Weaker sections
-
వారు స్త్రీలు మాత్రమే కాదు!
దేశం నివ్వెరపోయింది. ఆ మహిళ దేహం మీద నిర్భీతిగా, నిర్లజ్జగా, నిస్సంకోచంగా పాకిన ఆ మగ చేతిని చూసి ప్రజానీకం నిస్సహాయ క్రోధంతో వణికిపోతున్నారు. మణిపుర కుకీ గిరిజన తెగకి చెందిన ముగ్గురు క్రిస్టియన్ మహిళలను నగ్నంగా మార్చి, ఊరేగించి, అందులో ఒకరిని అత్యాచారం చేసిన ఘటన తాలూకు వీడియో ఇపుడు దేశంలో అనేకమందిని కలవరానికి లోను చేస్తోంది. సోషల్ మీడియా అందరికీ అందు బాటులోకి వచ్చాక స్త్రీలను, దళిత, గిరిజనులను వివస్త్రలను చేసి చితక బాదడం, చంపడం వంటి వీడియోలు అడపాదడపా వైరల్ అవుతూ ఉన్నాయి. నచ్చిన దుస్తులు వేసుకోవడం, నచ్చిన చోట్లకి వెళ్ళడం, నచ్చిన వారితో కలిసి గడపడం, ఇష్టమైన ఆహారం తినడం తప్పుగా మారి పోయాయి. ప్రేమలు, పరువులు, చేతబడుల వంక బెట్టి వారి శరీరాలను దారుణంగా హింసించడం – వీటన్నిటికీ పీడిత వర్గాల పట్ల సమాజానికి ఉన్న తక్కువ భావనే తక్షణ కారణం అయి ఉండొచ్చు. కానీ చాలా సందర్భాల్లో వేరే బలమైన కారణాలు ఉంటాయి. గుజరాత్లో ముస్లిం జాతి హనన మారణకాండలో వేలాది స్త్రీలమీద మూకుమ్మడి అత్యాచారాలు చేయడం, ప్రాబల్య కులాల స్త్రీలు కూడా దగ్గరుండి ప్రోత్సహించడం సమీప చరిత్ర. నగ్నదేహాలతో, రోడ్డున దొరికే చిత్తుపాతలు కప్పుకుంటూ ప్రాణాలు కాపాడుకోవడానికి పోలీస్ స్టేషన్లకు పరుగులు పెట్టిన గుజరాత్ ముస్లిం మహిళల గురించి అనేక నివేదికలు తెలియజెప్పాయి. ఇప్పుడు మణిపురలో జరుగుతున్నది సారంలో గుజరాత్‌కి భిన్నం కాదు. అక్కడ ముస్లింలు అయితే ఇక్కడ గిరిజన క్రిస్టియన్లు. ఇటువంటి సందర్భాలకి ప్రతిస్పందించే విషయంలో మనం చాలాసార్లు చేసే పొరపాటు – బాధితులను జండర్‌కి మాత్రమే కుదించి చూడడం. మణిపుర ఘటన వెనుక మతం, రాజకీయ ప్రయోజ నాలతో పాటు ఆర్థిక అంశాల పాత్ర తిరుగులేనిది. కులమైనా, మతమైనా, దేశమైనా– సమాజంలోని ఏ ప్రధానమైన అంశంలోనయినా బలమైన వర్గం బలహీన వర్గంపై దాడి చేయాలంటే అందుకు అనువుగా దొరికేది ముందుగా స్త్రీలు. వారి ద్వారా ప్రత్యర్థి వర్గం మీద పైచేయి సాధించడం ఆటవిక సమాజాల స్వభావం. అదిప్ప టికీ సాగుతూనే ఉంది. అయితే ఏ స్త్రీలు ప్రధానంగా బాధితులు అన్నది గ్రహించడం చాలా ముఖ్యం. పై మహిళల విషయానికి వస్తే వారి చుట్టూ కొల్లగొట్టదగిన ఖనిజ సంపదలు ఉన్నాయి కనుక, వారు కుకీ తెగ గిరిజనులు కనుక, వారు క్రిస్టియన్లు కనుక, ఈ అస్తిత్వాలు మైనార్టీ కనుకనే వారి మీద వందలాదిగా తరలి వచ్చి దాడి చేశారు. వందల, వేల గుంపులు కూడి సాగించే దాడులలో ప్రధానంగా కులమో, మతమో, వర్గమో, దేశభక్తో ఉండి తీరుతుంది. ఆయా కక్షలు తీర్చుకోవడానికి స్త్రీలను వాహికలుగా ఉపయోగించుకుంటారు. ఈ ఘటనలో నగ్నంగా ఊరేగించిన తమ స్త్రీలను కాపాడుకోవడానికి ప్రయత్నించిన ఒక తండ్రిని, అతని కొడుకుని విద్వేషకారులు చంపేయడం చూస్తే అక్కడి మైనార్టీలకి మాత్రమే సంపదలు ఒనగూడుతున్నాయన్న తీవ్ర ద్వేషం కనపడుతుంది. ఇటువంటి ఘటనలలో గుర్తించవలసిన మరొక విషయం – దాడులు సాగించినవారే కాస్త సమయం చూసుకుని తమ ప్రతాపాలను వీడియోల రూపంలో సోషల్ మీడియాకి ఎక్కించడం. మూకుమ్మడిగా దాడి చేయడం వల్ల తమ ఉనికి తెలీదన్న ధీమా, తప్పొప్పుల విచక్షణ ఏ కోశానా లేకపోవడం, కులం, మతం, వర్గం, స్థానిక ప్రభుత్వాల దన్ను తమకు ఉంటుందన్న అహం ఆణువణువూ నిండిపోవడం, పై పెచ్చు ఇవన్నీ విజయ సంకేతాలుగా భావించడం – యథా రాజా తథా ప్రజ. ప్రభుత్వం ఈ వీడియోను అన్ని మాధ్యమాల నుంచి తొలగించే పని సత్వరం చేయడానికి కారణం ప్రజల భావోద్వేగాల పట్ల అక్కర కొద్దీ కాదు... ఎన్నికల ముందు తటస్థులను దూరం చేసుకోకూడదన్న విజ్ఞత వల్ల మాత్రమే! ఇక మెల్లిగా ‘ఉరిశిక్ష రాగం’ గొంతు సవరిస్తోంది. ఆ మహిళలకు న్యాయం జరగాలంటే ఉరిశిక్ష వేస్తామని ఒక పెద్దాయన సెలవిచ్చాడు. మరి వందల మందికి, ఆ మహిళలని మూకకి అప్పగించి చూస్తూ నిలబడిన పోలీసులకి ఉరితాళ్ళు సిద్ధం చేస్తున్నారా సారూ! ఈ సారైనా మనం ‘ఉరి’ ఉచ్చులో చిక్కుకోకూడదు. రగిలే గుండెలకీ, భయంతో వణికే మనసుకీ అటువంటి శిక్ష కాస్త సాంత్వననూ, ధైర్యాన్నీ ఇవ్వొచ్చు. అక్కడికి దుష్ట శిక్షణ జరిగిందని ఊపిరి పీల్చుకోవచ్చు. కానీ మన బాధ్యత అక్కడితో తీరేది కాదు. అందరూ ప్రభుత్వాలతో తలపడే ఆచరణలోకి దిగలేకపోవచ్చు. కనీసంగానైనా మనమేం చేయాలి? లోకపు రీతుల పట్ల మనం ఏర్పరుచుకునే అవగాహన, భవిష్యత్ నాయకుల ఎంపికకు మార్గాన్ని చూపుతుందని నమ్మాలి. దాడి చేసినవారిలో అనువుగా దొరికిన ఒకరిద్దరిని ఉరితీసి, ప్రజల కోరికని మన్నించిన వీరుల్లా ఛాతీ విరుచుకు నిలబడే అసలు దొంగలను గుర్తించాలి. మణిపురలో కుకీ జాతి హనన మారణకాండకు వెనకుండి అండ దండలు అందించిన శక్తులను ముందుగా మనం గుర్తించాలి. సొంత ప్రజల మధ్యనున్న వర్గ, సామాజిక వైరుద్ధ్యాలను అవకాశవాదంతో పక్కన పెట్టి, సాంస్కృతిక, రాజకీయ భిన్నత్వపు సౌందర్యాన్ని ధ్వంసం చేసి, ‘జాతీయ’ రహదారి మీద ఏకతా యాత్ర చేస్తున్న బుల్డోజర్కి అందరమొక్కటై ఎదురుగా నిలబడాలి. నిలబడదాం రండి! కె.ఎన్. మల్లీశ్వరి వ్యాసకర్త జాతీయ కార్యదర్శి, ప్రరవే -
పేద ఖైదీలకు ఆర్థిక భరోసా
న్యూఢిల్లీ: జరిమానా సొమ్ము గానీ, బెయిల్ రుసుము గానీ చెల్లించే స్తోమత లేక జైళ్లలో మగ్గిపోతున్న ఖైదీలకు ఆర్థిక భరోసా కల్పించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. దీనివల్ల అర్హులైన ఖైదీలకు జైళ్ల నుంచి విముక్తి లభించనుంది. జైళ్లపై భారం తగ్గనుంది. కొత్త పథకంతో నిమ్న కులాలు, పేద కుటుంబాలు, బలహీన వర్గాలకు చెందిన ఖైదీలకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర హోంశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. వారికి ఆర్థిక భరోసా కల్పించే పథకంపై భాగస్వామ్యపక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. ఆధునిక టెక్నాలజీ సాయంతో పథకాన్ని పటిష్టంగా అమలు చేయడానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలియజేసింది. ఇందులో భాగంగా ఈ–ప్రిజన్స్ వేదిక ఏర్పాటు, జిల్లా న్యాయ సేవా సంస్థలను బలోపేతం చేస్తామంది. -
మనసున్న మారాజు..
శిఖరం చేరడమే విజయం అనుకుంటే...అది చేరే ప్రస్థానంలో కష్టాలు పడుతున్న వారికి చేయూత ఇచ్చి, వెన్నుతట్టి, దారి చూపడం ఘన విజయం. ‘ఏకలవ్య’ మూమెంట్ ద్వారా రాజు కేంద్రె ఆ పనే చేస్తున్నాడు... విదర్భ(మహారాష్ట్ర)లోని సంచార తెగల్లో చదువు అనేది అరుదైన విషయం. అయితే రాజు కేంద్రె తల్లిదండ్రులు మాత్రం చదువుకు బాగా విలువ ఇచ్చారు. తమకు అక్షరం ముక్క రాకపోయినా పిల్లలను మాత్రం అవకాశం ఉన్నంత వరకు చదివించాలనుకున్నారు. రాజు చదువు ప్రభుత్వ పాఠశాలల్లోనే కొనసాగింది. హైస్కూలు వరకు పెద్దగా తెలియలేదుగానీ, కాలేజిలో చేరిన తరువాత రకరకాల దూరాలు పరిచయం అయ్యాయి. ఇంగ్లీష్‌కు తనకు మధ్య ఉండే దూరం, కమ్యూనికెషన్స్ స్కిల్క్కు తనకు మధ్య ఉండే దూరం, ఇంకా రకరకాల ఆర్థిక, సామాజిక దూరాలు! పుణె యూనివర్శిటీలో చదువుకోవాలనుకున్నప్పుడు కూడా ఇదే దూరం తనకు అడ్డుగా నిలిచించి. బుల్దాన జిల్లాలోని తన ఊరు నుంచి అక్కడికి 400 కిలోమీటర్ల దూరం. పుణె వెళ్లి చదువుకోవాలంటే, చదువు సంగతి సరే ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి. దీంతో యశ్వంత్‌రావు చవాన్ మహారాష్ట్ర ఒపెన్ యూనివర్శిటీలో చదుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత... టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(తుల్జాపూర్)లో చేరడం తన జీవితాన్ని మలుపు తిప్పింది. మేల్ఘాట్లోని ‘కొర్కు’లాంటి గ్రాస్‌రూట్ కమ్యూనిటీలతో కలిసి పనిచేసే అవకాశం లభించింది. వారి పనితీరు, నైపుణ్యాలను దగ్గరి నుంచి చూశాడు. ‘వీరికి చదువు వస్తే ఎన్ని గొప్ప విజయాలు సాధించేవారో కదా’ అనుకున్నాడు. అట్టడుగు వర్గాల విద్యార్థుల కోసం ‘ఏకలవ్య ఇండియా’ అనే స్వచ్ఛందసంస్థకు ఉద్యమస్ఫూర్తితో శ్రీకారం చుట్టాడు రాజు. స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్, టెక్నాలజికల్ స్కిల్స్, మాక్ ఇంటర్వ్యూ వరకు ఎన్నో నేర్పిస్తుంది ఏకలవ్య. దీంతో పాటు చదువుల ప్రస్థానంలో తన కష్టాల నుంచి ప్రతిష్ఠాత్మకమైన చీవ్‌నింగ్ స్కాలర్షిప్(యూకే గవర్నమెంట్ ఇంటర్నేషనల్ స్కాలర్షిప్ ప్రోగ్రాం) గెలుచుకోవడం వరకు ఎన్నో విషయాలు చెబుతున్నాడు రాజు. అట్టడుగు వర్గాల తొలితరం విద్యార్థులకు కొండంత అండగా ఉన్న ‘ఏకలవ్య’కు ఎంటర్‌ప్రెన్యూర్స్, సోషల్ వర్కర్స్, డాక్టర్లు, వివిధ రంగాల ప్రముఖలు సహకారం అందిస్తున్నారు. ‘ఏకలవ్య’ ఆర్గనైజేషన్ ఇప్పటి వరకు 300 మంది విద్యార్థులు ప్రముఖ విశ్వవిద్యాలయాలలో చదువుకునేందుకు సహాయం చేసింది. చదువు విలువ గురించి పేదకుటుంబాల దగ్గరకి వెళ్లి ప్రచారం చేస్తుంది ఏకలవ్య, 2030 నాటికి వెయ్యిమంది వరకు గ్రాస్రూట్స్ లీడర్స్‌ను తయారుచేయాలనేది ‘ఏకలవ్య’ లక్ష్యంగా పెట్టుకుంది. ‘అట్టడుగు వర్గాల గురించి అంకితభావంతో పనిచేస్తున్న రాజు ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తున్నాడు’ అని ప్రశంసపూర్వకంగా అంటున్నారు స్కూల్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్(టిస్) అసిస్టెంట్ ప్రొఫెసర్ కృష్ణ సుధీర్ పటోజు. -
కాపులు బీసీలా? ఓసీలా? అన్న అయోమయానికి బాబు గురిచేశారు: సీఎం జగన్
-
ఈబీసీలకు 4,800 ఎంబీబీఎస్ సీట్లు
న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనకబడిన వారి కోసం ఈ సంవత్సరం 4,800 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించినట్లు ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. శుక్రవారం లోక్‌సభ జీరో అవర్‌లో పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. గడిచిన రెండేళ్లలో మెడికల్ కాలేజీల్లో 24,698 గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు పెరిగాయన్నారు. 2019–20లోనే 10,565 గ్రాడ్యుయేట్, 2,153 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు పెరిగాయన్నారు. దేశంలో 75 వేల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీలు, ఇన్స్టిట్యూట్లలో సీట్లు పెంచడానికి కేంద్రం చర్యలు తీసుకుందని చెప్పారు. ఎంబీబీఎస్ కోర్సుకు అనుమతి వచ్చిన మూడేళ్లలో పీజీ కోర్సును ప్రారంభించడం తప్పనిసరి చేశామన్నారు. జిల్లా ఆస్పత్రులను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కేంద్ర పథకం కింద కొత్త కాలేజీలు.. 2014 జనవరిలో ప్రారంభించిన కేంద్ర ప్రాయోజిత పథకం కింద 82 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పథకం కింద 60 శాతం నిధులను కేంద్రం, 40 శాతం నిధులను ఆయా రాష్ట్రాలు భరిస్తాయి. ఈశాన్య రాష్ట్రాల విషయానికొస్తే, 90 శాతం నిధులు కేంద్రం, 10 శాతం రాష్ట్రాలు సమకూర్చుతాయి. మొదటి దశలో 20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 జిల్లా ఆస్పత్రులను గుర్తించి ఆమోదించామని హర్షవర్ధన్ తెలిపారు. ఒక్కో వైద్య కళాశాల స్థాపనకు రూ.189 కోట్లు ఖర్చు అవుతుందని, మొత్తం వైద్య కళాశాలల కోసం రూ.7,507 కోట్లను ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేశామని చెప్పారు. రెండో దశలో 8రాష్ట్రాల్లోని 24 కొత్త వైద్య కళాశాలల స్థాపనకు రూ.250 కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి చెప్పారు. -
పాపన్నగౌడ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి
-సర్దార్‌సర్వాయి పాపన్న జైత్రయాత్ర రాష్ట్ర కన్వీనర్ రమణాగౌడ్ హత్నూర :బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాటం చేసిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పాపన్న గౌడ్ జైత్రయాత్ర రాష్ట్ర కన్వీనర్ వీవీ రమణాగౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం హత్నూర మండలం దౌల్తాబాద్‌కు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జైత్రయాత్ర బస్సుచేరుకుంది. మండల గౌడసంఘం నాయకులు దుర్గంగౌడ్, ధునుంజయ్యగౌడ్, గౌడసంఘం నాయకులు జైత్రయాత్ర బస్సుకు స్వాగతం పలికారు. తెలంగాణతల్లి, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసిన అనంతరం రమణాగౌడ్ మాట్లాడుతూ ఈనెల18న జరిగే సర్దార్ సర్వాయిపాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. ఈనెల1న పాపన్న జన్మస్థలమైన వరంగల్జిల్లా కిలాషాపురం నుంచి బస్సుయాత్ర ప్రారంభమై గ్రామగ్రామాన తిరుగుతూ సభలు, సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి గ్రామంలో పాపన్నగౌడ్ విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలన్నారు. ఈనెల18న పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ట్యాంక్‌బండ్, అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వమే పాపన్న విగ్రహాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గౌడసంఘం రాష్ట్ర నాయకులు బాల్‌రాజ్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, రమేష్‌గౌడ్, నర్సయ్యగౌడ్, వెంకటేశ్వర్‌గౌడ్, దుర్గంగౌడ్, రాజాగౌడ్, లక్ష్మణ్‌గౌడ్, మండల నాయకులు యాదగిరిగౌడ్, రామస్వామిగౌడ్, స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. 08ఎన్ఆర్ఎస్ః41 దౌల్తాబాద్‌లో తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాలలు వేస్తున్న గౌడసంఘం నాయకులు 08ఎన్ఆర్ఎస్ః41ఎః నాయకులకు స్వాగతం పలుకుతున్న గౌడసంఘం నాయకులు -
పేదలకు మెరుగైన వైద్యం
విశాఖపట్నం : బడుగు, బలహీన వర్గాల ప్రజ లకు మెరుగైన వైద్యం అందించేలా కేజీహెచ్‌ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. అందుకనుగుణంగా కేజీహెచ్‌లో అధునాతన వైద్య పరికరాలను ఏర్పాటు చేయడంతో పాటు ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేస్తామన్నారు. రాష్ట్ర కేబినెట్ తొలి సమావేశంలో పాల్గొనేం దుకు నగరానికి వచ్చిన ఆయనను బీజేపీ నేత లు దసపల్లా హిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కామినేని మాట్లాడుతూ బుధవారం కేజీహెచ్, ఘోషా ఆస్పత్రులను స్వయంగా పరి శీలించానన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రారంభోత్సవానికి నోచుకోని విమ్స్ ఆస్పత్రిని ఆరు నెలలోపు ప్రారంభిస్తామని లేదంటే ఎయిమ్స్ సహకారంతో నడుపుతామని మంత్రి హామీ ఇచ్చారు. నగరంలో సూపర్ హాస్పిటల్ ఏర్పాటు విషయం గురించి విలేకరులు ప్రస్తావించగా సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు కన్నా పేదలకు వైద్యం అందించడమే తమకు ముఖ్యమన్నారు. రాష్ట్ర విభజన విషయంలో రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరిగేలా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కృషి చేశారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రంగమోహన్, రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు పి.వి. చలపతి రావు, నగర అధ్యక్షుడు పి.వి. నారాయణరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జె.పృథ్వీరాజ్, నాయకులు చెరువు రామకోటయ్య, నరేంద్ర, విమ్స్ ఆస్పత్రి వైద్యుడు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.