prisons
-
2023లో 31,428 2024లో 41,138
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జైళ్లలో 2023తో పోలిస్తే 2024లో ఖైదీల సంఖ్య పెరిగినట్టు జైళ్ల శాఖ డీజీ సౌమ్యామిశ్రా తెలిపారు. 2023లో మొత్తం 31,428 మంది ఖైదీలు ఉండగా.. 2024లో ఖైదీల సంఖ్య 41,138 మందికి చేరిందన్నారు. ప్రధానంగా ఎన్డీపీఎస్ కేసులలో నిందితుల సంఖ్యలో పెరు గుదల ఉందన్నారు. 2023లో 3,688 ఖైదీలు ఎన్డీ పీఎస్ కేసులలో రాగా, 2024లో ఈ సంఖ్య 6,311కి చేరినట్టు తెలిపారు. తెలంగాణ జైళ్లశాఖ ఇతర రాష్ట్రాల జైళ్లతో పోలిస్తే సంస్కరణలు, ప్రత్యేక శిక్షణలు, ఖైదీల సంక్షేమం, సాంకేతికత వినియోగంలో ఎంతో ముందంజలో ఉందని సౌమ్యామిశ్రా తెలిపారు. ఈ మేరకు బుధవారం చంచల్గూడలోని సికా (స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరక్షనల్ అడ్మినిస్ట్రేషన్)లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలంగాణ జైళ్లశాఖ 2024 వార్షిక నివేదికను ఐజీలు రాజేశ్, మురళీబాబు ఇతర ఉన్నతాధికారులతో కలిసి సౌమ్యా మిశ్రా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జైళ్లలో తీవ్రవాదుల సంఖ్య తగ్గినట్టు తెలిపారు. 2023లో 52 మంది ఈ తరహా ఖైదీలు ఉండగా, 2024లో ఆ సంఖ్య 36కి తగ్గినట్టు చెప్పారు. హత్యకేసులలో ఖైదీల సంఖ్య 2023లో 2,511 ఉండగా, 2024కు అది 2,754కు చేరిందన్నా రు. ఖైదీల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తు న్నట్టు తెలిపారు. 2024లో 1,045 మంది ఖైదీలకు ఉచితంగా న్యాయ సహాయం అందించినట్టు తెలిపారు. అదేవిధంగా అర్హులైన 552 మంది ఖైదీలకు రూ.1,73,08,500 రుణాలు మంజూరు చేశామన్నారు. తెలంగాణ జైళ్లలో ఇప్పటివరకు 12,650 మంది ఖైదీలను అక్షరాస్యులుగా మార్చా మని తెలిపారు. తెలంగాణ జైళ్లశాఖ చరిత్రను పౌరు లకు తెలియ జెప్పేలా త్వరలోనే జైల్ మ్యూజి యం ఏర్పాటు చేయ నున్నట్టు సౌమ్యా మిశ్రా తెలిపారు. సమావేశంలో ఐజీలు రాజేశ్, మురళీబాబు, డీఐజీలు శ్రీనివాస్, సంపత్, సూప రింటెండెంట్లు నవాబ్ శివకుమార్ గౌడ్, రామచంద్రం, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మాకు అంతా సమానమే..జైళ్లశాఖ నిబంధనల మేరకే ఏ ఖైదీ విషయంలో లైనా చర్యలు తీసుకుంటున్నామని, చట్టానికి ఎవ రూ అతీతులు కారని డీజీ సౌమ్యామిశ్రా స్పష్టం చేశారు. నటుడు అల్లు అర్జున్ విషయంలోనూ తా ము జైల్ మాన్యువల్ ప్రకారమే నడుచుకున్నామని వెల్లడించారు. జైలు అధికారులుగా తాము ఎవరినీ వీఐపీలుగా భావించబోమని, అందరు ఖైదీలతో సమానంగా చూస్తామన్నారు. కోర్టు నుంచి ప్రత్యేక ఆదేశాలున్న వారి విషయంలో కోర్టు ఆదేశాల మేరకే చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
జైళ్లు సరిపోవట్లే!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని జైళ్లలో ఉండాల్సిన సంఖ్య కంటే ఎక్కువమంది కిక్కిరిసి ఉంటున్నారని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 1,330 జైళ్లలో 4,36,266 మంది ఖైదీలను ఉంచేందుకు వీలుండగా.. గతేడాది డిసెంబర్ 31 నాటికి ఏకంగా 5,73,220 మంది ఖైదీలు ఉన్నారు. ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, పంజాబ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, జార్ఖండ్ జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలు ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని జైళ్లలో సామర్థ్యం కంటే తక్కువగా ఖైదీలు ఉన్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని జైళ్లలో సామర్థ్యం కంటే స్వల్పంగా ఎక్కువ సంఖ్యలో ఖైదీలు ఉన్నారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపార్లమెంటులో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్ మిశ్రా లిఖితపూర్వకంగా ఇచ్చి న సమాధానంలో ఈ వివరాలనువెల్లడించారు. యూపీలో అత్యధికంగా.. ♦ దేశంలోనే అత్యధికంగా ఉత్తరప్రదేశ్(యూపీ)లోని 77 జైళ్లలో 67,600 మంది ఖైదీల సామర్థ్యం ఉండగా.. ఏకంగా 1,21,609 మంది ఖైదీలు మగ్గుతున్నారు. బీహార్‌లోని 59 జైళ్లలో 47,750 మంది సామర్థ్యానికిగాను 64,914 మంది ఖైదీలు ఉన్నారు. ♦ మధ్యప్రదేశ్‌లోని 132 జైళ్లలో 48,857 మంది ఖైదీలు.. మహారాష్ట్రలోని 64 జైళ్లలో 41,070 మంది ఖైదీలు.. పంజాబ్‌లోని 26 జైళ్లలో 30,801 మంది ఖైదీలు.. జార్ఖండ్‌లోని 32 జైళ్లలో 19,615 ఖైదీలు.. ఢిల్లీలోని 16 జైళ్లలో 18,497 మంది ఖైదీలు ఉన్నారు. ♦ తెలంగాణలోని 37 జైళ్లలో 7,997 మంది సామర్థ్యానికిగాను 6,497 మంది ఖైదీలు ఉన్నారు. ఇందులో 2,102 మంది దోషులు, 4,221 మంది విచారణ ఖైదీలు, 174 మంది నిర్బంధిత ఖైదీలు ఉన్నారు. ♦ ఆంధ్రప్రదేశ్‌లోని 106 జైళ్లలో 8,659 ఖైదీల సామర్థ్యానికిగాను 7,254 మంది ఖైదీలు ఉన్నారు. ఇందులో 1,988 మంది దోషులు, 5,123 మంది విచారణ ఖైదీలు, 134 మంది నిర్బంధిత ఖైదీలు, 9 మంది ఇతరులు ఉన్నారు. -
పరివర్తనా కేంద్రాలుగా మన కారాగారాలు
ఇంతవరకూ శిక్షా కేంద్రాలుగా ఉన్న కారాగారాలు ఇక పరివర్తన కేంద్రాలుగా మారనున్నాయి. అందు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జైళ్ళలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. శిక్షాకాలం పూర్తయినా చాలామంది ఖైదీల మానసిక స్థితిలో మార్పు రావడం లేదు. జైలు నుంచి బయటకు వచ్చాక వారికి సరైన ఉపాధి దొరక్కపోవడంతో మళ్లీ నేరాలకు పాల్పడి తిరిగి జైలుకు చేరుతున్నారు. కొందరు న్యూనతతో ఆత్మహత్యలు చేసుకోవడం కూడా కనిపిస్తుంది. రాష్ట్రంలో రాజమహేంద్రవరం, విశాఖపట్నం, కడప, అనంతపురం కేంద్ర కారాగారాలతో పాటు మొత్తం 80 జైళ్లు ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి 8,499 మంది ఖైదీలు రాష్ట్రంలో వివిధ జైళ్లలో ఉన్నారు. నాలుగు కేంద్ర కారాగారాలతో కలిపి 15 జైళ్లను తొలి దశలో పరివర్తనా కేంద్రాలుగా మార్చ డానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. మూడు కేటగిరీలుగా ఖైదీలను గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తారు. ఏడాదిలోపు శిక్ష పడిన ఖైదీలు, ఏడాది కంటే ఎక్కువ శిక్ష పడిన ఖైదీలు, రిమాండ్ ఖైదీలు అనే కేటగిరీలుగా వర్గీకరించి వాళ్లకు కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. వీటి కోసం జైళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ పరివర్తన కార్యక్రమం కోసం ప్రతి జైల్లోనూ ప్రత్యేక నిపుణుల బృందం ఏర్పాటవుతోంది. మానసిక వైద్య నిపుణులు, సంక్షేమ శాఖ అధికా రులు, సామాజిక సేవకులు, స్వచ్ఛంద సేవా సంస్థ (ఎన్జీవో), సామాజిక కౌన్సిలర్, ఆర్థిక రంగ నిపుణుడు, చిన్న తరహా పరిశ్రమల శాఖ అధికారులు, విద్యావేత్తలు తదితరులు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు. ఖైదీల్లో హింస, నేర ప్రవృత్తి రూపుమాపటం, చట్టానికి బద్ధుడయ్యే పౌరుడిగా తీర్చిదిద్దడం; తన జీవితానికీ, కుటుంబానికీ అవసరమయ్యే ఆర్థిక ప్రణాళిక లను వేసుకోగలగటం; విద్య, వృత్తి నైపుణ్యాలను పెంపొందించడం; కుటుంబ సమస్యలను పరిష్కరించుకోగలగటం, ప్రేమ తత్వాన్ని నింపటం, సామాజికంగా గౌరవ జీవనం ఆవశ్యకతను తెలియజేయడం, న్యూనతా భావాన్ని తొలగించడం, ఆత్మస్థైర్యాన్ని కలిగించటం, ఉత్సాహాన్ని నింపడం తదితర అంశాలపై ఖైదీలకు కౌన్సిలింగ్, శిక్షణ ఇస్తారు. క్యాటగిరీల వారీగా వారానికి, 15 రోజులకూ, నెలకూ, ఆ తర్వాత 45 రోజులకూ కౌన్సెలింగ్ ఇస్తూ ఉంటారు. ప్రతి ఖైదీని అక్షరాస్యునిగా తీర్చిదిద్ది కనీసం సంతకం చేసే స్థాయికి తీసుకురావాలనేది ఈ పరివర్తన సంకల్పం. వారి అభివృద్ధి నివేదికను ఎప్పటికప్పుడు ప్రత్యేక పోర్టల్‌లో నమోదు చేస్తారు. వారి సామాజిక పరివర్తన తీరును విశ్లేషించి తదనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటారు. ఖైదీలకు సంబంధించిన తుది నివేదిక కాపీని వాళ్లు జైలు నుంచి విడుదలయ్యాక సంబంధిత పోలీస్ స్టేషన్‌కు పంపుతారు. అక్కడ పోలీసులు వాళ్ల సామాజిక ప్రవర్తనపై ఒక కన్నేసి ఉంచుతారు. అవసరమైతే మంచి మార్పుతో బయటకు వచ్చిన ఖైదీల స్వీయ అనుభవాలతో పలువురికి కౌన్సిలింగ్ ఇప్పించే విధానాలు కూడా కార్యచరణలో ఉన్నాయి. ఇప్పటికే పెద్ద జైళ్లలో ఖైదీలకు డైరెక్ట్ టెన్త్ ఇంటర్మీడియట్, దూర విద్యా విధానం ద్వారా డిగ్రీ, పీజీ చదువులు కొన సాగుతున్నాయి. ‘స్కిల్ ఇండియా’ ద్వారా ప్లంబింగ్, వెల్డింగు, వీవింగ్, టైల రింగ్ తదితర వృతుల్లో శిక్షణ ఇస్తున్నారు. ఏపీ ప్రభుత్వం జైళ్లలో తలపెట్టిన పరివర్తన తొలి దశా కార్యక్రమం విజయవంతం అయితే మలిదశలో మిగతా అన్ని జైళ్లకూ విస్తరించడం సాధ్యమవుతుంది. నేరాల సంఖ్య తగ్గి, శాంతి భద్రతలు కట్టుదిట్టమై, జైళ్ల నిర్వహణలో మన రాష్ట్రం దేశానికే స్ఫూర్తిగా నిలవనుంది. చిలుకూరి శ్రీనివాసరావు వ్యాసకర్త జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ‘ 89859 45506 -
ఏడాదిలో 119 మంది ఖైదీల ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జైళ్లలో కలిపి 2022 సంవత్సరంలో 119 మంది ఖైదీలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో 109 మంది ఉరి వేసుకున్నారు. ఈ ఏడాది తెలంగాణలోని అన్ని జైళ్లలో కలిపి 11 మంది ఖైదీలు సహజ మరణం పొందగా, ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిపింది. కాగా 2021తో పోల్చుకుంటే ఖైదీల మరణాలు తగ్గడం గమనార్హం. దేశవ్యాప్తంగా జైళ్లలో పరిస్థితులు, ఖైదీల మరణాలపై నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ఒక నివేదిక రూపొందించింది. ఇందులోని వివరాలను ఇటీవల కేంద్ర హోంశాఖ వెల్లడించింది. 2022లో దేశవ్యాప్తంగా అన్ని జైళ్లలో కలిపి 1,955 మంది ఖైదీలు మృతి చెందారు. 1,773 మందిది సహజ మరణం కాగా, 159 మంది అసహజ రీతిలో మరణించారు. మిగతావి మిస్టరీ మరణాలు. సహజ మరణం పొందిన 1,773 మందిలో 1,670 మంది అనారోగ్యంతో, మరో 103 మంది వృద్ధాప్యం కారణంగా మృతి చెందారు. అనారోగ్య మృతుల్లో 428 మంది ఖైదీలు గుండె సంబంధ వ్యాధులతో, 190 మంది ఊపిరితిత్తుల సమస్యలతో, మరో 100 మంది క్యాన్సర్ కారణంగా మరణించారు. టీబీ కారణంగా 89 మంది, కిడ్నీ సమస్యలతో 81 మంది, బ్రెయిన్ హెమరేజ్‌తో 58 మంది, డ్రగ్స్, ఆల్కహాల్ విత్ డ్రావల్ లక్షణాల కారణంగా 37 మంది మృతి చెందారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 351 మంది అనారోగ్యంతో మరణించారు. పశి్చమ బెంగాల్ (174), బిహార్ (167) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అసహజ మరణాల్లో హత్యలు, దాడులు అసహజ మరణాల్లో 109 మంది ఉరేసుకోగా 10 మంది ఇతర ప్రమాదాల్లో మృతి చెందారు. తోటి ఖై దీల చేతుల్లో నలుగురు హత్యకు గురయ్యారు. బ యటి వారి దాడిలో ఒకరు, కారణాలు తెయని మర ణాలు మరో 25 వరకు నమోదయ్యాయి. అస హజ మరణాల్లోనూ అత్యధికంగా ఉత్తర ప్రదేశ్‌లోనే 24 మంది మృతి చెందారు. 17 మందితో కర్ణాటక, 15 మందితో హరియాణ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నా యి. పారిపోయింది 257 మంది.. పట్టుకుంది 113 మందిని మొత్తం 257 మంది ఖైదీలు జైళ్ల నుంచి పారిపోయినట్టు ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. వీరిలో 113 మందిని తిరిగి పట్టుకోగలిగారు. 2020లో 355 మంది, 2021లో 312 మంది పారిపోయినట్టు నివేదిక తెలిపింది. -
నేడు విశాఖకు గవర్నర్ అబ్దుల్ నజీర్
సాక్షి, విశాఖపట్నం : గవర్నర్ అబ్దుల్ నజీర్ ఐదు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం విశాఖకు చేరుకోనున్నారు. విశాఖతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శుక్రవారం సాయంత్రం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా పోర్టు గెస్ట్‌హౌస్‌కి వచ్చి రాత్రి బస చేయనున్నారు. శనివారం ఉదయం నోవాటెల్‌లో జరగనున్న సమాచార కమిషనర్ల జాతీయ సమాఖ్య సదస్సులో పాల్గొంటారు. సాయంత్రం ఏయూ స్నాతకోత్సవంలో చాన్సలర్ హోదాలో పాల్గొననున్నారు. ఆదివారం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో భాగంగా అరకులోని రైల్వే గెస్ట్ హౌస్‌కు చేరుకోనున్నారు. 11వ తేదీ సాయంత్రం విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరాన్ని సందర్శిస్తారు. 12న రుషికొండలోని సాయిప్రియా రిసార్ట్‌లో జరిగే జైళ్ల శాఖ జాతీయ సదస్సుకు హాజరుకానున్నారు. మంగళవారం గన్నవరం చేరుకుంటారని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. -
ప్రపంచలోనే అత్యంత పురాతన జైళ్లు ఇవే.. వందల ఏళ్ల కిందటే నిర్మాణం
-
పేద ఖైదీలకు ఆర్థిక భరోసా
న్యూఢిల్లీ: జరిమానా సొమ్ము గానీ, బెయిల్ రుసుము గానీ చెల్లించే స్తోమత లేక జైళ్లలో మగ్గిపోతున్న ఖైదీలకు ఆర్థిక భరోసా కల్పించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. దీనివల్ల అర్హులైన ఖైదీలకు జైళ్ల నుంచి విముక్తి లభించనుంది. జైళ్లపై భారం తగ్గనుంది. కొత్త పథకంతో నిమ్న కులాలు, పేద కుటుంబాలు, బలహీన వర్గాలకు చెందిన ఖైదీలకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర హోంశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. వారికి ఆర్థిక భరోసా కల్పించే పథకంపై భాగస్వామ్యపక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. ఆధునిక టెక్నాలజీ సాయంతో పథకాన్ని పటిష్టంగా అమలు చేయడానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలియజేసింది. ఇందులో భాగంగా ఈ–ప్రిజన్స్ వేదిక ఏర్పాటు, జిల్లా న్యాయ సేవా సంస్థలను బలోపేతం చేస్తామంది. -
ఉత్తరాది గ్యాంగ్స్టర్లు దక్షిణాది జైళ్లకు
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో గ్యాంగ్స్టర్ల ఆగడాలను చెక్‌పెట్టేందుకు, వారి విస్తృత నెట్‌వర్క్‌ను సమూలంగా నాశనం చేసేందుకు ఎన్ఐఏ కొత్త ఆలోచనను తెరపైకి తెచ్చింది. ఢిల్లీ, పంజాబ్, హరియాణా, రాజస్థాన్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్లను దక్షిణాది రాష్ట్రాల జైళ్లకు తరలించాలని భావిస్తోంది. నాలుగు ఉత్తరాది రాష్ట్రాల్లో డ్రగ్స్, అక్రమ ఆయుధాల సరఫరా, సుపారీ హత్యలు, హవాలా దందా, బెదిరింపు వసూళ్లు, మానవ అక్రమ రవాణా వంటి తీవ్ర నేరాల్లో కొందరు గ్యాంగ్స్టర్లను అరెస్ట్ చేసి సెంట్రల్ జైళ్లలో పడేశారు. వాళ్లు అక్కడి నుంచే నిక్షేపంగా తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. తొలి దశలో వారిలో 25 మందిని దక్షిణాది జైళ్లకు బదిలీ చేయాలని కోరినట్లు సమాచారం. మూసావాలా హత్యతో అలర్ట్ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యోదంతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. దక్షిణాసియాలోని అతిపెద్ద, అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుండే జైళ్లలో ఒకటైన ఢిల్లీలోని తీహార్ జైలు నుంచే మూసేవాలా హత్య ప్రణాళికను గ్యాంగ్స్టర్లు అమలు చేశారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తిహార్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తన నెట్వర్క్ ద్వారా ఈ హత్య చేయించారనే కేసు దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోంది. తిహార్‌లోనే ఉన్న మరో గ్యాంగ్‌స్టర్ నీరాజ్ బవానా సైతం జైలు నుంచే తన వ్యాపారాన్ని ఇష్టారీతిగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పంజాబ్, హరియాణా, రాజస్థాన్ జైళ్లలో ఉన్న గ్యాంగ్స్టర్లదీ ఇదే పంథా. జైళ్లలో కొత్తగా చిన్న ముఠాలుగా ఏర్పడి తమ ప్రణాళికను అమలుచేస్తున్నారు. ఏప్రిల్‌లో గ్యాంగ్‌స్టర్ జితేంద్ర గోగిను చంపేశాడనే కోపంతో మరో గ్యాంగ్‌స్టర్ శేఖర్ రాణాను గోగి సన్నిహితుడు రోహిత్ మోయి జైలు నుంచే కుట్ర పన్ని హత్య చేయించాడు. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో ఉత్తరాదిన పెరిగాయి. కొన్ని కేసుల్లో గ్యాంగ్స్టర్లకు జైలు సిబ్బంది సహకరిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలుండటం మధ్య ఆధిపత్య పోరు పెరిగి గొడవలకు దారితీస్తోంది. వీరికి విదేశాల నుంచి ఆర్ధిక సహకారం అందుతోందనే దారుణ వాస్తవాలు ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడయ్యాయి. ఉత్తరాది జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలుండటం కూడా ఎన్ఐఏ ప్రతిపాదనకు మరో కారణం. ఢిల్లీలో 14 సెంట్రల్ జైళ్ల సామర్ధ్యం 9,346 కాగా 17,733 మంది ఖైదీలున్నారు. పంజాబ్‌లో జైళ్లలో 103 శాతం, హరియాణాలో 127 శాతం, రాజస్థాన్‌లో 107 శాతం ఖైదీలున్నారు. -
తెలంగాణ: జైళ్లలో మగ్గుతున్న యువత.. హత్యలు, లైంగిక దాడులే అధికం..
సాక్షి, హైదరాబాద్: క్షణికావేశంలో చేస్తున్న నేరాలు జీవితాన్ని ఛిద్రం చేస్తున్నాయి. ఉన్నత చదువుల్లోనో, ఉద్యోగ వాపారాల్లోనో రాణించాల్సిన యువత జైలు గదుల్లో బందీ అవుతోంది. తెలంగాణ జైళ్లలో మగ్గుతున్న వారిలో ఎక్కువమంది యుక్త వయస్కులేనని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజాగా విడుదల చేసిన గణాంకాలు(2020) స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 37 జైళ్లలో 6,114 మంది ఉండగా, వీరిలో 1,910 మంది వివిధ నేరాల్లో శిక్ష పడిన వారు కాగా, 3,946 మంది అండర్ ట్రయల్స్ (విచారణ ఖైదీలు), మరో 256 మంది డిటైనీస్ (ముందు జాగ్రత్తగా నిర్బంధంలోకి తీసుకున్నవారు) ఉన్నారని ఎన్సీఆర్బీ పేర్కొంటోంది. అయితే వీరిలో ఎక్కువమంది 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సున్న వారు కావడం గమనార్హం. హత్యలు, లైంగిక దాడుల కేసులే అధికం అండర్ ట్రయల్స్‌లో ఖైదీలుగా ఉన్న యుక్త వయస్కులు ఎక్కువగా హత్యలు, హత్యాప్రయత్నం, లైంగిక దాడులు, మహిళలపై వేధింపులు, మద్యం, మాదకద్రవ్యాల సంబంధిత కేసులు, దొంగతనాల కేసుల్లో జైలు బాట పడుతున్నట్టు ఎన్సీఆర్బీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అదే విధంగా శిక్ష అనుభవిస్తున్న కేటగిరీలోనూ హత్యలు, లైంగిక దాడులు, మహిళలపై వేధింపులు, దొంగతనాలు తదితర కేసుల వారు ఉన్నట్టు వెల్లడవుతోంది. -
Photo Feature: జైలెళ్లి పోతోంది..
సాక్షి, వరంగల్: ముందు పోలీస్ వాహనం..వెనుకే ఆమె పరుగు.. వాహనంలో నుంచి బేలగా వెనక్కి చూస్తూ ఓ ఖైదీ.. చివరకు కనుమరుగైన వాహనం.. బరువెక్కిన గుండెలతో ఇంటిముఖం పట్టిన మహిళ.. వరంగల్ సెంట్రల్ జైలు నుంచి ఖైదీలను మంగళవారం హైదరాబాద్‌లోని చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలిస్తున్నపుడు కనిపించిన భావోద్వేగమిది. దగ్గర్లోనే ఉంటే ములాఖత్‌లో కలుసుకోవడం సులువయ్యేదని.. ఇప్పుడు హైదరాబాద్ ఎలా వెళ్లగలమని ఆమెతో పాటు పలువురు ఖైదీల బంధువులు, భార్యపిల్లలు విలపించారు. -
ఢిల్లీ పోలీసులకు రాష్ట్ర హైకోర్టు క్లాస్!
సాక్షి, న్యూఢిల్లీ : ‘ప్రధానంగా జైళ్లు ఉన్నవే నేరస్తులను శిక్షించేందుకు, సమాజానికి ఏదో సందేశం ఇవ్వడం కోసం నిందితులను నిర్బంధించడానికి కాదు’ అని ఢిల్లీ హైకోర్టు సోమవారం నాడు పోలీసులనుద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించింది. జాతీయ మానవ హక్కుల సంఘం సేకరించిన లెక్కల ప్రకారం 75 శాతం మంది నిందితులు జైళ్లలోనే మగ్గుతున్నారు. కాగా, పింజ్రా ఫెమినిస్ట్ గ్రూపునకు చెందిన నాయకురాలు దేవంగన కలితకు మంగళవారం నాడే ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయినా ఆమెను జైలు నుంచి విడుదల చేయలేదు. మరో కేసు ఆమె మీద పెండింగ్‌లో ఉండడమే అందుకు కారణం. గత రెండు వారాల్లో ఆమెను మూడుసార్లు అరెస్ట్ చేశారు. దేవంగనను ఢిల్లీ పోలీసులు చీటికి మాటికి అరెస్ట్ చేస్తున్నారు. ఏ సామాజిక సమస్యలపై ఆమె రోడ్డు మీదకు వచ్చినా అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళుతున్నారు. (చదవండి: మాస్క్‌లు లేని నూతన జంటకు పదివేల ఫైన్) భారత్‌లోని జైళ్ల గదులు ఇప్పటికే 114 శాతం ఖైదీలతో కిక్కిరిసి పోయి ఉండగా, సామాజిక కార్యకర్తలను పోలీసులు చీటికి మాటికి అరెస్ట్ చేస్తున్నారు. దేశంలో కరోనా మహమ్మారి భయాందోళనలు సష్టిస్తున్న నేటి పరిస్థితుల్లో జైళ్లు కిక్కిరిసి పోవడం ఎంత ప్రమాదరకమో ఊహించవచ్చు. చెన్నైలోని పుజాల్ జైలు కరోనా వైరస్‌కు హాట్‌స్పాట్‌గా మారింది. ఆ జైలులో 47 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. నేరాలను పరిష్కరించాల్సిన పోలీసులు ఆ విషయాన్ని పట్టించుకోకుండా అనుమానితులకు సందేశం ఇవ్వడం కోసం వారిని జైల్లో పెడుతున్నట్లున్నారని ఢిల్లీ కోర్టు విమర్శించింది. ఓ పక్క లాక్‌డౌన్‌ను ఉపయోగించుకొని ఢిల్లీ పోలీసులు గత ఫిబ్రవరి నెలలో జాతీయ పౌరసత్వ వ్యతిరేక ప్రదర్శనల్లో పాల్గొన్న ప్రజలను వెతికి పట్టుకుంటున్నారు. జైళ్లకు పంపుతున్నారు. కరోనాను కట్టడి చేయడంలో దేశంలోని హైకోర్టులే సున్నితంగా వ్యవహరిస్తున్నాయి. -
కారాగారాల్లో మౌలిక వసతులు
నెల్లూరు(క్రైమ్): కారాగారాల్లో మౌలిక వసతుల కల్పన, మహిళా వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్లు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు సుష్మా సాహూ పేర్కొన్నారు. వెంకటాచలం మండలం చెముడుగుంటలోని కేంద్రకారాగారాన్ని మంగళవారం సందర్శించారు. మహిళా ఖైదీల వార్డు, భోజనగది, హాస్పిటల్‌ను పరిశీలించి రిమాండ్, శిక్షను అనుభవిస్తున్న 19 మంది మహిళా ఖైదీలతో సమావేశమయ్యారు. జైలు మాన్యువల్ ప్రకారం వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నగరంలోని పినాకినీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర కారాగారాల్లో మహిళా ఖైదీలకు అందుతున్న సేవలు, మౌలిక వసతుల పరిశీలనలో భాగంగా కొంతకాలంగా వివిధ కారాగారాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. కారాగార వైద్యశాలలో మహిళా డాక్టర్‌తో పాటు మహిళా వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్లు చెప్పారు. మహిళా ఖైదీలకు వృత్తివిద్య కోర్సుల ఏర్పాటుకు కృషి చేస్తామని వెల్లడించారు. మహిళా ఖైదీలకు తెల్లని దుస్తులు ఇస్తున్నారని, వీరికి రంగు దుస్తులను ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నెల్లూరు కేంద్ర కారాగారంలో వసతులు బాగున్నాయని కొనియాడారు. కేంద్ర కారాగారాలను ఆదర్శ కారాగారాలుగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తామని, మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో పలు కేసులపై బుధవారం విచారించనున్నట్లు తెలిపారు. ఉదయం 11 నుంచి కార్యాలయంలో అందుబాటులో ఉంటామని, జాతీయ మహిళా కమిషన్‌కు వర్తించే కేసులను నేరుగా తమని సంప్రదించి పరిష్కరించుకోవాలని సూచించారు. మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, దాడులు, తదితరాలపై కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు అనూరాధ, నెల్లూరు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి ప్రశాంతి, నెల్లూరు కేంద్ర కారాగార సూపరింటెండెంట్ రవికిరణ్, నెల్లూరు నగర డీఎస్పీ మురళీకృష్ణ,, జైలర్ కాంతరాజు, తదితరులు పాల్గొన్నారు. -
శిక్షణ
-
జైలు అభివృద్ధికి కృషి చేయండి
బుక్కరాయసముద్రం : ఓపెన్ ఎయిర్ జైలు సిబ్బంది, జీవిత ఖైదీలు సమష్టిగా జైలు అభివృద్ధికి కృషి చేయాలని రాయలసీమ జైళ్ల శాఖ డీఐజీ జయవర్ధన్ అన్నారు. సోమవారం సాయంత్రం మండలంలోని ఓపెన్ ఎయిర్ జైలులో సిబ్బంది, ఖైదీలతో సమావేశం నిర్వహించారు. జైలులో ఎంత మంది ఖైదీలు ఉన్నారు? ఎంత మంది సిబ్బంది పని చేస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది అంకితభావంతో పని చేయాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ గోవిందరాజులును ఆదేశించారు. అలాగే జీవిత ఖైదీలు నియమ నిబంధనలకు లోబడి ఉండాలన్నారు. విరుద్ధంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో జిల్లా జైలు సూపరింటెండెంట్ నాగేశ్వరరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
జైళ్లలో గర్భిణులకు సౌకర్యాలు లేవు!
►వైద్య సదుపాయాలు, ప్రసవ ఏర్పాట్లూ లేనే లేవు ►హైకోర్టుకు ఏపీ న్యాయసేవాధికార సంస్థ నివేదిక ►ఆ నివేదికను బట్టి క్షేత్రస్థాయి పరిశీలన చేయండి ►సమస్య పరిష్కారానికి తగిన సూచనలు చేయండి ►ఉభయ రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: విచారణ ఎదుర్కొంటూ జైళ్లలో ఉన్న అండర్ ట్రయల్ మహిళా ఖైదీ లు, వారి పిల్లలు, గర్భిణులకు అవసరమైన సౌకర్యాలు పూర్తిస్థాయిలో లేవని ఉమ్మడి హైకోర్టుకు ఆంధ్రప్రదేశ్ న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నివేదించారు. అత్యధిక శాతం జైళ్లలో వైద్య సదుపాయాలు లేవని, రెసిడెంట్ మెడికల్ డాక్టర్లు కూడా లేరని, చాలా చోట్ల ఈ పోస్టు ఖాళీగా ఉందన్నారు. జైళ్లలో ఉన్న గర్భిణులను చెకప్‌లు, ప్రసవా ల నిమిత్తం దగ్గర్లో ఉన్న ప్రభుత్వాస్పత్రి లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళుతు న్నారని, ఏ జైలులో కూడా ప్రసవ ఏర్పాట్లు లేవని వివరించారు. పుట్టి న పిల్లలను తల్లితోనే ఉండేందుకు అను మతినిస్తున్న జైలు అధికారులు, ఆ పిల్లలకు వాతావరణ పరిస్థి తులకు తగినట్లుగా దుస్తుల సౌకర్యం కల్పించడం లేదన్నారు. అత్యధిక జైళ్లలో అంతర్గత విద్య, వినోద ఏర్పాట్లు లేవని తెలిపారు. ‘రాష్ట్రంలోని జైళ్లలో నలుగురు గర్భిణులు, తల్లులతో పాటు 35 మంది పిల్లలు ఉన్నారు. చాలా జైళ్లలో పిల్లలకు వండిపెట్టేందుకు ఏర్పాట్లేవీ లేవు. పిల్లల వ్యాక్సినేషన్ విషయంలో జైళ్లలో ఎటువంటి రికార్డులను నిర్వహించ డం లేదు. దగ్గర్లో ఉన్న ప్రభుత్వాస్పత్రుల్లో వాక్సిన్లు వేస్తున్నారు. ఖైదీలకు దూరంగా పిల్లలు ఉండేందుకు అత్యధిక జైళ్లలో ప్రత్యేక ఏర్పాట్లేవీ లేవు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జైళ్లలో మానసిక వైకల్యంతో బాధప డుతున్న 112 మంది ఉన్నారు. రాజమండ్రి కేంద్ర కారాగారం మినహా మిగిలిన జైళ్లలో ఎక్కడా మానసిక వైకల్యంతో బాధపడు తున్న వారికి ప్రత్యేక వసతి ఏర్పాట్లు లేవు. రాష్ట్రంలోని అన్నిజిల్లాల న్యాయ సేవాధి కార సంస్థ కార్యదర్శులు 4 కేంద్ర కారా గారాలను, ఒక ఓపెన్ ఎయిర్ జైల్, 3 ప్రత్యేక మహిళా జైళ్లు, 8 జిల్లా జైళ్లు, 4 స్పెషల్ సబ్‌జైళ్లు, 66 సబ్‌జైళ్లు సందర్శిం చారు. వారి వివరాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించాం’ అని సభ్య కార్యదర్శి తన నివేదికలో పేర్కొన్నారు. ఇదే విధంగా తెలంగాణ న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి కూడా ఓ నివేదికను సమర్పించారు. గురువారం ఈ నివేదికల్ని న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జున రెడ్డి, జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం పరిశీలించింది. ఈ నివేదికలను ప్రాతిపదికగా తీసుకుని క్షేత్రస్థాయిలో పరి శీలన చేసి సమస్యల పరిష్కారానికి తగిన సూచనలతో నివేదికలు సమర్పించాలని 2 రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. బాల నేరస్తులు, మహిళా ఖైదీల హక్కుల కోసం రాష్ట్రాలేం చర్యలు తీసుకుంటు న్నాయో చెప్పాలంటూ సుప్రీంకోర్టు ఆయా రాష్ట్రాల న్యాయసేవాధికార సంస్థల్ని∙గతం లో నివేదికలు కోరిన విషయం తెలిసిందే. -
కారాగారాలు కిటకిట
రాష్ట్రంలోని జైళ్లు ఖైదీలతో నిండిపోతున్నాయి. రాష్ట్రంలో మూడు కేంద్ర కారాగాలతో మొదలుకొని మొత్తం 46 జైళ్లు ఉన్నాయి. అన్ని జైళ్లలో కలిపి 6,848 మంది ఖైదీలను నింపే అవకాశం ఉంది. ప్రస్తుతం పూర్తి సామర్థ్యం ఇవి పనిచేస్తున్నాయి. కేంద్ర కారాగారాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. మూడు కేంద్ర కారాగారాల్లో కలిపి 3,126 మంది సామర్థ్యం కాగా ప్రస్తుతం 3,500 మంది ఉన్నారు. అలాగే, మహిళా కేంద్ర కారాగారం కెపాసిటీ 220 ఉండగా... ప్రస్తుతం 250 మంది ఉన్నారు. అయితే జిల్లా జైళ్లు, సబ్‌జైళ్లలో మాత్రం కాస్త తక్కువగానే ఉన్నారు. అయితే, జైళ్ల శాఖ మాత్రం సిబ్బంది కొరతతో సతమతమవుతోంది. మొత్తం 1,900 పోస్టులకు గాను 1500 మంది సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. -
అక్రమ ఖైదీలకు పరిహారం ఇవ్వరా?
విశ్లేషణ న్యాయస్థానం విధించిన శిక్ష కన్నా ఎక్కువ కాలం ఖైదీని జైల్లో నిర్బంధిస్తే ఆ ఖైదీకి పరిష్కారమేమిటో తెలి యజేయాల్సిన బాధ్యత జైళ్ల అధికారులపైన లేదా? తనను అనవసరంగా 18 రోజుల కాలం ఎక్కువగా నిర్బంధిం చారని, దీనికి పరిష్కారం ఏమిటని తీహార్ జైలునుంచి విడుదలైన ఒక మాజీ ఖైదీ ఓం ప్రకాశ్ గాంధీ ఆర్టీఐ కింద అడిగారు. ఆర్టికల్ 21 కింద జీవన స్వేచ్ఛ, వ్యక్తి స్వాతంత్య్రాలకు రాజ్యాంగం హామీ ఇస్తున్నది, న్యాయస్థానం నిర్దేశించిన శిక్ష నుంచి జైలు అధికారులు మంచి నడ వడిక ఆధారంగా తగ్గింపు చేస్తారు. ఆ కాలాన్ని కూడా తగ్గించి ఖైదీని విడుదల చేయాల్సి ఉంటుంది. కోర్టు తీర్పు ప్రకారం శిక్ష అనుభవించి జైలునుంచి విడుదైలైన తర్వాత మాజీ ఖైదీ ఓం ప్రకాశ్ ఆర్టీఐ దరఖాస్తుల ద్వారా తన హక్కులకు సంబంధించి అనేక పత్రాలను సంపాదించారు. ఆ పత్రాల ఆధారంగా, తాను ఆగస్టు 15, 2014న విడుదల కావలసి ఉండగా, 19న విడు దల చేశారని, తమకు అధికారులు ఇచ్చిన 15 రోజుల రెమిషన్ కూడా ఇవ్వలేదని తేల్చారు. 18 రోజుల అక్రమ నిర్బంధానికి ఎవరు బాధ్యులని ఓం ప్రకాశ్ గాంధీ అడిగారు. దానికి ప్రజాసమాచార అధికారి (పీఐఓ) ఎవరినీ శిక్షాకాలం కన్నా ముందే విడుదల చేసే ప్రసక్తే ఉండదని, ఒకవేళ ఎక్కువ కాలం నిర్బంధిస్తే అందుకు ఖైదీ న్యాయస్థానానికి వెళ్లి పరిహారం కోరాల్సి ఉంటుం దని జవాబిచ్చారు. ఏదైనా సమస్య ఉంటే ఫిర్యాదుల విభాగానికి అతను విన్నవించుకోవడం మినహా మరే ఇతర ఏర్పాటూ లేదని వివరించారు. రెండో అప్పీలు విచారణలో అధికారులు, ైఖైదీని 18 రోజుల పాటు అదనంగా జైల్లోనే ఉంచారన్న మాటను ఖండించలేదు. ఒకవేళ వేరే నేరం కేసులో ఈ ఖైదీ అండర్ ట్రయల్ ఖైదీ అయితే విడుదల చేయడం సాధ్యం కాదని వివరించారు. అయితే ఓం ప్రకాశ్ గాంధీ మరో కేసులో అండర్ ట్రయల్ ఖైదీ అని ఎలాంటి రుజువులూ చూపలేదు. ఇంతటి కీలకమైన ప్రాథమిక హక్కుకు సంబంధించి విధానం లేకపోవడం మంచి పాలనా విధానం కాజాలదు. కోర్టుకు వెళ్లండి అని చెప్పడం సరైన సమాధానమూ కాదు.. సమాచారమూ కాదు. వ్యక్తి జీవన హక్కును, వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్య్రా లను వ్యవస్థాపితమైన న్యాయవిధానాల ద్వారా హరించవలసిందే తప్ప మరో విధంగా హరించడా నికి వీల్లేదని మన సంవిధానం ఆర్టికల్ 21 నిర్దే శిస్తున్నది. పొరపాటుననో లేదా నిర్లక్ష్యం వల్లనో ఎక్కువ రోజులు నిర్బంధించామనే వాదనకు ఆస్కా రం లేదు. ఒక వేళ ఆ విధంగా నిర్బంధిస్తే అందుకు బాధ్యుడైన అధికారి పరిహారం చెల్లించవలసి ఉం టుంది. లేదా అతని పక్షాన ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సిందే అని న్యాయనియమాలు వివరి స్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం, వర్సెస్ చల్లా రామ కృష్ణారెడ్డి కేసులో సుప్రీంకోర్టు ఈ అంశంపై 26.4. 2000 సంవత్సరంలో ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఆ కేసుకు సంబంధించి జైల్లో ఉన్న ఖైదీల పైన శత్రువులు దాడిచేసి ఒకరిని చంపేస్తారు. గాయ పడిన బంధువులు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వ జైళ్ల శాఖపై దాఖలు చేసిన కేసు ఢిల్లీ దాకా వెళ్లింది. ఈ సంఘటనకు జైలు అధికారుల నిర్లక్ష్యం కారణ మని భావించి అందుకు ప్రభుత్వం పరిహారం చెల్లిం చాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు డీపీ వాధ్వా, ఎస్ సాగిర్ అహ్మద్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశిం చింది. ఈ కేసులోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లక్షా 44 వేల రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశిం చింది. దానిపైన రాష్ర్ట ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. మరో కీలకమైన కేసులో విచారణఖైదీ రుదుల్షా జైల్లో ఉన్న సమయంలో కింది కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించి, విడుదల చేయాలని ఆదేశించింది. కాని ఆ తరువాత కూడా రుదుల్ షాను 14 సంవత్సరాల పాటు జైల్లో ఉంచారు. ఒక ప్రజా ప్రయోజన వాజ్యంలో ఈ దారుణంపై విచారించిన సుప్రీంకోర్టు.. ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సిం దేనని, రుదుల్ షా వర్సెస్ బీహార్ రాష్ర్టం ఏఐఆర్ 1983/1086 కేసులో 1 ఆగస్టు 1983న తీర్పు ఇచ్చింది. చట్ట ప్రకారమే మొదటి నిర్బంధం జరిగిన ప్పటికీ, శిక్షాకాలం తీరిన తరువాత కూడా కొనసాగిం చడం చట్టవ్యతిరేకమని సుప్రీంకోర్టు వివరించింది. సమాచార హక్కు చట్టం సెక్షన్ 4(1)(సి) ప్రకా రం ప్రజాబాహుళ్యానికి వర్తించే విధానాలు రూపొం దించినపుడు ప్రభుత్వ విభాగాలు ఆ విధానానికి సంబంధించిన పూర్తి వివరాలను తమంత తామే ప్రచురించాలని నిర్దేస్తున్నది. అంటే జైళ్లలో అక్ర మంగా కారాగారవాసాన్ని పొడిగిస్తే అందుకు పరి ష్కారం ఏమిటి? దాన్ని ఏ విధంగా సాధించాలి? ఎవరిని పరిష్కారం అడగాలి? ఏ విధంగా? అనే వివ రాలను ప్రభుత్వ సంస్థ ఇవ్వవలసి ఉంటుంది. పరిహారం ఇవ్వాలంటే ప్రత్యేకంగా దానికోసమే ఒక పిటిషన్ వేయాలని జైలు అధికారులు అన్నారు. ఈ రెండో అప్పీలునే పరిహారం కోరే పిటిషన్‌గా భావించాల్సి ఉంది. ఇప్పటికైనా ఓం ప్రకాశ్ గాంధీ నుంచి దరఖాస్తు తీసుకుని పరిశీలించాలని, ఇటు వంటి కేసులకు సంబంధించి పరిహారం చెల్లించే విధానాన్ని రూపొందించవలసిన బాధ్యత ఉందని కమిషన్ గుర్తుచేసింది. (ఓం ప్రకాశ్ గాంధీ వర్సెస్ తీహార్ జైలు కేసు ఇఐఇ/అ/అ/2015/000431లో 29.3.2016న సీఐసీ ఇచ్చిన తీర్పు ఆధారంగా) మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
ఖైదీల కోసం వీడియో కాన్ఫరెన్స్
మదనపల్లె రూరల్ (చిత్తూరు జిల్లా) : కేసుల పరిష్కారం కోసం జైలు, కోర్టును అనుసంధానిస్తూ ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ సేవలు రాష్ట్రంలో తొలిసారిగా ప్రారంభమయ్యాయి. చిత్తూరు జిల్లా మదనపల్లెలోని మెజిస్ట్రేట్ కోర్టులో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ వి అప్జల్ పుర్కర్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మదనపల్లె సబ్‌జైలులో శుక్రవారం వాయిదాకు సిద్ధం చేసిన ఖైదీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి సలహాలు, సూచనలు అందజేశారు. ఇకపై కోర్టుకు ఏ కారణాల వల్లనైనా హాజరు కాలేని ఖైదీలతో న్యాయమూర్తులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్ధారిత సమయంలో మాట్లాడాతారని తెలిపారు. అవసరమైతే కేసులు పరిష్కరించడం, కొట్టి వేయడం, వాయిదాలు వేయడం కూడా చేస్తారని తెలిపారు. ఖైదీలు తమ సమస్యలను నిర్భయంగా న్యాయమూర్తులకు విన్నవించుకోవాలని సూచించారు. అనంతరం విలేకరుల సమావేశంలో జస్టిస్ అఫ్జల్ పుర్కర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొత్తం 37 చోట్ల త్వరలో వీడియో కాన్ఫరెన్స్ సేవలు ప్రారంభించనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. న్యాయస్థానాలను జైళ్లకు అనుసంధానం చేయడం వల్ల ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుందని, ఖైదీలకు రక్షణ కల్పించి త్వరితగతిన కేసులు పరిష్కరించేందుకు మార్గం సుగమమవుతుందని తెలిపారు. తొలుత జిల్లా ప్రధాన న్యాయమూర్తి టి.ఆనంద్, ఉన్నత న్యాయస్థానం సెంట్రల్ ప్రాజెక్టు సమన్వయకర్త కె.నరసింహాచారి, మదనపల్లె మండల న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్ , అదనపు జిల్లా జడ్జి ఎస్ఎస్ఎస్ జయరాజ్ ఆయనకు స్వాగతం పలికారు. విలేకరుల సమావేశం అనంతరం కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. చివరగా బార్ అసోసియేషన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. న్యాయమూర్తులు ప్రదీప్‌కుమార్, శరత్‌బాబు, మోహన్‌రావు, భాస్కర్‌రావు, కవిత, న్యాయవాదులు మాలతి, ఆవుల మోహన్‌రెడ్డి, అమరనాథరెడ్డి పాల్గొన్నారు. -
'అమెరికాలో ఖైదీలకు శుభవార్త'
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అభివృద్ధిలోనే కాదు నేరాలు, నేరగాళ్ల సంఖ్యలోనూ అగ్రరాజ్యమే. జైళ్లలోని ఖైదీలను పోషించడానికే ఆ దేశం సంవత్సరానికి 80 బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తోంది. ఒక ఖైదీకి సగటున ఏడాదికి 60,000 డాలర్లను ఖర్చు చేస్తున్నారు. దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా మాట్లాడుతూ.. ప్రపంచ జనాభాలో 5 శాతంగా ఉన్న అమెరికా జనాభా.. ఖైదీల సంఖ్యలో మాత్రం 25 శాతంగా ఉన్నట్లు గుర్తు చేయడం పరిస్థితి తీవ్రతకు అద్ధం పడుతుంది. అమెరికా జనాభా 1980 నుండి ఇప్పటివరకు 30 శాతం పెరిగితే, ఖైదీల సంఖ్యలో మాత్రం ఈ పెరుగుదల 800 శాతంగా నమోదైంది. అమెరికాలోని జైళ్లు ఎక్కువగా.. మాదకద్రవ్యాలకు బానిసైన వారు, మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు, చిన్న ఘటనలలో హిసాత్మకంగా ప్రవర్తించిన వారితో నిండిపోయి ఉన్నాయి. ప్రస్తుతం జైళ్లలో మగ్గుతున్న ఖైదీలను.. సమాజంలో ఉత్పాదక వనరులుగా మార్చుకునే దిశగా ఆగ్రరాజ్యం అడుగులేస్తుంది. గత శనివారం అధ్యక్షుడు బరాక్ ఒబామా తన రేడియో సందేశంలో దేశంలో జైళ్లను సంస్కరించాల్సిందిగా పిలుపునిచ్చారు. నేరాల యొక్క తీవ్రతను బట్టి శిక్షలు అమలు చేయాలని ఒబామా పేర్కొన్నారు. ఈ మేరకు దేశంలోని సుమారు 130 మంది పోలీసు ఉన్నతాధికారులు, ఉన్నత న్యాయాధికారులు ఖైదీల రేటును తగ్గించే దిశగా సంస్కరణలు చేపట్టడానికి గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చికాగో పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ఖైదీల సంఖ్యతో పాటు నేరాల రేటును అదుపులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇందుకోసం మళ్లీ నేరాలకు పాల్పడే అవకాశం తక్కువగా ఉన్నటువంటి ఖైదీలను గుర్తించి విడుదల చేసేందుకు అమెరికా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జైళ్ల సంస్కరణల్లో భాగంగా నవంబర్ నెలలో వేల సంఖ్యలో ఖైదీలను విడుదల చేయడానికి అగ్రరాజ్యం సమాయత్తమైంది. -
ప్రత్యేక బెయిల్ చట్టంపై యోచన
న్యూఢిల్లీ: నిందితులకు బెయిల్ జారీ చేసే విషయంలో కోర్టులకున్న విచక్షణాధికారాలకు అంతం పలికే దిశగా.. సమగ్ర, స్పష్టమైన బెయిల్ చట్టాన్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దాంతో సంపన్న నిందితులే బెయిల్ సౌకర్యం పొందగలుగుతున్నారని సమాజంలో నెలకొన్న అభిప్రాయాన్ని కూడా తొలగించవచ్చని భావిస్తోంది. ‘బెయిల్ జారీ విషయంలో లోపాలున్నాయి. డబ్బున్నవారు సులభంగా బెయిల్ సౌకర్యం పొందుతుండగా.. పేదవారు జైళ్లలో మగ్గుతున్నారు’ అని కేంద్ర న్యాయశాఖ మంత్రి డీవీ సదానంద గౌడ న్యాయశాఖ కార్యదర్శి పీకే మల్హోత్రకు పంపిన శాఖాంతర్గత లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత బెయిల్ వ్యవస్థను సమూలంగా మార్చేలా.. ప్రత్యేక బెయిల్ చట్టం రూపకల్పనకు గల అవకాశాలను అధ్యయనం చేయాలని అందులో సూచించారు. ‘నిందితులు సాక్ష్యులను ప్రభావితం చేస్తాడనో, సాక్ష్యాలను నాశనం చేస్తాడనో, లేక బెయిల్‌పై బయట ఉంటే మరిన్ని నేరాలకు పాల్పడుతాడనో కోర్టు భావిస్తే తప్ప.. నిందితులకు ఒక హక్కుగా బెయిల్ ఇవ్వాల్సి ఉండగా.. వాస్తవానికి అలా జరగడం లేదు. బెయిల్ దరఖాస్తు విచారణకు రావడానికే చాలా సమయం పట్టడం, విచారణ ప్రక్రియలో విపరీత జాప్యం, నిందితులు పూచీకత్తులను సమర్పించలేకపోవడం, వారికి అవగాహన లేకపోవడం.. తదితర కారణాల వల్ల అనేకమంది పేద నిందితులు జైళ్లలోనే మగ్గిపోతున్నారు’ అని గౌడ పేర్కొన్నారు. గౌడ సూచనలను పీకే మల్హోత్ర లా కమిషన్‌ను పంపించారు. హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు ఇటీవల బాంబే హైకోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించినప్పుడు.. ఆ నటుడు వెంటనే బెయిల్ పొందడంపై వివాదం, బెయిల్ జారీ ప్రక్రియపై చర్చ ప్రారంభమైన నేపథ్యంలో గౌడ ఈ లేఖ రాశారు. -
జైళ్ల గదుల్లో జామర్లు..!
సాక్షి, ముంబై: ఇటీవల జైళ్లలో నేరస్తులు సెల్ఫోన్ల ను విని యోగించడం పెరిగిపోతుండటంతో బ్యారెక్స్‌ల్లోనూ జామర్లను ఏర్పాటుచేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అనుమతి మంజూ రు చేయాల్సిందిగా రాష్ట్ర జైళ్ల విభాగం హోం డిపార్ట్మెంట్కు ఓ లేఖ రాసింది. నిబంధనల ప్రకారం జైళ్లలో నేరస్తులు బయట వ్యక్తులతో ఎటువంటి సం బంధాలు, సంప్రదింపులు జరపకూడదు. కాగా, కొందరు జైలు సిబ్బంది నిర్వాకం వల్ల పలువురు నేరస్తులు అధికారుల కన్ను గప్పి జైళ్ల నుంచి సెల్ఫోన్ల ద్వారా తమ పనులను చక్కబెట్టుకోవడం ప్రారంభించారు. జైళ్ల నుంచే తమ అనుచరులతో కిడ్నాప్‌లు,హత్యలు, బెదిరింపులకు పాల్పడుతుండేవారు. కొంతకాలానికి విషయం బయటపడటంతో జైళ్లలో మొబైల్ ఫోన్ల వాడకాన్ని నివారించేందుకు జామర్లను అమర్చారు. అయితే వాటిని జైళ్ల ఆవరణలోనే అమర్చడంతో అవి మొత్తం జైలు కాంపౌం డ్‌ను కవర్ చేయడంలో విఫలమయ్యాయి. దీంతో జైళ్లలో సెల్ఫోన్ల వాడకం ఏమాత్రం తగ్గలేదు. దీం తో జైళ్ల గదుల్లో కూడా జామర్లను ఏర్పాటుచేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు జామర్ల కొనుగోలుకు అనుమతించాలని తాము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామనిఅడిషినల్ డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (జైళ్లు) మీరన్ బోర్వన్కర్ తెలిపారు. ఆమోదం లభించిన వెంటనే ‘ప్రత్యేక’ బారెక్స్‌ల్లోనూ వీటి ని అమరుస్తామని ఆయన వివరించారు. జైళ్లలో చాలా మంది ఖైదీలు అనధికారికంగా సెల్ఫోన్లు ఉపయోగిస్తుండడాన్ని చాలా సందర్భాలలో గమనించామని అధికారి పేర్కొన్నారు. దీంతో విడివిడిగా బ్యారెక్సుల్లో వీటిని అమర్చేందుకు నిర్ణయిం చామని ఆయన చెప్పారు. వివిధ జైళ్లలో ఉంటున్న నేరస్తులు ఫోన్ల ద్వారా బెదిరింపు కాల్స్‌కు పాల్పడుతున్నట్లు అధికారి పేర్కొన్నారు. కాగా, జైళ్లలో నేరస్తులు సెల్ఫోన్లు వినియోగించడాన్ని నిరోధించడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఫలితం ఉండటంలేదని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అవినీతి సిబ్బంది వల్ల జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న బడా నేరస్తులు తమ ‘పనుల’ను సుల భంగా కానిచ్చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. దీంతో వీటి వినియోగాన్ని నిరోధించాలంటే జామర్లను ఏర్పాటుచేయడమే ఉత్తమ మార్గమని తాము భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో హ్యాండ్‌హెల్డ్, మెటల్ ఫ్రేమ్ డిటెక్టర్ల సహాయంతో జైళ్లలో మొబైల్ ఫోన్ల ఉపయోగాన్ని కొంత వరకు అరికట్టగలిగామన్నారు. అదే క్రమం లో కొన్ని జైళ్లలో జామర్లను కూడా అమర్చి నా వాటి లో కొన్ని పురానతమైనవి కాగా, మరికొన్ని వాడుకలో లేవన్నారు. అదేవిధంగా మరికొన్ని పని చేయ డం లేదని అధికారి తెలిపారు. కొన్ని సెంట్రల్ జైళ్ల లో ఆవరణలో నెలకొల్పిన జామర్లు మొత్తం పరిసరాలను కవర్ చేయడం లేదని ఆయన పేర్కొన్నారు. దీంతో బడా నేరస్తుల కోసం జైళ్ల బ్యారెక్సుల్లోనూ జామర్లను ఏర్పాటు చేయడానికి నిర్ణయిం చినట్లు మీరన్ బోర్వన్కర్ తెలిపారు. కరడు గట్టిన నేరస్తులు ఎక్కువగా ఉండే ఆర్థర్రోడ్, తజోలా, నాసిక్ జైళ్లలో అక్రమ మొబైల్ ఫోన్ల వినియోగం ఎక్కువగా ఉందని బోర్వన్కర్ తెలిపారు. గతంలో గ్యాంగ్‌స్టర్ అబుసలీమ్‌పై కొందరు తలోజా జైలు లో కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. తర్వాత దేవేంద్ర జగ్‌పాత్ అనే వ్యక్తి తానే ఆ నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. కాగా, అబుసలేమ్‌ను హత్య చేయాలని గ్యాంగ్‌స్టర్ చోటా షకీల్, మరో ఇద్దరు తనను మొబైల్ ఫోన్లోనే సంప్రదించారని, వారి సూచన మేరకు అతడిపై కాల్పులు జరిపానని చెప్పాడు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదంటే జామర్ల వినియోగం చాలా అవసరమని జైళ్ల అధికారులు భావిస్తున్నారు. -
అక్టోబర్‌లో ఖైదీల విడుదల
చెన్నై, సాక్షి ప్రతినిధి: హత్య, హత్యాయత్నం, దోపిడీ తదితర నేరాలకు సంబంధించి పలువురు నిందితులు జైళ్లలో కాలం గడుపుతున్నారు. వాయిదాలపై వాయిదాలతో అటు కోర్టులకు, ఇటు జైళ్లశాఖకు వారు భారమైపోతున్నారు. జైలు, కోర్టుల మధ్య నిందితులను తిప్పడం పరిమిత సంఖ్యలో ఉన్న పోలీసు సిబ్బందికి క ష్టంగా తయారైంది. వాయిదాలకు హాజరుపరిచే సమయంలో ఖైదీ పరారీ కాకుండా చూడడం పోలీసులకు సవాలుగా మారింది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఇందుకు పరిష్కారంగా జైల్ అదాలత్ నిర్వాహించాలని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశించింది. నిబంధనల పరిధిలోకి వచ్చిన ఖైదీలను విడుదల చేయడమే అదాలత్ ముఖ్య ఉద్దేశం. నేరానికి తగిన శిక్షాకాలంలో 50 శాతం పూర్తి చేసినవారు, న్యాయవాదులను నియమిం చుకోలేని, కోర్టులు విధించే జరిమానాలను చెల్లించలేని పేదల కేసులను జైల్ అదాలత్ పరిధిలోకి తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆయా కేటగిరీలకు చెందిన నిందితు లు అదాలత్‌కు హాజరై న్యాయమూర్తుల సమక్షంలో నేరాన్ని అంగీకరించి, పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసిన నిందితులను విడుదల చే యవచ్చ ని సుప్రీం కోర్టు జారీచేసిన ఆదేశాల్లో పేర్కొం ది. మొత్తం ఈ ప్రక్రియను రెండునెలల్లోగా పూర్తిచేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తమిళనాడులో 9 సెంట్రల్ జైళ్లు, 3 మహిళా జైళ్లు, 5 ప్రత్యేక జైళ్లు, 9 జిల్లా జైళ్లు, 95 జోనల్ జైళ్లు ఇలా మొత్తం 121 జైళ్లు ఉన్నాయి. చెన్నై పుళల్ సెంట్రల్ జైలులో 2,223 మంది మగ ఖైదీలు, 120 మహిళా ఖైదీలు, 2,343 విచారణ ఖైదీలు ఉన్నారు. కడలూరులో 275, పళయంగాడులో 550, తూత్తుకూడి, కన్యాకుమారిలో 300 ఇలా మొత్తం 7వేల మంది ఖైదీలు ఉన్నారు. ఆదివారం రాత్రి వరకు రాష్ట్రంలోని 121 జైళ్లలో అదాలత్ నిర్వహించి 3 వేల కేసులను పరిశీలించి మొత్తం 2500 మంది ఖైదీలు విడుదలకు అర్హులుగా తేల్చినట్లు సోమవారం న్యాయూధీశులు ప్రకటించారు. ఒక్క పుళల్ సెంట్రల్ జైలుకు సంబంధించే 850 మంది విచారణ ఖైదీలు విడుదల కానున్నారు. వీరిలో చెన్నై జిల్లాకు చెందిన వారు 290 మంది, కాంచీపురం జిల్లావారు 260 మంది, తిరువళ్లూరు జిల్లాలకు చెందిన ఖైదీలు 304 మంది ఉన్నారు. అలాగే సేలం సెంట్రల్ జైలు నుంచి మొత్తం455 మందిలో సేలం, ధర్మపురి, కృష్ణగి రి, నామక్కల్ జిల్లాలకు చెందిన ఖైదీలు ఉన్నా రు. తిరునెల్వేలీ, తూత్తుకూడి, కన్యాకుమారికి చెందిన 174 మంది, కడలూరు సెంట్రల్ జైలు నుంచి కడలూరు, విళుపురం జిల్లాల ఖైదీలు 170 మందికి విముక్తి కలగనుంది. మదురై సెంట్రల్ జైలు నుంచి మదురై, దిండుగల్లు, విరుదునగర్, రామనాథపురం జిల్లాలకు చెందిన 57 మందికి విముక్తి ప్రసాదించారు. తిరుచ్చికి చెందిన 58 మందిలో 48 మంది విడుదలకు నోచుకోవడం విశేషం. వేలూరులో 39, కోయంబత్తూరులో 23 మంది విడుదలకు అర్హులయ్యూరు. జైల్ అదాలత్‌పై జెళ్లశాఖ ఐజీ మవురియా సోమవారం మీడియాతో మాట్లాడుతూ, సుప్రీంకోర్టు నుంచి తమకు ఇంతవరకు ఎటువంటి ఆదేశాలు అందలేదన్నారు. అయినా రాష్ట్రంలో విచారణ ఖైదీల జాబితాను సిద్ధం చేశామని తెలిపారు. సుప్రీం కోర్టు నుంచి తగిన ఆదేశాలు అందగానే జైల్ అదాలత్ ప్రకారం విడుదలకు అర్హులైన వారి జాబితాను సిద్ధం చేసి హోంశాఖకు అందజేస్తామని చెప్పారు. రాష్ట్ర హోంశాఖ ఆదేశాల ప్రకారం ఖైదీల విడుదలకు సన్నాహాలు చేస్తామని తెలిపారు. -
విచారణ ఖైదీలను విడుదల చేయండి
సుప్రీం కోర్టు ఆదేశం స్యూరిటీలు, బాండ్లు ఇవ్వలేని పేద ఖైదీలకు ఊరట న్యూఢిల్లీ: విచారణ ఎదుర్కొంటూ జైళ్లలో మగ్గుతున్న అండర్ ట్రయల్ ఖైదీలను సుప్రీం కోర్టు కనికరించింది. నేరం రుజువైతే పడే శిక్షా కాలంలో ఇప్పటికే సగం కాలం జైళ్లలో గడిపిన అండర్ ట్రయల్ ఖైదీలందర్నీ వెంటనే విడుదల చేయాలని శుక్రవారం ఆదేశించింది. 60 శాతంపైగా అండర్ ట్రయల్ ఖైదీలు జైళ్లలో మగ్గుతున్నారని ఆందోళన వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం.. వారిని విడుదల చేసే పనిని కింది స్థాయి జ్యుడీషియల్ అధికారులకు అప్పగించింది. అక్టోబర్ 1 నుంచి రెండు నెలల్లోపు వారానికి ఒక రోజు వారి పరిధిలోని ప్రతీ జైలును సందర్శించి అలాంటి ఖైదీలను వెంటనే విడుదల చేయాలని ఆ అధికారులను ఆదేశించింది. ఖైదీలను గుర్తించే పనిని చేపట్టే జ్యుడీషియల్ అధికారులు (మెజిస్ట్రేట్/సెషన్స్ జడ్జి/ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్) సీపీసీ సెక్షన్ 436ఏను అనుసరించి జైల్లోనే నిర్ణయం తీసుకుని అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేయాలని చీఫ్ జస్టిస్ ఆర్ఎం లోధా నేతృత్వంలో జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ రోహిన్టన్ ఎఫ్ నారీమన్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్యూరిటీలు ఇవ్వలేక, బెయిల్ బాండ్లకు డబ్బులు చెల్లించలేక జైళ్లలోనే ఉండిపోతున్న నిందితులకు విముక్తి లభించనుంది. దేశ వాప్తంగా దాదాపు 3.81 లక్షల మంది ఖైదీలు ఉన్నారని, వారిలో 2.54 లక్షల మంది అండర్ ట్రయల్స్‌గానే ఉన్నారని అంచనా. చాలా కేసుల్లో నిందితులు నేరం రుజువై శిక్ష అనుభవించే కాలం కంటే అండర్ ట్రయల్స్‌గానే ఎక్కువ కాలం జైళ్లలో మగ్గుతున్నారు. అలాంటి వారందరికీ సుప్రీం తీర్పు ఊరటనిచ్చింది. నిందితుల విడుదలపై జ్యుడీషియల్ అధికారులు తమ నివేదికను సంబంధిత హైకోర్టు రిజస్ట్రార్ జనరల్‌కు సమర్పించాలని, తర్వాత వారు ఆ నివేదికను సుప్రీం కోర్టు జనరల్ సెక్రటరీకి పంపాలని ధర్మాసనం పేర్కొంది. ఫాస్ట్ ట్రాక్ తీర్పులకు రోడ్‌మ్యాప్ సిద్ధం చేయండి కేసుల విచారణలో ఆలస్యానికి కారణమవుతున్న మౌలి క సదుపాయాల లేమిపై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు.. తీర్పుల వెలువరించే విధానాన్ని ఏ విధంగా ఫాస్ట్ ట్రాక్‌లో పెట్టాలనుకుంటున్నారో దానికి సంబంధించి రోడ్ మ్యాప్‌ను తమ ముందుంచాలని కేంద్రాన్ని శుక్రవారం ఆదేశించింది. ఈ బ్లూ ప్రింట్ సమర్పించడానికి చీఫ్ జస్టిస్ ఆర్ఎం లోధా నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి మూడు నెలల సమయమిచ్చింది. -
గల్ఫ్ బందీల జీవితాల్లో చిరు ఆశలు
వైఎస్సార్ సీపీ ఎంపీల బృందం చొరవతో.. మదనపల్లె సిటి: బతుకు భారంగా మారడంతో భార్యాబిడ్డల పోషణ కోసం కన్నవారిని, ఉన్న ఊరిని వదిలారు. ఉన్న కొద్దోగొప్పో పొలాలను అమ్మి, పుస్తెలను సైతం తాకట్టుపెట్టి ఆశల పల్లకిలో ఎడారి దేశాలకు పయనమయ్యారు. అయితే గల్ఫ్‌లో ఏజెంట్ల మోసాల బారినపడి అక్కడి జైళ్లలో మగ్గుతున్నారు. మరి కొందరేమో దేశం కాని దేశంలో అష్టకష్టాలు పడుతూ దినదిన గండంగా కాలం నెట్టుకొస్తున్నారు. ఉన్నఫలంగా వచ్చేస్తే ఇక్కడి అప్పులు ఎలా తీరుతాయనే బెంగతో అక్కడే ఉంటూ నరకయాతన అనుభవిస్తున్నారు. ఇలాంటివారి పక్షాన వైఎస్సార్ సీపీ ఎంపీల బృందం నిలిచింది. గల్ఫ్‌లో వారు పడుతున్న బాధలను తమను కలిచివేశాయ ని, వారిని అన్ని విధాల ఆదుకోవాలని కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కడప, రాజంపేట ఎంపీలు వైఎస్.అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి నేతృత్వంలో ఎంపీల బృందం కేంద్ర విదేశాంగ, ప్రవాస భారతీయుల వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ను కలిసి గల్ఫ్‌లో సీమ వాసులు ఎదుర్కొం టున్న సమస్యలను, పడుతున్న బాధలను విన్నవించారు. వారిని ఆదుకోవాలని కోరారు. స్పందించిన కేంద్రం వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చింది. దీంతో గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న వారి జీవితాల్లో ఆశలు చిగురించాయి. ఎడారి దేశాలకు జిల్లా వాసులు జిల్లాలోని మదనపల్లె, తంబళ్లపల్లె, పెద్దమండ్యం, పీలేరు, గుర్రంకొండ, వాల్మీకిపురం, పుంగనూరు తదితర నియోజకవర్గాల నుంచి దుబాయ్, మస్కట్, సౌదీ, ఓమన్, ఇరాక్ వంటి గల్ఫ్ దేశాలకు జీవనోపాధి కోసం వెళుతుంటారు. దాదాపు నాలుగు వేలకు పైగానే ఇక్కడి వారు గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్నారు. ఉన్న ఊరిలో సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం, సాగు లాభసాటి కాకపోవడంతో చేసిన అప్పు లు తీర్చేందుకు, ఆర్థికంగా ఎదిగేందుకు గల్ఫ్‌బాట పడుతున్నారు. అయితే కొందరు ఏజెంట్లు చేసే మోసాలతో వారు ఎడారి దేశాల్లో దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నా రు. మదనపల్లెకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఏళ్ల తరబడి సౌదీ జైలులోనే ఉన్నారు. మరికొందరైతే అక్కడి జైళ్లల్లో మగ్గుతున్నారు. ఇంకొందరైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నా రు. దీంతో వారి కుటుంబాలు మరింత ఆందోళనకు గురవుతున్నాయి. అందని ఆసరా కొందరు ఏజెంట్లు, కొన్ని కంపెనీలు చేసిన మోసాలతో రూ.లక్షల అప్పులతో తిరిగి స్వగ్రామాలకు వచ్చిన వారు అనేక మంది ఉన్నారు. గతంలో దుబాయి ప్రభుత్వం, ఇటీవల సౌదీ ప్రభుత్వం జారీ చేసిన నితాఖత్ చట్టాలతో వందలాది మంది స్వగ్రామాలకు చేరుకున్నారు. ఇక్కడ ఎలాంటి ఆసరా లేకుండాపోయింది. అందరికీ అప్పులు మిగిలాయి. దీంతో అప్పులు తీర్చే మార్గాలు లేక నిత్యం అష్టకష్టాలు పడుతున్నారు. వీరికోసం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వ మైనా చర్యలు తీసుకుని గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న తమ వారి ని కాపాడాలని బాధిత కుటుంబాల వారు కోరుతున్నారు. అలాగే తమ వారిని కాపాడేందుకు కోసం కృషి చేస్తున్న వైఎస్సార్ సీపీ ఎంపీల బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. -
నేరస్ధుల సంఖ్య తగ్గిపోతోందోచ్!