తెలంగాణ జైళ్లలో పెరిగిన ఖైదీల సంఖ్య
వార్షిక నివేదిక విడుదలలో జైళ్లశాఖ డీజీ సౌమ్యామిశ్రా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జైళ్లలో 2023తో పోలిస్తే 2024లో ఖైదీల సంఖ్య పెరిగినట్టు జైళ్ల శాఖ డీజీ సౌమ్యామిశ్రా తెలిపారు. 2023లో మొత్తం 31,428 మంది ఖైదీలు ఉండగా.. 2024లో ఖైదీల సంఖ్య 41,138 మందికి చేరిందన్నారు. ప్రధానంగా ఎన్‌డీపీఎస్ కేసులలో నిందితుల సంఖ్యలో పెరు గుదల ఉందన్నారు. 2023లో 3,688 ఖైదీలు ఎన్‌డీ పీఎస్ కేసులలో రాగా, 2024లో ఈ సంఖ్య 6,311కి చేరినట్టు తెలిపారు.
తెలంగాణ జైళ్లశాఖ ఇతర రాష్ట్రాల జైళ్లతో పోలిస్తే సంస్కరణలు, ప్రత్యేక శిక్షణలు, ఖైదీల సంక్షేమం, సాంకేతికత వినియోగంలో ఎంతో ముందంజలో ఉందని సౌమ్యామిశ్రా తెలిపారు. ఈ మేరకు బుధవారం చంచల్‌గూడలోని సికా (స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కరక్షనల్ అడ్మినిస్ట్రేషన్)లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలంగాణ జైళ్లశాఖ 2024 వార్షిక నివేదికను ఐజీలు రాజేశ్, మురళీబాబు ఇతర ఉన్నతాధికారులతో కలిసి సౌమ్యా మిశ్రా విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జైళ్లలో తీవ్రవాదుల సంఖ్య తగ్గినట్టు తెలిపారు. 2023లో 52 మంది ఈ తరహా ఖైదీలు ఉండగా, 2024లో ఆ సంఖ్య 36కి తగ్గినట్టు చెప్పారు. హత్యకేసులలో ఖైదీల సంఖ్య 2023లో 2,511 ఉండగా, 2024కు అది 2,754కు చేరిందన్నా రు. ఖైదీల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తు న్నట్టు తెలిపారు. 2024లో 1,045 మంది ఖైదీలకు ఉచితంగా న్యాయ సహాయం అందించినట్టు తెలిపారు.
అదేవిధంగా అర్హులైన 552 మంది ఖైదీలకు రూ.1,73,08,500 రుణాలు మంజూరు చేశామన్నారు. తెలంగాణ జైళ్లలో ఇప్పటివరకు 12,650 మంది ఖైదీలను అక్షరాస్యులుగా మార్చా మని తెలిపారు. తెలంగాణ జైళ్లశాఖ చరిత్రను పౌరు లకు తెలియ జెప్పేలా త్వరలోనే జైల్ మ్యూజి యం ఏర్పాటు చేయ నున్నట్టు సౌమ్యా మిశ్రా తెలిపారు. సమావేశంలో ఐజీలు రాజేశ్, మురళీబాబు, డీఐజీలు శ్రీనివాస్, సంపత్, సూప రింటెండెంట్లు నవాబ్ శివకుమార్ గౌడ్, రామచంద్రం, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మాకు అంతా సమానమే..
జైళ్లశాఖ నిబంధనల మేరకే ఏ ఖైదీ విషయంలో లైనా చర్యలు తీసుకుంటున్నామని, చట్టానికి ఎవ రూ అతీతులు కారని డీజీ సౌమ్యామిశ్రా స్పష్టం చేశారు. నటుడు అల్లు అర్జున్ విషయంలోనూ తా ము జైల్ మాన్యువల్ ప్రకారమే నడుచుకున్నామని వెల్లడించారు.
జైలు అధికారులుగా తాము ఎవరినీ వీఐపీలుగా భావించబోమని, అందరు ఖైదీలతో సమానంగా చూస్తామన్నారు. కోర్టు నుంచి ప్రత్యేక ఆదేశాలున్న వారి విషయంలో కోర్టు ఆదేశాల మేరకే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment