విజయపురలోని కేంద్రకారాగారంలో నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రామల పేరుతో రికార్డింగ్ డ్యాన్స్
విచారణకు ఆదేశించిన జైళ్లశాఖ
సాక్షి,బెంగళూరు: విజయపురలోని కేంద్రకారాగారంలో నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రామల పేరుతో రికార్డింగ్ డ్యాన్స్ నిర్వహించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాలు... గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్ఫ్రవర్తన కలిగిన ఖైదీలను విజయపుర కేంద్ర కారగారం నుంచి విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వేదిక పై సినిమా పాటలకు అనుగుణంగా యువతి అసభ్యకర రీతిలో నృత్యం చేస్తుండగా కొంతమంది కారాగార సిబ్బంది ఆమెపై డబ్బులు వెదజెల్లారు. ఈ విషయం వీడియో క్లిప్పుంగుల రూపంలో ఒక రోజు ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై స్పందించిన జైళ్ల శాఖ ఇందుకు సంబంధించిన పూర్తి నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు గాను విచారణకు ఆదేశించింది. జైళ్ల శాఖ డీజీపీ హెచ్.ఎన్.ఎస్.రావును విచారణాధికారిగా నియమించింది. మరో రెండు రోజుల్లో హెచ్.ఎన్.ఎస్.రావు తన విచారణను ప్రారంభించనున్నారని తెలుస్తోంది.