అధ్వానమన్నా క్యాంటీన్లు ! | Anna Canteens Is Not Working Kurnool | Sakshi
Sakshi News home page

అధ్వానమన్నా క్యాంటీన్లు !

Published Sat, Jul 14 2018 6:59 AM | Last Updated on Fri, Aug 10 2018 8:42 PM

Anna Canteens Is Not Working Kurnool - Sakshi

భోజనాల కోసం తోసుకుంటున్న పేదలు

ఆదోని: టీడీపీ  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన అన్న క్యాంటీన్ల  నిర్వహణ పట్టణంలో అబాసుపాలు అవుతోంది. పర్యవేక్షణ కొరవడి ఇష్టారాజ్యంగా మారింది. క్యాంటీన్లు ప్రారంభించిన మూడు రోజలకే  ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.   రూ.5కే అల్పాహారం, భోజనం దొరుకుతోందన్న ఆశతో క్యాంటీన్లకు వస్తున్న వారు నిరాశగా వెనుదిరుగుతున్నారు.  నిరుపేదలందరికీ చౌకగా అల్పాహారం, భోజనం అన్న క్యాంటీన్ల ద్వారా అందుబాటులోకి తెచ్చామని పాలకులు గోప్పలు చెప్పుకోవడం  తప్పా వాస్తవ పరిస్థితి విరుద్ధంగా ఉంది. మూడు రోజుల కిందట బుధవారం పట్టణంలోని రైల్వే స్టేషను రోడ్డు, నిర్మల్‌ టాకీసు ఎదురుగా  అన్న క్యాంటీన్లను అధికారులు, నాయకులు హంగు, ఆర్భాటాలతో ప్రారంభించిన విషయం తెలిసిందే.  నాణ్యత పాటించకోవడంతో అధ్వానమన్నా భోజనం అంటున్నారు పేదలు.
  
అరగంటనే టోకన్లు ఖాళీ... 
ఉదయం 7 గం. నుంచి 9 గం వరకు అల్పాహారం, మధ్యాహ్నం 1 గం. నుంచి 3 గం. వరకు, రాత్రి 7 గం. నుంచి 9 గం. వరకు భోజనం అందుబాటులో ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఉదయం 200 మందికి అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి మూడు వందల మందికి చొప్పున భోజన సదుపాయం కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అయితే క్యాంటీన్లు తెరిచిన అరగంట లోపే టోకెన్లు ఖాళీ అవుతున్నాయి.
 
టోకెన్ల జారీలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు.  క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం అక్షయపాత్ర అనే సంస్థకు అప్పగించింది. అయితే  టీడీపీ మద్దతుదారులు హవా కొనసాగిస్తున్నారు.    టోకన్ల పంపిణీలోనూ వ్యత్యాసాలు చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  క్యాంటీన్ల పర్యవేక్షణ బాధ్యతను ప్రభుత్వం నిర్దిష్టంగా ఏ అధికారికి అప్పగించలేదు. దీంతో పర్యవేక్షణ కొరవడి నిర్వహణ ఆదిలోనే గాడి తప్పింది.
 
ఎమ్మిగనూరులో వంట... 
క్యాంటీన్ల నిర్వహణ  బాధ్యతను స్వీకరించిన అక్షయపాత్ర సంస్థ పట్టణంలోని రెండు క్యాంటీన్లకు అవసరం అయిన అల్పాహారం, భోజనం  తయారీ ఎమ్మిగనూరులో చేపట్టింది. ఎమ్మగనూరు నుంచి ప్రత్యేక వాహనంలో పట్టణానికి తెస్తున్నారు. దీంతో అల్పాహరం, భోజనం టోకెన్లు తీసుకున్న వారు  నిరీక్షించాల్సి వస్తోంది.  వాహనం రాగానే అల్పాహారం, భోజనం కోసం ఎగబడుతుండడంతో గందరగోళం నెలకొంది.
  
పరిమితి  విధింపుతో ఇబ్బంది...  
అల్పాహారం, భోజనాల టోకెన్ల జారీకి పరిమితి విధించడం కూడా తీవ్ర విమర్శలకు గురవుతోంది.   పట్టణంలో 2 లక్షలకు పైగా జనాభా ఉండ గా ఇందులో దుకాణాలు, మార్కెట్లు, తోపుడు బండ్లు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు ఇలా.. అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్న కార్మికులు దాదాపు 30వేలకు పైగా ఉన్నారు. డివిజన్‌ కేంద్రం కావడం,  అతి పెద్ద మార్కెట్‌ యార్డు ఉండడంతో రైతులు, ప్రభుత్వ కార్యాలాయాలలో ఇతర పను ల కోసం ప్రతిరోజూ దాదాపు  50వేలకు పైగా ప ట్టణానికి వస్తుంటారు.   పట్టణంలో ఏర్పాటు చేసి న అన్న క్యాంటీన్లలో రూ.5కే అల్పాహారం, భోజనం అందుబాటులోకి వస్తుందని అధికారులు, నాయకులు ఊదరగొట్టడంతో ఖర్చు చాలా త గ్గుతోందని పేదలు అశించారు. అయితే అల్పాహారానికి 200, భోజనాలకు 300 టోకెన్ల మాత్రమే జారీ చేస్తుండడం ఇబ్బంది నెలకొంది. 

నాణ్యతపై అనుమానాలే...  
నాణ్యతపై సీపీఎం నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వంటలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు వెళ్లగా  ఇడ్లిలో పురుగున్నట్లు గుర్తించారు. వెంటనే సిబ్బంది దృష్టికి తీసుకెళ్లిగా  వేరే ఇడ్డి వడ్డించినట్లు తెలిసింది.  దీంతో వంటకు వినియోగించే సరుకుల నాణ్యతపై కూడా పలు అనుమానాలు  వ్యక్తమవుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement