
సాక్షి,ముంబై: ఇటీవల రికార్డు స్థాయికి ఎగబాకిన బంగారం ధరలు క్రమంగి దిగివస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన సమీపిస్తున్న తరుణంలో రెండు నెలల కనిష్టం వద్ద పసిగి కొనుగోలు దారులకు ఊరనిచ్చే అంశం. అంతర్జాతీయంగా ఇటీవలి కాలంలో దాదాపు 3500 దిగొవచ్చిన పసిడి ధర మంగళవారం కూడా అదే బాటలో నడిచింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో MCXలో బంగారం ధర నేడు 55,000 స్థాయిలో ఉంది. అలాగే వెండి 63,000 వద్ద ట్రేడవుతోంది.
ఎంసీఎక్స్ మార్కెట్‌లో 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం ధరపై రూ.150 తగ్గి రూ.51,350గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.160 బలహీనపడి రూ.56,020గా ఉంది. అలాగే కేజీ వెండి ధరపై రూ.1000 తగ్గడంతో,రూ.69000లుగా ఉంది. అయితే దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధరూ స్వల్పంగా పుంజుకుని రూ.69200 పలుకుతోంది.
గ్లోబల్ మార్కెట్‌లో కూడా బంగారం ధర పడిపోయింది. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుదల కారణంగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పడిపోయింది. జూన్ 2021 నుండి అతిపెద్ద నెలవారీ నష్టానికి దారితీశాయి. సోమవారం రెండు నెలల కనిష్టానికి చేరిన తర్వాత మంగళవారం స్పాట్ బంగారం 0.1శాతం తగ్గి ఔన్సు ధర 1,816.19 డాలర్ల వద్ద ఉంది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 0.1శాతం క్షీణించి తగ్గి 1,823.30 డాలర్ల స్థాయికి చేరింది.
22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరలు ఇలా ఉన్నాయి
హైదరాబాద్ - రూ.51,450
చెన్నై - రూ. 52,070
ముంబై - రూ. 51,450
ఢిల్లీ - రూ. 51,600
కోల్‌కతా - రూ. 51,450
బెంగళూరు - రూ.51,500
Comments
Please login to add a commentAdd a comment