పాపన్నగౌడ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి
-సర్దార్‌సర్వాయి పాపన్న జైత్రయాత్ర రాష్ట్ర కన్వీనర్ రమణాగౌడ్
హత్నూర :బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాటం చేసిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పాపన్న గౌడ్ జైత్రయాత్ర రాష్ట్ర కన్వీనర్ వీవీ రమణాగౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం హత్నూర మండలం దౌల్తాబాద్‌కు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జైత్రయాత్ర బస్సుచేరుకుంది. మండల గౌడసంఘం నాయకులు దుర్గంగౌడ్, ధునుంజయ్యగౌడ్, గౌడసంఘం నాయకులు జైత్రయాత్ర బస్సుకు స్వాగతం పలికారు.
తెలంగాణతల్లి, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసిన అనంతరం రమణాగౌడ్ మాట్లాడుతూ ఈనెల18న జరిగే సర్దార్ సర్వాయిపాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. ఈనెల1న పాపన్న జన్మస్థలమైన వరంగల్‌జిల్లా కిలాషాపురం నుంచి బస్సుయాత్ర ప్రారంభమై గ్రామగ్రామాన తిరుగుతూ సభలు, సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి గ్రామంలో పాపన్నగౌడ్ విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలన్నారు.
ఈనెల18న పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ట్యాంక్‌బండ్, అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వమే పాపన్న విగ్రహాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గౌడసంఘం రాష్ట్ర నాయకులు బాల్‌రాజ్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, రమేష్‌గౌడ్, నర్సయ్యగౌడ్, వెంకటేశ్వర్‌గౌడ్, దుర్గంగౌడ్, రాజాగౌడ్, లక్ష్మణ్‌గౌడ్, మండల నాయకులు యాదగిరిగౌడ్, రామస్వామిగౌడ్, స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
08ఎన్‌ఆర్‌ఎస్‌ః41 దౌల్తాబాద్‌లో తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాలలు వేస్తున్న గౌడసంఘం నాయకులు
08ఎన్‌ఆర్‌ఎస్‌ః41ఎః నాయకులకు స్వాగతం పలుకుతున్న గౌడసంఘం నాయకులు