించింది. 2020 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ రేటు 2.5 శాతానికి పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ భయాల మధ్య మూడీస్ తాజాగా ఈ అంచనాలను వెల్లడించింది. (రుణ గ్రహీతలకు భారీ ఊరట) రాబోయే రెండు, మూడు త్రైమాసికాలు భారతదేశంలో అన్ని రంగాలు తీవ్రంగా ప్రభావం చెందనుండడంతో.. జీడీపీ వృద్ధి రేటు అంచనాలలో భారీగా కోత పడనుందని తెలిపింది. భారత జీడీపీ వృద్ధి రేటు మరింత కనిష్టానికి పడిపోనుందని అంచనా వేసింది. ఒక దశలో 8 శాతం పైగా వృద్ధి రేటుతో దూసుకుపోయిన భారత జీడీపీ 2019 లో 5 శాతానికి చేరింది. ఇపుడు 5 శాతం మార్కును అందుకోవడం కూడా కష్టంగా మారిపోయింది. పారిశ్రామిక రంగంతో పాటు వాహన రంగాలు కుదేలు కావడం ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంది. (వచ్చే 3నెలలు ఈఎంఐలు కట్టకపోయినా ఫర్వాలేదు) మరోవైపు దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన కారణంగా ప్రస్తుత త్రైమాసికంలో జీడీపీ వృద్ధి కేవలం 1 శాతానికి పడిపోతుందని ఐఎన్జీ గ్రూప్, డాయిష్ బ్యాంకు సహా పలువురు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఏప్రిల్-జూన్ నెలల్లో నిజమైన జీడీపీ వృద్ధి కుప్పకూలనుందని, చైనా అనుభవంతో వార్షిక ప్రాతిపదికన 5 శాతం లేదా అంతకంటే దిగువకు చేరుతుందని డాయిష్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ కౌశిక్ దాస్ అంచనా వేశారు. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 4.7 శాతం విస్తరించిన ఆర్థిక వ్యవస్థ రానున్న కాలంలో రెండు దశాబ్దాల కనిష్టానికి చేరనుందని సింగపూర్ ఐఎన్జీ ఆర్థికవేత్త ప్రకాష్ సక్పాల్ తెలిపారు. ముఖ్యంగా భారతదేశ జీడీపీలో 57 శాతం వాటా ఉన్న ప్రైవేట్ వినియోగం ప్రస్తుత త్రైమాసికంలో దాదాపు సున్నా శాతానికి పడిపోనున్న నేపథ్యంలో జీపీడీ వృద్ధి కేవలం 1 శాతానికి పడిపోతుందన్నారు. (ప్యాకేజీ లాభాలు) -
జీడీపీ.. ఢమాల్!
న్యూఢిల్లీ: భారత ఆర్థికరంగం తీవ్ర ఆందోళనకరమైన పరిస్థితులను ఎదుర్కొంటోందని ఏప్రిల్–జూన్ త్రైమాసిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు కేవలం 5 శాతంగా నమోదయ్యింది. 2012–13 ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో కేవలం 4.9 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. అటు తర్వాత ఈ రేటు మళ్లీ ఈ స్థాయిని చూస్తోంది. గత ఆర్థిక సంవత్సరం (2018–19) తొలి త్రైమాసికంలో భారీగా 8 శాతం వృద్ధి సాధించినా, ఏడాది తిరిగే సరికి ఈ రేటు భారీగా పడిపోవడం గమనార్హం. జనవరి–మార్చి త్రైమాసికంలో (గత ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలలు) కూడా వృద్ధి రేటు కనీసం 5.8 శాతం నమోదయ్యింది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో తీవ్ర నిరాశకు కీలక తయారీ, వ్యవసాయ రంగాలు రెండూ ఈ కాలంలో మొండిచేయి చూపించడం దీనికి ప్రధాన కారణం. తాజా సమీక్షా కాలంలో కనీసం 5.7 శాతం అన్నా వృద్ధి రేటు ఉంటుందని మార్కెట్ అంచనావేసిన సంగతి ఇక్కడ ప్రస్తావనాంశం. కాగా చైనా ఇదే త్రైమాసికంలో 6.2 శాతం వృద్ధిని (27 సంవత్సరాల కనిష్టం) నమోదుచేసుకుంది. అయితే భారత్ వృద్ధి ఇంతకన్నా తక్కువ నమోదయినందున (5 శాతం) ఈ నిర్దిష్ట త్రైమాసికంలో ‘ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం’ హోదాను భారత్ కోల్పోయినట్లయ్యింది. కేంద్రం శుక్రవారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారంకొన్ని కీలక రంగాలను చూస్తే... ♦ తయారీ: కేవలం 0.6 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. 2018–19 ఇదే త్రైమాసికంలో ఈ రేటు 12.1 శాతంగా ఉండడం గమనార్హం. ♦ వ్యవసాయం, అటవీ, మత్స్యసంపద: వృద్ధి 5.1 శాతం నుంచి 2 శాతానికి జారింది. ♦ గనులు, తవ్వకాలు: ఈ రంగం కొంచెం బెటర్. వృద్ధి రేటు 0.4% నుంచి 2.7 శాతానికి ఎగసింది. ♦ ఎలక్ట్రిసిటీ, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవలు: ఈ రంగంలో కూడా వృద్ధి రేటు 6.7 శాతం నుంచి 8.6 శాతానికి చేరింది. ♦ నిర్మాణం: ఈ రంగంలో వృద్ధి రేటు 9.6 శాతం నుంచి 5.7 శాతానికి పడిపోయింది. ♦ ట్రేడ్, హోటెల్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్స్, సేవలు: 7.8% నుంచి 7.1 శాతానికి చేరింది. ♦ ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సేవలు: వృద్ధి రేటు 6.5% నుంచి 5.9 శాతానికి దిగింది. ♦ జీఎఫ్‌సీఎఫ్:పెట్టుబడులకు సంబంధించిన పరిస్థితిని తెలియజేసే గ్రాస్ ఫిక్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ (జీఎఫ్‌సీఎఫ్) విలువ రూ.11.21 లక్షల కోట్ల (2018–19 క్యూ1లో) నుంచి కేవలం రూ.11.66 లక్షల కోట్లకు చేరింది.కాగా, వృద్ధి పడిపోడానికి దేశీయ, అంతర్జాతీయ అంశాలు కారణమని ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణ్యం పేర్కొన్నారు. విలువలు చూస్తే... జాతీయ గణాంకాల కార్యాలయం (ఎస్ఎస్ఓ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం– 2018–19 మొదటి త్రైమాసికంలో జీడీపీ విలువ 34.14 లక్షల కోట్లు. 2019–20 మొదటి త్రైమాసికంలో ఈ రేటు రూ.35.85 లక్షల కోట్లకు చేరింది. అంటే వృద్ధి రేటు ఇక్కడ 5 శాతమన్నమాట. 2019–2020 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు అంచనాలను ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గించింది. తాజా పరిస్థితి చూస్తుంటే, ఈ స్థాయి వృద్ధి రేటు అయినా, సాధ్యమైనా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. మొదటి త్రైమాసికంలో పారిశ్రామిక ఉత్పత్తి 5.1 శాతం నుంచి 3.6 శాతానికి పడిపోయిన క్రమంలోనే తాజా జీడీపీ పేలవ ఫలితాలూ వెలువడ్డాయి. ఆటోమొబైల్ అమ్మకాలు, రైలు రవాణా, దేశీయ విమాన ట్రాఫిక్, దిగుమతులు (ఆయిల్, పసిడి, వెండి యేతర) పడిపోవడం వినియోగం తగ్గుదలను సూచిస్తోంది. తక్కువ స్థాయి ద్రవ్యోల్బణం సైతం వ్యవస్థలో మందగమనానికి సంకేతం. భారత్ పాసింజర్ వాహన పరిశ్రమ అమ్మకాలు జూలైలో 31 శాతం పడిపోయాయి. గడచిన 19 సంవత్సరాల్లో ఈ స్థాయి పతనం ఇదే తొలిసారి. రేటు కోత నిర్ణయాలు తీసుకుంటూ (వరుసగా నాలుగు ద్వైమాసికాల్లో 1.10 శాతం తగ్గింపు– ప్రస్తుతం 5.4 శాతం) ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి ఆర్బీఐ చర్యలు తీసుకుంటున్నా అంతగా ఫలితం ఉండడంలేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పాసింజర్ వాహనాలు, సిమెంట్ వంటి రంగాలపై వస్తు, సేవల పన్ను తగ్గించాలని పారిశ్రామిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే భారీగా ఉపాధి అవకాశాలు కోల్పోవచ్చని హెచ్చరిస్తున్నాయి. 2018 జూలైతో పోల్చుకుంటే, 2019 జూలైలో నిరుద్యోగ రేటు 5.66 శాతం నుంచి 7.51 శాతానికి చేరిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ వివరించింది. -
మెజారిటీ అభిప్రాయం ప్రకారమే రెపో రేటు పెంపు
ముంబై: గత నెలలో జరిగిన రెండో త్రైమాసిక ద్రవ్య పరపతి సమీక్షలో మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకే రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పావు శాతం మేర పెంచింది. ద్రవ్యోల్బణం ఇంకా అధిక స్థాయిలోనే ఉన్నందున రెపో రేటును పెంచేందుకు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్)ని పావు శాతం తగ్గించేందుకు నలుగురు సభ్యులు మద్దతు తెలిపారు. ఆర్బీఐ గురువారం ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపింది. ఇద్దరు సభ్యులు మాత్రం రెపో రేటును పెంచితే.. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, ద్రవ్యోల్బణ తగ్గింపు చర్యలకు పెద్దగా ఉపయోగపడకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఒక సభ్యుడు మాత్రం ఆర్బీఐ వృద్ధికి ఊతమిచ్చే విధంగా రెపో రేటును పావు శాతం తగ్గించాలని పేర్కొన్నారు. అక్టోబర్ 23న ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ సారథ్యంలో సమీక్ష సమావేశం జరిగింది. ఇందులో ఆర్బీఐ డిప్యుటీ గవర్నర్లతో పాటు ఎక్స్టర్నల్ సభ్యులు కూడా పాల్గొన్నారు. బ్యాంకులు తీసుకునే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటుగా పరిగణిస్తారు.