Prisons Department
-
బాబు ఆరోగ్యం బాగుంది
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ స్పష్టం చేశారు. ఆయన వైద్య పరీక్షలకు ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు చేస్తున్న అసత్య ఆరోపణలపై జీజీహెచ్ వైద్య బృందం, జిల్లా ఎస్పీ పి.జగదీష్ లతో డీఐజీ శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబు 67 కిలోల బరువు ఉన్నారన్నారు. ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఎటువంటి మార్పు లేదని తెలిపారు. జీజీహెచ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివకుమార్, డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మార్కండేయులు, డిపార్ట్మెంట్ ఆఫ్ డెర్మటాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సునీతాదేవి, డిపార్ట్మెంట్ ఆఫ్ అనస్థీషియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మహేంద్ర, డిపార్ట్మెంట్ ఆఫ్ పాథాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.హిమజ బృందం చంద్రబాబు ఆరోగ్యాన్ని పూర్తిగా పరిశీలించిందని వెల్లడించారు. స్టెరాయిడ్స్ ఇవ్వడం లేదు.. ఈ సందర్భంగా వైద్య బృందం మాట్లాడుతూ.. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి అన్నీ బాగున్నాయని చెప్పారు. తమతో ఆయన బాగా మాట్లాడారన్నారు. అన్ని విషయాలు అడిగామన్నారు. షుగర్ కూడా అదుపులోనే ఉందని తెలిపారు. చంద్రబాబు వాడుతున్న మందులను కూడా పరిశీలించామన్నారు. శరీరంపై దద్దుర్లు ఉన్నాయని.. వాటికి ఆయన వాడుతున్న మందులతో పాటు తాము కొన్ని రకాల మందులు ఇచ్చామని వివరించారు. స్టెరాయిడ్స్ ఇస్తున్నారన్న మాట పూర్తిగా అసత్యమన్నారు. శరీరంపై ఉన్న దద్దుర్ల దృష్ట్యా చల్లని వాతావరణంలో ఆయన ఉండాలని చెప్పారు. జీజీహెచ్‌లో చంద్రబాబుకు వైద్య పరీక్షల నిమిత్తం ప్రత్యేక గది ఏర్పాటు చేయలేదన్నారు. నిత్యం జీజీహెచ్‌లో ఒక ప్రత్యేక గది ఉంటుందని స్పష్టం చేశారు. కాగా చంద్రబాబుకు ఏసీ ఏర్పాటు చేస్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు డీఐజీ రవికిరణ్ సమాధానం చెబుతూ ఇప్పటివరకు జైళ్ల శాఖలో ఖైదీలకు ఏసీ ఏర్పాటు చేయలేదన్నారు. కాబట్టి తాము ఏసీని ఏర్పాటు చేయలేమని స్పష్టం చేశారు. వైద్య బృందం ఇచ్చిన నివేదికను కోర్టుకు అందజేస్తామన్నారు, కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటామని తెలిపారు. జైలు లోపల 85 ఏళ్ల వృద్ధ ఖైదీ కూడా ఉన్నారన్నారు. జైలు లోపల ఉన్న అందరినీ జాగ్రత్తగా చూస్తామని చెప్పారు. చంద్రబాబు ప్రత్యేక ఖైదీ అయినందున మరింత శ్రద్ధ తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. జైలులో జరుగుతున్న ప్రతి విషయాన్ని కోర్టుకు నివేదిస్తున్నామని వివరించారు. రిపోర్టును బయట ఎవరికీ ఇవ్వలేదు.. చంద్రబాబుకు నిర్వహించిన వైద్య పరీక్షల రిపోర్టును జీజీహెచ్ వైద్య బృందం తమకు అందించిందని డీఐజీ రవికిరణ్ చెప్పారు. ఆ రిపోర్టును తాము బయట ఎవరికీ ఇవ్వలేదన్నారు. చంద్రబాబు తరఫున వచ్చిన లాయర్లు ఇవ్వాలని అడిగితే ఆయన అనుమతి తీసుకుని, సంతకం చేయించుకుని రిపోర్టును లాయర్లకు అందజేశామని తెలిపారు. అందులో ఒక లైనును జైలు అధికారులు బ్లాక్ మార్కర్‌తో కనిపించకుండా చేశారన్న వార్తలు పూర్తిగా అవాస్తమన్నారు. ఆ లెటర్‌పై బ్లాక్ మార్కు చేసి ఎవరు వైరల్ చేస్తున్నారో తమకు తెలియదని చెప్పారు. కాగా తమ పట్ల డీఐజీ దురుసుగా ప్రవర్తించారని లోకేశ్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ములాఖత్ సమయం ముగిసిందని.. నిబంధనల ప్రకారం మీరు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని మాత్రమే చెప్పానన్నారు. చంద్రబాబును కలిసిన లోకేశ్ చంద్రబాబును ఆయన తనయుడు నారా లోకేశ్, భువనేశ్వరి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్‌లో కలిశారు. శనివారం మధ్యాహ్నం 40 నిమిషాల పాటు జరిగిన ములాఖత్ అనంతరం వారు జైలు నుంచి నేరుగా వారు ఉంటున్న క్యాంప్‌కు వెళ్లారు. కాగా ములాఖత్‌లో లోకేశ్ డీఐజీ రవికిరణ్‌తో వాగ్వాదానికి దిగారని సమాచారం. తన తండ్రి ఆరోగ్యం బాగాలేదని, ప్రభుత్వ వైద్యులు నివేదిక ఇచ్చినా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. డీహైడ్రేషన్ బారిన పడిన చంద్రబాబును వైద్యులు సూచించిన మేరకు చల్లటి వాతావరణంలో ఎందుకు ఉంచడం లేదని నిలదీసినట్టు తెలిసింది. -
ఆరోగ్యంగా చంద్రబాబు.. తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు: జైళ్ల శాఖ డీఐజీ
సాక్షి, రాజమండ్రి(తూర్పుగోదావరి): చంద్రబాబు ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆయన భద్రత విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉన్నామని కోస్తా జిల్లాల జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ఆరోగ్యం విషయంలోనూ పర్యవేక్షిస్తున్నామన్నారు. రోజుకు మూడుసార్లు వైద్యపరీక్షలు.. ‘‘రోజుకు మూడుసార్లు వైద్యపరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు 67 కేజీల బరువున్నారు. బయట చెబుతున్నట్టుగా అంత సీరియస్ ఏమీ లేదు. చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారు. ఏ మందులు ఇస్తున్నారనేది డాక్టర్‌కు, పేషెంట్‌కు మధ్య ఉండే ప్రైవసీ. లోకేష్ చేసిన ట్వీట్ పూర్తిగా అవాస్తవం. ఏసీ వసతి జైళ్ల మ్యాన్యువల్‌లో లేదు’’ అని డీఐజీ రవికిరణ్ పేర్కొన్నారు. వాటర్ పొల్యూషన్ కారణమైతే అందరికీ రావాలి కదా?.. మా దగ్గర చంద్రబాబు ఒక రిమాండ్ ఖైదీ మాత్రమే. హైప్రొఫైల్ ఖైదీకి ఇచ్చే అన్ని సౌకర్యాలు ఇస్తాం. జైలులో 2 వేల మందికి పైగా ఖైదీలు ఉన్నారు. వాటర్ పొల్యూషన్ కారణమైతే అందరికీ రావాలి కదా?. చంద్రబాబు ప్రతీ మూమెంట్ సీసీటీవీలో రికార్డవుతుంది. చంద్రబాబును ఉంచిన బ్యారెక్ చాలా విశాలంగా ఉంది. చంద్రబాబు బరువు తగ్గారన్నది పూర్తిగా అవాస్తవం. ఆయన ఆరోగ్యం బాగాలేదని మేం చెప్పలేదు.. మీరే చెబుతున్నారు. జైలులోకి డ్రోన్ వచ్చిందన వార్త పూర్తిగా అవాస్తవం. ఊహించని రీతిలో తప్పుడు వార్తలు రావడంతో స్పష్టతనిస్తున్నాం. ఇకపై ఎవరైనా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే తప్పుడు వార్తలు ప్రచారం చేసినవారిని హెచ్చరిస్తున్నాం’’ అని డీఐజీ తెలిపారు. మాపై ఎటువంటి ఒత్తిళ్లూ లేవు.. ‘‘చంద్రబాబుకు దోమ తెర ఇచ్చాం. నిబంధనల ప్రకారం ఏసీ, కూలర్స్ ఇవ్వలేం. కోర్టు నుంచి ఏం ఆర్డర్స్ వస్తే వాటి ప్రకారం నడుచుకుంటాం. చంద్రబాబు రూమ్‌లో 8 ఫ్యాన్స్ పెట్టాం. మా నిబంధనల ప్రకారం అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం. మాపై ఎటువంటి ఒత్తిళ్లూ లేవు. యనమల ఏం మాట్లాడారో మాకు తెలీదు. చంద్రబాబుకు భద్రతా లోపాలు ఉన్నాయన్న వార్తలు నమ్మొద్దు. చంద్రబాబు దగ్గరకు వేరే ఏ ఖైదీని అనుమతించడం లేదు’’ అని డీఐజీ రవికిరణ్ స్పష్టం చేశారు. చదవండి: చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ డ్రామాలు -
స్టే ఉండగా.. పీటీ వారెంట్ ఎలా జారీ చేస్తారు?
సాక్షి, చైన్నె: పరప్పన అగ్రహార జైలులో లగ్జరీ జీవితం గడపిన వ్యవహారంలో దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ, ఈమె వదినమ్మ ఇలవరసిపై పీటీ వారెంట్ జారీ అయ్యింది. బెంగళూరు లోకాయుక్త మంగళవారం ఈ ఉత్తర్వులు ఇచ్చారు. అదే సమయంలో స్టే ఉండగా ఎలా..? వారెంట్‌జారీ చేస్తారని చిన్నమ్మ తరపు న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. వివరాలు.. అక్రమాస్తుల కేసులో చిన్నమ్మ శశికళ, ఆమె వదినమ్మ ఇలవరసి బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో జైలు శిక్షను అనుభవించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో వీరు ఆ జైల్లో లగ్జరీ జీవితాన్ని గడిపినట్టు వెలుగులోకి వచ్చింది. జైలు నుంచి తరచూ బయటకు షాపింగ్‌కు వెళ్లడం వంటి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీ ద్వారా వెలుగులోకి వచ్చాయి. జైళ్ల శాఖలో పనిచేస్తున్న అధికారులు అవినీతికి మరిగి, లంచం పుచ్చుకుని చిన్నమ్మ, వదినమ్మకు లగ్జరీ జీవితం గడిపే అవకాశం కల్పించినట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారంపై నియమించిన కమిటీ ఇచ్చిన సిఫార్సు మేరకు బెంగళూరు ఏసీబీ అధికారులు శశికళ, ఇలవరసిని కూడా టార్గెట్ చేశారు. విచారణకు హాజరుకాకపోవడంతో.. ఈకేసులో తొలి నిందితుడిగా అక్కడి జైళ్ల శాఖ పర్యవేక్షణాధికారి కృష్ణకుమార్, పరప్పన అగ్రహార జైలు అధికారులు అనిత, సురేష్ నాగరాజ్‌కు సంబంధించిన కేసు లోకాయుక్త కోర్టులో విచారణకు వచ్చింది. కేసు తొలి నిందితులిగా జైలు పర్యవేక్షణాధికారి కృష్ణకుమార్, పరస్పన అగ్రహార అధికారులు అనిత, సురేష్ నాగరాజ్‌ను రెండు, మూడు, నాలుగో నిందితులుగా పేర్కొన్నారు. అలాగే, ఐదు, ఆరో నిందితులుగా శశికళ, ఇలవరసి ఉన్నారు. ఈ కేసు బెంగళూరు లోకాయుక్తలో విచారణలో ఉంది. ఈ విచారణకు నేరుగా హాజరు కావడం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ గతంలో కోర్టును ఆశ్రయించారు. మినహాయింపు పొందారు. అయితే, అవసరమైనప్పుడు విచారణకు హాజరు కావాలని కోర్టు ఇది వరకు సూంచింది. ఆ మేరకు పలుమార్లు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ అయ్యాయి. అయితే, విచారణకు ఈ ఇద్దరు వెళ్లలేదు. దీంతో లోకాయక్త కోర్టు కన్నెర్ర చేసింది. ఈ ఇద్దరికీ పిటీ వారెంట్ జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ అక్టోబరు 6వ తేదీకి వాయిదా పడింది. కాగా చిన్నమ్మను అరెస్టు చేస్తారేమో అన్న బెంగ ఆమె మద్దతు దారులలో నెలకొంది. అయితే కోర్టు విచారణకు హాజరు కావడంలో కోర్టు మినహాయింపు ఉన్నా.. ఎలా వారెంట్ జారీ చేస్తారని, దీనిపై న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని చిన్నమ్మ న్యాయవాదులు వెల్లడించారు. -
జైళ్ల శాఖ రెండో ఐజీగా మురళీబాబు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జైళ్ల శాఖలో ప్రస్తుతం ఉన్న పోస్ట్‌కు అదనంగా.. మరో ఐజీ పోస్ట్ ఏర్పాటుకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ రేంజ్ డీఐజీగా పనిచేస్తున్న మురళీబాబు త్వరలో ఐజీగా పదోన్నతి పొందనున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడినందున జైళ్ల శాఖలో డీపీసీ (డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ) సమావేశమై మురళీబాబుకు ఐజీగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం ఇక లాంఛనప్రాయమే. ఈ మొత్తం ప్రక్రియ మరో వారంలోగా ముగిసే అవకాశం ఉండడంతో ఆ తర్వాత మురళీబాబు ఐజీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం జైళ్లశాఖ ఐజీగా పనిచేస్తున్న రాజేశ్‌కుమార్, పదోన్నతిపై ఐజీగా బాధ్యతలు స్వీకరించనున్న మురళీబాబుల మధ్య పని విభజన చేయనున్నారు. కాగా, ఈ ఇద్దరు అధికారులు ఒకే బ్యాచ్ అధికారులు. సీనియారిటీ అంశంలో తలెత్తిన వివాదాన్ని పరిష్కరించే దిశగా జైళ్ల శాఖలో రెండో ఐజీ పోస్ట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. మురళీబాబుకు పదోన్నతి లభించడంతో ఖాళీ అయ్యే డీఐజీ పోస్ట్ వరంగల్ సెంట్రల్ జైలు ఎస్పీ సంపత్‌కు దక్కే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుత డీఐజీ శ్రీనివాస్‌తోపాటు సంపత్ డీఐజీ హోదా పొందనున్నట్టు సమాచారం. -
Aarogyasri: ఖైదీలకూ ఆరోగ్యశ్రీ! ఇతర రాష్ట్రాల ఖైదీలకూ చాన్స్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలు, మధ్యతరగతి వర్గాలకు ఉచిత వైద్యం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మానవతా దృక్పథంతో ఖైదీలకు సైతం చికిత్స అందించనుంది. ఈ మేరకు ఖైదీలకు కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తూ తాజాగా జీవో విడుదల చేసింది. దేశంలోనే మరెక్కడా లేనివిధంగా తొలిసారి ఖైదీలకూ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలందించనుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాదు.. ప్రైవేటు/కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ వీరికి వైద్యం అందించనుంది. 2019 డిసెంబర్లో జరిగిన ప్రిజన్ డెవలప్మెంట్ బోర్డు సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ఖైదీల వైద్య సదుపాయాలపై నివేదిక సమర్పించాలని జైళ్ల శాఖను ఆదేశించారు. దీంతో స్వతహాగా వైద్యుడైన జైళ్ల శాఖ ఐజీ ఇండ్ల శ్రీనివాసరావుతో పాటు అప్పటి గుంటూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ కె.రఘు, డీజీ అషాన్‌రెజా ఆధ్వర్యంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆ నివేదికను ఆమోదిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది జూలై 22న జీవో విడుదల చేసింది. దీంతో ఇకపై రాష్ట్రంలోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు అనారోగ్యం పాలైతే వారు సాధారణ ప్రజల మాదిరిగానే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు పొందొచ్చు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సంబంధిత జబ్బుకు చికిత్స లభించకపోతే ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తారు. వీరి కోసం ఇప్పటికే ఆరోగ్యశ్రీ సీఈవో నెట్వర్క్ ఆస్పత్రులను గుర్తించారు. ఖైదీలు వైద్య సేవలు పొందడానికి ఆధార్/రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. అవి లేని ఇతర రాష్ట్రాల ఖైదీలకు చీఫ్ మినిస్టర్ క్యాంప్ ఆఫీస్ (సీఎంసీవో) కార్డును తాత్కాలికంగా జారీ చేస్తారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో జైళ్లలో శిక్ష అనుభవిస్తూ సరైన వైద్యం అందక మరణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గనుంది. ఇబ్బందులకు చెక్.. గతంలో ఎవరైనా ఖైదీకి అనారోగ్యం చేస్తే ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లేవారు. అక్కడ సరైన వైద్య సదుపాయాలు లేక ఇబ్బంది పడేవారు. వ్యా«ధి తీవ్రతను బట్టి దూరంగా ఉండే ప్రభుత్వాస్పత్రులకు ఖైదీలను రిఫర్ చేసేవారు. ఇందుకోసం న్యాయస్థానం అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. ఈ ప్రక్రియ పూర్తయి ఆస్పత్రులకు వెళ్లినా ఆరోగ్యశ్రీ ఉండేది కాదు. దీంతో వైద్యం అందక ఖైదీలు ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించడంతో ఖైదీలకు కూడా మెరుగైన వైద్యం అందనుంది. జైళ్లలో మరణాలు గణనీయంగా తగ్గుతాయి.. ఖైదీలకు మెరుగైన వైద్యసేవలను ప్రభుత్వం అందిస్తోంది. ఇటువంటి సదుపాయం కల్పించిన ఘనత దేశంలో మొట్టమొదట రాష్ట్రానికే దక్కుతుంది. ప్రభుత్వ నిర్ణయంతో జైళ్లలో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. – డాక్టర్ శ్రీనివాసరావు, ఐజీ, జైళ్ల శాఖ -
బేడీలపై దురుద్దేశం లేదు
సాక్షి, గుంటూరు: నిజాలతో పనిలేదు.. నిర్ధారించుకునే ప్రయత్నమూ లేదు. విషయం ఏదైనప్పటికీ విమర్శలే పరమావధిగా ప్రతిపక్షం వ్యవహరిస్తోంది. రాజధాని అమరావతిలో దళితులను అడ్డుకున్న వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించే క్రమంలో పోలీస్ శాఖకు చెందిన ఏఆర్ సిబ్బంది బేడీలు వేయడాన్ని టీడీపీ రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకునేందుకు ప్రయత్నించడమే ఇందుకు నిదర్శనం. వాస్తవానికి ఏఆర్ విభాగానికి చెందిన ఎస్కార్ట్ సిబ్బందికి రిమాండ్ ఖైదీల వివరాలు తెలిసే అవకాశం లేదని, ముందు జాగ్రత్తలో భాగంగానే ఇలా వ్యవహరించారని తెలుస్తోంది. నరసరావుపేట సబ్ జైలు నుంచి జిల్లా జైలుకు రిమాండ్ ఖైదీలను తరలించేటప్పుడు బేడీలు వేయడం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని పోలీసు శాఖ ఉన్నతాధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. విచారణ జరుగుతోంది.. జైళ్ల శాఖ విజ్ఞప్తి మేరకు పోలీస్ శాఖలోని ఏఆర్ విభాగం సిబ్బంది ఖైదీలకు ఎస్కార్టుగా వెళ్తుంటారు. ఖైదీలను ఫలానా చోట నుంచి నిర్దేశిత ప్రాంతానికి తీసుకువెళ్లాలని మాత్రమే జైలు అధికారులు పోలీసులకు సూచిస్తారు. ఖైదీలు ఏ కేసుల్లో అరెస్టయ్యారు?ఊరు, పేర్లు, తదితర వివరాలపై ఎస్కార్టు పోలీసులకు సమాచారం ఉండదు. ఈ క్రమంలో మంగళవారం నరసరావుపేట నుంచి గుంటూరుకు ఖైదీలను తరలించే సమయంలో ముందు జాగ్రత్తలో భాగంగా 43 మందికి ఎస్కార్టు సిబ్బంది బేడీలు వేశారని ప్రాథమిక విచారణలో వెల్లడైనట్టు తెలుస్తోంది. దీనిపై డీఐజీ త్రివిక్రమ వర్మ ఆదేశాల మేరకు ఎస్పీ విశాల్ గున్నీ శాఖాపరమైన విచారణను కొనసాగిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలో ఈ నెల 23న జరిగిన రిలే నిరాహార దీక్షలకు కొందరు దళితులు ఆటోల్లో వెళుతుండగా కృష్ణాయపాలెం వద్ద అమరావతి మద్దతుదారులు అడ్డుకుని దాడి యత్నం చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఏడుగురిని అరెస్టు చేయగా న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది. ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో నిందితులైన ఈ ఏడుగురితో పాటు హత్యాయత్నం కేసుల్లో ఇద్దరు, డెకాయిట్ కేసులో ముగ్గురు, పోక్సో కేసుల్లో ఇద్దరు, చోరీ కేసుల్లో ముగ్గురు ఖైదీలు, 498ఏ, ఎక్సైజ్, ఇతర క్రిమినల్ కేసుల్లో ఉన్న నిందితులతో కలిపి మొత్తం 43 మందిని ఈనెల 27న నరసరావుపేటలో కరోనా పరీక్షల అనంతరం గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఖైదీలకు బేడీలు వేయడం విమర్శలకు తావివ్వడంతో ఆరుగురు ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ అదే రోజు ఆదేశాలు జారీ చేశారు. -
జైలులో స్కిల్ డెవలప్మెంట్ యూనిట్
కడప అర్బన్: దేశంలోనే తొలిసారిగా కడప కేంద్ర కారాగారంలో రూ.4.70 కోట్ల వ్యయంతో స్కిల్‌డెవలప్‌మెంట్ మాడ్యులర్ ఫర్నిచర్ యూనిట్ నెలకొల్పుతున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. కడప కేంద్ర కారాగారంలో శుక్రవారం ఉదయం ఆమె ఈ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. కేంద్ర కారాగారంలో ఖైదీలతో కాసేపు మాట్లాడారు. మహిళా ప్రత్యేక కారాగారాన్ని సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ స్విట్జర్లాండ్‌లో తప్ప మరెక్కడాలేని మాడ్యులర్ ఫర్నిచర్ యూనిట్‌ను కడప కేంద్ర కారాగారంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఖైదీలలో పరివర్తన కోసం చేపట్టిన సంస్కరణల్లో భాగంగా ఈ యూనిట్ నెలకొల్పుతున్నామన్నారు. రాబోయే నాలుగు నెలల్లో ఈ యూనిట్ పూర్తవుతుందన్నారు. ఖైదీల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. దిశ యాప్‌ను ప్రారంభించిన 12 రోజుల్లోనే లక్షా 50 వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. ప్రత్యేకంగా కోర్టుల ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ.87 కోట్లు ఇప్పటికే మంజూరు చేసిందన్నారు. స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నా మాజీ సీఎం చంద్రబాబు రాజకీయంగా ఉనికిని చాటుకునేందుకు గురువారం విశాఖ వచ్చారన్నారు. బయట వ్యక్తులెవరూ ఆయన్ను అడ్డుకోలేదని, ప్రజలే అడ్డుకున్నారన్నారు. కడప పోలీస్ పేరుతో పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్‌బాషా, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, జైళ్ల శాఖ రాష్ట్ర డీజీ హసన్‌రాజా, జైళ్లశాఖ డీఐజీ వరప్రసాదరావు, జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్ పాల్గొన్నారు. అంతకుముందు సుచరిత అమీన్‌పీర్ దర్గా (పెద్ద దర్గా)ను సందర్శించారు. -
ఇంటర్ ఫెయిలే జీవితాన్ని మార్చేసింది
అపజయమే విజయానికి సోపానమంటారు పెద్దలు. అది నిజమేనని నిరూపించారు శివకుమార్ గౌడ్. ఈయనెవరనేదేనా మీ సందేహం. మన జిల్లాకు చెందిన వ్యక్తే. మొదట్లో పరీక్షల్లో ఫెయిలైనా ఆ అపజయాన్నే విజయానికి పునాదిగా మార్చుకుని సక్సెస్ బాట పట్టారు. అంతటితోనే ఆగకుండా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఉన్నతస్థాయిలో నిలబడ్డారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని నేటి విద్యార్థులు పరీక్షల్లో తప్పామని కుంగిపోకుండా గుండె నిబ్బరంతో విజయం కోసం తపించాలని శివకుమార్ గౌడ్ పిలుపునిస్తున్నారు. సాక్షి, కామారెడ్డి : పరీక్ష తప్పితే కుంగిపోనవసరం లేదు.. పట్టుదలతో చదివితే సక్సెస్ కావచ్చు.. ఉన్నతస్థాయికి ఎదగొచ్చునని రుజువు చేశారు శివకుమార్‌గౌడ్. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రానికి చెందిన శివకుమార్‌గౌడ్ పదో తరగతి వరకు సొంత ఊల్లోనే చదివాడు. ఇంటర్మీడియట్ చదివేందుకు కామారెడ్డి పట్టణానికి చేరుకున్నాడు. 1987–89లో స్థానిక జీవీఎస్ కాలేజీలో ఇంటర్ ఎంపీసీ చదివిన శివకుమార్ మొదటి సంవత్సరంలో మ్యాథ్స్‌లో ఫెయిలయ్యాడు. అప్పుడు 150 మార్కులకు 53 మార్కులు వస్తే పాస్ అవుతారు. అయితే ఆయనకు 43 మార్కులు మాత్రమే వచ్చాయి. మార్కులు తక్కువ వచ్చి ఫెయిల్ అయ్యానని కుంగిపోలేదు. కసితో చదివాడు. సప్లిమెంటరీలో రాసి పాసయ్యాడు. ద్వితీయ సంవత్సరంలో మంచి మార్కులు సాధించాడు. అప్పుడు 643 మార్కులతో ఎంపీసీలో క్లాస్ సెకండ్‌గా, కాలేజీలో థర్డ్ ర్యాంకర్‌గా నిలిచాడు. ఏ మ్యాథమెటిక్స్ సబ్జెక్టు ఆయన్ను ఇబ్బంది పెట్టిందో దాని మీదే ఎక్కువ దృష్టి సారించాడు. డిగ్రీలో బీఎస్సీ మ్యాథ్స్ సబ్జెక్టును ఎంచుకున్నాడు. 1989–1992 సంవత్సరంలో ఆయన మ్యాథ్స్‌కు సంబంధించి నాలుగు పేపర్లు రాశాడు. రెండింటిలో 150 మార్కులకు 150 మార్కులు, ఒకదానిలో 139, మరొకదానిలో 142 మార్కులు సాధించి కాలేజీలో మంచి గుర్తింపు పొందాడు. 89 శాతం మార్కులతో కాలేజీ టాపర్‌గా నిలిచాడు. 1992–94లో ఉస్మానియా పరిధిలోని నిజాం కాలేజీలో ఆయన పీజీలో 90 శాతం మార్కులు సాధించి యూనివర్సిటీలో నాలుగో ర్యాంకు సాధించాడు. 1994–96లో నాగార్జన సాగర్‌లో బీఈడీ చదివారు. అక్కడా ఏడో ర్యాంకు సాధించారు. 1996లో డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుడిగా ఎంపికైన శివకుమార్‌గౌడ్ 2002 వరకు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. తరువాత 2002లో జూనియర్ లెక్చరర్‌గా ఎంపికై 2012 వరకు రామారెడ్డి, కామారెడ్డి కాలేజీల్లో పని చేశాడు. లెక్చరర్‌గా పని చేస్తూనే గ్రూప్–1కు ప్రిపేర్ అయ్యాడు. 2008లో అప్లయి చేసిన ఆయ న 2011లో జరిగిన పరీక్షలో నెగ్గాడు. 2012లో ఆయనకు జైళ్ల శాఖ డీఎస్పీ పోస్టింగ్ ఇచ్చారు. వరంగల్‌లో తరువాత కరీంనగర్లో ఆ తరువాత మహబూబ్‌నగర్‌లో ప్రస్తుతం సంగారెడ్డి జైల్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆ మార్కులే గ్రూప్–1 సక్సెస్‌కు కారణం.. శివకుమార్‌గౌడ్ గ్రూప్–1లో సక్సెస్ కావడానికి మ్యాథ్స్‌లో వచ్చిన మార్కులే కారణం కావడం విశేషం. ఇంటర్లో ఏ సబ్జెక్టులో అయితే ఆయన ఫెయిల్ అయ్యాడో, తరువాత అదే సబ్జెక్టు ఆయన జీవితాన్ని మార్చేసిందని చెప్పాలి. గ్రూప్–1 ఎగ్జామ్‌లో మ్యాథ్స్‌కు సంబంధించి 150 మార్కులు ఉంటాయి. అందులో శివకుమార్‌గౌడ్‌కు 143 మార్కు లు వచ్చాయి. అన్ని మార్కు లు రావడం కారణంగానే గ్రూప్–1 ఉద్యోగం వచ్చిం దని చెబుతారు శివకుమార్‌గౌడ్. విద్యార్థులు కుంగిపోవద్దు.. గెలుపు ఓటములు అనేవి సహజం. టెన్త్, ఇంటర్లో ఫెయిల య్యాన ని కుంగిపోతే పెద్ద నష్టమే జరుగుతుంది. ఫెయిలైన సబ్జెక్టుకు సం బంధించి మరింత కసితో చదివితే సక్సెస్ కావొచ్చు. ఫెయిల్ అయినవారంతా ఆత్మహత్యలు చేసుకుంటే ఎవరూ మిగలరు. ధైర్యంగా చదవాలి. ముందుకు సాగాలి. ఫెయిలై సక్సెస్ అయిన వ్యక్తుల్లో నేనొకరిని. ప్రతి ఒక్కరూ ధైర్యంగా అడుగులు వేస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు. – శివకుమార్‌గౌడ్, సంగారెడ్డి జైల్ సూపరింటెండెంట్ -
నాణ్యతకు పట్టాభిషేకం !
పాలమూరు : ద్విచక్ర వాహనం లేదా కారు.. లేదంటే మరొకటి.. మనకు దగ్గర్లోని బంకుకు వెళ్లి పెట్రోల్ కాదంటే డీజిల్ పోయించుకుంటాం.. మధ్యలో వాహనం ఎక్కడ మొరాయించినా మొదట బంక్‌లో ఇంధనం నాణ్యతపై అనుమానమొస్తుంది.. ఎందుకంటే పరిస్థితులు అలా తయారయ్యాయి.. ప్రతీ వస్తువులో జరుగుతున్నట్లుగానే పెట్రోల్, డీజిల్ కల్తీకి అనర్హం కాదన్నట్లుగా మారిపోయింది. నాణ్యత విషయం పక్కన పెడితే మనం చెల్లించిన డబ్బుకు సరిపడా ఇంధనం పోశారా, లేదా అన్నది కూడా అనుమానమే! అందుకే బాగా తెలిసిన, పేరున్న బంక్‌లకు వెళ్లడాన్ని వాహనదారులు అలవాటు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జైళ్ల శాఖ ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న బంక్‌లకు ఆధరణ లభిస్తోంది. ఈ బంక్‌ల ఏర్పాటుద్వారా వినియోగదారులకు నాణ్యమైన ఇంధనం లభించడమే కాకుండా అటు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఉపాధి లభిస్తోంది. ఈ మేరకు మహబూబ్‌నగర్ జిల్లా జైలును ఆనుకుని ఏర్పాటుచేసిన బంక్ లాభాల బాటలో నడుస్తోంది. ఇదే మాదిరిగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మరికొన్ని బంక్‌ల ఏర్పాటుకు అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇప్పటికే నాగర్‌కర్నూల్‌లో నిర్మాణ పనులు చివరి దశకు చేరుకోగా.. కల్వకుర్తిలో ఒప్పందం జరిగింది. ఇంకా మరో పది చోట్ల కూడా బంక్‌ల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 2016లో ప్రారంభం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా జైలును ఆనుకుని 2016లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు ఏర్పాటుచేశారు. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తొలి బంక్ ఇదే. ఈ బంక్‌లో పనిచేసే వారందరూ ఖైదీలే కాగా.. నిత్యం పోలీసుల పర్యవేక్షణ ఉంటుంది. తద్వారా నాణ్యత, పరిమాణంలో తేడా రావడం లేదు. ఫలితంగా రోజురోజుకు వినియోగదారుల ఆదరణ పెరుగుతుండగా.. కాసుల వర్షం కురుస్తోంది. శిక్షను అనుభవిస్తున్న, విడుదలైన ఖైదీలు 20మంది మూడు షిప్టుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ బంకు ఏర్పాటుతో కారాగారం ఆదాయం కూడా పెరగగా... ఉమ్మడి జిల్లాలో మరిన్ని పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర జైళ్ల శాఖ నిర్ణయించింది. నాగర్‌కర్నూల్‌లో పనులు పూర్తి మహబూబ్‌నగర్ జిల్లా జైళ్ల శాఖ ఆద్వర్యంలో నాగర్‌కర్నూల్ సబ్ జైల్ దగ్గర పెట్రోల్ ఏర్పాటు పనులు పూర్తికావొచ్చాయి. మరో రెండు నెలల్లో ఈ బంకును ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో పాటు కల్వకుర్తి సబ్ జైలు దగ్గర కూడా నూతనంగా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే స్థల సేకరణ పూర్తికాగా.. సంబంధిత కంపెనీతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇక నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి ఉంది. 2019 చివరి నాటికి ఇక్కడ కూడా పెట్రోల్ బంకును ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 26దరఖాస్తులు ఉమ్మడి జిల్లాలో జైళ్ల శాఖతో కలిసి పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయడానికి ఇప్పటికే 26మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నాణ్యమైన పెట్రోల్, డీజిల్ అందించేలా బంకుల ఏర్పాటుకు జిల్లా జైళ్ల శాఖ నవంబర్ 6 నుంచి 10వరకు దరఖాస్తులు స్వీకరించింది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రధాన రహదారికి 5 కిలోమీటర్ల పరిధిలో పెట్రోల్ బంకులు ఏర్పా టు చేయాలని నిర్ణయించారు. ప్రధాన రోడ్డుకిరు వైపులా 1000 నుంచి 1500 గజాల భూమి ఇవ్వడానికి ఆసక్తి ఉన్న 26 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు వివరాలను ఉన్నతాధికారులకు పంపగా.. అక్కడి నుంచి నిర్ణయం వెలువడితే ఆయా ప్రాంతాల్లో బంకుల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. కాగా, అధికారుల కు అందిన 26 దరఖాస్తుల్లో నాగర్‌కర్నూల్, కొత్తకోట, తాండూర్ రోడ్డువైపు, అచ్చంపేట, భూత్పూర్ ప్రాంతాల నుంచే ఎక్కువ ఉన్నాయి. ఒప్పందం ఇలా... జైళ్ల శాఖతో కలిపి పెట్రోల్ బంక్‌ల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న వారి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. సొంత స్థలం కలిగి ఉండి జైళ్ల శాఖకు లీజ్‌కు ఇస్తే వారే బంక్ ఏర్పాటుచేసి నిర్వహణ బాధ్యతలు తీసుకుంటారు. ఇలా స్థలం ఇచ్చిన వారికి నెలకు కొంత అద్దె చెల్లిస్తారు. లేదంటే భాగస్వామ్యం ఉండడానికి కూడా అనుమతిస్తున్నారు. అయితే, ఏ విధానంలో బంక్ ఏర్పాటుచేసినా నిర్వహణ బాధ్యతలు జైళ్ల శాఖే చూసుకోనుండగా.. శిక్ష అనుభవిస్తున్న, శిక్ష పూర్తి చేసుకున్న వారికే ఉపాధి కల్పిస్తారు. తద్వారా వినియోగదారులకు నాణ్యమైన పెట్రోల్, డీజిల్ అందడంతో పాటు ఖైదీలకు ఉపాధి లభించినట్లవుతుంది. 12 బంకుల ఏర్పాటుకు నిర్ణయం ఉమ్మడి జిల్లాలో జైళ్ల శాఖ ఆధ్వర్యాన 12 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికోసం 26మంది దరఖాస్తు చేసుకున్నారు. పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాం. థర్డ్ పార్టీతో సర్వే చేసిన తర్వాత బంక్‌లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే మహబూబ్‌నగర్‌లోని బంక్ విజయవంతంగా నడుస్తోంది. అదేవిధంగా రెండు నెలల్లో నాగర్‌కర్నూల్‌లో బంక్ ప్రారంభం కానుంది. పెట్రోల్ బంకు ఏర్పాటు తర్వాత జైలు ఆదాయం ఆదాయం బాగా పెరగడమే కాకుండా ఖైదీలకు ఉపాధి లభిస్తోంది. – సంతోష్‌రాయ్, సూపరింటెండెంట్, జిల్లా జైళ్ల శాఖ -
రాష్ట్రానికి 12 పోలీసు పతకాలు
సాక్షి, న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలను కేంద్రం ప్రకటించింది. విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందించిన పోలీసులకు ప్రకటించే ఈ పతకాల్లో తెలంగాణకు 12 దక్కాయి. వీటిలో రెండు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 10 అత్యుత్తమ సేవా పతకాలున్నాయి. రైల్వే, రోడ్డు భద్రతల శాఖ అడిషనల్ డీజీపీ సందీప్ శాండిల్యా, హైదరాబాద్ టీఎస్ సెల్ మాల్నీది కృష్ణలకు విశిష్ట సేవా పతకాలు దక్కాయి. కరీంనగర్ కమిషనర్ వీబీ కమలాసన్‌రెడ్డితోపాటు మరో 9 మందిని అత్యుత్తమ సేవా పతకాలు వరించాయి. 2019 ఆగస్టు 15న ముఖ్యమంత్రి చేతుల మీదుగా సంబంధిత అధికారులు ఈ పతకాలు స్వీకరించనున్నారు. పతకాలు పొందిన అధికారులు, సిబ్బందిని డీజీపీ మహేందర్‌రెడ్డి అభినందించారు. ఇద్దరు అగ్నిమాపక సిబ్బందికి శౌర్య పతకాలు పలువురు రాష్ట్ర అగ్నిమాపక సిబ్బందినీ రాష్ట్రపతి పురస్కారాలు వరించాయి. ఫైర్మన్లు దేవరం కొర్రా, భీంరావ్ అనికెలిలు రాష్ట్రపతి శౌర్య పురస్కారాలకు.. లీడింగ్ ఫైర్‌మన్ సుధాకర్‌రెడ్డి బుర్రా, ఫైర్‌మన్ మహ్మద్ అక్బర్ అత్యుత్తమ సేవా పతకాలకు ఎంపిక అయ్యారు. జైళ్ల శాఖ సిబ్బందికీ.. జైళ్ల శాఖలో హైదరాబాద్ డిప్యూటీ ఐజీ బి.సైదయ్య, చర్లపల్లి కేంద్ర కారాగారం హెడ్ వార్డర్ బి.బాలకృష్ణారెడ్డి, వార్డర్ టి.భాస్కర్‌చారి, వరంగల్ కేంద్రకారాగం చీఫ్ హెడ్ వార్డన్ మహ్మద్ అన్వర్జియాలకు అత్యుత్తమ సేవా పతకాలు దక్కాయి. అత్యుత్తమ సేవా పతకాలకు ఎంపికైన వారు - వీబీ కమలాసన్‌రెడ్డి, సీపీ, కరీంనగర్ - జక్కుల శ్రీనివాస్‌రావు, డీఐజీ కమ్యూనికేషన్స్, సైఫాబాద్ - ఎంజీఎస్ ప్రకాశ్‌రావు, అసిస్టెంట్ కమాండెంట్, వరంగల్ - మెట్టు మానిక్‌రాజ్, అడిషనల్ డీసీపీ, హైదరాబాద్ - సి.రఘునందన్‌రావు, ఇన్స్పెక్టర్ ఇంటెలిజెన్స్, హైదరాబాద్ - జి.రాజులు, ఎస్సై సీఐడీ, సిద్దిపేట - మనోజ్‌కుమార్ దూబే, ఏఆర్ హెచ్‌సీ, హైదరాబాద్ - రమావత్ పెంటయ్య, హెచ్‌సీ ఐఎస్‌డబ్ల్యూ, హైదరాబాద్ - కె.రాంప్రసాద్, హెచ్‌సీ, నిజామాబాద్ - ఎల్ మరియన్న బట్టు, ఏఆర్ఎస్సై, కొత్తగూడెం–భద్రాది -
హైదరాబాద్‌లో అడుక్కుంటూ కనిపిస్తే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నేపథ్యంలో హైదరాబాద్‌లోని యాచకులను నిర్బంధించి జైళ్ల శాఖ పరిధిలోని ప్రత్యేక గృహాలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం చంచల్‌గూడ కేంద్ర కారాగారం వెనుక భాగంలో ఉన్న బాలుర అబ్జర్వేషన్ హోంను పురుష యాచకుల కోసం, చర్లపల్లి కేంద్ర కారాగారం పక్కన ఉన్న భవనాన్ని మహిళా యాచకుల కోసం వర్క్ హౌస్ కమ్ స్పెషల్ హౌస్‌గా ఉపయోగించనుంది. ఏపీ యాచకుల నిర్మూలన చట్టం–1977 కింద ఈ నిర్ణయం తీసుకుంటూ రాష్ట్ర పురపాలక శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాంకా ట్రంప్‌తో పాటు 1,500 మంది బిగ్షాట్స్.. వచ్చే నెల 28 నుంచి 30 వరకు హెచ్ఐఐసీలో జరగనున్న ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, పారిశ్రామికవేత్త ఇవాంకా ట్రంప్‌తో పాటు దేశ విదేశాలకు చెందిన 1,500 మంది పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వక్తలు హాజరుకానున్నారు. కాగా ఈ సదస్సును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు హాజరయ్యే వీవీఐపీలు, వీఐపీల కంటికి నగరంలోని యాచకులు కనిపించకుండా ఏరాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పురుష, మహిళా యాచకుల కోసం వేర్వేరుగా నిర్వహించే ఈ హోమ్‌ల నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర జైళ్లశాఖకే అప్పగించింది. చంచల్గూడలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రిన్స్‌పాల్‌ను పురుష యాచకుల వర్క్‌హోంకు సూపరింటెండెంట్‌గా, చర్లపల్లిలోని ఖైదీల వ్యవసాయ కాలనీ సూపరింటెండెంట్‌ను మహిళా యాచకుల వర్క్ హోంకు సూపరింటెండెంట్‌గా నియమించింది. -
జైళ్లను సైనిక్ స్కూళ్లుగా మార్చడమే లక్ష్యం
జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ వరంగల్: రాష్ట్రంలోని జైళ్లన్నింటినీ సైనిక్ స్కూళ్లుగా మార్చడమే జైళ్ల శాఖ లక్ష్యమని రాష్ట్ర డైరెక్టర్ జనరల్(జైళ్లు) వీకేసింగ్ అన్నారు. వరంగల్ కేఎంసీలో సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో కుల, మత, ప్రాంతీయతత్వాలతో ప్రభుత్వాలు ఏర్పాటవుతున్నాయన్నారు. సిటిజన్ ఫోరం ఏర్పడటంతోనే సరిపోదని డివిజన్, మండలంతోపాటు గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పడి ప్రజలను భాగస్వామ్యం చేసినప్పుడే బంగారు తెలంగాణ సుసాధ్యమవుతుందన్నారు. గతేడాది 80 వేల మంది ఖైదీలను అక్షరాస్యులుగా మార్చామన్నారు. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ ఏమీ కేటాయించలేదన్నారు. రెండేళ్లుగా జైళ్లశాఖను అవినీతి రహిత శాఖగా మార్చడం, చేపట్టిన అభివృద్ధి పనులను గుర్తించిన ప్రభుత్వం జైళ్లలో మరిన్ని సౌకర్యాల కల్పనకు వచ్చే బడ్జెట్లో రూ.30 కోట్లు కేటాయిస్తోందన్నారు. సదస్సులో జైలు సూపరింటెండెంట్ ఎం.సంపత్, శ్రీనివాస్, అశోక్‌రెడ్డి, సిటిజన్ ఫోరం అర్బన్ కమిటీ సభ్యులు పరశురాములు, గిల్దార్ సుల్తానా, బాలరాజు, నరేశ్, వీరభద్రరావు, మంజుల, రమాదేవి, ఉమేందర్, యాకుబ్‌పాషా పాల్గొన్నారు. -
తెలంగాణ జైళ్ల శాఖలో పదోన్నతులు
హైదరాబాద్: తెలంగాణ జైళ్ల శాఖలో ముగ్గురు అధికారులకు పదోన్నతులు లభించాయి. చంచల్‌గూడ జైలు పర్యవేక్షణ అధికారి సైదయ్యకు హైదరాబాద్ రేంజ్ డీఐజీగా, చర్లపల్లి జైలు ఇన్చార్జి పర్యవేక్షణ అధికారి ఎం.ఆర్.భాస్కర్‌కు పూర్తిస్థాయి పర్యవేక్షణ అధికారిగా పదోన్నతి లభించింది. అలాగే సికా ప్రిన్సిపాల్ మురళిబాబును చర్లపల్లి ఖైదీల వ్యవసాయ క్షేత్రం జైలు పర్యవేక్షణ అధికారిగా ప్రభుత్వం నియమించింది. ఈ పదోన్నతులపై అధికారికంగా నాలుగు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. -
ఖైదీలే సైకాలజిస్టులు!
- జైళ్లలోని స్టడీ సెంటర్లలో అందుబాటులోకి ఎంఏ సైకాలజీ - ఇప్పటివరకు డిగ్రీ కోర్సులకే పరిమితం - ఇక ముందు పీజీ కోర్సులు కూడా.. - జైళ్ల శాఖ, అంబేడ్కర్ వర్సిటీల మధ్య ఒప్పందం - ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు సాక్షి, హైదరాబాద్: క్షణికావేశంలో నేరాలు చేసినవారెం దరో జైళ్లలో ఏళ్లకేళ్లు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే కొంత మంది ఖైదీలు ఈ సమయాన్ని తమలో పరివర్తన కోసం, ఉన్నత చదువుల కోసం వినియోగించుకుంటున్నారు. అలా చాలా మంది డిగ్రీ పట్టాలు కూడా పొందారు. తాజాగా డిగ్రీయే కాదు పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) చేసేలా తోడ్పాటు అందించేందుకు జైళ్ల శాఖ సిద్ధమైంది. ఖైదీల్లో మానసిక అభివృద్ధి, కౌన్సెలింగ్ కోసం సైకాలజీలో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇప్పటివరకు చాలా మంది ఖైదీలు ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఆపై అంబేడ్కర్ యూనివర్సిటీ సహకారంతో డిగ్రీలు పూర్తిచేస్తున్నారు. కానీ పీజీ చేసే అవకాశాన్ని తాజాగా కల్పిస్తున్నారు. రెండు కారాగారాల్లో.. ఏటా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని జైళ్లలో 500 మంది వరకు ఖైదీలు డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందుతున్నారు. వారిలో సుమారు 150 మంది వరకు ఉత్తీర్ణులవుతున్నారు. ఇలాంటి ఖైదీలు పీజీ కోర్సులు కూడా చేసేందుకు సిద్ధంగా ఉండడంతో.. వారిని ప్రోత్సహించేందుకు జైళ్ల శాఖ చర్య లు చేపట్టింది. దీనిపై అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి ప్రతిపాదనలు పంపింది. తెలంగాణలోని వరంగల్, చర్లపల్లి కేంద్ర కారాగారాల్లో ఉన్న స్టడీ సెంటర్లలో పీజీ కోర్సులు ప్రవేశపెట్టాలని కోరింది. అటు ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, రాజమండ్రి, కడప కేంద్ర కారాగారాలు సైతం ఇదే ప్రతిపాదన చేశాయి. పీజీ కోర్సుల్లో భాగంగా ఎంఏ సైకాలజీని ప్రవేశపెట్టడం ద్వారా అన్ని జైళ్లలోని ఖైదీలకు మానసిక శిక్షణ, అభివృద్ధికి వారి సేవలు వినియోగించుకో వాలని భావిస్తున్నారు. నేర ప్రవృత్తి కారణంగా జైలుకు వచ్చిన ఖైదీల్లో మానసిక పరివర్తన తీసుకురావడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నా రు. సీట్ల కేటాయింపుతో సంబంధం లేకుండా పీజీ కోర్సును ప్రవేశపెట్టి ఖైదీలనే.. జైళ్ల శాఖలో సైకాలజిస్టు లుగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఎంఏ సైకాలజీ కోర్సు అందు బాటులోకి వచ్చే అవకాశం ఉందని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధికారులు తెలిపారు. -
కానిస్టేబుల్ అభ్యర్థులకు 1న ఫిజికల్ టెస్ట్
- ఓఎంఆర్ రీవెరిఫికేషన్ కోసం 23 లోగా దరఖాస్తు చేసుకోవాలి - ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ అతుల్‌సింగ్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 4,283 సివిల్, రిజర్వ్ పోలీస్ కానిస్టేబుళ్లు, జైళ్ల శాఖలోని 265 వార్డెన్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షలో ఓఎంఆర్ షీట్ల రీవెరిఫికేషన్ కోసం ఈ నెల 19 నుంచి 23 వ తేదీ ఐదు గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ అతుల్‌సింగ్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 6న నిర్వహించిన పరీక్ష ఫలితాలు 15న విడుదలైనట్లు తెలిపారు. రాతపరీక్షకు సంబంధించి అనుమానాలు ఉంటే ఏపీఆన్‌లైన్ (మీసేవ కాదు) ద్వారా రూ. 1,000 ఫీజుతో కలిపి ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. www.recruitment.appolice.gov.in వెబ్సైట్లో హాల్ టికెట్, అభ్యర్థి పేరు, తండ్రి పేరు, ఓఎంఆర్ షీటు రీవెరిఫికేషన్ కోరడానికి కారణం తెలియజేస్తూ ధరఖాస్తు చేసుకోవాలని వివరించారు. రీవెరిఫికేషన్లో అభ్యర్థుల మార్కుల వివరాలను మొబైల్‌కు ఎస్ఎంఎస్, ఇమెరుుల్ ద్వారా తెలియజేస్తామన్నారు. మార్కులు పెరిగితే ఆ అభ్యర్థికి రీవెరిఫికేషన్ కోసం చెల్లించిన ఫీజు తిరిగి ఇస్తామన్నారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబర్ 1న ఫిజికల్ టెస్ట్ నిర్వహించే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాత పరీక్ష సమయంలో ఓఎంఆర్ షీటులో సామాజికవర్గాన్ని తప్పుగా పేర్కొన్నట్టరుుతే www.recruitment.appolice.gov.in కు సామాజికవర్గాన్ని ధ్రువీకరించే పత్రాలను మెరుుల్ చేయాలని సూచించారు. ఫిజికల్ టెస్ట్‌కు వచ్చేటపుడు వాటికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాలని పేర్కొన్నారు. -
వరంగల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీల పరార్
వరంగల్: పటిష్ట భద్రత ఉండే వరంగల్ సెం ట్రల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పరార య్యారు. ఏకే-47 ఆయుధాన్ని అమ్మిన కేసులో శిక్ష అనుభవిస్తున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ సైనికుడు, ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లా కాంకేర్కేరా వాసి సైనిక్‌సింగ్, ఒక హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న బిహార్‌లోని ఆర్యాల్ ప్రాంతానికి చెందిన రాజేశ్‌సింగ్ శనివారం తెల్లవారుజామున జైలు ప్రహరీ దూకి పారి పోయారు. వీరిద్దరూ సెంట్రల్‌జైలులోని హైసె క్యూరిటీ బ్యారక్‌లో వరంగల్ జిల్లాకు చెందిన మరో ఖైదీతో కలసి ఉంటున్నారు. వీరిలో సైనిక్‌సింగ్, రాజేశ్‌సింగ్ కలసి బ్యారక్‌కు ఉన్న తాళం పగలగొట్టి మూడంచెల భద్రతను దాటి నిరంతరం విద్యుత్ సరఫరా ఉండే గోడ దూకి పారిపోవడం సంచలనంగా మారింది. బ్యార క్కు ఉన్న తాళం పగులగొట్టే సమయంలో శబ్దం వస్తుందని భావించిన ఖైదీలు.. తాళా నికి, దాన్ని పగులగొట్టేందుకు ఉపయోగించిన ఐరన్ రాడ్‌కు గుడ్డ(క్లాత్)ను చుట్టి తాళం మధ్య లో ఒత్తడంతో తాళం విడిపోరుుందని తెలిసింది. అక్కడ నుంచి వారు తప్పించుకొని ప్రహరీ వద్దకు చేరుకున్నారు. అప్పటికే సిద్ధం చేసుకున్న ఇనుప కొక్కానికి గుడ్డను కట్టి ప్రహరీపై వేసినట్లు తెలిసింది. ఆ కొక్కానికి దుప్పటితో తయారు చేసుకున్న తాడును కట్టి ప్రహారీగోడపైకి చేరుకొన్న ఇద్దరూ గోడ దూకి బయటకు పారిపోరుునట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో రౌండ్సకు వచ్చిన జైలు సిబ్బంది.. తాళం పగిలి పోరుు ఉండడం.. బ్యారక్‌లోని ముగ్గురు ఖైదీలకు ఒక్కరే ఉండడంతో అనుమానం వచ్చి పరిశీలించగా ఇద్దరు తప్పించుకుపోరుునట్లు బయటపడింది. కాగా, ఈ విషయం తెలుసు కున్న ఉన్నతాధికారులు సెంట్రల్ జైలుకు వచ్చారు. తప్పించుకుపోరుున ఖైదీలను పట్టు కునేందుకు ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపారు. నగరం చుట్టూ నాకాబందీ నిర్వహి స్తూ వాహనాలను తనిఖీలు చేయడం ప్రారం భించారు. కాగా, 20 ఫీట్ల ఎత్తుతో ఉన్న ప్రహరీకి ఇరువైపులా టవర్లు ఉన్నప్పటికీ ఇద్దరు ఖైదీలు ఆ రెండు టవర్ల మధ్య నుంచే దూకి పారిపోవడం పట్ల పలు అనుమా నాలు వ్యక్త మవుతున్నారుు. జైలు లోపల జైళ్ల శాఖకు చెందిన సిబ్బం ది పహారా, వాచింగ్ టవర్లపై ఆర్మ్డ్ రిజర్వు పోలీసులు నిరంతరం పర్యవేక్షణ, భద్ర త ఉన్న జైలు నుంచి ఇద్దరు ఖైదీలు తప్పించుకుపోవ డాన్ని చూసి జైళ్ల శాఖతో పాటు సివిల్ పోలీసు యంత్రాంగం నివ్వెర పోరుుంది. ఇద్దరు ఖైదీలు పారిపోవడాన్ని గుర్తించలేదంటే డ్యూటీలో ఉన్నవారు నిద్ర లో కి జారుకున్నారని అధికారులు భావిస్తు న్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో మద్యం బాటిళ్ల మూత ల సీళ్లు కనిపించడం గమనార్హం. జైలును సందర్శించిన డీజీ వీకే సింగ్ వరంగల్ సెంట్రల్ జైలును జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ శనివారం మధ్యా హ్నం సందర్శించారు. ఖైదీలు తప్పించు కున్న తీరును, వారు ఉపయోగించిన ఆయు ధాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ జైళ్ల శాఖలో సిబ్బంది కొరత ఉందని, దీనివల్ల భద్రతలో లోపాలున్నాయన్నారు. వరంగల్ సెంట్రల్ జైలులోని 4 వాచ్ టవర్లలో మూడు టవర్లే పనిచేస్తున్నాయని, పనిచేయని టవర్ వద్ద నుంచి ఖైదీలు తప్పించుకున్నారని చెప్పారు. వారిని ఎలాగైనా పట్టుకుంటామని, ఘటనకు బాధ్యులైనవారిపై చర్యలు తప్పవని వీకే సింగ్ హెచ్చరించారు. -
ప్రారంభమైన జైళ్ల శాఖ సైకిల్ యాత్ర
తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర శుక్రవారం ప్రారంభమైంది. ఈ యాత్రను చంచల్‌గూడ జైళ్ల ప్రధాన కార్యాలయంలో డీఐజీ నర్సింహులు ప్రారంభించారు. ఈ సైకిల్ యాత్రలో ఐదుగురు జైళ్ల శాఖ సిబ్బంది పాల్గొన్నారు. అవినీతి రహిత సమాజం, ఏకత్వంలో భిన్నత్వం, పర్యావరణ పరిరక్షణ కోసం ఈ సైకిల్ యాత్ర చేస్తున్నట్లు తెలిపారు. వీరు తెలంగాణ వ్యాప్తంగా 2145 కి.మీల సైకిల్ యాత్ర చేస్తారు. -
ఆ ఫిర్యాదులను ‘ఫేస్బుక్లో ఫిర్యాదు చేయొచ్చు’
చంచల్‌గూడ: జైళ్ల శాఖకు సంబంధించిన ఫిర్యాదులు, సలహాలను తెలంగాణ స్టేట్ ప్రిజన్స్ డిపార్ట్మెంట్ ఫేస్బుక్ ద్వారా తెలియజేయవచ్చని ఆ శాఖ హైదరాబాద్ డీఐజీ అకుల నర్సింహ ఓ ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదులకై ఫోన్ నెంబర్లు 04024527846, 04024511791లో కూడా సంప్రదించవచ్చన్నారు. ఫిర్యాదు అందిన వారంలోపు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
విడుదలైన ఖైదీలకు ఉపాధి అవకాశాలు
* ప్రణాళిక సిద్ధం చేసిన జైళ్ల శాఖ * పలు ప్రైవేటు కంపెనీలతో అవగాహనా ఒప్పందం * వచ్చే 15 ఏళ్లలో 10 వేల ఉద్యోగాల కల్పన లక్ష్యం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జైళ్ల శాఖ పూచీకత్తుగా విడుదలైన ఖైదీలకు ఆ శాఖ భాగస్వామ్యంతో పనిచేసే ప్రైవేటు కంపెనీలలోనూ 25 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ తెలిపారు. శనివారం చంచల్గూడలోని జైళ్ల శాఖ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే 91 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. వచ్చే 15 ఏళ్లలో పదివేలమందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. జైళ్ల శాఖ వస్తువులకు భారీ డిమాండ్.. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో తయారయ్యే వస్తూత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటోంది. నాణ్యతతో కూడిన వస్తువులు కావడంతో విద్యాశాఖ తమ ఫర్నిచర్ కోసం భారీగా ఆర్డర్లు ఇచ్చింది. రాష్ట్రంలోని పలు జైళ్లల్లో ఖైదీలకు పెట్రోల్ బంకుల నిర్వహణ, నేచురల్ స్పా, కుట్లు, అల్లికలు, ఫర్నిచర్, స్టీల్ సామగ్రి తయారీలో శిక్షణనిచ్చి మూడుషిప్టుల్లో పనిచేయిస్తున్నారు. పెట్రోల్‌బంకుల లాభాల బాట పట్టడంతో కొత్తగా మరో మూడు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. గతేడాది జైళ్లశాఖ వివిధ మార్గాల ద్వారా రూ.4.42 కోట్ల లాభాలను ఆర్జించింది. నెలకు రూ. 8 వేలు ఇస్తున్నారు: మనోజ్‌కుమార్ సోని, విడుదలైన ఖైదీ పదేళ్లలో ఇప్పటి వరకు 16 సార్లు జైలుకు వెళ్లాను. చాలాసార్లు చేయని నేరానికి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఖైదీ అనే ముద్ర పడటంతో ఎక్కడా ఉపాధి లభించలేదు. మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోనే నాలుగు కేసులు నమోదు చేశారు. ఇన్ఫార్మర్గా మారాలని లేకపోతే పీడీయాక్టు పెడతామంటూ పోలీసులు బెదిరిస్తున్నారు. ఈ విషయాన్ని జైలు అధికారులకు చెబితే వారే ఉద్యోగం కల్పించారు. ప్రస్తుతం నెలకు రూ.ఎనిమిది వేలు ఇస్తున్నారు. -
ఖైదీలకు రుణాలు మంజూరు చేసిన జైళ్ల శాఖ
హైదరాబాద్: రాష్ట్ర జైళ్ల శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాపరివర్తన్ కార్యక్రమంలో భాగంగా ఖైదీలకు వ్యక్తిగత రుణాలు మంజూరు చేసినట్లు ఆ శాఖ డీజీ వినయ్‌కుమార్‌సింగ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ జై ళ్లకు చెందిన 34 మంది ఖైదీలకు వారి పిల్లల విద్య, వివాహాల ఖర్చులకు సంబంధించి వడ్డీలేని రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. మొదటి విడతలో మొత్తం రూ. 11,47,500 రుణాలు (ఒక్కో ఖైదీకి రూ. 13500 నుంచి రూ. 45 వేల వరకు) నిర్ణయించినట్లు తెలిపారు. ఖైదీలకు రుణాల పంపిణీ వల్ల వారి జీవితాల్లో మంచి మార్పులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
జైళ్లలో చికెన్ బిర్యానీ!
అధునాతన క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని జైళ్లశాఖ డీజీ ఉత్తర్వులు సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జైలు పేరు చెబితే ఠక్కున గుర్తుకొచ్చేది చిప్పకూడు! కానీ ఇకపై చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, ఫ్రైడ్‌రైస్ సహా అన్నీ గుర్తుకొస్తాయి. ఇవన్నీ జైలు క్యాంటిన్లో ఖైదీలకు అందుబాటులోకి రాబోతున్నాయి. బయట హోటల్ మాదిరిగా డబ్బులు చెల్లిస్తే చాలు.. ఉదయం ఇడ్లీ, దోశ, పూరి, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఇష్టమైన చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్.. వగైరా లాగించేయొచ్చు. ఈ మేరకు రాష్ట్ర జైళ్ల డీజీ వీకే సింగ్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు ఎందుకంటే... మంచి భోజనం కోసం ఖైదీలు, రిమాండ్ ఖైదీలు అల్లాడిపోతున్నారు. జైలు కూడు తినలేక పస్తులుంటూ ఎందరో అనారోగ్యం పాలవుతున్నారు. కొందరైతే నచ్చిన తిండి కోసం జైలు సిబ్బందికి వేలకు వేలు లంచాలిచ్చి బయట్నుంచి చాటుమాటుగా తెప్పించుకుని తింటున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు జైళ్ల శాఖ డీజీ జైళ్లలో అదునాతన క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల ఖైదీలు ఇష్టమైన తిండి కోసం జైలు సిబ్బందికి లంచాలిచ్చే పద్ధతికి స్వస్తి పలకొచ్చని ఆయన భావిస్తున్నారు. దీనికితోడు క్యాంటీన్ల ద్వారా వచ్చే ఆదాయంతో జైళ్లను ఆర్థికంగా బలోపేతం చేయొచ్చని భావిస్తున్నారు. ఒక్కో ఐటమ్కు ఒక్కో రేటు! క్యాంటీన్లో ఆహార పదార్థాలకు ఒక్కో ఐటమ్కు ఒక్కో ధర నిర్ణయిస్తారు. ఆహార పదార్థాలకయ్యే ఖర్చు, క్యాంటీన్ నిర్వహణ ఖర్చులపై 20 శాతం లాభం వేసుకొని ఈ ధరలు నిర్ణయించాలని జైళ్లశాఖ డీజీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వచ్చిన ఆదాయాన్ని జైళ్ల అభివృద్ధికి వినియోగించాలని సూచించారు. జైలు క్యాంటీన్లో ఇష్టమైన ఆహారం తినే సదుపాయం విదేశాల్లో ఎప్పట్నుంచో అమలవుతోంది. మన రాష్ట్రంలో తొలిసారిగా ఈ విధానాన్ని అమలు చేయబోతున్నారు. ఇప్పటికే కరీంనగరం జిల్లా జైలులో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఖైదీల నుంచి అనూహ్య స్పందన రావడంతో త్వరలో పూర్తిస్థాయిలో అధునాతన క్యాంటీన్‌ను ఏర్పాటు చేసేందుకు జైలు సూపరింటెండెంట్ శివకుమార్ సిద్ధమవుతున్నారు. ఖైదీల సంక్షేమం కోసమే: శివకుమార్, జైలు సూపరింటెండెంట్, కరీంనగర్ జైళ్లశాఖ డీజీ ఆదేశాల మేరకు జిల్లా జైలులో ప్రయోగాత్మకంగా చికెన్, ఎగ్‌తో చేసిన ఆహార పదార్థాలను ఖైదీలకు అందించాం. ఎగ్‌ఫ్రైడ్ రైస్, ఎగ్కర్రీల ధర రూ.40. ఖైదీల నుంచి మంచి స్పందన రావడంతో పూర్తిస్థాయిలో మెనూలోని ఆహార పదార్థాలన్నీ అందించేందుకు సిద్ధమవుతున్నాం. ఖైదీల ఆరోగ్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ విధానాన్ని అమలు చేస్తున్నాం. క్యాంటీన్ నిర్వహణను ఐదుగురు ఖైదీలకు కేటాయించాం. ఇదీ జైలు క్యాంటీన్ మెనూ ఉదయం: ఇడ్లీ, దోశ, పూరి, వడ, ఉప్మా సాయంత్రం: చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, వెజ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్‌రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్‌బోండా, చపాతీ. -
కారాగారంలో రికార్డింగ్ డ్యాన్స్!
విచారణకు ఆదేశించిన జైళ్లశాఖ సాక్షి,బెంగళూరు: విజయపురలోని కేంద్రకారాగారంలో నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రామల పేరుతో రికార్డింగ్ డ్యాన్స్ నిర్వహించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాలు... గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్ఫ్రవర్తన కలిగిన ఖైదీలను విజయపుర కేంద్ర కారగారం నుంచి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వేదిక పై సినిమా పాటలకు అనుగుణంగా యువతి అసభ్యకర రీతిలో నృత్యం చేస్తుండగా కొంతమంది కారాగార సిబ్బంది ఆమెపై డబ్బులు వెదజెల్లారు. ఈ విషయం వీడియో క్లిప్పుంగుల రూపంలో ఒక రోజు ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై స్పందించిన జైళ్ల శాఖ ఇందుకు సంబంధించిన పూర్తి నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు గాను విచారణకు ఆదేశించింది. జైళ్ల శాఖ డీజీపీ హెచ్.ఎన్.ఎస్.రావును విచారణాధికారిగా నియమించింది. మరో రెండు రోజుల్లో హెచ్.ఎన్.ఎస్.రావు తన విచారణను ప్రారంభించనున్నారని తెలుస్తోంది. -
జైళ్ల శాఖ టర్నోవర్ రూ.216 కోట్లు
సగానికి తగ్గిన ఖైదీల మరణాలు: డీజీ వీకే సింగ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర జైళ్ల శాఖ 2015 సంవత్సరంలో రూ.216.03 కోట్లు టర్నోవర్ సాధించినట్లు డెరైక్టర్ జనరల్ (డీజీ) వినయ్‌కుమార్ సింగ్ వెల్లడించారు. జైళ్ల శాఖకు ఒక్క రూపాయి నిధులు రాకపోయినా... తమ శాఖ ఆదాయం నుంచే ఖర్చులన్నీ పోను గతేడాది రూ.4.77 కోట్లు మిగులు సాధించినట్లు తెలిపారు. 2025 నాటికి రూ.100 కోట్ల లాభాలను ఆర్జించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. మంగళవారం జైళ్ల శాఖ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంతో పోల్చితే జైళ్లలో ఖైదీల మరణాలు సగానికిపైగా తగ్గినట్లు చెప్పారు. 2013లో 53 మంది ఖైదీలు చనిపోగా, 2014లో 56 మంది చనిపోయారన్నారు. 2015లో 32 మంది వివిధ వ్యాధుల బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారన్నారు. ఖైదీల మరణాలను నివారించేందుకు మహాపరివర్తన్ పేరిట జైళ్లలో అనేక సంస్కరణలు చేపడుతున్నామని, ఫలితంగా జైలుకు వచ్చే ఖైదీల సంఖ్య కూడా భారీగా తగ్గిందని సింగ్ పేర్కొన్నారు. 2014లో రాష్ట్రంలోని అన్ని జైళ్లకు 94 వేల మంది ఖైదీలు రాగా, 2015లో 79,409 మంది వచ్చారన్నారు. వీరిలో శిక్ష పడిన వారు 3,926 మంది కాగా, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీల్లో 49,942 మంది పురుషులు, 25,541 మంది మహిళలు ఉన్నట్లు ఆయన చెప్పారు. -
ఖైదీల క్షమాభిక్షపై నీలినీడలు!
గ్రేటర్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జాప్యం సాక్షి, హైదరాబాద్: ఖైదీలకు మళ్లీ ఎదురుచూపులు తప్పడంలేదు. క్షమాభిక్షపై నీలినీడలు కమ్ముకున్నాయి. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం(జనవరి 26) రోజున విడుదల చేస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఖైదీల క్షమాభిక్షపై ఏర్పాటైన జైలు సూపరింటెండెంట్ల కమిటీ ఒక జాబితాను తయారు చేసి ప్రభుత్వానికి అందజేసింది. దీనిపై ప్రభుత్వ ఉన్నతస్థాయి కమిటీ పరిశీలించి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకు ఆ ప్రక్రియ జరగలేదు. ప్రస్తుత ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెలువరించే పరిస్థితి లేదు. నిర్ణయాన్ని ప్రకటించాలంటే ఎన్నికల కమిషన్ అనుమతి అవసరం. ఇప్పటికిప్పుడు ఈసీ నుంచి అనుమతి తీసుకున్నా ఖైదీల క్షమాభిక్ష జనవరి 26 నాటికి పూర్తయ్యే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న క్షమాభిక్ష ప్రసాదించే అవకాశం ఉంది. క్షమాభిక్షపై నిషేధాన్ని తొలగిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. కొన్ని మార్గదర్శకాలను సూచించింది. తీర్పు ప్రతులు ప్రభుత్వానికి, జైళ్లశాఖకు అందాయి. న్యాయస్థానం తీర్పును అనుసరించి నియమ నిబంధనలు రూపొందించాలని రాష్ట్ర జైళ్ల శాఖను ప్రభుత్వం ఆదేశించింది. అందుకు అనుగుణంగా అన్ని జైళ్ల సూపరింటెండెంట్లను సభ్యులుగా నియమిస్తూ జైళ్లశాఖ ఒక కమిటీని వేసింది. క్షమాభిక్షకు అర్హత కలిగిన ఖైదీలను కమిటీ ఎంపిక చేసింది. ఈ మేరకు నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి గత నెలలో అందజేసింది. తెలంగాణలోని అన్ని జైళ్లలో శిక్షపడిన ఖైదీలు 18 వందల మంది వరకు ఉండగా వీరిలో దాదాపు 300 మంది ఖైదీలు క్షమాభిక్షకు అర్హత కలిగి ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. -
ఎట్టకేలకు రోడ్డెక్కిన చెన్నై
- ఐదు రోజుల తర్వాత వర్షాల నుంచి కాస్త ఉపశమనం - వరద కూడా తగ్గుతుండడంతో కుదుటపడుతున్న నగరం - భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడి - ఇప్పటికీ చుక్కలు చూపిస్తున్న నిత్యావసరాలు - పెట్రోలు బంకులు, ఏటీఎం, పాలబూత్‌ల వద్ద జనం బారులు - బస్సులు, రైలు సేవలు పాక్షికంగా పునరుద్ధరణ చెన్నై నుంచి నందగోపాల్, సాక్షి ప్రతినిధి : ఐదు రోజుల నుంచీ వరుణుడి ప్రకోపంతో విలవిల్లాడిపోతున్న చెన్నై నగర ప్రజలకు ఎట్టకేలకు శనివారం కాస్త ఊరట లభించింది. శుక్రవారంనాటికి కొన్ని ప్రాంతాల్లోనే ముంపు తగ్గగా, శనివారం మరికొన్ని ప్రాంతాలు వరద నీటి నుంచి ఉపశమనం పొందాయి. దీంతో ధైర్యం తెచ్చుకొని ప్రజలు ఇళ్ల నుంచి బయటకొచ్చారు. అయితే వలంటీర్లు, సహాయ బృందాలు అందిస్తున్న ఆహార పదార్థాలు, బిస్కెట్ ప్యాకెట్లతో కడుపు నిండే పరిస్థితి లేకపోగా, రోడ్డుపై విక్రయిస్తున్న పాలప్యాకెట్లు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు చూసి విస్తుపోవడం వారి వంతైంది. ఎంతో కొంత డబ్బు మిగిలినవారు అధిక ధరలు చెల్లించి కొనడానికి క్యూ కడుతుండగా, నిరుపేదలు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. మరికొందరు పూర్తిగా నిండని కడుపుతోనే తమ ఇళ్ల నుంచి వ్యర్థాలు తొలగించడంపై దృష్టిపెట్టారు. ఐదు రోజులుగా నీళ్లల్లో నాని పాడైపోయిన సర్టిఫికెట్లు, ఫర్నీచర్లు, ఉప్పు, పప్పులు ఆరబెట్టుకోవడం కోసం స్థానికులు నానా పాట్లూ పడుతున్నారు. డ్రైనేజీ వ్యర్థాలతో నిండిపోయిన వంట సామాన్లను ముక్కుమూసుకొని శుభ్రం చేసుకుంటున్నారు. మరికొందరు ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు వరద తగ్గిన నేపథ్యంలో ప్రభుత్వం రైళ్లు, బస్సుల సేవలు పాక్షికంగా పునరుద్ధరించింది. అక్కడక్కడా పెట్రోలు బంకులు, ఏటీఎంలు స్వల్ప సంఖ్యలో పనిచేయడం ప్రారంభించాయి. దీంతో వందలకొద్దీ వాహనదారులు బంకుల వద్ద గంటల తరబడి క్యూలు కట్టారు. కొన్ని చోట్ల మొబైల్ ఏటీఎంలు నడుపుతున్నారు. కేరళ రాష్ట్రం జైళ్ల శాఖ అక్కడి ఖైదీల ద్వారా 5వేల చపాతీలను, జామ్‌ను తయారుచేయించి విమానం ద్వారా తమిళనాడుకు చేరవేసింది. సెల్‌ఫోన్ సర్వీసులు కూడా కొంతమేర అందుబాటులోకి వచ్చాయి. మళ్లీ మొదలైన టెన్షన్: గత నెలరోజులుగా భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజానీకాన్ని శనివారం వాతావరణ శాఖ సూచన మరోసారి టెన్షన్ పెట్టింది. బంగాఖాతంలో శ్రీలంక, ఉత్తర తమిళనాడు తీరంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాగల 24 గంటల పాటూ భారీ వర్షాలు కొనసాగుతాయని చెన్నై వాతావరణశాఖ డైరక్టర్ రమణన్ ప్రకటించారు. ఈ అల్పపీడనం వల్ల తమిళనాడులోని సముద్రతీర జిల్లాల్లోనూ, పుదుచ్చేరిలోనూ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు చెన్నై పూర్తిగా మునిగిపోగా, వరదనీరు ప్రవహించేలోపునే మళ్లీ వర్షాలు పడతాయని చేసిన ప్రకటన అబద్ధమైతే బాగుంటుందని వాపోతున్నారు. చెంబరబాక్కం తెగబోతోందా?: గత 20 రోజులపాటూ కురిసిన వర్షాలకు తోడు చెంబరబాక్కం చెరువు నుండి ప్రవహించిన వరదనీటితో జనవాసాలన్నీ నీట మునిగిపోగా, చెంబరబాక్కం చెరువు తెగబోతోందనే వదంతులు బయలుదేరాయి. నడుము లోతు నీళ్ల నుండి బైటపడకముందే పీకల్లోతు నీళ్లలోకి వెళ్లిపోతున్నామని ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఈ సమాచారం ప్రభుత్వం చెవినకూడా పడటంతో వదంతులు నమ్మవద్దని, చెంబరబాక్కం చెరువు పటిష్టంగా ఉందంటూ హడావిడి ప్రకటన చేయాల్సి వచ్చింది. ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు: నగరంలో సహాయక చర్యలు చేపట్టేందుకు నావికాదళానికి చెందిన మూడు నౌకలు సుమారు 700 టన్నుల ఆహారపదార్థాలతో, పది బోట్లతో చెన్నై హార్బర్‌కు చేరుకున్నాయి. ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ శనివారం కూడా ఏరియల్ సర్వే చేసి పరిస్థితిని సమీక్షించారు. ఇప్పటి వరకు సైన్యం 5500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇంతవరకు తాము 16,325 మంది పౌరులను, 30 పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఎన్డీఆర్ఎఫ్ పేర్కింది. 19,465 ఆహార పొట్లాలు, 16,002 తాగునీటి ప్యాకెట్లు సరఫరా చేసినట్లు వెల్లడించింది. వరద నీరు అధికంగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజల వద్దకే కాయగూరల్ని తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో అదనంగా రెండు వందల వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడానికి ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. ఆ మార్గంలో ఉచిత బస్సు ప్రయాణం.. రవాణా సౌకర్యాలు శుక్రవారంతో పోలిస్తే కాస్త మెరుగయ్యాయి. చెన్నై కోయంబేడు నుంచి ఇతర ప్రాంతాలకు బస్సుల సేవల్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించారు. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల వైపుగా సాగే నగర రోడ్డు రవాణా సంస్థ బస్సులు ఈ నెల 8 వరకు ఉచితంగా సేవల్ని అందిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. చెన్నై విమానాశ్రయం నుంచి పౌర విమాన సర్వీసులను ఆదివారం నుంచి పగటి పూట పునరుద్ధరిస్తామని, రాత్రి వేళ నడిపే అంశంపై ఆదివారం నిర్ణయం తీసుకుంటామని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మరోవైపు మూడు రోజులుగా ఆగి ఉన్న ఈఎంయూ(ఎలక్ట్రిక్) రైళ్ల సేవలు పునరుద్ధరించారు. ట్రాక్‌ల పునరుద్ధరణ పర్వం ముగియడంతో సెంట్రల్, ఎగ్మూర్‌ల నుంచి రైలు సేవలకు అధికారులు నిర్ణయించారు. సెంట్రల్, ఎగ్మూర్ స్టేషన్ల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత రైలు సేవలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. రీలే కాదు.. రియల్ హీరోలు కూడా.. సాక్షి, చెన్నై: వరద బాధితులను ఆదుకోవడానికి ఇప్పటికే సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలను ప్రకటించిన తమిళ నటీనటులు శనివారం స్వయంగా సహాయకార్యక్రమాల్లో పాల్గొన్నారు. తమిళ నటులు విశాల్, ధనుష్, కార్తీ, సిద్ధార్థ్, కోవై సరళ, ఖుష్బూ తదితరులు వివిధ ప్రాంతాల్లో సహాయకార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాధితులకు తమ తరఫున ఆహార పొట్లాలను, మంచి నీటి పాకెట్లను అందించారు. హీరో విశాల్ నగరంలోని లోతట్టు ప్రాంతాలకు వెళ్లి కొంతమంది బాధితులకు ఆహారాన్ని అందించారు. బాధితులతో మమేకం అయ్యి వారి కష్టనష్టాలను తెలుసుకున్నాడు. కార్తీ కూడా సహాయ కార్యక్రమాల్లో భాగస్వామి అయ్యాడు. నటీమణులు ఖుష్బూ, కోవై సరళలు తమ వంతుగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హీరో సిద్ధార్థ్ ఒక టీమ్‌నే తయారు చేసుకుని వరద బాధితులకు అండగా నిలుస్తున్నాడు. ట్వీటర్ ద్వారా వలంటీర్లతో అనుసంధానమై పనిచేస్తున్నాడు. వీలైన వారు ఆహార పొట్లాలను, నీళ్ల బాటిళ్లను తెచ్చి బిగ్ ఎఫ్ఎమ్ ఆఫీసులో అందజేయాలని, అక్కడి వరకూ రాలేని వాళ్లు ట్వీటర్ ద్వారా సమాచారం అందిస్తే తమ వాళ్లే వాహనాల్లో వచ్చి వాటిని సేకరిస్తారని సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు. ‘మా’ 5 లక్షల విరాళం: ‘‘తెలుగు చిత్ర పరిశ్రమకు చెన్నై తల్లి లాంటిది. అలాంటి చెన్నై నగర ప్రజల పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. ఇప్పటికే మా బిడ్డల్లాంటి హీరోలు స్పందించి తమకు తోచిన సాయాన్ని ప్రక టించారు. అందుకే ‘మా’ అసోసి యేషన్ తరపున కూడా రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటిస్తున్నాం’’ అని రాజేంద్రప్రసాద్ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ఏపీలో తేలికపాటి జల్లులు సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శ్రీలంక వైపు మళ్లింది. ప్రస్తుతం ఇది దక్షిణ తమిళనాడుకు ఆవల కొమరిన్ ప్రాంతానికి ఆనుకుని శ్రీలంకపై కొనసాగుతోంది. దీని ప్రభావం దక్షిణకోస్తా, రాయలసీమపై బాగా తగ్గింది. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు కూడా బలహీనపడ్డాయి. ఫలితంగా కొద్ది రోజులుగా భారీ వర్షాలతో అతలాకుతలమైన ఆ ప్రాంతాల్లో వర్షాలు బాగా తగ్గుముఖం పట్టి సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. దీంతో గత 24 గంటల్లో అటు రాయలసీమ, ఇటు దక్షిణకోస్తాలో ఎక్కడా వర్షాలు కురవలేదు. వచ్చే రెండు రోజులు ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు గాని, వర్షం గాని కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. దక్షిణ కోస్తాలో తీరం వెంబడి గంటకు 40-45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. రూ.2 లక్షల చొప్పున పరిహారం: మోదీ తమిళనాడు వరద మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. వరదతో తీవ్రంగా దెబ్బతిన్న చెన్నై ప్రజలకు తోడుగా నిలిచేందుకుగాను 27 ట్రక్కుల్లో తినుబండారాలు, నాలుగు లక్షల బాటిళ్ల తాగునీరు పంపినట్లు కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది. నగరంలో 90 శాతం మేర విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లు ప్రభుత్వం పేర్కొంది. కాగా చెన్నైకు 75 వేల డాలర్లను వరద సహాయంగా ఇవ్వనున్నట్లు సింగపూర్, రూ.2 కోట్లను కరూర్ వైశ్యా బ్యాంకు ప్రకటించాయి. తమ సిరీస్ పూర్తికాగానే చెన్నై బాధితులకు చేయూతనందిస్తామని టీమిండియా ప్రకటించింది. తెలుగు కూలీల పరిస్థితి దయనీయం పొట్టకూటి కోసం బేల్దారీ కూలీలుగా చెన్నైకి వచ్చిన ఏపీ ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుండి సుమారు 20 కుటుంబాలు భార్యా, పిల్లలతో రెండునెలల క్రితం చెన్నైకి వచ్చాయి. వీరంతా ఇక్కడి సాలగ్రామంలోని ఒక భారీ నిర్మాణంలో పనిచేస్తున్నారు. భారీ వర్షాల వల్ల యజమాని పనులను నిలిపివేశారు. పనిచేస్తేగానీ కూలి దక్కని పేద జనం ఆకలితో అల్లాడుతున్నారు. విశాఖకు చెందిన ఆదినారాయణ, రమణ సాక్షి తో మాట్లాడుతూ, తాగేందుకు నీళ్లు లేవు, ఆకలి తీర్చుకునేందుకు డబ్బులు లేవు, ఎవరినైనా అడుక్కుందామంటే తమిళభాష తెలియదని వాపోయారు. వర్షాలు ఎపుడు తగ్గుతాయో, పనులు ఎపుడు మొదలవుతాయో తెలియని పరిస్థితి ఉందని అన్నారు. 8 నెలల చిన్నారి, గర్భిణి, పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పనిచేసిన రోజుల్లోని కూలీ డబ్బులు కూడా అయిపోయాయని వాపోయారు.