poor families
-
ఎన్నికలు ముగిసే వరకూ ఆహార భద్రత !
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని నిరుపేద కుటుంబాలకు ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం పథకాన్ని ఈ ఏడాది డిసెంబర్ తర్వాత సైతం కొనసాగించే అవకాశాలున్నాయని కేంద్రప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రాజకీయ కారణాలు, వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని మరో ఆరు నెలల పాటు కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పథకం ద్వారా 81 కోట్ల మంది లబ్ధిదారులకు కేంద్రప్రభుత్వం ప్రతి నెల ఐదు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తోంది. నిజానికి ఈ ఉచిత బియ్యం పంపిణీ ఈ ఏడాది డిసెంబర్ వరకు కొనసాగించాలని కేంద్రం ఈ ఏడాది జనవరిలోనే నిర్ణయించడం తెల్సిందే. అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఉచిత బియ్యం పథకాన్ని ప్రధానాస్త్రంగా చేసుకుని అధికార బీజేపీ ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టింది. గతంలో రెండుసార్లు బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు దేశంలోని పేద, మధ్య తరగతి వర్గాలు అండగా నిలిచిన నేపథ్యంలో ఈ పథకాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించి ఈసారీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ యోచిస్తోంది. దీంతోపాటే ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు రెండేళ్లుగా ఏడాది గరిష్టంగా ఒక్కో రీఫిల్‌కు రూ.200 సబ్సిడీ చొప్పున 12 సిలిండర్లను రాయితీ ధరకు అందిస్తోంది. వంటగ్యాస్ ధరలు ఎక్కువ స్థాయిలోనే కొనసాగితే ఈ గడువును మరో ఆరు నెలల పాటు పొడిగించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
ఇళ్ల స్థలాల పంపిణీ కోసం సుదీర్ఘ న్యాయపోరాటం
-
అమరావతిలో సీఎం వైఎస్ జగన్ సరికొత్త చరిత్ర
-
రాజధాని పేదల ఇళ్ల స్థలాల కోసం మరో 268 ఎకరాలు
-
ఏపీలో పెద్ద ఎత్తున గృహనిర్మాణాలు
-
పేద ఖైదీలకు ఆర్థిక భరోసా
న్యూఢిల్లీ: జరిమానా సొమ్ము గానీ, బెయిల్ రుసుము గానీ చెల్లించే స్తోమత లేక జైళ్లలో మగ్గిపోతున్న ఖైదీలకు ఆర్థిక భరోసా కల్పించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. దీనివల్ల అర్హులైన ఖైదీలకు జైళ్ల నుంచి విముక్తి లభించనుంది. జైళ్లపై భారం తగ్గనుంది. కొత్త పథకంతో నిమ్న కులాలు, పేద కుటుంబాలు, బలహీన వర్గాలకు చెందిన ఖైదీలకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర హోంశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. వారికి ఆర్థిక భరోసా కల్పించే పథకంపై భాగస్వామ్యపక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. ఆధునిక టెక్నాలజీ సాయంతో పథకాన్ని పటిష్టంగా అమలు చేయడానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలియజేసింది. ఇందులో భాగంగా ఈ–ప్రిజన్స్ వేదిక ఏర్పాటు, జిల్లా న్యాయ సేవా సంస్థలను బలోపేతం చేస్తామంది. -
ప్రభుత్వ సాయంతో నిలదొక్కుకుంటున్న పేద కుటుంబాలు
-
సాటిలేని ‘ఉప’కారం.. ఎస్సీ సబ్‌ప్లాన్‌పై కేంద్ర గణాంకాల్లో ఏపీకి అగ్రస్థానం
సాక్షి, అమరావతి: అత్యంత సమర్థంగా ఎస్సీ ఉప ప్రణాళికను అమలు చేస్తూ ఆయా కుటుంబాలకు సాయం అందించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ ఉప ప్రణాళికను ఈ ఆర్థిక ఏడాది తొలి ఆరు నెలల్లోనే అమలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. 2022–23 రెండో త్రైమాసికం వరకు (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్) దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పథకాల అమలు పురోగతిపై రూపొందించిన నివేదికను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ ఈ నెల 11వ తేదీన విడుదల చేసింది. ఉపప్రణాళిక ద్వారా చిత్తశుద్ధితో ఎస్సీ కుటుంబాలకు సాయం అందించడం, ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల మంజూరుతో పాటు పట్టణ పేదలకు సాయం, వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్ల జారీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా మంచి పనితీరు కనపరిచిందని కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రశంసించింది. ► నిర్దేశిత లక్ష్యాల్లో 90 శాతానికిపైగా అమలు చేసిన రాష్ట్రాలను చాలా మంచి పనితీరు కనపరిచినట్లు పరిగణించారు. 80 నుంచి 90 శాతం మేర అమలు చేసిన రాష్ట్రాలను మంచి పనితీరు కనపరిచిన జాబితాలో చేర్చారు. 80 శాతం లోపు అమలు చేసిన రాష్ట్రాలను పనితీరు బాగోలేని వాటిగా నివేదిక వర్గీకరించింది. ► ఎస్సీ ఉప ప్రణాళిక కింద దేశంలోని 22 రాష్ట్రాల్లో మొత్తం 29.84 లక్షల ఎస్సీ కుటుంబాలకు సాయం అందించగా అందులో 29.10 లక్షల ఎస్సీ కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్‌లో సహాయం అందినట్లు నివేదిక వెల్లడించింది. మిగతా మరే రాష్ట్రం కూడా లక్ష ఎస్సీ కుటుంబాలకు సహాయం చేయలేదని నివేదిక పేర్కొంది. మిగతా రాష్ట్రాలు కేవలం వేల సంఖ్యలో మాత్రమే సాయానికి పరిమితమయ్యాయి. కర్నాటకలో 22,884 మంది ఎస్సీ కుటుంబాలకు ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా సాయం అందించగా మిగతా రాష్ట్రాలు అంతకంటే తక్కువ సంఖ్యకే పరిమితమయ్యాయి. ► ఈ ఆర్థిక ఏడాది తొలి ఆర్నెళ్లలో దేశవ్యాప్తంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కింద 11,80,746 మంది ఎస్సీ విద్యార్థులు సాయం పొందగా అందులో ఆంధ్రప్రదేశ్‌లోనే 6.15 లక్షల మంది ఎస్సీ విద్యార్ధులు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు అందుకోవడం గమనార్హం. పేదలకు సాయం.. ఇళ్లు.. లక్ష్యానికి మించి వ్యవసాయ కనెక్షన్లు... ► దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నాటికి పట్టణ ప్రాంతాల్లోని 3.47 లక్షల పేద కుటుంబాలకు సహాయం అందించగా ఆంధ్రప్రదేశ్‌లోనే 3.28 లక్షల మంది పట్టణ పేద కుటుంబాలకు సాయం అందినట్లు నివేదిక వెల్లడించింది. ► పట్టణ ప్రాంతాల్లో 24 రాష్ట్రాల్లో ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ కింద 3.29 లక్షల గృహాలను నిర్మించగా ఒక్క ఆంద్రప్రదేశ్‌లోనే 1,38,245 ఇళ్ల నిర్మాణంతో అగ్రస్థానంలో ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఆ తరువాత బిహార్ 99,718 గృహాలను నిర్మించింది. మిగతా రాష్ట్రాలు స్వల్ప సంఖ్యకే పరిమితమయ్యాయి. ► వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలో ఏపీ చాలా మంచి పనితీరు కనపరిచినట్లు నివేదిక తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 24,852 విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా తొలి ఆర్నెళ్లలోనే లక్ష్యానికి మించి ఏకంగా 46,856 విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయడం గమనార్హం. లక్ష్యానికి మించి 754 శాతం నమోదైనట్లు నివేదిక పేర్కొంది. ► ఏపీలో అంగన్వాడీలు, ఐసీడీఎస్‌లు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీలతో పాటు 257 ఐసీడీఎస్‌లు నూటికి నూరు శాతం పని చేస్తున్నట్లు పేర్కొంది. -
ఒక్క రూపాయికే పక్కా ఇల్లు
మాటే మంత్రంగా.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. రాష్ట్రాభివృద్ధే ఆశయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారు. ప్రజాసంకల్ప యాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతున్నారు. ఒకే ఒక్క రూపాయికి లక్షలాది రూపాయలు విలువచేసే పక్కా ఇంటిని పేదలకు అందించే బృహత్తర కార్యక్రమానికి విజయనగరంలోని సారిపల్లి వేదికగా మారింది. సకల సదుపాయాలతో నిర్మించిన టిడ్కో ఇళ్లను మంత్రులు ప్రారంభించి లబ్ధిదారులకు గురువారం అప్పగించనున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: పట్టణాల్లో ఇళ్లులేని నిరుపేద కుటుంబాలకు ఉచితంగా ఇళ్లు నిర్మించి, పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ పత్రాలను చేతికి అందిస్తానన్న సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ సాకారమవుతోంది. విజయనగరానికి సమీపంలోని సారిపల్లి వద్ద రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ ఏపీ టౌన్షిప్ ఇన్ఫ్రాస్టక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) ఆధ్వర్యంలో జగనన్న కాలనీ సిద్ధమైంది. 800 ఇళ్లను జిల్లా ఇన్చార్జి మంత్రి బూడి ముత్యాలనాయుడు, రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్ గురువారం ప్రారంభించనున్నారు. ఆయా లబ్ధిదారులకు ఇంటిపత్రాలను అందించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచే అక్కడ పండగ వాతావరణం నెలకొంది. విద్యుత్‌దీపాల కాంతులతో కాలనీలోని ఇళ్లు జిగేల్మంటున్నాయి. అందంగా.. విశాలంగా.. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిరుపేదల కోసం ప్రభుత్వం నెల్లిమర్ల మండలం సారిపల్లి వద్ద జి+3 విధానంలో రూ.161.52 కోట్ల వ్యయంతో 2,656 ఇళ్ల నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. వాటిలో ఏ–కేటగిరిలో 300 చదరపు అడుగుల చొప్పున విస్తీర్ణంతో 1,536 ఇళ్లు, బి–కేటగిరీలో 365 చదరపు అడుగుల విస్తీర్ణంతో 192 ఇళ్లు, సి–కేటగిరీలో 430 చదరపు అడుగుల విస్తీర్ణంతో 928 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఉన్నాయి. వాటిలో అన్ని రకాల సౌకర్యాలతో సిద్ధమైన 800 ఇళ్లను లబ్ధిదారులకు గురువారం మంత్రుల చేతుల మీదుగా అందించడానికి ఏపీ టిడ్కో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. లక్షల ఆస్తి ఒక్క రూపాయికే... రాష్ట్ర ప్రభుత్వం ఏ–కేటగిరి కింద ఒక్కో ఇంటిని రూ.6.55 లక్షల వ్యయంతో నిర్మింస్తోంది. ఆ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు ఇస్తోంది. మిగతా రూ.5.05 లక్షలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. మొత్తంమీద లబ్ధిదారులకు మాత్రం కేవలం ఒక్క రూపాయికే రూ.6.55 లక్షల విలువగల ఇంటిని అందజేస్తోంది. సి–కేటగిరీ కింద నిర్మించే 430 చదరపు అడుగుల విస్తీర్ణంగల డబుల్ బెడ్రూం ఇళ్లకు ఒక్కోదానికి రూ.8.55 లక్షల చొప్పున నిర్మాణ వ్యయం అవుతోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.1.50 లక్షలు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం రూ.2.90 లక్షలు సమకూర్చుతోంది. లబ్ధిదారు తన వాటా కింద రూ.50వేలు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు రుణం కింద రూ.3.65 లక్షలను అధికారులు సమకూరుస్తున్నారు. రూ.41 కోట్లతో మౌలిక సదుపాయాలు... సారిపల్లిలోని జగనన్న టిడ్కో కాలనీ లేఅవుట్లో లబ్ధిదారుల ఇళ్లకు సామాజిక, మౌలిక వసతులు కల్పించేందుకు రూ.41.02 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. తాగునీటి సరఫరా కోసం రూ.8.93 కోట్లు, రోడ్ల నిర్మాణానికి రూ.2.55 కోట్లు, డ్రైనేజీ ఏర్పాటుకు రూ.1.61 కోట్లు, విద్యుత్ సరఫరా కోసం రూ.3.97 కోట్లు, మురుగునీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణానికి రూ.4.92 కోట్లు, కాలనీ చుట్టూ రిటైనింగ్ వాల్ కోసం రూ.11.27 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. అలాగే, విజయనగరం శివారు సోనియానగర్‌లో 1120 ఇళ్లు, నెల్లిమర్లలో 570, బొబ్బిలిలో 1680, రాజాంలో 336 మొత్తం 3,712 ప్లాట్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిని కూడా పూర్తిచేసి వచ్చే డిసెంబర్ నాటికి లబ్ధిదారులకు కేటాయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంట్లో చక్కని వసతులు... ఇళ్లలో పూర్తిగా టైల్స్‌తో కూడిన గచ్చు ఏర్పాటు చేశారు. బెడ్ రూమ్, లివింగ్ రూమ్ ఆకట్టుకునేలా రూపొందించారు. గ్రానైట్ ఫ్లాట్‌ఫాంతో కూడిన వంటగది, సింక్ చక్కగా ఉన్నాయి. ఆధునిక వసతులతో కూడిన టాయిలెట్ కూడా ఉంది. ఇక కాలనీలో 40 అడుగుల వెడల్పుతో కూడిన రోడ్ల నిర్మాణ పనులను ఇప్పటికే పూర్తిచేశారు. విద్యుత్ సరఫరా ఇప్పటికే కల్పించారు. అన్ని వసతులతో సిద్ధమైన ఇళ్లను మంత్రులు లబ్ధిదారులకు అందజేయనున్నారు. లబ్ధిదారుల చేతికి రిజిస్ట్రేషన్ పత్రాలు... టిడ్కో కాలనీలో ఇళ్ల మంజూరుపత్రాలతో పాటు లబ్ధిదారుల పేరిట రిజి స్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లను కూడా మంత్రుల చేతుల మీదుగా అందజేస్తాం. తొలివిడతలో ఏ–కేటగిరీకి సంబంధించిన 15 బ్లాకుల్లోని 480 ఇళ్లు, సి–కేటగిరీకి సంబంధించి 10 బ్లాకుల్లోని 320 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను సిద్ధం చేశాం. లబ్ధిదారులకు ఎలాంటి ఖర్చులు, వ్యయప్రయాసలు లేకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి డాక్యుమెంట్లను ఇస్తాం. సారిపల్లి లే అవుట్లో మిగిలిన 1,856 ప్లాట్లను ఆగస్టునాటికి సిద్ధం చేస్తాం. – ఎస్.జ్యోతి, ఎస్ఈ, ఏపీటిడ్కో (చదవండి: శ్రీకాకుళం జిల్లా పర్యటనకు సీఎం జగన్) -
నవ్విపోదురు గాక..!
విజయనగరం ఫోర్ట్: విద్యుత్‌శాఖలో జూనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను విజయనగరంలో ఉన్న తన సొంత ఇంటికి అక్రమంగా వినియోగించుకుంటున్నారు. విద్యుత్‌శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి కూడా ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను తన సొంత ఇంటికి మూడేళ్లుగా వాడుకుంటున్నారు. విద్యుత్‌శాఖలో జూనియర్ అకౌంట్స్ అధికారిగా పనిచేస్తున్న ఓ ఉద్యోగి తన సొంత ఇంటికి ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను వినియోగించుకుంటున్నారు. ఈ ముగ్గురు ఉద్యోగులే కాదు. అనేక మంది ఉద్యోగులు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన పేదలకు ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్ లబ్ధిని అక్రమ మార్గాన పొందుతూ ప్రభుత్వ ధనాన్ని లూటీ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీల్లో అధికశాతం మంది విద్యుత్ బిల్లులు కూడా చెల్లించుకోలేని పరిస్థితి. అటువంటి వారికి చేయూత నివ్వాలనే ఉద్దేశ్యంతో 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వారికి ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. అయితే కంచే చేను మేసినట్లు విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ను పొందుతుండడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లబ్ధిపొందుతున్న ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు 1,00,987మంది జిల్లాలో ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ పథకం కింద లబ్ధిదారులు 1,00,987 మంది. వారికి ఏడాదికి ప్రభుత్వం ఉచిత విద్యుత్‌కు చెల్లిస్తున్న నిధులు రూ.10.95 కోట్లు. గుర్తించిన అనర్హులు 19,996 మంది జిల్లాలో ఎస్సీ, ఎస్టీ ఉచిత విద్యుత్ పథకాన్ని అక్రమంగా పొందుతున్న వారు 19, 996 మంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించి జాబితాను విద్యుత్ శాఖ అధికారులకు పంపించింది. 2019 నుంచి ఉచిత విద్యుత్ పొందుతున్న వీరికి ప్రభుత్వం వెచ్చించింది రూ.6 కోట్లు. అనర్హులపై జాబితాపై సర్వే ప్రభుత్వం అందించిన అనర్హుల జాబితా ప్రకారం విద్యుత్‌శాఖ అధికారులు ఇప్పటివరకు 2,880 మందిని సర్వే చేశారు. ఇంకా 17,116 మందిని సర్వే చేయాల్సి ఉంది. సర్వేలో విస్తుగొల్పే విషయాల్లో వెల్లడవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలు కాని బీసీ, ఓసీ వర్గాల వారు కూడా ఉచిత విద్యుత్ పొందుతుండడం గమనార్హం. నెలాఖరు లోగా సర్వే పూర్తి అనర్హుల జాబితా ప్రకారం ఇప్పటి వరకు 2,880 మందిని సర్వే చేశాం. ఈ నెలాఖరు లోగా పూర్తి చేస్తాం. అనర్హుల్లో ఉద్యోగులు ఉంటే వారి వివరాలు ప్రభుత్వానికి తెలియజేస్తాం. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి చర్యలు తీసుకుంటాం. – పి.నాగేశ్వరావు, విద్యుత్‌శాఖ ఎస్ఈ (చదవండి: సారా రహిత పార్వతీపురమే లక్ష్యం...) -
బంపరాఫర్.. ఆ షాపులో ఒక డ్రెస్ ఖరీదు రూ.1 మాత్రమే..!
బెంగళూరు: కరోనా మహమ్మారి సమయంలో పేదలు జీవనోపాధి కోల్పోయి నానా అవస్థలు పడ్డారు. చాలా మంది ఎన్జీవోస్, స్యచ్ఛంద సంస్థలు తమ వంతు సాయం అందిచడానికీ ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే నిరుపేదలను ఆదుకునేలా బెంగళూరులోని నలుగురు స్నేహితులు సరికొత్త ఆలోచనతో ముందుకు రావడమే కాక కార్యాచరణలోకి తీసుకువచ్చి అందర్నీ ఆశ్చర్య పరిచారు. (చదవండి: ఎంత మంచి వాడో.. ప్రతి డెలివరీ బాయ్‌కు గిఫ్ట్ ఇస్తాడట) ఈ మేరకు మెలిషా నొరోన్హా అనే ఆమె తన భర్త వినోద్ లోబో, తల్లి గ్లాస్గో, మరో ఇద్దరు స్నేహితులు నితిన్ కుమార్, విఘ్నేశ్‌తో సహా కలసి 2013లో పేద ప్రజల కోసం ఒక ట్రస్ట్‌ని ఏర్పాటు చేశారు. అయితే ఈ కరోనా మహమ్మారి తర్వాత ప్రజల దీనస్థిత చూశక వారికి క్లాత్ బ్యాంక్ అనే ఆలోచన వచ్చింది. ఆ క్రమంలోనే తాము ఇమాజిన్ క్లాత్స్ బ్యాంక్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ 2021లో బెరటేన అగ్రహారంలో లవకుశ లే అవుట్‌లోని ఒక చిన్న డబల్ బెడ్రూం అపార్ట్మెంట్లో షాపును ప్రారంభించారు. అయితే ఈ షాపుకి అక్కడ ఎలక్ట్రానిక్ సిటీ చుట్టుపక్కల ఉన్నవాళ్లు బట్టలను విరాళంగా ఇచ్చారు. ఈ క్లాత్ బ్యాంక్‌లో పేదవాళ్లు తమకు నచ్చిన దుస్తులను ఎన్నుకోవచ్చు. పైగా వాటి ధర రూ.1 మాత్రమే. పైగా ఈ క్లాత్ షాపులోని క్లాత్‌లు అమ్మగా వచ్చిన డబ్బులను కూడా వారు నిరుపేద కుటుంబాల పిల్లల చదువు, వైద్య ఖర్చుల అవసరాలకు నిధులుగా సమకూరుస్తున్నారు. అంతేకాదు ఒక పేద కుటుంబం సంవత్సరానికి దుస్తులు కోసం రూ. 2000 ఖర్చు చేస్తున్నారు. అదే ఈ బ్యాంక్ ద్వారా వారికి డబ్బు ఆదా కూడా అవుతుంది. ఈ మేరకు వినోద్, నితిన్ మాడుతూ.."2002లో మంగళూరులోని సెయింట్ అలోసియస్లో మా కాలేజ్ డేస్‌లోనే ఈ క్లాత్ బ్యాంక్ ఆలోచన ఉంది. మేము అప్పుడు కూడా మా స్నేహితు సాయంతో దుస్తులను సేకరించి పేదలకు పంపిణీ చేసేవాళ్లం." అని అన్నారు. (చదవండి: ప్రమాదం ఆ కుక్క జీవితాన్ని మార్చింది.. ఏకంగా మనిషిలా..) -
బాధిత కుటుంబాలకు తక్షణమే సాయం.. మార్గదర్శకాలివే
సాక్షి, అమరావతి: పేద కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయినప్పుడు సత్వరమే ఆదుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న సంపాదించే వ్యక్తి సహజమరణం చెందితే వారి కుటుంబ సభ్యులకు (నామినీ)కి రూ. లక్ష పరిహారాన్ని ఇన్సూరెన్స్ కంపెనీతో సంబంధం లేకుండా నేరుగా ప్రభుత్వమే చెల్లించనుంది. ఈ మేరకు కార్మిక ఉపాధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.అనంతరాము ఆదివారం ఉత్తర్వులిచ్చారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు తక్షణమే ఉపశమనం కలిగేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్ బీమా పథకానికి సంబంధించి తాజా మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈ నిబంధనలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 18 నుంచి 70 ఏళ్ల వయసు వారై ఉండి, ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత వైకల్యం పొందిన వారికి రూ.5 లక్షలు ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుందని తెలిపారు. దీనికి సంబంధించి ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ స్కీముకు నోడల్ ఏజెన్సీగా కార్మిక శాఖ, ఇంప్లిమెంటింగ్ (అమలు) ఏజెన్సీగా గ్రామ సచివాలయ/వార్డు సచివాలయ విభాగం పనిచేస్తుంది. బీమా పరిధిలోకి దారిద్య్ర రేఖ దిగువన ఉన్న అన్ని కుటుంబాలు వస్తాయి. వైఎస్సార్ బీమా పథకంపై ఇటీవల సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష చేశారు. ఈ పథకం నుంచి కేంద్రం వైదొలిగినా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఇన్సూరెన్స్ మొత్తాన్ని భరిస్తోంది. అయినప్పటికీ బీమా కంపెనీలు, బ్యాంకుల ద్వారా ఎదురవుతున్న చిక్కుల నేపథ్యంలో పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకునేలా వైఎస్సార్ బీమాలో మార్పులు చేయాలని సీఎం ఆదేశించారు. ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకున్నారు. తాజా మార్గదర్శకాలు ఇవే ► లబ్ధిదారులను గుర్తించడం కోసం గ్రామ వార్డు సచివాలయ వలంటీర్లు ఇంటింటి సర్వే చేస్తారు. లబ్ధిదారులను నిర్ధారించే అధికారం (రిజిçష్ట్టరింగ్ అథారిటీ) వెల్ఫేర్ అసిస్టెంట్‌కు ఇస్తారు. ఈ జాబితాను కార్మిక శాఖ పరిశీలిస్తుంది. ► వైఎస్సార్ బీమా పరిధిలోకి రావాలంటే 18 ఏళ్ల పైనా, 70 ఏళ్లలోపు ఉండి, దారిద్య్రరేఖకు దిగువన ఉండాలి. అతను లేదా ఆమె కుటుంబ పోషణ చేసే వారై ఉండాలి. ► వయసు నిర్ధారణ విషయంలో నోడల్ ఏజెన్సీ సంతృప్తి చెందాలి. ► ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో వైఎస్సార్ బీమా రిజిస్ట్రేషన్ సదుపాయం ఉంటుంది. ► లబ్ధిదారుల నమోదు సంబంధించిన ఫిర్యాదులను డీఆర్డీఏ పీడీ పరిష్కరిస్తారు. ► సహజ మరణం చెందిన వారికి ఇచ్చే లక్ష రూపాయలు చట్టబద్ధమైన వారసుడికి చెందే విషయమై గ్రామ/వార్డు వలంటీర్లే పర్యవేక్షణ చేస్తారు. ► ప్రమాదవశాత్తు మరణం, లేదా శాశ్వత వైకల్యం గుర్తించే విషయంలో గ్రామ/వార్డు సెక్రటేరియట్ పర్యవేక్షణ చేస్తుంది. ► జిల్లా స్థాయిలో ఈ పథకాన్ని జాయింట్ కలెక్టర్లు (సంక్షేమం) నిశితంగా పరిశీలిస్తారు. కుటుంబ పోషకుడు మరణించిన 15 రోజుల నుంచి 30 రోజుల లోపు అన్ని రకాల సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు. ► నామినీ లేదా వారసులకు చెల్లింపులు ఆన్లైన్ ద్వారా బ్యాంకు ఖాతాకు (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్–డీబీటీ) చేస్తారు. ► పర్యవేక్షణకు జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కన్వీనర్‌గా ఉంటారు. మరో 8 మంది సభ్యులుగా ఉంటారు. ► రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీకి కార్మిక ఉపాధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చైర్మన్‌గానూ, మరో 9 మంది వివిధ విభాగాల కమిషనర్లు, డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారు. -
ఒక్కరికైనా సాయపడండి
‘‘ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో పేదలకు సాయం చేయగలిగినవారు కనీసం రోజులో ఒక్కరికైనా సహాయం చేయడానికి ప్రయత్నించండి’’ అని కోరుకుంటున్నారు రకుల్‌ప్రీత్ సింగ్. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయిన దాదాపు 200 కుటుంబాలకు ఆహారం అందజేస్తున్నారు రకుల్. గుర్గావ్లోని తన ఇంటి సమీపంలో ఉన్న పేదవారికి రకుల్ ఈ సహాయం చేస్తున్నారు. ‘‘లాక్డౌన్ కారణంగా పేదవారి జీవనశైలి దెబ్బతింటోంది. కనీస అవసరాలు తీరని పేదవారికి మేం సహాయం చేయాలనుకున్నాం. మా వంతుగా మా ఇంటి సమీపంలోని బస్తీలో నివాసం ఉంటున్న 200 కుటుంబాలకు రెండు పూటలా భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. లాక్డౌన్ పూర్తయ్యేంతవరకు ఇలా చేయాలనుకున్నాం. ఒకవేళ లాక్డౌన్ పొడిగిస్తే మా సహాయాన్ని కూడా కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇదంతా మా నాన్నగారి (కుల్విందర్ సింగ్) ప్రోత్సాహంతోనే జరుగుతోంది. విపత్కర పరిస్థితుల్లో నా వంతుగా నేను ఏదో సాయం చేయాలని తాపత్రయపడుతుంటాను’’ అని పేర్కొన్నారు రకుల్. -
పేదలకు కనీస ఆదాయ భద్రత
న్యూఢిల్లీ/పణజీ/రాయ్‌పూర్: లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి తమ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలోని పేదలందరికీ కనీస ఆదాయ భద్రత కల్పించి పేదరికాన్ని రూపుమాపుతామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ప్రకటించారు. దీంతో ‘పేదరికాన్ని తొలగించండి’(గరీబీ హఠావో) అంటూ 1971 లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఇచ్చిన నినాదాన్ని మళ్లీ రాహుల్ అందుకున్నట్లైంది. ప్రధాని మోదీ ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సరిగ్గా 4రోజుల ముందు కాంగ్రెస్ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో రైతుల ర్యాలీలో సోమవారం రాహుల్ మాట్లాడారు. ‘చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ప్రజలందరికీ కనీస ఆదాయ భద్రతను కాంగ్రెస్ కల్పించబోతోంది. దీంతో దేశంలో ఆకలి, పేదరికం అనేదే ఉండదు’ అని రాహుల్ అన్నారు. చెప్పింది చేస్తానని, పథకాన్ని దేశమంతటా అమలు చేస్తానన్నారు. ర్యాలీలో బీజేపీపై రాహుల్ పలు విమర్శలు చేశారు. 15 మంది బడా పారిశ్రామికవేత్తలు తీసుకున్న రూ.3.5కోట్ల రుణాలను కేంద్రం మాఫీ చేసిందనీ, రైతులకు రుణమాఫీ చేయలేదని అన్నారు. మోదీ ప్రభుత్వం రెండు భారత దేశాలను సృష్టించాలని ప్రయత్నిస్తోందనీ, వాటిలో ఒకటి రఫేల్ కుంభకోణం, అనీల్ అంబానీ, నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ తదితరులు ఉండే దేశం కాగా, ఇంకొకటి పేద రైతులు ఉండే దేశమని రాహుల్ వ్యాఖ్యానించారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు ఓటేసి భారీ మెజారిటీతో అధికారం కట్టబెట్టిన రైతులకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ ర్యాలీని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. కనీస ఆదాయ భద్రత హామీపై బీజేపీ స్పందించింది. ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చిన వందలకొద్దీ అబద్ధపు హామీల్లో ఇదొకటనీ, వాటిని అమలు చేయడం ఆ పార్టీకి కుదరని పని అని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఆ టేపులు నిజమైనవే రఫేల్ ఒప్పందానికి సంబంధించిన వ్యాఖ్య లున్న గోవా ఆడియో టేపులు నిజమైనవేనని రాహుల్ ఆరోపించారు. గోవా ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ రక్షణ మంత్రి మనోహరీ పరీకర్ వద్ద రఫేల్ ఒప్పందం గురించిన భారీ రహస్యాలు ఉన్నాయనీ, వాటి వల్లనే ప్రధాని నరేంద్ర మోదీపై అధికారం చెలాయించే అవకాశం పరీకర్‌కు దక్కిందని రాహుల్ అన్నారు. రఫేల్ ఒప్పందానికి సంబంధించిన రహస్య పత్రాలు పరీకర్ వద్ద ఉన్నాయి కాబట్టే ఆయన పదవిలో ఉన్నాడంటూ గోవా మంత్రి విశ్వజిత్ రాణే ఒక గుర్తు తెలియని వ్యక్తికి చెబుతున్న ఆడియో టేపులు ఈ నెల మొదట్లో బయటపడటం తెలిసిందే. రాహుల్ మాట్లాడుతూ ‘30 రోజులవుతున్నా వీటిపై విచారణేదీ లేదు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. మంత్రిపై ఏ చర్యలూ లేవు. ఈ ఆడియోటేపులు నిజమైనవేనని తెలుస్తోంది. రఫేల్ రహస్య పత్రాలు పరీకర్ దగ్గర ఉన్నాయి’ అని అన్నారు. రఫేల్ డీల్‌కు చెందిన ఆధారాలు తన పడకగదిలో ఉన్నాయంటూ పరీకర్ వ్యాఖ్యానించినట్లుగా గతంలో వచ్చిన వార్తలపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటలయుద్ధం జరిగింది. ఆ ఆడియో టేపులు నకిలీవనీ, నిజాలను దాచి అబద్ధాలను వ్యాప్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని పరీకర్ అప్పట్లో చెప్పారు. బీజేపీ నేత అనంతకుమార్ హెగ్డే కేంద్ర మంత్రి పదవిలో ఉండేందుకు అనర్హుడనీ, ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని రాహుల్ అన్నారు. అంతకుముందు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు దినేశ్ గుండూరావ్ భార్యను ఉద్దేశించి హెగ్డే అనుచిత వ్యాఖ్యలు చేశారు. గోవాలో రాహుల్, సోనియా రాహుల్ తన తల్లి, యూపీఏ చైర్పర్సన్ సోనియాతో కలిసి శని, ఆదివారాల్లో గోవాలో వ్యక్తిగతంగా పర్యటించారు. పార్టీ నేతలతో సమావేశాలు అక్కడ ఏర్పాటు చేయలేదు. ఆదివారం వారు ఓ బీచ్ రెస్టారెంట్‌కు వెళ్లారు. కాగా, గోవాలో మండోవి నదిపై తమ ప్రభుత్వం ఏర్పాటుచేసిన 5.1 కిలో మీటర్ల పొడవైన తాళ్ల వంతెనను రాహుల్ సందర్శించి, దేశాన్ని బీజేపీ ఎలా మారుస్తుందో చూడాలని రాహుల్‌ను ట్విట్టర్లో బీజేపీ కోరింది. మాజీ ప్రధాని వాజ్‌పేయి పేరు మీదుగా ఈ వంతెనకు అటల్ సేతు అని పేరు పెట్టారు. -
అధ్వానమన్నా క్యాంటీన్లు !
ఆదోని: టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన అన్న క్యాంటీన్ల నిర్వహణ పట్టణంలో అబాసుపాలు అవుతోంది. పర్యవేక్షణ కొరవడి ఇష్టారాజ్యంగా మారింది. క్యాంటీన్లు ప్రారంభించిన మూడు రోజలకే ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రూ.5కే అల్పాహారం, భోజనం దొరుకుతోందన్న ఆశతో క్యాంటీన్లకు వస్తున్న వారు నిరాశగా వెనుదిరుగుతున్నారు. నిరుపేదలందరికీ చౌకగా అల్పాహారం, భోజనం అన్న క్యాంటీన్ల ద్వారా అందుబాటులోకి తెచ్చామని పాలకులు గోప్పలు చెప్పుకోవడం తప్పా వాస్తవ పరిస్థితి విరుద్ధంగా ఉంది. మూడు రోజుల కిందట బుధవారం పట్టణంలోని రైల్వే స్టేషను రోడ్డు, నిర్మల్ టాకీసు ఎదురుగా అన్న క్యాంటీన్లను అధికారులు, నాయకులు హంగు, ఆర్భాటాలతో ప్రారంభించిన విషయం తెలిసిందే. నాణ్యత పాటించకోవడంతో అధ్వానమన్నా భోజనం అంటున్నారు పేదలు. అరగంటనే టోకన్లు ఖాళీ... ఉదయం 7 గం. నుంచి 9 గం వరకు అల్పాహారం, మధ్యాహ్నం 1 గం. నుంచి 3 గం. వరకు, రాత్రి 7 గం. నుంచి 9 గం. వరకు భోజనం అందుబాటులో ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఉదయం 200 మందికి అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి మూడు వందల మందికి చొప్పున భోజన సదుపాయం కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అయితే క్యాంటీన్లు తెరిచిన అరగంట లోపే టోకెన్లు ఖాళీ అవుతున్నాయి. టోకెన్ల జారీలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం అక్షయపాత్ర అనే సంస్థకు అప్పగించింది. అయితే టీడీపీ మద్దతుదారులు హవా కొనసాగిస్తున్నారు. టోకన్ల పంపిణీలోనూ వ్యత్యాసాలు చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. క్యాంటీన్ల పర్యవేక్షణ బాధ్యతను ప్రభుత్వం నిర్దిష్టంగా ఏ అధికారికి అప్పగించలేదు. దీంతో పర్యవేక్షణ కొరవడి నిర్వహణ ఆదిలోనే గాడి తప్పింది. ఎమ్మిగనూరులో వంట... క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను స్వీకరించిన అక్షయపాత్ర సంస్థ పట్టణంలోని రెండు క్యాంటీన్లకు అవసరం అయిన అల్పాహారం, భోజనం తయారీ ఎమ్మిగనూరులో చేపట్టింది. ఎమ్మగనూరు నుంచి ప్రత్యేక వాహనంలో పట్టణానికి తెస్తున్నారు. దీంతో అల్పాహరం, భోజనం టోకెన్లు తీసుకున్న వారు నిరీక్షించాల్సి వస్తోంది. వాహనం రాగానే అల్పాహారం, భోజనం కోసం ఎగబడుతుండడంతో గందరగోళం నెలకొంది. పరిమితి విధింపుతో ఇబ్బంది... అల్పాహారం, భోజనాల టోకెన్ల జారీకి పరిమితి విధించడం కూడా తీవ్ర విమర్శలకు గురవుతోంది. పట్టణంలో 2 లక్షలకు పైగా జనాభా ఉండ గా ఇందులో దుకాణాలు, మార్కెట్లు, తోపుడు బండ్లు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు ఇలా.. అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్న కార్మికులు దాదాపు 30వేలకు పైగా ఉన్నారు. డివిజన్ కేంద్రం కావడం, అతి పెద్ద మార్కెట్ యార్డు ఉండడంతో రైతులు, ప్రభుత్వ కార్యాలాయాలలో ఇతర పను ల కోసం ప్రతిరోజూ దాదాపు 50వేలకు పైగా ప ట్టణానికి వస్తుంటారు. పట్టణంలో ఏర్పాటు చేసి న అన్న క్యాంటీన్లలో రూ.5కే అల్పాహారం, భోజనం అందుబాటులోకి వస్తుందని అధికారులు, నాయకులు ఊదరగొట్టడంతో ఖర్చు చాలా త గ్గుతోందని పేదలు అశించారు. అయితే అల్పాహారానికి 200, భోజనాలకు 300 టోకెన్ల మాత్రమే జారీ చేస్తుండడం ఇబ్బంది నెలకొంది. నాణ్యతపై అనుమానాలే... నాణ్యతపై సీపీఎం నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వంటలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు వెళ్లగా ఇడ్లిలో పురుగున్నట్లు గుర్తించారు. వెంటనే సిబ్బంది దృష్టికి తీసుకెళ్లిగా వేరే ఇడ్డి వడ్డించినట్లు తెలిసింది. దీంతో వంటకు వినియోగించే సరుకుల నాణ్యతపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
డబుల్.. ట్రబుల్
నిరుపేదలకు సొంత ఇంటి కల సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసింది. అయితే జిల్లాలో ఈ ఇళ్ల నిర్మాణ పనుల్లో ఆశించిన ప్రగతి కనిపించడం లేదు. పలు చోట్ల ఇళ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టినప్పటికీ పునాదులు, పిల్లర్లు, గోడలు, స్లాబ్ లెవల్లో ఉన్నాయి. కొన్ని చోట్ల పనులే ప్రారంభం కాలేదు. జిల్లాకు మొదటి, రెండో విడతల్లో మొత్తం 2,713 ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 150 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలిసిపోతోంది. అధికారులు చొరవ చూపాల్సిన అవసరం ఉంది. మహబూబాబాద్: డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో జిల్లా చాలా వెనుకబడి ఉంది. జిల్లాకు రెండు విడతల్లో 2,713 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 1,439 ఇళ్లకు టెండర్లు పిలిచారు. 1,006 ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పూర్తి చేశారు. 684 ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయి. పనులు ప్రారంభమైన ఇళ్లు సైతం 25శాతం కూడా పూర్తి కాలేదు. మార్చి 31వ తేదీ వరకు కాంట్రాక్టర్లకు గడువు ఇవ్వగా పూర్తయ్యే పరిస్థితే లేదు. జిల్లాలో పరిస్థితి... జిల్లాకు మొదటి విడతలో 1,433, రెండో విడతలో 1,280.. మొత్తం 2,713 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరయ్యాయి. మానుకోట నియోజకవర్గానికి మొదటి విడతలో 400, రెండో విడతలో 625, డోర్నకల్‌కు మొదటి విడతలో 400, పాలకుర్తి నియోకవర్గానికి 429, ఇల్లందు నియోజకవర్గంలోని గార్ల, బయ్యారం మండలాలకు 160, ములుగు నియోజకవర్గంలోని గంగారం, కొత్తగూడ మండలాలకు 44 గృహాలు మంజూరయ్యాయి. మొత్తం 2,713 ఇళ్లకు 150 మాత్రమే పూర్తయ్యాయి. పాలకుర్తి, ఇల్లందు నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణ పనులు కొంత వేగంగా సాగుతుండగా, ములుగు నియోజకవర్గంలోని రెండు మండలాల్లో పనులే ప్రారంభం కాలేదు. మానుకోట నియోజకవర్గంలో నిల్ మహబూబాబాద్ నియోజకవర్గంలో 300 ఇళ్లకు టెండర్లు పూర్తి కాగా 245 ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయి. ఇంకా 55 పనులే మొదలు కాలేదు. ఇప్పటివరకు ఒక్క ఇంటి నిర్మాణం కూడా పూర్తి కాలేదు. మహబూబాబాద్ మండలంలో 200 ఇళ్ల పనులు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో పిల్లర్ల దశలోనే ఉన్నాయి. నెల్లికుదురు మండలం చిన్నముప్పారంలో 25 ఇళ్లకు 16 ఇళ్ల పనులు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయి. మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామంలో 15 ఇళ్లు ప్రారంభంం కాగా, కేసముద్రం మండలం పెనుగొండ గ్రామంలో 14 ప్రారంభమయ్యాయి. చిన్నముప్పారంలోని 7గృహాలు, పెనుగొండలోని 2గృహాలకు ప్లాస్టరింగ్ పనులు చేస్తున్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో వివిధ దశల్లో... నియోజకవర్గానికి మొత్తం 400 ఇళ్లు మంజూరుకాగా, 270 టెండర్లు పూర్తయ్యాయి. 215 ఇళ్ల పనులు ప్రారంభం కాగా 60 మాత్రమే పూర్తయ్యాయి. డోర్నకల్ మండలానికి 70 ఇళ్లు మంజూరు కాగా వెన్నారం గ్రామంలో 18 ఇళ్లు పూర్తి కాగా, మిగతా 52 ఇళ్ల పనులు ఇటీవల మొదలయ్యాయి. మరిపెడ మండలం చిల్లంచెర్లలో 50 ఇళ్లు మంజూరై 25 ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయి. ఎల్లంపేటలో 50 ఇళ్లకు 42 పూర్తయి 5 వివిధ దశల్లో ఉండగా 2 ఇంకా పనులు చేపట్టలేదు. దంతాలపల్లి మండలం పెద్దముప్పారంలో 50కి మొత్తం పనులు ప్రారంభమై 30 గోడల దశలో, 12 స్లాబ్ దశలో, 8 ప్లాస్టరింగ్ దశలో ఉన్నాయి. నర్సింహులపేట మండలం జయపురం గ్రామానికి 50కి మొత్తం ప్రారంభమై 6గోడల దశలో, 37 స్లాబ్ దశలో, 7 బేస్మెంట్ స్థాయిల్లో ఉన్నాయి. పాలకుర్తి నియోజకవర్గంలో 30 ఇళ్లు పూర్తి పాలకుర్తి నియోజకవర్గంలో జిల్లా పరిధిలోకి వచ్చే తొర్రూ రు, పెద్ద వంగర మండలాలకు 429 ఇళ్లు మంజూరయ్యా యి. వీటిలో 367 టెండర్లు పూర్తికాగా, 175 ప్రారంభమై 30గృహాలు పూర్తయ్యాయి. పెద్దవంగర మండలంలోని పోలంపల్లికి 23మంజూరు కాగా అన్నీ ప్రారంభమయ్యాయి. ఉప్పరిగూడెం గ్రామానికి 20 మంజూరు కాగా అన్నింటి పనులు ప్రారంభమయ్యాయి. వివిధ దశల్లో ఉన్నాయి. కొరి పెల్లి గ్రామానికి 60 ఇళ్లు మంజూరై 30 ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయి. గట్లకుంట గ్రామానికి 10 మంజూరై అన్నిం టి పనులు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయి. తొర్రూరు మండలం కంటాయపాలెం గ్రామంలో 21 మంజూరై అన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. నాంచారిమడుగు గ్రామానికి 50 మంజూరై 30 ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయి. ఇల్లందు నియోజకవర్గంలో దాదాపు పూర్తి ఈ నియోజకవర్గంలో జిల్లా పరిధిలోకి వచ్చే గార్ల, బయ్యారం మండలాల్లో 160 ఇళ్లు మంజూరై 140 ప్రారంభమయ్యాయి. వీటిలో 60 ఇళ్లు పూర్తయ్యాయి. మిగతా వాటిలో 50 ప్లాస్టరింగ్ దశలో, 10 స్లాబ్ పూర్తయ్యాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. బయ్యారం మండలం రామచంద్రాపురానికి మంజూరైన 20, నామాలపాడులో మంజూరైన 20, బాలాజీపేటకు మంజూరై 20 పూర్తయ్యాయి. ఇసుకమేది గ్రామానికి 20 మంజూరు కాగా వివిధ దశల్లో ఉన్నాయి. గార్ల మండలం గుంపెళ్లగూడెంకు మంజూరైన 20 ప్లాస్టరింగ్ దశలో ఉండగా, పూసలతండాలో మొత్తం 20 స్లాబ్ దశలో ఉన్నాయి. సూర్యాతండాలో 20 ప్రారంభమై స్లాబ్‌లు పూర్తయ్యాయి. శేరిపురం గ్రామానికి 20 మంజూరై స్థలం లేక ప్రారంభంకాలేదు. ములుగు నియోజకవర్గంలో మొదలు కాని పనులు నియోజకవర్గంలోని కొత్తగూడ, గంగారం గ్రామాలు జిల్లా పరిధిలో ఉన్నాయి. ఆయా మండలాలకు 44 ఇళ్లు మంజూరయ్యాయి. కొత్తగూడకు 37, పొనుగోడుకు 3గృహాలు మంజూరు కాగా, నేటికీ టెండర్లు కూడా పూర్తికాలేదు. మార్చి 31 వరకు మొదటి విడత గృహాలు పూర్తి కావాల్సి ఉండే చివరికి 2విడతలకు 684 గృహాలు మాత్రమే ప్రారంభం కాగా, వాటిలో కూడా 150 మాత్రమే పూర్తయ్యాయి. గడువులోగా ప్రారంభమైన గృహాలు సైతం పూర్తయ్యే పరిస్థితి లేదు. జిల్లాలోని గార్ల మండలం శేరిపుర గ్రామంలో స్థల సమస్యతో డబుల్బెడ్రూం ఇండ్లు ప్రారంభం కాలేదు. -
'మత్తు'కు దూరంగా మనుషులకు దగ్గరగా
ఎక్కడైనా నలుగురు కలిస్తే మద్యం తాగడం, మాంసాహారం తినడం ఓ ఫ్యాషన్‌గా మారిపోయిన రోజులివి. పండుగలొచ్చినా, పబ్బాలొచ్చినా.. మంచైనా, చెడైనా.. మద్యం, మాంసాహార వినియోగం తప్పనిసరిగా మారిపోయింది. మద్యం మహమ్మారి కారణంగా ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. పేద కుటుంబాలు కకావికలం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో నిర్మల్ జిల్లాలోని పలు గ్రామాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. మద్యపానానికి, మాంసాహారానికి దూరంగా ఉండడమే కాదు సమష్టితత్వం, పరస్పర సహకారంతో అభివృద్ధి బాటన ప్రయాణిస్తున్నాయి. హంగులు, ఆర్భాటాలు వదిలేసి సేవాతత్వంలో నడుస్తూ సరికొత్త బాటను చూపుతున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో నిర్మల్ జిల్లాలోని కుభీర్, తానూరు, మామడ మండలాల్లో ఉన్న ఈ గ్రామాలపై ఈ వారం ‘ఫోకస్’.. – నిర్మల్ నిర్మల్ జిల్లాలోని కుభీర్, తానూరు, మామడ మండలాల పరిధిలోని ఆరేడు తండాలు/గ్రామాలు మద్యపానంపై స్వీయ నిషేధం విధించుకున్నాయి. ఈ ఊళ్లలో మందు సీసాలే కాదు.. కల్లు అమ్మే దుకాణం కూడా కనిపించదు. మేకలు, కోళ్లు కోయడమనే ముచ్చటే ఉండదు. మద్యం, మాంసాహారం గురించి మాట్లాడినా ఆ గ్రామాల ప్రజలు సున్నితంగా తిరస్కరిస్తారు. ఏ నిర్ణయమైనా సంఘటితంగా తీసుకుంటారు. సమష్టిగా గ్రామ అవసరాలు తీర్చుకుంటారు. ఎవరికీ భారం కాకుండా ఊరంతా కలసి సామూహికంగా తమ పిల్లలకు వివాహాలు చేస్తారు. ఇవే వారిని, వారి గ్రామాలను ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా ‘మద్యం’ మహమ్మారి జాడ లేకపోవడంతో ఈ గ్రామాల్లో నేరాలు, ఘోరాలు దాదాపుగా లేకపోవడం గమనార్హం. వాస్తపూర్.. ప్రతి ఇల్లు దేవాలయమే చుట్టూ పచ్చని చెట్లతో ఎత్తయిన గుట్టలు, దట్టమైన అడవి మధ్య గ్రామం వాస్తపూర్. బాహ్య ప్రపంచానికి దూరంగా మామడ మండలంలోని తాండ్ర గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఈ గ్రామ జనం.. ముప్పై ఏళ్లుగా మద్యమాంసాలకు దూరంగా ఉంటున్నారు. 450 మంది మాత్రమే ఉన్న ఈ గ్రామస్తులు మద్యం, మాంసాలను ఎప్పుడూ ముట్టకూడదని తమకు తాముగా ప్రతిజ్ఞ చేసుకున్నారు. ఇక ఈ గ్రామంలో ప్రతి ఇల్లూ ఒక దేవాలయమే. అడవిలో ఉన్నా తమ ఇళ్లలో పేడతో అలికి, ముగ్గులు వేసుకుంటారు. ప్రతి శనివారం ఊరంతా కలసి గ్రామంలోని హనుమాన్ ఆలయంలో సామూహికంగా భజన నిర్వహిస్తారు. గ్రామంలోకి ఎవరు వచ్చినా.. మర్యాద గా స్వాగతిస్తారు. చేలలో విత్తనాలు చల్లే సమయంలో, శివరాత్రి సమయంలో దీక్షలు చేపట్టి.. కఠిన నియమాలను అనుసరిస్తుంటారు. ఇక వాస్తపూర్కున్న మరో ప్రత్యేకత ఏమిటంటే... ఏ ఎన్నికలు వచ్చినా నిర్మల్ నియోజకవర్గ నాయకులు ఈ కుగ్రామం నుంచే ప్రచారం ప్రారంభించడం ఆనవాయితీ కావడం గమనార్హం. ఏళ్లుగా పాటిస్తున్నాం ‘‘మాది అడవిలో ఉండే ఊరైనా ముప్పై ఏళ్లుగా మద్యమాంసాలకు దూరం గా ఉంటున్నాం. ప్రకృతి ఒడిలో ఉండే తమ గ్రామంలో ఏ పండుగ వచ్చినా ప్రతి కుటుంబం పాలు పంచుకుంటుంది. ఉదయం గ్రామంలోని హనుమాన్ ఆలయంలో సామూహిక పూజలు చేశాక రోజూ పనులు ప్రారంభిస్తాం..’’ – గంగారాం పటేల్, వాస్తపూర్ పుట్టిన్నుంచి మందు చూడలె.. ‘‘నాకిప్పుడు తొంభయ్యేళ్లపైన ఉంటయ్. నేను పుట్టినప్పటి నుంచి మద్యం చూడలె. పాంగ్రాలో తరాల కిందనే మందు బంజేసిండ్రు. ఇప్పటికీ మా కొడుకులు, మనుమలు కూడా దూరంగనే ఉంటున్నరు. అదే మా ఊరికి మంచి పేరు తెస్తున్నది..’’ – కెర్భా పటేల్, పాంగ్రా మేం అదృష్టవంతులం.. ‘‘మా పాంగ్రా గ్రామపంచాయతీలోని బాకోట్, పాంగ్రా, సౌనా ఈ మూడు ఊళ్లూ మద్యం, మాంసానికి దూరంగా ఉంటాయి. ఇలాంటి గ్రామాల్లో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాం. మద్యానికి దూరంగా ఉండటం వల్లే ఇప్పటిదాకా గొడవలు, కేసులేవీ లేవు..’’ – ముక్తాబాయి, సర్పంచ్, కుభీర్ మండలం సౌనా యువకులు, మహిళలు ముందుకువచ్చి.. ‘‘ఒకప్పుడు మా ఝరి (బి) గ్రామం మద్యం కారణంగా ఇబ్బందులు పడింది. పరిస్థితి గొడవలు, హత్యల వరకూ వెళ్లింది. యువత, మహిళలు ముందుకువచ్చి పట్టుబట్టడంతో మద్యానికి దూరమైంది..’’ – ఆనంద్, నచికేత యూత్, ఝరి(బి) గ్రామం మూడు తరాల నుంచి పచ్చగా.. నిర్మల్ జిల్లా భైంసా పట్టణం నుంచి కుభీర్ వెళ్లే మార్గంలోని చిన్న గ్రామం పాంగ్రా. ఇక్కడ దాదాపుగా మూడు తరాల నుంచి మద్యం, మాంసం వినియోగం బంద్. ఇప్పటి యువత సైతం మద్యపానానికి దూరంగా ఉండటం విశేషం. గ్రామంలో ఉన్నా, చదువుకునేందుకు పట్టణాలకు వెళ్లినా వారు ఊరి పద్ధతిని వీడడం లేదు. వేరే గ్రామం నుంచి వచ్చిన కోడళ్లు, అల్లుళ్లూ ఈ ‘మర్యాద’ను పాటిస్తుంటారు. ‘‘మా తాత చెప్తుండె.. మన ఊళ్లో జమానా నుంచి మందు తాగుడు, మాంసం తినుడు లేదురా అని.. ఇట్ల మూడు పిడిల (తరాల) కెళ్లి మా ఊళ్లె తాగుడు తినుడు ముచ్చట్నే లేదు..’’ అని పాంగ్రా గ్రామ మాజీ సర్పంచ్ దిగంబర్ పటేల్ తమ ఊరి గొప్పదనాన్ని వివరించారు. ఎటు చూసినా పచ్చగా.. పత్తి, మొక్కజొన్న, శనగ, గోధుమ పంటలతో ఈ గ్రామం ఎటు చూసినా పచ్చగా కళకళలాడుతుంటుంది. గ్రామంలో వివిధ కులాల వాళ్లున్నా అందరూ ఒక్కటిగానే ఉంటారు. ఈ ఊరికున్న ప్రత్యేకత ‘ఏకముఖి దత్తాత్రేయుడు’గా పిలుచుకునే ఆలయం. గ్రామశివారులో నిర్మించిన ఈ దత్తాత్రేయ ఆలయమే పాంగ్రాను కలిసికట్టుగా నడిపిస్తోంది, వ్యసనాలకు దూరంగా ఉంచుతోంది. దత్తాత్రేయ బోధనలను పాటించే గురువు ‘మహానుభావు’ మార్గాన్ని ఈ గ్రామ ప్రజలు అనుసరిస్తున్నారు. మద్యమాంసాలకు దూరంగా ఉంటూ కలసికట్టుగా జీవించడమే తమ మహానుభావు మతమని వారు చెబుతుంటారు. గ్రామంలో దసరా నవరాత్రులు, దత్తపౌర్ణమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. బాకోట్, సౌనా గ్రామాల్లోనూ.. పాంగ్రా గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామాలైన బాకోట్, సౌనా గ్రామాలు సైతం ఈ ఆదర్శాన్ని అందిపుచ్చుకున్నాయి. ఎంత పెద్ద పండుగైనా, ఏ వేడుకైనా సరే ఈ గ్రామాల్లోనూ మద్యమాంసాలను ముట్టుకోరు. అసలు ఇప్పటిదాకా తమ పంచాయతీ పరిధిలోని పాంగ్రా, బాకోట్, సౌనా ఊళ్లల్లో వాటి ముచ్చటే రాలేదని గ్రామ సర్పంచ్ ముక్తాబాయి చెబుతున్నారు. ఏదైనా కార్యం ఉంటే లడ్డూ, బూందీ వంటి తీపి పదార్థాలతోనే వేడుకలను నిర్వహించుకుంటామని అంటున్నారు. మద్యం లేనందునే తమ గ్రామాల్లో గొడవలు లేవని, ఇప్పటిదాకా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన దాఖలాలు లేవని చెబుతున్నారు. అమృత నిలయం.. జామ్‌గావ్ కుభీర్ మండల కేంద్రం నుంచి కొండలు, గుట్టలు దాటుకుని వెళ్తే మహారాష్ట్ర సరిహద్దులో ఉంటుంది జామ్‌గావ్. ఇక్కడ మద్యమనే మాటే లేదు.. మాంసం వినియోగం తెలియని ఇళ్లు ఉన్నాయి. ముప్పై ఏళ్ల కిందే ఈ గ్రామం భక్తిని తమ మార్గంగా ఎంచుకుంది. ముంబై లో పాండురంగ అఠావలే ప్రారంభించిన స్వాధ్యాయ పంథాను జామ్‌గావ్ అందిపుచ్చుకుంది. ఉమ్మడి ఏపీ లోనే తొలిసారిగా 1996లో స్వాధ్యాయ ఆధ్వర్యంలో ఈ గ్రామంలో అమృతాలయం నిర్మించడం గమనార్హం. దీనిని కేంద్రంగా చేసుకుని.. ఆ ఊళ్లో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు. నలభయ్యేళ్ల కిందటే ప్రతి ఇంటి కి మరుగుదొడ్డి నిర్మించుకోవడం గమనార్హం. గ్రామస్తులంతా ఉపాధి పథకంలో కలసి పనిచేసి, వచ్చిన డబ్బులతో హనుమాన్ ఆలయాన్ని నిర్మించుకున్నారు. పండుగలప్పుడు ఒకరింటికి మరొకరు వెళ్లి జరుపుకోవడం, మంచిని ప్రచారం చేయడం, ఏడాదికోసారి ఊరంతా కలసి ఒక చేనులో పంట పండించి ప్రత్యేక రోజుల్లో వినియోగించడం వంటివి జామ్‌గావ్ మరిన్ని ప్రత్యేకతలు. అందరం కలిసుంటాం.. ‘‘మా జామ్‌గావ్‌లో ఎలాంటి భేదభావాలు లేవు. అందరం ఒకటేనన్న భావన తో కలసి ఉంటాం. మద్యమాంసాల ముచ్చటే లేదు. రాజకీయం, ప్రచారం, హంగూ ఆర్భాటం లేకుండా భక్తి మార్గంలోనే నడుస్తాం. ఏళ్లుగా ఇలాగే కలసి ఉంటున్నం..’’ – పెద్దకాపు చిన్నన్న, జామ్‌గావ్ -
ఓ నాన్నా.. ఇటు చూడూ..
చెమట చుక్క చిందిస్తే.. అప్పుల పంటే మొలిచింది.. నాగలి వెనక నడిస్తే.. కన్నీళ్ల చేనే పండింది.. సాగే జూదమైంది.. బతుకే భారమైంది.. తెల్లారేసరికే.. ఆ రైతు జీవితం ఉరితాడుకు వేలాడింది! కానీ.. ఓ నాన్నా.. ఇటు చూడు నీ చావుతో అప్పులు తీరలేదు.. అసలు, మిత్తి కలసి అమ్మను ప్రశ్నిస్తున్నాయి.. చదువుల కల చెదిరిపోయింది.. చేతిలో పుస్తకం జారిపోయింది.. ఇప్పుడు... తమ్ముడూ నేనూ కూలి బడిలో కష్టాల ఓనమాలు దిద్దుతున్నాం!! రైతన్న ఆత్మహత్యలతో దిక్కులేని పక్షులవుతున్న బిడ్డలు మధ్యలోనే ఆగుతున్న చదువులు.. కూలి బాట పడుతున్న బాల్యం ఆదరించేవారు లేక.. ఆలనాపాలనా లేక దుర్భర పరిస్థితులు పోషణ భారమై రోడ్డున పడుతున్న కుటుంబాలు.. తల్లితో కలసి పనులకు కొందరు.. అప్పుల భారంతో పట్నానికి వెళ్తున్నవారు ఇంకొందరు.. కానరాని సర్కారు సాయం సాక్షి నెట్వర్క్: తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలు గోడుగోడున విలపిస్తున్నాయి. పెద్దదిక్కును కోల్పోవడంతో వారి ఇళ్లల్లో బాల్యాన్ని సంక్షోభం చుట్టుముడుతోంది. నాన్న వేలు పట్టుకుని బడికెళ్లాల్సిన పిల్లలు.. భారంగా పనికి కదులుతున్నారు. ఆదరించేవారు లేక.. ఆలనాపాలనకు నోచుకోలేక చదువులకు దూరమవుతున్నారు. అప్పులు భారం మోయలేకనో.. కాలం కలసిరాకనో క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్న రైతన్నలు తమ కుటుంబాలను మరిన్ని కష్టాల్లోకి నెట్టి వెళ్లిపోతున్నారు. దీంతో తమ పిల్లల్ని పెద్ద చదువులు చదివించేందుకు అప్పటిదాకా వారు పడ్డ కష్టమంతా వృథా అవుతోంది. చదువుల కల చెదిరిపోవడమే కాదు.. అప్పుల భారం మీద పడటంతో భార్యాపిల్లలు రోడ్డున పడుతున్నారు. పెద్దదిక్కును కోల్పోయి సాయం కోసం దిక్కులు చూస్తున్నారు. తండ్రి మరణంతో అర్ధంతరంగా చదువులు మాని కూలి పనులకు వెళ్తున్నవారు కొందరైతే.. చిన్న వయసులోనే అప్పుల భారం భుజానికెత్తుకొని పట్నం బాటపడుతున్నవారు మరికొందరు! ఇక కొన్ని కుటుంబాల్లో.. పిల్లల్ని పస్తులు ఉంచలేక మధ్యాహ్న భోజనమైనా దొరుకుతుందన్న ఆశతో బడికి పంపుతున్న దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఆత్మహత్య చేసుకున్న దాదాపు 50 రైతు కుటుంబాలను ‘సాక్షి’పరిశీలించగా.. హృదయాలను కదిలించే కన్నీటి వెతలెన్నో కనిపించాయి. వసివాడుతున్న పసిడి బాల్యం ‘సాక్షి’పరిశీలించిన దాదాపు 50 కుటుంబాల్లో 40 వరకు రైతు కుటుంబాల్లోని పిల్లలంతా 15 ఏళ్ల లోపువారే. ఎదిగే వయసులో తండ్రి లేకపోవడం.. చదువులు ఆగిపోవడం.. ఒక్కసారిగా కష్టాలు చుట్టుముట్టడం.. అనుకోని బాధ్యతలు పైనపడటంతో ఈ పసి పిల్లలు కుంగుబాటుకు గురవుతున్నారు. అప్పులోళ్లు ఇప్పటికీ వచ్చి ఒత్తిడి చేస్తుండటం, తండ్రి చేసిన బాకీ తీర్చాలంటూ ఇంటికొచ్చి దురుసుగా ప్రవర్తిస్తుండటం వంటి ఘటనలు వీరిపై పెను ప్రభావం చూపిస్తున్నాయి. తల్లి పడే కష్టం చూడలేక చాలామంది దొరికిన పనులకు వెళ్తున్నారు. చేతికొచ్చిన పనులు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా హకీంపేటకు చెందిన శ్రీనివాస్.. తండ్రి చనిపోయే నాటికి టెన్త్ చదువుతున్నాడు. తండ్రి మరణంతో పూట గడవని స్థితిలో చదువు ఆపేసి ఇప్పుడు శ్రీనివాస్ వ్యవసాయ కూలీగా మారిపోయాడు. ఇదే జిల్లా పోలేపల్లికి చెందిన ఈశ్వర్.. తండ్రి ఆత్మహత్యతో 9వ తరగతితోనే మానేసి కొన్నాళ్లు హైదరాబాద్‌లో హోటల్ బాయ్‌గా పనిచేసి కొన్ని అప్పులు తీర్చాడు. ప్రస్తుతం సెంట్రింగ్ కూలీగా పని చేస్తున్నాడు. తల తాకట్టు పెట్టి.. భర్త తనువు చాలించినా కుటుంబ పోషణను భుజానకెత్తుకున్న భార్యలు తమ పిల్లల్ని ఎన్నో కష్టాలకోర్చి చదివిస్తున్న ఉదంతాలూ ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా చౌదర్‌పల్లికి చెందిన లలితమ్మ.. భర్త ఆత్మహత్యానంతరం తమకున్న నాలుగెకరాలతోపాటు మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తోంది. కూలి పనులకూ వెళ్తోంది. ఇలా వచ్చిన ఆదాయంతో తన ముగ్గురు పిల్లల్ని చదివిస్తోంది. పెద్ద కొడుకు మహేశ్ (21) డిగ్రీ, కుమార్తె మంజుల (19) ఇంటర్, రెండో కొడుకు నరేశ్ (17) టెన్త్ పూర్తి చేశారు. వీరు కష్టాల పాలు కావొద్దనే ఉన్నత చదువులు చదివించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు లలితమ్మ చెప్పింది. ఆదిలాబాద్ జిల్లా కొలాంగూడకు చెందిన జంగుబాయి కూలీ పనులకు వెళ్తూ పిల్లల్ని చదివిస్తోంది. ఆమె భర్త మడావి అయ్యు (40) గత ఫిబ్రవరి 26న ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్కసారిగా కుటుంబ పరిస్థితులు తల్లకిందులయ్యాయి. దీంతో జంగుబాయి వ్యవసాయ కూలీగా రోజూ రూ.120 సంపాదిస్తూ.. డిగ్రీ చదువుతున్న రెండో కుమార్తె రవాణా ఖర్చులకు రూ.30, ఆరో తరగతి చదువుతున్న కొడుకు ఆటో ఖర్చు కోసం రూ.20 ఖర్చు చేస్తోంది. మిగతా పిల్లల్ని హాస్టల్లో ఉంచింది. ఈ చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో.. ఈ చిత్రంలో భర్త ఫొటో పట్టుకొని ఉన్న మహిళ పేరు సురేఖ. ఆమె భర్త దేవా (కొమురం భీం జిల్లా కైరిగూడ) పత్తి పంట కోసం రూ.3 లక్షల దాకా అప్పు చేశాడు. పంట చేతికందలేదు. మరోపక్క పెళ్లీడుకొచ్చిన కూతురు. దిక్కుతోచక 2011లో ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణానంతరం సురేఖ భూమి అమ్మి బిడ్డ పెళ్లి చేసింది. అప్పటికి కొడుకు నరేశ్ రెండో తరగతి చదువుతున్నాడు. కుటుంబ పోషణ భారం కావడంతో బాధను దిగమింగుకుని కొడుకు చదువు మాన్పించింది. ఇద్దరూ కలిసి కూలి పనులకు వెళ్తున్నారు. ఇప్పుడు నరేశ్ వయసు 16. పిల్లలకు మంచి చదువులు చెప్పించాలనుకున్నాం కానీ పెనిమిటి మరణంతో అవన్నీ కల్లలయ్యాయని ఉబికివస్తున్న కన్నీళ్లతో చెప్పింది సురేఖ. ఇసుమంతైనా సాయం లేదు! ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వపరంగా సాయం అందుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఘటన జరిగిన రోజు అధికారులు, నేతలు వచ్చి ఇస్తున్న హామీలేవీ నెరవేరడం లేదు. వికారాబాద్ జిల్లా నంద్యానాయక్ తండాకు చెందిన రాథోడ్ ధన్సింగ్ నాలుగెకరాల రైతు. కాలం కలిసిరాక మూడెకరాలు అమ్మి కొన్ని అప్పులు తీర్చాడు. మిగతా ఎకరంలో బోరు వేయిస్తే చుక్క నీరు పడలేదు. భార్య, ఏడుగురు పిల్లలను పోషించడానికి అందినచోటల్లా అప్పులు చేశాడు. రుణదాతల ఒత్తిడి భరించలేక గతేడాది ఏప్రిల్ 5న ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు అతని భార్య తుల్జీబాయి, ఏడుగురు పిల్లలకు మిగిలింది.. వంటింట్లో రెండు పాత్రలు, చినిగిన రెండు జతల బట్టలు.. ఇవే! ధన్సింగ్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు చూడ్డానికి వచ్చిన అధికారులు పిల్లల్ని హాస్టల్లో చేర్పిస్తామన్నారు. తర్వాత ఆ ఊసే లేదు. ఏడుగురు పిల్లల ఆకలి తీర్చలేక.. ఇంట్లో గ్లాసుడు బియ్యమూ లేక పస్తులుంటున్నట్టు ఆ తల్లి చెబుతోంది. ఇక పిల్లల చదువుల గురించి చెప్పేదేముంటుంది? సదుకుంటే ఎట్ల గడుస్తది సారూ.. ఎండిన పంట పొలంలోనే నా భర్త పురుగుల మందు తాగిండు. నేనూ అప్పుడే సద్దామనుకున్నా.. కానీ పిల్లల ఆగమైతరని బతికున్న. భర్త చనిపోంగానే కొడుకు చదువు మాన్పించిన. నాతోనే కూలికి తోల్కపోతున్న. వాడు సదువుకుంటనంటున్నడు. నాకూ కొడుకును మంచిగ సదివించాలని ఉంది గానీ అప్పులోళ్లు ఇప్పటికీ ఇంటికి తిరుగుతూనే ఉన్నారు. ఆడు సదుకుంటే మా కుటుంబం ఎట్ల గడుస్తది సారూ..! – మీరి, తిమ్మక్కపల్లి తండా, మెదక్ జిల్లా చదవాలని ఉంది.. పత్తి పంట నష్టాలను మిగల్చడంతో మా నాన్న గతేడాది జూన్ 1న ఆత్మహత్య చేసుకున్నడు. నన్ను బాగా చదివించాలని తపన పడేవాడు. పాలిటెక్నిక్ వరకు చదివిన నేను తండ్రి మరణంతో తప్పనిసరి పరిస్థితుల్లో వ్యవసాయంలోకి దిగిన. ప్రభుత్వం సాయం చేస్తే ఉన్నత చదువులు చదవాలని ఉంది. నేను చదువుకు దూరమైనా తమ్ముడిని టెన్త్, చెల్లిని 7వ తరగతి చదివిస్తున్నా. మధ్యాహ్న భోజనమే దిక్కు.. ఎకరంన్నర సాగు కోసం నా పెనిమిటి మల్లేశం రూ.3 లక్షల వరకు అప్పు చేశాడు. ఏడు బోర్లూ వట్టిపోయినయ్. వరి ఎండిపోయింది. పొలంలోనే పురుగుల మందు తాగిండు. పిల్లలు ఎక్కడ ఆగమైతరోనని నేను బతికున్న. పెద్ద బిడ్డ 9, చిన్న బిడ్డ 6 చదువుతుండ్రు. బుడ్డోడిని అంగన్వాడ్కి పంపుతున్న. స్కూల్ల పెట్టే మధ్యాహ్న భోజనంతో పిల్లలకు ఒక పూట గడిచిపోతోంది. రెండో పూట కడుపు నింపుకోవడాన్కి కష్టపడుతున్నం. – మొగుళ్ల లక్ష్మి, మిరుదొడ్డి, సిద్దిపేట జిల్లా నాన్నే ఉంటే.. సదివించేటోడు! మిర్చి పంటలో నష్టం రావడంతో మా నాన్న గతేడాది ఏప్రిల్‌లో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్మ కూలి చేసి మా ముగ్గుర్ని సాకుతోంది. టెన్త్‌లో పాసైన. అమ్మ.. ఇక చదివించలేనంటే చదువు మానేశా. మా నాన్నే ఉంటే బాగా చదివించేవాడు. – తేజావత్ శ్రావణి, ఊటవాగు తండా, ఖమ్మం జిల్లా పెద్దోడు డిగ్రీ.. చిన్నోడు ఇంటర్‌తో ఆగిపోయారు.. మూడేళ్ల క్రితం నా భర్త వెల్మల్ మారుతి ఆత్మహత్య చేసుకున్నాడు. బీడీలు చుడుతూ ముగ్గురు పిల్లలతో కుటుంబాన్ని నెట్టుకురావడం సాధ్యం కావడం లేదు. అందుకే పెద్దోడు సందీప్‌ను డిగ్రీ వరకు చదివించి ఆపేశాను. రెండో వాడు ఇంటర్‌తో ఆగిపోయాడు. చిన్నబ్బాయి నవీన్ ఇంటర్లో చేరాడు. ప్రభుత్వ కాలేజీలో సీటు వస్తే సరి.. ప్రైవేటుగా చదివించే స్థోమత లేదు. తిననీకే సంపాదన చాలడం లేదు. ఇక చదువెలా చెప్పించేది? – వెల్మల్ సావిత్రి, జానకంపేట, నిజామాబాద్ జిల్లా పిల్లల్ని మంచిగ చదివిద్దామన్నడు.. నా భర్త చిలువేరి మొండయ్య (40) పంటకు చేసిన అప్పులు తీర్చలేక ప్రాణాలు తీసుకున్నడు. ఇప్పుడే పొలానికి వెళ్లి వస్తానని గుళికలు మింగాడు. మేం రోడ్డున పడ్డాం. బతికున్న రోజుల్లో.. ఇద్దరు ఆడపిల్లల్ని బాగా చదివిద్దామని, మంచి ఉద్యోగాలు చేయిద్దామని అనేవాడు. మనిషి లేకపోయినా, ఆయన మాట నిలిపేందుకు కూలి చేసి బిడ్డల్ని చదివిస్తున్నా. సర్కారు నుంచి చిల్లిగవ్వ అందలేదు. – మంజుల, రాఘవపట్నం, జగిత్యాల జిల్లా సదువుకుంటే ఎట్ల గడుస్తది సారూ.. ఎండిన పొలంలోనే నా భర్త పురుగుల మందు తాగిండు. నేనూ అప్పుడే సద్దామనుకున్నా.. కానీ పిల్లలు ఆగమైతరని బతికున్న. భర్త చనిపోంగనే కొడుకు చదువు మాన్పించిన. నాతోనే కూలీకి తోల్కపోతున్న. వాడు సదువుకుంట నంటున్నడు. నాకూ కొడుకును మంచిగ సదివించాలని ఉంది గానీ అప్పులోళ్లు ఇప్పటికీ ఇంటికి తిరుగుతూనే ఉన్నారు. ఆడు సదువుకుంటే కుటుంబం ఎట్ల గడుస్తది సారూ! – మీరి, తిమ్మక్కపల్లి తండా, మెదక్ జిల్లా చదవాలని ఉంది.. పత్తి పంట నష్టాలను మిగల్చడంతో మా నాన్న గతేడాది ఆత్మహత్య చేసుకున్నడు. పాలిటెక్నిక్ వరకు చదివిన నేను నాన్న మరణంతో తప్పనిసరి పరిస్థితుల్లో వ్యవసాయంలోకి దిగిన. ప్రభుత్వం సాయం చేస్తే ఉన్నత చదువులు చదువుతా. తమ్ముడిని టెన్త్, చెల్లిని 7వ తరగతి చదివిస్తున్నా. – రాజశేఖర్, డాకూరు, సంగారెడ్డి జిల్లా చదువు మానేసి.. ట్రాక్టర్‌పై పనికి.. ఈ చిత్రంలో కనిపిస్తున్నవారు మంచిర్యాల జిల్లా మన్నెగూడెంకు చెందిన బట్టు రాజయ్య భార్యాపిల్లలు. రాజయ్య ఎనిమిదెకరాల రైతు. ఆయన ఉన్నన్ని రోజులు తన నలుగురు పిల్లల్ని మంచి చదువులు చదివించాడు. బాగా చదువుకుని జీవితంలో స్థిరపడాలని పిల్లలకు చెప్పేవాడు. వరుస పంట నష్టాలు అప్పులను మిగల్చడంతో వాటిని తీర్చే దారిలేక 2015 అక్టోబర్ 13న రాజయ్య ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ పోషణకు ఆయన భార్య మారక్క.. స్థానిక పాఠశాలలో వంటమనిషిగా చేరింది. పెద్ద కొడుకు సంతోశ్ (19) 9వ తరగతి, రెండో కొడుకు సమ్మయ్య(16) 8వ తరగతి వరకు చదివి మానేశారు. తల్లి కష్టం చూడలేక ట్రాక్టర్‌పై పనికి కుదిరారు. వీరంతా కలసి మూడో కొడుకు సురేశ్(14)ను చదివించాలనుకున్నా.. అదీ సాధ్యం కాక అతడిని కూడా కూలి పనులకు పంపుతున్నారు. అతికష్టమ్మీద చిన్న కొడుకు పున్నంను మంచిర్యాలలోని ఏకలవ్య ఆశ్రమంలో చేర్చారు. బతికుండగా తన పిల్లల గురించి రాజయ్య ఏం కలలుగన్నాడో కానీ.. ఆ పిల్లలు మాత్రం ఇప్పుడు కూలీలుగా మిగిలిపోయారు. చాలా వరకు రైతు కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. -
జీవాల పెంపకంతో అభివృద్ధి
ఆదిలాబాద్ రూరల్ : నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమంలో రుణాలను అందజేస్తుంది. ప్రభుత్వం గతంలో గ్రామాల్లో పీవోపీ సర్వే నిర్వహించారు. ఈ సర్వేల్లో అత్యంత నిరుపేదలు ఉన్న వారిని ర్యాంక్ వారీగా ఎంపిక చేస్తున్నారు. అందులో భాగంగానే నియోజకవర్గంలోని ఆదిలాబాద్, బేల, జైనథ్ మండలలో బేల మండలం 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఎంపికైంది. ఆదిలాబాద్, జైనథ్ మండలాలు ఈ ఆర్థిక సంవత్సరంలో పల్లె ప్రగతి కాని మండలాల కింద ఎంపిక చేసి రుణాలు అందిచనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీని కోసం అధికారులు నివేధికలను సిద్ధం చేస్తున్నారు. ఇదీలా ఉండగా మహిళల్లో చైతన్యం తీసుకువచ్చి జీవితాల్లో వెలుగులు నింపేందుకు రుణాలు అందజేస్తూ ఆర్థిక బలోపేతానికి జీవాల పెంపకం, బట్టల, కిరణా షాపులు, చిప్పుర్ల తయారీ ద్వారా చేయూత అందజేస్తోంది. వంటింటికే పరిమితమవుతున్న మహిళలు పలు రంగాల్లో ముందుకు తీసుకెళ్లడానికి పేదరిక నిర్మూలన సంస్థ పల్లె ప్రగతి పథకంలో భాగంగా 2015-16 ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గంలోని బేల మండలంలోని వివిధ గ్రామ పంచాయతీ పరిధిలోని సుమారు 200 మంది ఎస్సీ, ఎస్టీ మహిళలకు గొర్రెలు, మేకలు కొనుగోళుకు, జనరల్ స్టోర్, కిరణా షాప్ ఏర్పాటు కోసం రుణాలు అందించింది. ఒక్కొక్క సభ్యురాలికి రూ. 30 నుంచి 50 వేలు రుణం అందజేసి వారు ఆర్థికంగా ఎలా అభివృద్ధి చెందాలి, వచ్చిన ఆదాయంతో రుణాల చెల్లింపు ఎలా చేయాలి అనే వాటిపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. వచ్చిన ఆదాయంతో అప్పులు చెల్లిస్తూ ప్రగతి పథంలో పయనిస్తున్నారు. లాభలు ఇలా... మేకలు, గొర్రెలు రోజువారీ పనులకు ఆటంకం కాకుండా ఓ కాపరిని ఏర్పాటు చేయడంలో లేదా ఇంట్లో ఖాళీగా ఉన్న ఒకరికి ఉద్యోగ భద్రత కల్పించిన్నట్లు అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. తము ఇతర కూలీ పనులకు వెళ్తు వచ్చిన ఆదాయంతో కుటుంబ పోషణ భారం కూడా లేకుండా ఉందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ఏడాది కిందట జీవాలను పంపిణీ చేయడంతో జీవాల పిల్లల సంఖ్య పెరగడంతో రెండింతల మేరకు ఆదాయం సమకురుతుందని సభ్యులు తెలుపుతున్నారు. లాభలు వస్తున్నాయి - మెస్రం లక్ష్మీ, చెప్రాల, బేల స్త్రీనిధి అప్పుతో గత ఏడాది మేకలను కొనుగోలు చేశాను. అవి ప్రస్తుతం రెట్టింపు అయ్యాయి. దీంతో రుణం చెల్లించడం కూడా సులభంగా ఉంది. కాని ప్రభుత్వం స్పందించి మేకలకు ఉచిత మందులు సరఫరా చేస్తే బాగుంటుంది. నెలనెలా అప్పు సక్రమంగా చెల్లిస్తున్నాం - అరుణ, బేల స్త్రీ నిధి పథకం ద్వారా రూ. 50వేలు అందజేశారు. దాని ద్వారా మండల కేంద్రంలో జనరల్ స్టోర్ ఏర్పాటు చేసుకున్నాను. తన కూలీ గిట్టుబాటు కావడంతో పాటు కుటుంబాన్ని పోషించడానికి ఉపయోగపడుతుంది. రుణం కూడా సకాలంలో చెల్లించడానికి సులువుగా ఉంది. సత్ఫలితాలిస్తున్న జీవాల పెంపకం - జ్ఞాను, ఏపీఎం, బేల మండలంలో జీవాల పెంపకం సత్ఫలితాలిస్తుంది. మండలంలోని సుమారు 200 మందికి వివిధ గ్రామాల్లో వివిధ స్త్రీ నిధి కింద రుణాలను అందజేశాం. జీవాల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి పోషణ చేస్తుండడంతో రెండింత ఆదాయం పొందుతున్నారు. ఇతర వ్యాపారులు పెట్టుకున్న వారికి కూడా లాభం చేకూరుతుంది. -
బాలారిష్టాల్లో గిరిపుత్రిక!
సీతంపేట: నిరుపేద కుటుంబాలకు చెందిన అవివాహిత యువతులు వివాహం చేసుకుంటే ఆర్థికసాయం కింద వారికి రూ. 50 వేలు ఇస్తామని 2014 ఆగస్టు తొమ్మిదో తేదీన విశాఖలో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారికి నిధులు సక్రమంగా మంజూరు కాకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుని వివాహం చేసుకున్న గిరిజన యువతులంతా ఎప్పటికీ నిధులు విడుదల కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇలా.. ఐటీడీఏ పరిధిలో 20 ట్రైబుల్ సబ్‌ప్లాన్ మండలాలున్నాయి. వీటిలో ఇప్పటివరకు ఈ పథకం కింద 132 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారిలో 71 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. అయితే ప్రభత్వం నుంచి కేవలం పన్నెండున్నర లక్షల రూపాయల నిధులు మాత్రమే మంజూరయ్యాయి. 71 మంది అర్హులకు రూ.35 లక్షల 50 వేలు విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. దానిలో సగం కూడా నిధులు విడుదల కాకపోవడం గమనార్హం. విడుదలైన అరకొర నిధులు ఎవరికి ఏ ప్రాతిపదికన పంపిణీ చేస్తారోనని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. కేవలం 25 మంది వరకు సరిపడా నిధులు మాత్రమే విడుదల కావడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఈ పథకానికి సంభందించిన సర్వర్ కూడా నిలిచిపోయినట్టు సమాచారం. ఈ విషయమై గిరిజన సంక్షేమశాఖ డీడీ ఎంపీవీ నాయిక్ వద్ద ప్రస్తావించగా వచ్చిన నిధులను ఎంతమందికి సరిపోతే అంతమందికి పంపిణీ చేస్తామన్నారు. -
పేద కుటుంబాల్లో ‘కల్లో’లం!
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం బాదేపల్లిలోని గౌరిశంకర్ కాలనీకి చెందిన కుమ్మరి లక్ష్మమ్మ కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషించేది. ప్రతిరోజు సేవించే కల్లు లభించకపోయేసరికి.. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుని సెప్టెంబర్ 21న ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం తిమ్మాపూర్‌కు చెందిన బాస జలపతి మత్తెక్కించే కల్లు తాగే అలవాటుంది. అధికారుల దాడులతో ఆ మందు లభించకపోయేసరికి వింతగా ప్రవర్తిస్తూ ఇల్లాలిపైనే హత్యాయత్నం చేశాడు. అతడు జైలు పాలు కావడంతో కుటుంబం వీథినపడింది. సాక్షి నెట్వర్క్: తెలంగాణలో రైతన్నల ఆత్మహత్యలు చాలదన్నట్లుగా.. ఇప్పుడు కల్లు బాధితుల బలవన్మరణాలు, ఆత్మహత్యాయత్నాలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో అనేక కుటుం బాలు వీధిన పడుతున్నాయి. వారి ఆర్థిక, సామాజిక పరిస్థితులు తలకిందులవుతున్నాయి. పిల్లల చదువులు అర్ధంతరంగా ఆగిపోతున్నాయి. ఆ కుటుంబాల పోషణ భారమవుతోంది. ఈ మత్తు కల్లు కారణంగా తెలంగాణలో దాదాపు వంద మందికిపైగా మరణించారు. ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలో 80 మందికిపైగా మరణిస్తే.. ఎక్సైజ్, పోలీసుల లెక్కలు మాత్రం 42 మంది చనిపోయినట్లు చెబుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 11 మంది, ఆదిలాబాద్‌లో దాదాపు 15 మంది మరణించారు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లోనూ ఈ స్థాయి మరణాలు నమోదయ్యాయి. 10 జిల్లాల్లో 7,574 దుకాణాలు రాష్ట్రంలోని పది జిల్లాల్లో మొత్తం 7,574 కల్లు దుకాణాలు అధికారికంగా నడుస్తున్నాయి. మరో రెండు వేల వరకు అనధికారికంగా విక్రయాలు సాగుతున్నాయి. నల్లగొండ, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని కొన్ని మండలాల్లో మినహా తాటి, ఈత చెట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ మత్తు కలిపి అమ్మే కల్లు విక్రయాలు తక్కువే. మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్‌లకు సంబంధించి కల్లు వినియోగానికి అల్ఫాజోలమ్, చక్కెర, పిండి, డిటర్జంట్ పౌడర్ తదితర వాటిని కలిపి కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్న ఘటనలు ఉన్నాయి. కౌన్సెలింగ్ ఏదీ?..: మత్తు కల్లుకు బానిసలైన వారు ఆ వ్యసనం నుంచి బయటపడలేక.. అది లేకుండా జీవించలేక అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. ప్రభుత్వం కల్లులో మత్తునిచ్చే డైజోఫామ్,అల్ఫాజోలమ్, క్లోరల్ హైడ్రేట్ (సీహెచ్)తో పాటు ఇతర రసాయనాల వినియోగంపై పెద్దగా పట్టించుకోకుండా.. ఒక్కసారిగా దాడులు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మత్తు అధికంగా ఉండే కల్లు తాగుతున్న వారికి.. ఆ మత్తు నుంచి బయటపడడానికి వీలుగా ఎక్కువ సంఖ్యలో కౌన్సెలింగ్ కేంద్రాలు, డీ ఆడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి, వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ చర్యలు ఏవీ చేపట్టలేదు. కల్లులో కలిపే మత్తు పదార్థాలు కాస్తా.. నాడి మండలంపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయని వైద్య నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. మంచానికే పరిమితమయ్యా మూడు నెలల క్రితం కల్లులో మత్తు తగ్గడంతో నా ఆరోగ్యం మూడు నెలలుగా క్షీణించడంతో మంచానికే పరిమితమయ్యాను. గతంలో నా కుటుంబ పోషణ కోసం వడ్రంగి పనితో పాటు కమ్మరి పని చేసుకుంటూ పొట్టగడిపేవాడిని. ప్రస్తుతం కొడుకులు అన్నం పెడితే గానీ పూట గడవని పరిస్థితి ఉంది. - ఇనుగుర్తి నారాయణ, తిమ్మాపూర్, జగిత్యాల, కరీంనగర్ జిల్లా ఆగమైన కుటుంబం కల్లులో మత్తు తగ్గడం వల్ల వికృత చేష్టలతో భర్త నన్ను చంపేందుకు ప్రయత్నించాడు. హత్యాయత్నం కేసు నమోదు కావడంతో ఆయన జైలులో ఉన్నాడు. నేను నా ఇద్దరు పిల్లలతో బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. కల్తీ కల్లుతో నా కుటుంబం ఆగమైంది. -బాస రాధ, తిమ్మాపూర్, జగిత్యాల పిల్లలను చదివించలేకపోతున్నాం.. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌కు చెందిన బిట్ల అశోక్(35) సెప్టెంబర్ 25న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో కుటుం బం వీధిన పడింది. ప్రస్తుతం పిల్లలను చది వించలేక పోతున్నా. -బిట్ల సునీత, నిర్మల్ * కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని విఠల్‌నగర్‌కు చెందిన కోడూరి వైకుంఠం మృతితో ఆయన కుటుంబం అనాథగా మారింది. * జగిత్యాల డివిజన్లోని తిమ్మాపూర్‌లో 23, మోతెలో 18 మంది వికృత చేష్టలతో కుటుంబానికే దూరమయ్యారు. * తిమ్మాపూర్‌కు చెందిన ఇనుగుర్తి నారాయణ కల్తీ కల్లుతో అనారోగ్యం బారినపడి మంచానికే పరిమితయ్యాడు. * ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 13 మంది మృత్యువాత పడ్డారు. వీరంతా రెక్కాడితే గానీ, డొక్కాడని నిరుపేద కూలీలే. * బాసరలో ఆరుగురు, నిర్మల్‌లో ఏడుగురు బాధితులు మరణించారు. * మహబూబ్‌నగర్ జిల్లాలో కల్లు లేని కారణంగా మరణించిన వారు 80 మంది దాకా ఉన్నారు. * రంగారెడ్డి జిల్లాలో తాండూరు, బషీరాబాద్ ప్రాంతాలకు చెందిన దాదాపు 11 మంది మరణించారు. * తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో సుమారు 200మంది చికిత్స కోసం చేరారు. నాలుగు జిల్లాలోనే అధికం: అకున్ సబర్వాల్ మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోనే కల్లీకల్లు సమస్య ఎ క్కువగా ఉందని ఎక్సైజ్‌శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ చెప్పారు. ‘కల్లు సమస్య ఎక్కువగా ఉంది. మత్తు కోసం అల్పాజోలమ్ వినియోగిస్తున్నారు. ఇది మెదడుపై ప్రభావం చూపిస్తోంది. ఈసారి కల్లు దుకాణాలపై దాడులు చేయడానికి ముందుగానే ఆసుపత్రులను సి ద్ధంచేస్తాం. గత సెప్టెంబర్‌లో దాడులతో ఒక్కసారిగా ఇబ్బందులు వచ్చాయి’ అన్నారు. -
నాణ్యతకే ప్రాధాన్యం
- లెవీ సేకరణను పరిశీలిస్తాం - రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలకు తావిస్తే కఠిన చర్యలు - జాయింట్ కలెక్టర్ రాంకిషన్ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పేద కుటుంబాలకు చేరాల్సిన రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని.. క్షేత్రస్థాయి నుంచి దీనిపై పూర్తిస్థాయి నిఘా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ రాంకిషన్ వెల్లడించారు. శుక్రవారం ‘సాక్షి’ ప్రతినిధితో ఆయన మాట్లాడారు. జిల్లాలో రేషన్ సరుకులు పంపిణీ జరుగుతున్న తీరు.. లెవీ సేకరణ అంశాలను వివరించారు. రేషన్ డీలర్లు తమ షాపులకు కేటాయించిన బియ్యాన్ని గతంలోలాగా దఫాల వారీగా డీడీలు చెల్లించి తీసుకువెళ్లే ప్రక్రియకు ఇక పూర్తిగా స్వస్తి చెప్పనున్నామన్నారు. ఆ డీడీలపై అలాట్ అయిన బియ్యాన్ని ఒకేసారి తీసుకువెళ్లి అర్హులైన రేషన్‌కార్డుదారులకు అందించాలని.. ఈ అంశంలో ఏమాత్రం పొరపాటు జరిగినా సదరు డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. అలాగే ‘సాక్షి’లో వారం రోజులుగా లెవీ సేకరణపై వస్తున్న వార్తలకు సంబంధించి ఆయన స్పందించారు. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం మిల్లింగ్ చేసి వారికిచ్చిన దామాషా ప్రకారం ప్రభుత్వానికి బియ్యం లెవీ ఇవ్వాల్సిందేనన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నిర్ణీత గడువులోపు లెవీ ఇవ్వని రైస్మిల్లర్లపై తగిన చర్యలు తీసుకుంటామని జేసీ వివరించారు. ఇప్పటికే జడ్చర్లకు సంబంధించి గత సంవత్సరం లెవీ ఇవ్వాల్సిన రెండు మిల్లులకు సంబంధించి నోటీసులు జారీచేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టామన్నారు. దీంతో ఒక మిల్లర్ పూర్తిస్థాయి లెవీని చెల్లించారని.. మరో రైస్‌మిల్లర్ లెవీ ఇవ్వడానికి గడువు కోరాడని జేసీ చెప్పారు. గడువు లోపు ఇవ్వని పక్షంలో క్రిమినల్ కేసులు పెట్టడానికి సైతం వెనుకాడబోమన్నారు. రైస్‌మిల్లర్లు ప్రభుత్వానికి ఇచ్చే లెవీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయన్నారు. లెవీ బియ్యాన్ని ఏ క్షణమైనా క్వాలిటీ కంట్రోల్ సిబ్బందితో తనిఖీలు చేయిస్తామన్నారు. అవసరమైతే గోదాముల్లోకి లెవీ చేరిన తరువాత కూడా మిల్లర్లు ఇచ్చిన ఏసీకేల ఆధారంగా తనిఖీలు చేస్తామన్నారు. ఇచ్చిన బియ్యంలో నాణ్యత లోపాలు ఉంటే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. ఇప్పటికే ప్రభుత్వానికి చెల్లించాల్సిన లెవీకి సంబంధించి రైస్‌మిల్లర్లు సకాలంలో ఇచ్చేందుకు గాను ఎన్ఫోర్స్మెంట్ డీటీలను వారికి అనుసంధానం చేశామని జేసీ చెప్పారు. సకాలంలో లెవీ రాని పక్షంలో రేషన్ బియ్యాన్ని ఏ రూపంలో మిల్లర్లు వినియోగించుకున్నా సహించబోమన్నారు. రేషన్ బియ్యం అక్రమమార్గం పట్టకుండా నిఘాను కట్టుదిట్టం చేస్తున్నామని.. అడుగడుగునా తనిఖీలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే రెండు నెలలుగా నిఘా ఏర్పాటుచేయడం ద్వారా పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోగలిగామన్నారు. పలుచోట్ల కేసులు నమోదు చేశామని జే సీ వివరించారు. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం మిల్లర్ల వద్ద నిల్వ ఉందా లేదా ఆ ధాన్యం మిల్లింగ్ చేసే తమకు లెవీ ఇస్తున్నారా లేదా అన్న అంశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు జేసీ వివరించారు. -
పేదల ‘గూడు’ చెదిరింది
* ‘ఆర్‌ఏవై’ రద్దుతో రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్రం మంగళం * కార్యరూపం దాల్చని ఆరు ప్రాజెక్టుల రద్దు * విడుదలైన తమ వాటా నిధులు తిరిగివ్వాలంటూ లేఖ * త్వరలో ప్రారంభించే పథకం కింద రాష్ట్రానికి అవకాశం! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మురికివాడల్లో నివసిస్తున్న పేదలు కలలుగన్న ‘గూడు’ చెదిరింది! కేంద్రం నిర్ణయం, రాష్ట్రం జాప్యం కారణంగా వివిధ పట్టణాల్లో ప్రారంభం కావాల్సిన పక్కా ఇళ్ల నిర్మాణం ఆదిలోనే అటకెక్కింది. పట్టణ ప్రాంతాల్లో మురికివాడల నిర్మూలన లక్ష్యంతో గత యూపీఏ ప్రభుత్వం 2011లో ప్రారంభించిన రాజీవ్ ఆవాస్ యోజన (ఆర్‌ఏవై/రే)ను రద్దు చేసిన ప్రస్తుత మోదీ ప్రభుత్వం... ఈ పథకం కింద ఇప్పటికే రాష్ట్రానికి మంజూరైన ఏడు ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుల్లో ఇంకా పనులు ప్రారంభంకాని ఆరు ప్రాజెక్టులను రద్దు చేసింది. పనులు ప్రారంభమైన ఏకైక ప్రాజెక్టు ‘కేశవనగర్’ను మాత్రమే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలనశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ పంపింది. పైగా ఈ ప్రాజెక్టులకు మంజూరు చేసిన తమ వాటా నిధులను తిరిగి ఇవ్వాలని కోరింది. దేశవ్యాప్తంగా కేవలం 188 ప్రాజెక్టులనే కొనసాగించిన కేంద్రం ఇంకా కార్యరూపం దాల్చని మిగిలిన ప్రాజెక్టులను రద్దు చేసేసింది. అయితే 2022 నాటికి ప్రజలందరికీ ఇళ్ల నిర్మాణం లక్ష్యంలో భాగంగా త్వరలో ప్రకటించనున్న ‘హౌస్ ఫర్ ఆల్’ పథకం కింద రాష్ట్రానికి మళ్లీ అవకాశం కల్పిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కొంప ముంచిన పనుల జాప్యం ‘మిషన్ సిటీస్’లోని మురికివాడల ప్రజల కోసం రెండు, మూడంతస్తుల (జీ+2, జీ+3) గృహ సమూదాయాలను నిర్మించడం, మౌలిక సౌకర్యాలను కల్పించడమే రాజీవ్ ఆవాస్ యోజన ఉద్దేశం. గడిచిన మూడేళ్లలో రూ. 300 కోట్ల అంచనా వ్యయంతో తెలంగాణకు ఏడు ఆర్‌ఏవై ప్రాజెక్టులు మంజూరయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కేశవ్‌నగర్‌లో రూ. 58.74 కోట్లతో 334 ఇళ్ల నిర్మాణానికి మంజూరైన ప్రాజెక్టు మాత్రమే ఇటీవల కార్యరూపం దాల్చింది. వరంగల్, ఖమ్మం, రామగుండం పట్టణాలకు మంజూరైన మరో ఆరు ప్రాజెక్టుల కింద ఇంకా పనులు ప్రారంభించకపోవడంతో కేంద్రం వాటిని రద్దు చేసేసింది. కేంద్ర ప్రభుత్వ వాటా కింద విడుదలైన రూ.161.56 కోట్ల నిధుల్లో గత రెండేళ్లుగా నిరుపయోగంగా ఉంచిన రూ.70 కోట్లను తిరిగివ్వాలని రాష్ట్రాన్ని కోరింది. ప్రతిపాదనలు పంపినా లభించని సీఎంవో ఆమోదం ఆర్‌ఏవై కింద మంజూరైన ప్రాజెక్టులను తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోకు అనుగుణంగా డబుల్ బెడ్ రూమ్ గృహాలతో నిర్మించాలని దాదాపు ఏడాది కింద సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆర్‌ఏవై మార్గదర్శకాల ప్రకారం సింగిల్ బెడ్రూమ్ ఇంటికి రూ.5 లక్షల వ్యయం చేయాల్సి ఉండగా అదనపు బెడ్రూమ్ నిర్మాణం వల్ల ఈ ఖర్చు రూ.7 లక్షలకు పెరగనుందని అధికారులు అంచనా వేశారు. దాదాపు ఆర్నెల్ల కిందే సీఎం కార్యాలయానికి ఈ మేరకు సవరించిన ప్రతిపాదనలు వెళ్లినా ఆమోదముద్ర పడలేదు. కేశవ్‌నగర్ ప్రాజెక్టుకే ప్రభుత్వం ప్రత్యేక జీవో ద్వారా అనుమతులిచ్చింది. మిగిలిన ఆరు ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోలేకపోయింది. దీంతో రెండేళ్ల కిందే మంజూరైన ఈ ప్రాజెక్టులు ప్రారంభం కాకుండానే రద్దయ్యాయి. -
బీమాతో పేదల కుటుంబాలకు భరోసా
ఒంగోలు: ప్రధానమంత్రి ఇటీవల ప్రవేశపెట్టిన మూడు రకాల పథకాలు పేదల కుటుంబాలకు అతిపెద్ద భరోసాగా నిలుస్తాయని బీమా సంస్థలే కాదు...బ్యాంకర్లూ చెబుతున్నారు. అయితే అవకాశం ఉన్నా సరైన అవగాహన లేకపోవడంతో ప్రజలు వీటిని వినియోగించుకునేందుకు దృష్టి సారించడం లేదు. చాలామంది ఏదో ఒక స్కీమును వినియోగించుకుంటే సరిపోతుంది కదా అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి కనీసం రెండు బీమా పథకాలను ఉపయోగించుకున్నా ఆపద వేళల్లో ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. అంటే ఈనెల 31వ తేదీ వరకు బ్యాంకుల్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. జూన్ ఒకటో తేదీ నుంచి బీమా పథకాలు అమలులోకి వస్తాయి. మే 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకునేందుకు ఎటువంటి మెడికల్ చెకప్‌లు అవసరం లేదు. కేవలం ఫారం పూర్తిచేసి ఇస్తే సరిపోతుంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన: ఇది పూర్తిగా ప్రమాద బీమా. ఈ బీమాలో సభ్యత్వం పొందాలంటే బ్యాంకులో ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ కనీసంగా నెలకు రూపాయి చొప్పున ప్రతి ఏడాది ఏకమొత్తంగా రూ.12 చెల్లించాలి. ఈ మొత్తం కూడా జూన్ ఒకటో తేదీ నాటికి బ్యాంకు ఖాతాలో నిల్వ ఉండాలి. మిగిలిన రోజుల్లో ఎలా ఉన్నా ప్రతి ఏడాది జూన్ ఒకటో తేదీ నాటికి నిల్వ ఉంచుకునేలా చూసుకోవాలి. దీనికి 18 నుంచి 70 ఏళ్ల వయస్సు వరకు అందరూ అర్హులే. ఏదైనా ప్రమాదవశాత్తు సంబంధిత పాలసీదారుడు మరణిస్తే అతను పేర్కొన్న నామినీకి రూ.2 లక్షలు అందుతుంది. ఒక వేళ పాలసీదారుడు తీవ్రంగా గాయపడి ఎటువంటి పనిచేసుకోలేని నిస్సహాయ స్థితికి లోనైతే అతనికి లక్ష రూపాయలు అందుతుంది. ప్రయోజనం ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన: ఇది పూర్తిగా జీవిత బీమా. మరణం ఏ రూపంలో సంభవించినా పాలసీదారుడు సూచించినా నామినీకి రూ.2 లక్షలు అందుతుంది. దీనికి ఏడాదికి రూ.330లు ప్రీమియం చెల్లించాలి. దీనికి దరఖాస్తు చేసుకోవాలంటే 18 నుంచి 50 సంవత్సరాలలోపు వారు మాత్రమే అర్హులు. పాలసీ 5 వరుస సంవత్సరాలు అమలులో ఉంటుంది. దీనికి కూడా ప్రీమియం రూ.330లు ప్రతి ఏడాది జూన్ ఒకటో తేదీ నాటికి బ్యాంకు ఖాతాల్లో నిల్వ ఉండేలా చూసుకోవాలి. జూన్ ఒకటో తేదీ నుంచి బీమా అమలులోకి వస్తుంది. వ్యవసాయ కూలీలు, డ్రైవర్లు, ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు, అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఒక వేళ ఎవరైనా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన రెండింటికీ ప్రీమియం చెల్లించిన పాలసీదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి రెండు పథకాల నుంచి రూ.4 లక్షలు పరిహారం అందుతుంది. అటల్ పెన్షన్ యోజన: ఇది కేవలం భవిష్యత్తులో పెన్షన్ పొందేందుకు ఉద్దేశించిన పథకం. పెన్షన్ కనీసంగా వెయ్యి రూపాయల నుంచి రూ.5 వేల వరకు పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే పెన్షన్ 60 సంవత్సరాలు దాటిన తరువాతే అందుతుంది. పథకంలో చేరాలంటే 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు మాత్రమే అర్హులు. అసంఘటిత రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. వెయ్యి రూపాయల పెన్షన్ పొందాలంటే 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు ప్రతినెల రూ.42 చొప్పున చెల్లించాలి. రూ.2 వేలు పెన్షన్ పొందాలంటే రూ.84, రూ.3 వేలు పెన్షన్ పొందాలంటే రూ.126, రూ.4 వేలు పెన్షన్ పొందాలంటే రూ.168, రూ.5 వేలు పెన్షన్ పొందాలంటే రూ.210లు చొప్పున ప్రీమియం చెల్లించాలి. అయితే ప్రీమియం వయస్సు పెరిగేకొద్దీ పెరుగుతూ ఉంటుంది. అయితే వేరే పెన్షన్ సౌకర్యం పొందుతున్నవారు ఈ పథకంలో దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు. పాలసీదారుడు మరణిస్తే నామినీకి రూ.1.70 లక్షలు చెల్లించడంతోపాటు పెన్షన్ కూడా ప్రతినెలా ప్రభుత్వం చెల్లిస్తుంది. -
గూడుపోయింది గోడు మిగిలింది
సంతకవిటి : నిన్నమొన్నటి వరకూ పచ్చగా ఉన్న మామిడిపల్లి గ్రామం నేడు మొండి గోడలతో శ్మశాన వాతావరణాన్ని తలపిస్తోంది. బుధవారం సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో 60 ఇళ్లు కాలిపోయిన విషయం విదితమే. పూరిపాకల్లో తలదాచుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద కుటుంబాలు అగ్ని దేవడు ఆగ్రహంతో నేడు నిలువనీడలేక చెట్టుకొకరు..పుట్టకొక్కరయ్యారు. బాధితులంతా గ్రామంలోని షిర్డీసాయి మందిరం వద్ద, పలువురు ఇళ్ల గడపల్లోనూ తలదాచుకుంటున్నారు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. కాలిపోయిన వస్తు సామగ్రిని చూసి రోదిస్తున్నారు. నష్టం రూ. 60 లక్షలు అగ్ని ప్రమాద నష్టం సుమారు రూ 60 లక్షలు ఉంటుందని రెవెన్యూ అధికారులు ధ్రువీకరించారు. ఇన్చార్జి తహశీల్దార్ బి.సూరమ్మ, డీటీ సాయికామేశ్వరరావు, ఆర్ఐ రామారావులు గ్రామానికి చేరుకుని కాలిపోయిన ఇళ్ల వివరాలను గురువారం సేకరించారు. ఆస్తినష్టం మీద ఆరాతీసి నివేదికలు రూపొందించుకున్నారు. బాధితులకు తక్షణ సాయం అందించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో అరసవల్లి కొండలరావు, రాములమ్మ, బేపల దుర్గయ్య, గూనాపు సీతారాంలకు చెందిన నగదుతో పాటు తిండి నిమిత్తం ఉంచుకున్న ధాన్యం కాలిపోయినట్లుగా, మండల గన్నెప్పడు, బంటుపల్లి లక్ష్మణరావు, మాటూరు కాంతమ్మ, సరోజనమ్మ, సెగల్ల అప్పడు, నాగం, పైల లక్ష్మణ, సత్యం, సూర్యనారాయణ తదితరులుకు చెందిన ఎల్ఐసీ బాండ్లు, పిల్లల సర్టిఫికెట్లు, నగదు కాలిపోయినట్టు రోదిస్తున్నారు. అరసవల్లి చిన్నోడు, బేపల చింతయ్య, నందయ్య, ఉంకుల లక్ష్మణరావు, ఆదినారాయణ, అరసవల్లి చిన్నారావు, బంటుపల్లి నారాయణరావు, పైల రామారావులు కూడా బాగా నష్టపోయారు. పి.రామప్పడు, చిన్నోడు, చిన్నారావులు ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరి ముగ్గురు ఇల్లు కాలిపోవడంతో నిలువ నీడలేక రోడ్డున పడ్డారు. అలాగే పి.అప్పలసూరి, అప్పమ్మ, రాములమ్మ, శంకుడు, సీతమ్మ వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరి ఇల్లు కూడా దహనం కావడంతో రోదిస్తున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది రజక, ఎస్సీ కుటుంబాలకు చెందిన నిరుపేదలే కావడంతో సాయం కోసం ఎదురు చూస్తున్నారు. బంధువుల ఓదార్పు బంధువులను పరామర్శించేందుకు వచ్చిన వారితో మామిడిపల్లి రద్దీగా మారింది. ఓదార్పులు, రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు నెలకున్నాయి. షిర్డీ సాయి మందిరం వద్ద కొంతమంది బాధితులు తలదాచుకుంటున్నారు. ఇక్కడే భోజన ఏర్పాట్లను అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేశారు.