హైదరాబాద్: రాష్ట్ర జైళ్ల శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాపరివర్తన్ కార్యక్రమంలో భాగంగా ఖైదీలకు వ్యక్తిగత రుణాలు మంజూరు చేసినట్లు ఆ శాఖ డీజీ వినయ్‌కుమార్‌సింగ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ జై ళ్లకు చెందిన 34 మంది ఖైదీలకు వారి పిల్లల విద్య, వివాహాల ఖర్చులకు సంబంధించి వడ్డీలేని రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. మొదటి విడతలో మొత్తం రూ. 11,47,500 రుణాలు (ఒక్కో ఖైదీకి రూ. 13500 నుంచి రూ. 45 వేల వరకు) నిర్ణయించినట్లు తెలిపారు. ఖైదీలకు రుణాల పంపిణీ వల్ల వారి జీవితాల్లో మంచి మార్పులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.