న్యూఢిల్లీ: జరిమానా సొమ్ము గానీ, బెయిల్ రుసుము గానీ చెల్లించే స్తోమత లేక జైళ్లలో మగ్గిపోతున్న ఖైదీలకు ఆర్థిక భరోసా కల్పించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. దీనివల్ల అర్హులైన ఖైదీలకు జైళ్ల నుంచి విముక్తి లభించనుంది. జైళ్లపై భారం తగ్గనుంది.
కొత్త పథకంతో నిమ్న కులాలు, పేద కుటుంబాలు, బలహీన వర్గాలకు చెందిన ఖైదీలకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర హోంశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. వారికి ఆర్థిక భరోసా కల్పించే పథకంపై భాగస్వామ్యపక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. ఆధునిక టెక్నాలజీ సాయంతో పథకాన్ని పటిష్టంగా అమలు చేయడానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలియజేసింది. ఇందులో భాగంగా ఈ–ప్రిజన్స్ వేదిక ఏర్పాటు, జిల్లా న్యాయ సేవా సంస్థలను బలోపేతం చేస్తామంది.
Comments
Please login to add a commentAdd a comment